• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Friday, August 2, 2019

-

బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు


పట్టువదలని విక్రమార్కుడిలా హిట్టు కోసం ప్రయత్నిస్తున్న బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నిన్న విడుదల అయిన రాక్షసుడు మూవీ తో ఒక సాలిడ్ హిట్టు అందుకోబోవడం కాయంగా కనిపిస్తుంది. రాక్షసుడు మూవీకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా సాగే కథనం తో తెరకిక్కిన ఈ సినిమా మంచి రివ్యూ లను పొంది, సినీ క్రిటిక్స్ ప్రశంసలను అందుకుంది. తమిళ బ్లాక్బస్టర్ రాచసన్ సినిమా కి రీమేక్ అనే విషయం విదితమే. ఈ వారం చెప్పుకో దగిన సినిమాలు లేకపోవడం రాక్షసుడు సినిమాకి కలిసి వచ్చే అంశం. 

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్యంగ్ రెబెల్ స్టార్,ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు జంటగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న  మోస్ట్ అవైటెడ్ మూవీ "సాహో".ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ వీడియో సాంగ్ ను నిన్న చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.ఈ పాట చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంగీతం సమకూర్చి న గురు రంధావా నే , తులసి కుమార్,హరిచరణ్ శేషాద్రి ల తో కల్సి ఈ పాట ను పాడారు.యూట్యూబ్ ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది.


Wednesday, July 31, 2019

నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్.ఇండియా లో బెస్ట్ డాన్సర్ ఎవరు..? అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో ముందుగా గుర్తొచ్చే పేరు హృతిక్ రోషన్.ఈ మధ్య కాలం లో హృతిక్ ని డాన్స్ లో మరిపించింది ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా టైగర్ ష్రాఫ్ అని చెప్పొచ్చు.అతనిలో హృతిక్ లాగా    కళాత్మకంగా డాన్స్ చేయడమే కాదు,హై ఎనర్జీ తో స్టెప్స్ వేయడమే కాదు,అద్భుతమైన ఆక్రోబాట్స్ కూడా చేయగలడు గ్రేట్ అథ్లెటిక్ బాడీ,ఆరు ఫలకల దేహం..వెరసి చూస్తే టైగర్ ష్రాఫ్..ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే,ఫైట్స్ చేస్తే...అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి ఒకే పాటకి డాన్స్ చేస్తే...అబ్బబ్బ...ఆ కిక్కే వేరు..ఇలాంటివన్నీ ఒకే సినిమాతో తీరబోతున్నాయి.. అదే ..."WAR" సినిమా.
యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.దీనికి సంగీతం విశాల్ -శేఖర్.వాణీ కపూర్ హీరోయిన్.
హై voltage action డ్రామా గా రాబోయే ఈ సినిమా ట్రైలర్ ని ఒక్కసారి చూడండి..

Monday, July 29, 2019

నానీ గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కార్తికేయ..?నాచురల్ స్టార్ నానీ,మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో  , మనం,24,  చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "గ్యాంగ్ లీడర్". ఈ మధ్యనే దీనికి సంబంధించి విడుదలైన టీజర్ ను బట్టి చూస్తే, ఐదుగురు లేడీస్ తో నాని కలిసి చేస ఫన్ ఫిల్ల్డ్ రివేంజ్ డ్రామా అని స్పష్టమవుతుంది. ఇకపోతే ఇందులో మరో యూత్ హీరో కార్తికేయ (Rx 100 ఫేమ్ ) ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు తెల్సింది. కానీ టీజర్ లో ఇతన్ని చూపించలేదు, అయితే ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్  ఇపుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ పాత్ర ఏంటి?  దీని ప్రకారం చూస్తే కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం.ఇతని ఎంట్రీ ఇంటెర్వెల్ బ్లాక్ లో వస్తుందట , ఈ కథలో అతని పాత్ర చాలా కీలకం కావడంతో టీజర్ లో అతన్ని చూపించకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది.
మొదట్లో గ్యాంగ్ లీడర్ టైటిల్ మీద వచ్చిన మెగా ఫ్యాన్స్ వ్యతిరేకతను టీజర్ చూడడం వలన తగ్గించుకుంటున్నారట. వరుస ఫ్లాప్ లలో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఈ గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ కావడం చాలా అవసరం.

మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.thribhuvanavijayam.com

సంపూర్ణేశ్ బాబు... World Record .... " కొబ్బరి మట్ట " సినిమా కోసం ఏకంగా 3.30 నిమిషాల డైలాగ్ సింగిల్ టేక్ లో అద్భతంగా చెప్పిన సంపూ.

