• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Friday, April 12, 2019

నాని "జెర్సీ"ట్రైలర్ విడుదల: AWESOME గా ఉంది : 4.5/5 రేటింగ్


నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం "జెర్సీ".ఈ సినిమా ట్రైలర్  నిన్న విడుదలైంది.నిజంగా ట్రైలర్ అద్భుతంగా ఉంది.ట్రైలర్ ప్రకారం సినిమా లో 10 సంవత్సరాల క్రితం నాని ఒక ఆవేశం కలగలిపిన క్రికెట్ ప్లేయర్.అతడు మైదానం లో దూకుడుగా ఉండే వాడని తెలుస్తుంది.అలాంటి హీరో అర్జున్(నాని) జీవితం లోకి హీరోయిన్ ఎంటర్ కావడం ,హీరో ఆవేశం వల్ల క్రికెట్ లో ఎదగలేకపోవడం ,ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని,ఒక సాధారణ గ్రేడ్ 3 అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ, ఒక  5 ఏళ్ల కొడుకు కు తండ్రిగా ,జీవితం లో ఓడిపోయి,భార్య దృష్టి లో చిన్న చూపు చూడబడే  ఒక యువకుడు తిరిగి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే కథ లాగా ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది.అయితే నానీ ఈ ట్రైలర్ లొనే అద్భుతమైన ,హావ భావాలను పండించాడు.నిజంగా నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు.హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది.బహుశా ఈమె సినిమాలో కోచ్ సత్యరాజ్ కూతురు అయి ఉంటుంది. ఈ సినిమా తో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మంచి డైరెక్టర్ గా మొదటి సినిమా తో నే పేరుతెచ్చుకోవడం ఖాయం.ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై , సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.PDV ప్రసాద్ సమర్పిస్తు న్నాడు.ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం.ఇది ఈ నెల 19.న విడుదల అవుతుంది.

ట్రైలర్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్: cant wait to watch..

    మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
             www.thribhuvanavijayam.com

Thursday, April 11, 2019

" డియర్ కామ్రేడ్ " సినిమా నుండి స్వీట్ మెలోడీ:లిరికల్ వీడియో


విజయ్ దేవర కొండ,రష్మిక మండన ల లేటెస్ట్ చిత్రం "డియర్ కామ్రేడ్".ఈ మూవీ కి సంబంధించిన పాట " నీ నీలి కన్నుల్లోన "
పల్లవితో సాగే ఈ పాట చాలా మెలోడియస్ గా ఉంది.గౌతమ్ పాడిన ఈ పాట కు ,లిరిక్స్ రెహమాన్ అందించాడు.సంగీతం జస్టిన్ ప్రభాకరన్.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయ్ దేవర కొండ vs షాహిద్ కపూర్ :అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫీషియల్ టీజర్ విడుదల

 "అర్జున్ రెడ్డి"   తెలుగులో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.ఈ ఒక్క సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు.అటువంటి మూవీ ని ఇప్పుడు హిందీ లో ,షాహిద్ కపూర్ హీరోగా ,ఒరిజినల్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ కుమార్ వంగా నే డైరెక్టర్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ ని నిన్న విడుదల చేయగా దీనికి హిందీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే షాహిద్ కపూర్ అభిమానులు,విజయ్ దేవరకొండ అభిమానులు మా వాడు బాగా చేశాడు అంటే ,మా వాడు బాగా చేశాడు అని సోషల్ మీడియాలో దెబ్బలాడుకుంటున్నారు.మీరు చూసి ఎవరు బాగా చేశారో చెప్పండి..!         
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ప్రతి రోజు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com
Wednesday, April 10, 2019

"మజిలీ" తొలి 5 రోజుల వసూళ్లు : బ్లాక్ బస్టర్ దిశగా చై-సామ్ ల చిత్రం


శివ నిర్వాణ దర్శకుడిగా ,నాగ చైతన్య సమంతా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన " మజిలీ " కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది.ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు చేసిన చిత్రం. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రమ్ కేవలం 5  రోజుల లోనే  21  కోట్ల షేర్ ను సాధించడం జరిగింది. పూర్తి గా ఫామిలీ ఓరియెంటెడ్ గా ఉండడం, కథ కథనాలు దర్శకుడు నడిపిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర విజయం పై అక్కినేని నాగార్జున చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు చైతన్య ,సమంతాలను ఎంతో మెచ్చుకున్నాడు. ఈ చిత్ర విజయం తో వరుస గా రెండు హిట్స్ సాధించిన డైరెక్టర్ గా శివ నిర్వాణ కు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమా "నిన్ను కోరి " హిట్ అయ్యింది . ఇప్పుడు మజిలీ సూపర్ హిట్ అవడమే కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతుంది.
ఆల్ రెడీ  బ్రేక్ ఈవెన్ అయినట్టు తె౩లుస్తుంది.ఇక నుండి  వచ్చేవి అన్నీ లాభాలే. ఈ సినిమా ఈ సంవత్సరం లో F2  తర్వాత రెండవ హిట్ఎ.లక్షన్ ల హడావుడి రేపటితో పూర్తి కానుండడం తో కలెక్షన్ లు ఇంకా పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
visit every day for movie updates
                                 www.thribhuvanavijayam.com

Avengers: End game- అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డుల సునామీ.


