• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Thursday, May 16, 2019

294 కోట్లను వసూల్ చేసిన "మహర్షి":అల్ టైం టాప్ గ్రాసర్


వంశీ పైడి పల్లి దర్శకత్వంలో, మూడు దిగ్గజ సంస్థలు నిర్మించిన,
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం "మహర్షి"ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లను వసూల్ చేసినట్టు ఇండియా టుడే ధృవీకరించింది.దాదాపు 154.4 కోట్ల షేర్ తో దూసుకు పోతుంది.నిజానికి క్రిటిక్స్ ఈ సినిమాకి కొంత నెగెటివ్ రాయడం,మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది.సమ్మర్ హాలిడేస్ ని పూర్తి స్థాయిలో ఎన్ కాష్ చేసుకుంటుంది ఈ మూవీ..ఇందులోని రైతుల సమస్యల ఎపిసోడ్ సినిమాకి బాగా ప్లస్ అయింది.దీని వల్ల మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి సినిమా కి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు.భారత్ అనే నేను లైఫ్ టైం వసూళ్లను(232.4 కోట్లను)  కేవలం వారం రోజుల్లో ఈ సినిమా క్రాస్ చేయడం విశేషం.దాదాపు ఈ సినిమా మొదటి వారానికి సంబంధించి,  నాన్ బాహుబలి రికార్డులను అన్నింటిని  క్రాస్ చేసింది. ఇది మహేష్ కెరీర్ లొనే అల్ టైం టాప్ గ్రాసర్.
ఇక 'రంగ స్థలం' లైఫ్ టైం రికార్డులను ఇది క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు.

వావ్ ..! వాట్ ఏ పోస్టర్ ...గేమ్ ఆఫ్ త్రోన్స్ ..హీరో గెటప్ లో రామ్ చరణ్ ఫోటో అదుర్స్:అభిమానికి థాంక్స్ చెప్పిన ఉపాసన

ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న మోస్ట్ రేటెడ్ టీవీ సీరియల్  "గేమ్ ఆఫ్ త్రోన్స్".ఇంకొక్క ఎపిసోడ్ మాత్రమే మిగిలిన ఈ సిరీస్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తుంది.ఈ ఆది వారం HBO లో ప్రసారం కాబోతున్న ఈ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ ఫీవర్ ప్రపంచ సినీ అభిమానులందరినీ ఎదురు చూసేలా చేస్తుంది.అయితే ఈ సీరియల్ లో హీరో జాన్ స్నో గెటప్ లో మన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఐరన్ త్రోన్ పైన కూర్చున్న ట్టు క్రియేట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది.ఈ ఫోటో ను రాం చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిని డిజైన్ చేసిన అభిమానికి థాంక్స్ చెప్పింది.నిజంగా ఈ గెటప్ చరణ్ కి అతికి నట్టు సరిపాయింది.నిజం చెప్పాలంటే చాలా రాయల్ గా ఒరిజినల్ జాన్ స్నో కన్నా బాగుంది...

Wednesday, May 15, 2019

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా "దర్బార్"లో రజినీకాంత్: ఇక ఫాన్స్ కి పూనకాలే


ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభ వార్త.రజినీకాంత్ నెక్స్ట్ మూవీ AR మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న "దర్బార్" మూవీ లో రజనీకాంత్ ఇంత వరకు చేయని పాత్ర చేయబోతున్నట్టు తెలిసింది.ఇందులో రజనీకాంత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా కు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది.రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో రజినీ కి జోడీ గా నయన తార నటిస్తుంది.ఇప్పటికే నయనతార సూపర్ స్టైలిష్ లుక్స్ విడుదలై అందరినీ అలరిస్తున్నాయి.పోలీస్ గెటప్ లో రజినీ లుక్ చాలా  స్టైలిష్ గా,అద్భుతంగా ఉంది.ఈ సినిమాకు సంగీతం అనిరుద్.