సంపూర్ణేష్ బాబు ఒక్క సినిమా తో స్టార్ కామెడీ హీరోగా రాత్రికి రాత్రే పాపులర్ ఐపోయాడు.'హృదయ కాలేయం ' అనే డిఫరెంట్ ఫన్ టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా సంపూని రాత్రికి రాత్రే స్టార్ ని చేయగా తరువాత చేసిన సినిమాలు మాత్రం సంపూని నిలబెట్ట లేక పోయాయి.అయితే ఇక అయిపో యింది ,అని ,సంపూని అందరూ మరిచి పోతున్న సమయంలో సడన్ గా " కొబ్బరి మట్ట" అనే సినిమాలో ఒక సీన్ లో ఏక ధాటిగా 3నిమిషాల ముప్పై సెకన్ ల పాటు చెప్పిన డైలాగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐంది.నిజంగా సంపూ అద్భుతంగా ఈ డైలాగ్ ని చెప్పాడనే చెప్పాలి.ప్రధాన హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఎక్కడా లాగ్ లేకుండా చాలా మంచి పెర్ఫామెన్స్ తో సంపూ చెప్పిన ఈ డైలాగ్ ని సినీ అభిమానులు కలకాలం గుర్తుంచుకుంటారు.. మీరు ఒక్క సారి చూడాల్సిందే.. షేర్ చేయాల్సిందే..


వావ్ ...వాట్ ఏ ఫోటో.. :అద్భుతమైన ఫోటోను విడుదల చేసిన ఇస్రో :3 స్టెప్స్ క్లోజర్ టు మూన్
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత దేశం ప్రయోగించిన చంద్రయాన్ ఒక్కొక్క దశను దాటుతూ చంద్రుడిని  చేరడానికి ఉరకలేస్తుంది.ఈ రోజు ఇస్రో వారు తమ అఫీషియల్ పేజి లో 3 స్టెప్స్  క్లోజర్ టు మూన్ అనే ట్యాగ్ తో ప్రచురించిన ఫోటో నిజంగా ఆకట్టుకుంటుంది.సుమారు 946 కోట్లతో చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటివరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా భూ కక్ష్యను దాటడానికి ఉరకలేస్తుంది.ఇస్రో ప్రకారం భూమి చుట్టూ  5 సార్లు దీర్ఘ    వృత్తాకార కక్ష్య లో 
              పరిభ్రమణం చెంది చంద్రుని వైపు ప్రయాణం ప్రారంభించనున్న చంద్రయాన్ 2, ఇప్పటికి 3 సార్లు పరిభ్రమణం
విజయవంతం గా పూర్తి చేసి నట్టు ఇస్రో ప్రకటించింది.
 ప్రపంచం లో మొట్ట మొదటి సారిగా చంద్రుడి యొక్క దక్షిణ ధృవం పై ల్యాండ్ అయ్యి రోవర్ సహాయంతో అక్కడ నీటి జాడను పరీక్షించనుంది.


మెగాస్టార్ చిరంజీవి 153 వ చిత్రం ,దిల్ రాజు తో...!

శర్వానంద్ కాజల్ ల " రణ రంగం " వీడియో సాంగ్ పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్ " విడుదల

శర్వానంద్ హీరోగా ,కాజల్ అగర్వాల్ ,కల్యాణి ప్రియదర్శిని లు లీడ్ రోల్స్ లో ,సుదీర్ వర్మ దర్శకుడిగా ,సితార ఎంటర్టెయిన్మెంట్ సంస్థ వారు ,సూర్యదేవర naga వంశీ నిర్మాతగా వస్తున్న సినిమా "రణ రంగం ".ఈ చిత్రానికి సంబంధించి కాజల్ ,శర్వా లు కల్సి చేసిన "పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్ " అనే పాట వీడియో సాంగ్ ను విడుదల చేశారు.ఈ పాట ను నిఖిత గాంధి ,పాడగా, రచన కృష్ణ చైతన్య,సంగీతం సన్నీ ఎం ఆర్ .కోరియోగ్రఫీ శేఖర్ మాస్టర్.ఈ పాట లో శర్వా హెవీ బియర్డ్ తో బీచ్ లో నడుస్తుండగా,కాజల్ బీచ్ డ్రెస్ లో నటించింది.పాట బాగుంది ..


మరిన్ని ..మూవీ న్యూస్..

KGF 2 లో అద్భుతమైన పాత్ర( అదీరా) లో సంజయ్ దత్: తుఫాన్ లా వైరల్ అవుతున్న పోస్టర్.