Avengers: End game- అడ్వాన్స్ బుకింగ్ లో కానీ వినీ ఎరుగని రికార్డుల ను నెలకొల్పింది.హాలీ వుడ్ డబ్ డ్ మూవీస్ ల కు సంబంధించి ఇంతవరకు ఏ సినిమా కి రానంత గా  అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ సాధించింది.CNBC. COM లెక్కల ప్రకారం Avengers: End game-రీసెంట్ గా విడుదలైన హాలీవుడ్ డబ్ డ్ మూవీ "Star wars-The last jedi"  సినిమా అడ్వాన్స్ కలెక్షన్స్ ని కేవలం 6 గంటలలో దాటేసింది.ఒక వారం రోజులు అయ్యే సరికి  "Aquaman" "Star wars-The last jedi"  "Avengers-Infinity war" మూడు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ మొత్తానికి దాదాపు రెండు రెట్లు అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను రాబట్టింది.
దీనిని బట్టి ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారు అనేది అర్ధమవుతుంది.ఈ సినిమా 'Avengers-Infinity War ' సీక్వెల్ కాబట్టి అందులో స్పైడర్ మాన్, డాక్టర్ స్ట్రేంజ్,స్కార్లెట్ విచ్,వింటర్ సోల్జర్   వార్ మెషీన్ వంటి ముఖ్య పాత్రలు చని పోవడం తో ,మిగిలిన అవెంజర్స్ మరోసారి కలిసి Mad Titan -థానోస్ ను చంపడానికి ఏం చేయబోతున్నారు..? అనే ఆసక్తి వల్లే అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రపంచ సినిమా అవుతుంది.
ఈ సినిమా లో టోనీ స్టార్క్ గా రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్ వర్త్ థోర్ గా, క్రిస్ ఇవాన్స్ కెప్టెన్ అమెరికా గా శామ్యూల్ ఎల్ జాక్సన్ ,నిక్ ఫ్యూరీ గా, స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో గా ,జాష్ బ్రోలిన్ తానోస్ గా,పాల్ రుడ్ ఆంట్ మ్యాన్ గా,బెనెడిక్ట్ చంబర్ బాచ్  డాక్టర్ స్ట్రేంజ్ గా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com
Monday, April 8, 2019

అల్లు అర్జున్ కొత్త సినిమా: "ICON" కనుబడుటలేదు:ట్రెండింగ్


స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ రోజు.చిరంజీవి సినిమా "డాడీ" లో తళుక్కున మెరిసి,గంగోత్రి సినిమా తో అరంగేట్రం చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,ఆర్య సినిమా తో సూపర్ హిట్ కొట్టి ,తన డ్యాన్స్ స్టెప్పులు తో తెలుగు మైకేల్ జాక్సన్ అనిపించుకున్న అల్లు అర్జున్ ఈ రోజుతో 37 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్నాడు.ఈ సందర్బంగా అల్లు అర్జున్ కొత్త సినిమా ను దిల్ రాజు బ్యానర్ లో అనౌన్స్ చేశారు.ఈ సినిమా టైటిల్  "ICON"-కనబడుట లేదు"
.ఈ టైటిల్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.దీనికి దర్శకుడు వేణు శ్రీరామ్. త్వరలోనే దీని షూటింగ్ మొదలవుతుంది.త్రివిక్రమ్ తో సినిమా కూడా ఇప్పుడు మొదలు కాబోతుంది. అల్ ద బెస్ట్ స్టైలిష్ స్టార్...
HAPPY BIRTHDAY from : thribhuvanavijayam.com

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

Sunday, April 7, 2019

మెగాస్టార్ ని కలిసిన అమీర్ ఖాన్: తన అభిమాన నటుడు చిరంజీవి గారు అని వ్యాఖ్య.


బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్     క్యోటో ఎయిర్ పోర్ట్  లో   మన మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాడు.సాధారణంగా అమీర్ ఖాన్ సోషల్ మీడియా కి చాలా దూరంగా ఉంటాడు.అలాంటిది చిరంజీవి గారిని చూడడం తో వెంటనే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి ఫోటోను షేర్ చేశాడు.అంతే కాదు చిరంజీవి గారు నా అభిమాన నటుల్లో ఒకరు. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందదాయకం అని రాశాడు."చిరంజీవి గారు తన నెక్స్ట్ ప్రాజెక్టు దేశభక్తుడు " ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి " చిత్రం గురించి వివరించారు ,మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం సర్" అని  అమీర్ ట్వీట్ చేశాడు

ఈ ఫోటో తో మెగాస్టార్ అభిమానులు ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అమీర్ ఖాన్ లాంటి హీరో నే ,మెగాస్టార్ ని పొగడడం మామూలు విషయం కాదు మరి. ఐతే ఇప్పటి వాళ్ళకి తెలియక పోవచ్చు, కానీ ఘరానా మొగుడు సినిమా వరకు నిజంగా చిరంజీవికి అమితాబ్ బచ్చన్ తో సమానమైన ఇమేజ్ ఉండేది. చిరంజీవి అంటే ఒక మనీ  మెషీన్ అనే పేరుండేది.     చిరంజీవి డ్యాన్స్ లకి బాలీవుడ్ హీరోలంతా ఫాన్స్ గా ఉండేవాళ్ళు.అప్పుడు అమీర్ లాంటి హీరోల కెరీర్ తొలి రోజులు.కాబట్టి చిరంజీవి అంటే అందుకే అభిమానం.


మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com