Tuesday, May 14, 2019

"ఇస్మార్ట్ శంకర్ "- ఫస్ట్ టీజర్ ...ఉస్తాద్ "ఇస్మార్ట్ శంకర్ "-ఊర మాస్

ఈ రోజు హీరో రామ్  పుట్టిన రోజు సందర్భంగా ,పూరి జగన్న్నాథ్ దర్శకత్వం లో రాబోతున్న కొత్త చిత్రం "ఇస్మార్ట్ శంకర్ " ఫస్ట్ టీజర్ ను ఈ రోజు 10.30 గంటలకు విడుదల జేయడం జరిగింది.ట్రైలర్ పూర్తిగా ఊర మాస్ గా ఉండి.పాతబస్తీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది.చార్మినార్, పరిసర ప్రాంతపు కథ ఇది అని టీజర్ ద్వారా అర్థమవుతుంది.ఇక ఎప్పటి లాగే పూరి మార్క్ మాస్ పంచ్ లు ఉండబోతున్నాయి." నాతో కిరికిరి అంటే పోశమ్మ గుడి కాడ పొట్టేలు ను కట్టేశినట్టే " వంటి డైలాగులు మంచి కిక్ ఇస్తున్నాయి..ఒక్క సారి ఈ టీజర్ ను చూడండి... 

కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల ను చేరుకున్న "మహర్షి "

వైజయంతి మూవీస్ ,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ,పీవీపి సినిమా వంటి మూడు భారీ సంస్థలు కలిసి నిర్మించిన ,సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా గా వంశీ పైడి పల్లి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం "మహర్షి" .ఈ సినిమా కేవలం 4 రోజుల్లో 100 కోట్ల  గ్రాస్ వసూళ్లను వసూల్  చేసింది.ఇంకా అదే దూకుడు తో ముందుకు సాగుతుంది.ఇది మహేష్ బాబు స్టామినా కు మంచి నిదర్శనం.నిన్న 5 వ రోజు కూడా మంచి కలెక్షన్ లు వచ్చినట్టు సమాచారం ,ఈ సినిమా మహేష్ కెరీర్ లో హయ్యెస్ట్ కల్లెక్షన్ లు సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా లో రైతు సమస్యల ఎపిసోడ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.దీనికి అనూహ్య స్పందన వస్తుంది.స్వయంగా ఉపరాష్ట్రపతి గారే ఈ సినిమాను మెచ్చుకున్నారు.ఇక రైతులు అయితే ఈ సినిమాను స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు.ఈ వీకెండ్ వరకు ఇది దాదాపు 150 కోట్లకు పైగా వూళ్ళను రాబట్టవచ్చని అంచనా.

మహర్షి సినిమాను మెచ్చు కున్న ఉపరాష్ట్రపతి : కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్,డైరెక్టర్ వంశీ పైడి పెల్లి


సూపర్ స్టార్ మహేష్ బాబు "మహర్షి" సినిమాకి అనుకోని విధంగా గొప్ప ప్రశంశ లభించింది.మనదేశ ఉప రాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు gaaru ,ఈ సినిమాను చూసి 
"కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు "మహర్షి " చిత్రాన్ని చూడడం జరిగింది.గ్రామీణ ఇతివృత్తం తో ,వ్యవసాయ పరిరక్షణను ,అన్నదాత ల కు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియ జేసినా ప్రభోదాత్మక చిత్రం .ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా " 
అని ట్వీట్ చేశారు.

దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ 
"సార్ ఇది నాకు వ్యక్తిగతంగా మరియు ఈ చిత్ర టీం అందరికీ  ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.ఇంత కన్నా ఆనందం ఇంకేం ఉండదు.కృతజ్ఞతలు సర్,మీ మాటలు మాకు "మహర్షి " లాంటి మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ప్రేరణ కలిగించింది .ఎంతో వినయ పూర్వకంగా మా టీమ్ తరుపున మీ కు కృతజ్ఞతలు"
 అని రిప్లై ఇచ్చాడు. 
అలాగే చిత్ర దర్శకుడు వంశీ పైడి పెల్లి కూడా ఈ ప్రశంశ పై స్పందిస్తో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇది తమ పై మరింత బాధ్యతను పెంచిందని,మా టీ అందరికీ ఇవి ఎంతో స్ఫోర్తి దాయకమైన ప్రశంశలని కృతజ్ఞతలు తెలియజేశాడు.