KGF గతేడాది ఈ పేరు తో వచ్చిన ఒక కన్నడ సినిమా అల్ ఇండియా లెవెల్లో ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.దాదాపు అన్ని భాషల్లో కనీ వినీ ఎరుగని రీతిలో హిట్ అయింది.దాదాపు బాహుబలి సినిమాకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఈ మూవీకి.ఇది జస్ట్ మొదటిభాగం మాత్రమే.సినీ అభిమానులు ఈ సినిమా రెండో భాగం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు ఈ చిత్ర బృందం  సంజూ బాబా birthday సందర్బంగా విడుదల చేసిన సంజు లుక్ ని విడుదల చేసింది.ఈ ఫోటో ని చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే.ఈ లుక్ లో సంజయ్ దత్ హీరో యశ్ నే డామినేట్ చేసేలా ఉన్నాడు. కాబట్టి కావాల్సినంత మైలేజ్ ఆల్రెడీ వచ్చేసింది.ఇక ఈ పోస్టర్ తో ఈ సినిమా రేంజ్ డబుల్ అయింది అని చెప్పొచ్చు.నిజానికి సంజయ్ దత్ ఫస్ట్ పార్ట్ లొనే నటించాల్సింది.కానీ సినిమా పై అప్పుడు పెద్ద గా అంచనాలు లేక పోవడం వల్ల ఒప్పుకోలేదు.ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో సంజయ్ దత్ ని మళ్లీ అప్రోచ్ అవ్వడం తో ఈ సారీ సులభంగా నే ఒప్పుకున్నాడు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(KGF)లోని బంగారు గనుల గురించి 1970 లలో జరిగిన యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ మాస్ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్.హోంబల్ ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా " బాహుబలి "టచ్ చేస్తుండొచ్చు...

మరిన్ని ..మూవీ న్యూస్..
శర్వానంద్ కాజల్ ల " రణ రంగం " వీడియో సాంగ్ పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్ " విడుదల

Sunday, July 28, 2019

మెగాస్టార్ చిరంజీవి 153 వ చిత్రం ,దిల్ రాజు తో...!


తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ వయసులో కూడా యంగ్ హీరోలకి ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఉన్న ఏకైక సీనియర్ కథానాయకుడు టాలీవుడ్ లో చిరంజీవి ఒక్కడే.ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలైనప్పుడు దాదాపు అన్ని సినిమాల కలెక్షన్ లను బ్రేక్ చేసిన సంగతి తెల్సిందే.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రామ్ చరణ్ నిర్మాత గా "సైరా" లో నటిస్తున్నారు. ఇది 151 వ సినిమా.ఇక 152 సినిమా కొరటాల తో తీస్తున్నాడు.దీని కోసం ఈ మధ్యనే బరువు తగ్గటానికి వైజాగ్ లోని నేచర్ క్యూర్ సెంటర్ లో చేరిన సంగతి తెల్సిందే.ఈ సమయం లొనే టాలీవుడ్ టాప్ నిర్మాత  దిల్ రాజు వెన్ను నొప్పి చికిత్స కోసం అదే సెంటర్ లో చేరాడు.ఈ సమయం లొనే మెగాస్టార్ తో చిత్రం చేయాలనే కోరికను వెలిబుచ్చినట్టు తెలిసింది.దీనికి మెగాస్టార్ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు తెలిసింది.ఇప్పటికే టాలీవుడ్ అగ్రనాయకులందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ,ఒక్క చిరంజీవి,బాలకృష్ణ లతో మాత్రమే సినిమా తీయలేదు.అన్నీ అనుకున్నట్టు సాగితే చాలా తొందరలో చిరు,దిల్ రాజు ల సినిమా గురించి అఫిషియల్ స్టేట్ మెంట్ రావచ్చు..సో ఆల్ ద బెస్ట్ దిల్ రాజు.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ ఆన్.. Menu >Home

మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.thribhuvanavijayam.com


అల్లు అర్జున్ 19 వ సినిమా లో సూపర్ బ్యూటీ టబు..

అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తర్వాతి చిత్రం లో సీనియర్ నటి టబు నటించిఆ బోతుంది..ఈ మేరకు చిత్ర బృందం ఓ వీడియో ను విడుదల చేసింది.గతం లో త్రివిక్రమ్, ఇలాంటి పాత్రలకు ,నదియా,కుష్బూ,స్నేహ లను తీసుకున్న సంగతి తెల్సిందే..ఇప్పుడు టబు వంతు వచ్చింది.ఒక్క సారి..ఈ వీడియో చూడండి..