అదిరిపోయిన "ఇస్మార్ట్ శంకర్" ఫస్ట్ పోస్టర్ :హ్యాపీ బర్త్ డే _రామ్ పొత్తినేని


పూరి జగన్నాథ్ ,హీరో రాం కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతూ ,"ఇస్మాట్ శంకర్ " సినిమా ఫస్ట్ పోస్టర్ ని పోస్ట్ చేశాడు.కాగా ఈ పోస్టర్ చాలా బాగుంది. ఫుల్ మాస్ look లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై  నోట్లో సిగరెట్ తో రాం పూర్తిగా కొత్తగా ఉన్నాడు.ఈ సినిమా తో రాం మళ్ళీ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నాడు.హ్యాపీ  బర్త్ డే _రామ్ పొత్తినేని
from:త్రిభువన విజయం.com

visit for more updates
www.thribhuvanavijayam.com

"ఫలక్ నూమా దాస్ "- ట్రైలర్ లాంచ్ చేసిన వెంకటేష్

ఫలక్ నూమా దాస్ - పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో  తీసిన ఫక్తు హైద్రాబాది పాతబస్తీ మూవీ.ఈ సినిమాకి హీరో ,డైరెక్టర్  విశ్వక్ సేన్.ఈ సినిమా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.ఈ మధ్య యూత్ కి ఇంతలా కనెక్ట్ అయిన మూవీ టీజర్ ఈ మూవీ నే అయి ఉంటుందని ఆయన అన్నారు.ఈ సినిమా కంటెంట్ నచ్చి సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు..ట్రైలర్  ఎలా ఉందో చూడండి..


రామ్-పూరీ ల "ఇస్మాట్ శంకర్" టీజర్ ఈ నెల 15 న


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా , సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ దర్శకత్వంలో వస్తున్న "ఇస్మాట్ శంకర్" చిత్రం టీజర్ ఈ నెల 15 వ తేదీన విడుదల కాబోతుంది.ఈ విషయాన్ని రామ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.ఏ హీరో కైనా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా పడాల్సిందే..అలా ఉంటుంది పూరి మార్క్ హీరోయిజం.పోకిరి తో మహేష్ మ్యానరిజాన్నే మార్చేసిన ఘనత పూరిది,ఇడియట్ తో రాత్రికి రాత్రి రవి తేజ ను స్టార్ ను చేశేశాడు పూరీ,హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అద్భుతమైన సినిమాలు చేస్తాడు పూరి.అలాంటి పూరి తో రామ్ చేయడం,తన ఫస్ట్ లుక్ కు పిచ్చ రెస్పాన్స్ రావడం చాలా మంచి పరిణామం..ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తేవడం ఖాయం.

నాగ చైతన్య కెరీర్ బెస్ట్:40 కోట్ల షేర్ ను చేరిన 'మజిలీ'


ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం లోని మూడో తరం  హీరో లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను నాగ చైతన్య సాధించాడు.రీసెంట్ గా వచ్చిన 'మజిలీ'సినిమా ఎంతో సెన్సిబుల్ గా ఉండడమే కాకుండా నటుడిగా చైతన్య ఎంతో పరిణితితో నటించిన ఈ సినిమా ప్రస్తుతం 40 కోట్ల నెట్ వసూళ్లను 60 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లకు  రీచ్ అయింది. ఈ సందర్భంగా చైతూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇక ఇందులో సమంత ఎంత అద్భుతంగా నటించిందో చెప్పక్కర్లేదు.శివ నిర్వాణ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా క్లాస్ మాస్ అందరినీ అలరిస్తూ ఇంకా స్టడీ గా రన్ అవుతుంది.అల్ ద బెస్ట్ తో చైతూ అండ్ congratulatoins..from:
త్రిభువన విజయం.
మరిన్ని updates కోసం visit..
www.thribhuvanavijayam.com