• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, March 9, 2019

సింగపూర్ ప్రభుత్వం తమ దేశపు ప్రతీ పౌరుడికీ బహుమతిగా నగదు బోనస్:ఇదొక రికార్డు


సాధారణంగా ఒక కంపనీ తమ లాభాలలో కొంత భాగాన్ని ,తమ వర్కర్ల కు బోనస్ గా ప్రకటించడం చూస్తుంటాం.కానీ సింగ పూర్ ప్రభుత్వం ఈ సారి తమ బడ్జెట్ ప్రకటన సందర్బంగా ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ  కీట్ తమ దేశం లోని 21 సంవత్సరాల వయసు దాటిన ప్రతి పౌరుడికీ 300 $ డాలర్ల బోనస్ ను ప్రకటించాడు.గత సంవత్సరం తమ దేశ సంపాదన లో మిగులు సుమారు 7.6 బిలియన్ అమెరికన్ డాలర్లు.దీనినే ఇప్పుడు పౌరులకు "హొంగ్ బావో"(చైనీస్ భాషలో   నగదు బహుమతి) రూపం లో బోనస్ ప్రకటిస్తున్నామని ప్రకటించాడు.ఇది నిజంగా ఒక గొప్ప విషయం.

Friday, March 8, 2019

విజయ్ దేవరకొండ స్ట్రాటజీ అదుర్స్: ఒక్క లుక్ తో అన్నిటికీ సమాధానాలు


చాలా తొందరగా స్టార్ స్టేటస్ అందుకున్న నాన్ ఫిల్మ్ ఫామిలీ హీరోల్లో విజయ్ దేవరకొండ ముందుంటాడు. ఇప్పుడు అతడు ఎం చేసినా ఒక సెన్సేషన్ .తనకి సంబంధించి ఏ మ్యాటర్ అయినా సోషల్ మీడియా లో వైరల్ అయ్యేలా చూసుకోవడం లో విజయ్ దిట్ట.తన డిఫరెంట్ మ్యానరిజిమ్ తో ఆ ప్రొడక్టు రేంజ్ ని పెంచేస్తాడు. "అర్జున్ రెడ్డి" తనకు వచ్చిన సూపర్ పాపులారిటీ ని విజయ్ చాలా చక్కగా వినియోగించుకున్నాడు.
ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ "డియర్ కామ్రేడ్". ఈ సినిమా గురించి రాక రకాల రూమర్లు చక్కర్లు కొట్టగా అందులో ఒకటి ఏంటంటే ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నాడని చాలా పుకార్లు షికార్లు చేశాయి.కానీ విజయ్ ఒక డబ్బింగ్ సినిమా రూపం లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వదల్చుకోలేదు. ఈ విషయాన్ని తన టీజర్ ద్వారా చాలా స్పష్టంగా విజయ్ తెలియ జేశాడు.ఎలాగంటే ఈ సినిమా టైటిల్ ని సౌత్ లోని నాలుగు భాషలలో చూపించడం.దీంతో పై పుకార్లన్నింటికీ ఒకే పోస్టర్ తో చెక్ పెట్టి,ఈ సినిమా కేవలం సౌత్ లోని తెలుగు,తమిళ్,కన్నడ మలయాళ భాషల్లో మాత్రమే విడుదల చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశాడు విజయ్.అన్నట్టు ఈ మూవీలో కూడా గీతా గోవిందం ఫేం రష్మిక మండన కావడం తో ఈ సినిమా పై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.

Thursday, March 7, 2019

RRR గురించి హాట్ అప్ డేట్: రాముడి గా చరణ్ , రావణుడు గా ఎన్టీఆర్....???


రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా,భారత దేశపు నంబర్ వన్ దర్శకుడు SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ RRR("రామ రావణ రాజ్యం" అని వర్కింగ్ టైటిల్).ఈ సినిమా కి సంబంధించి హీరో లు ,దర్శకుడు , బ్యానర్ ,సంగీతం,రచయిత ..ఈ డీటెయిల్స్ తప్ప ఏ విషయమూ అధికారికంగా వెల్లడి కాలేదు.ఇక ఈ సినిమా గురించి తెలిసిన మరో 3 విషయాలు ,ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ అని ,దీని బడ్జెట్ 300 కోట్ల పైనే అని,ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్ కత లో జరుగుతుందని .
ఇక పోతే ఈ సినిమా కి సంబంధించి మరో హాట్ న్యూస్ ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది.అదేంటంటే ఈ సినిమా లో రాంచరణ్ రాముడిగా నూ, ఎన్టీఆర్ రావణుడు గానూ చేస్తున్నట్టు తెలుస్తుంది.అంటే దాని అర్థం నిజంగా రాముడు ,రావణుడు అని కాదు,కానీ చరణ్ ఒక మోస్ట్ సిన్సియర్ పోలీస్ గా, ఎన్టీఆర్ ఒక దొంగల ముఠా నాయకుడుగా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముందు ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకుని తర్వాత కల్సిపోతారని టాక్. ఇలా అయితే ఫాన్స్ హర్ట్ కారా...? చాన్సే లేదు.అక్కడ డైరెక్టర్ రాజమౌళి. ఎవరిని ఎలా చూపించాలి అనే విషయం లో అతన్ని మించిన డైరెక్టర్ లేడు. అతడు ఏం చేసినా ప్రేక్షకులను రంజింప జేసేదిగానే ఉంటుంది తప్ప ,ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయడు.కాబట్టి ప్రేక్షకులు దేన్నైనా సంతోషంగా స్వీకరిస్తారు.ఎందుకంటే  అక్కడ   రాజమౌళి మరి...

Wednesday, March 6, 2019

సంచలనంగా ట్రెండింగ్ అవుతున్న నిఖిల్ "అర్జున్ సురవరం " టీజర్.:భారీ స్పందన

నిఖిల్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన చిత్రం "అర్జున్ సురవరం " .ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని  మొన్న 4 వ తేదీన విడుదల చేయగా దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది.కేవలం 2 రోజుల్లో 3 మిలియన్ వ్యూస్ రావడం నిజంగా ఆశ్చర్యకరం.ఈ సినిమా తో నిఖిల్ హిట్టు కొడతాడేమో చూడాలి. ఒకసారి టీజర్ చూడండి. 

Tuesday, March 5, 2019

కోహ్లీ 40 వ వన్డే శతకం నాగ్ పూర్ వన్డే లో కూడా నెగ్గిన టీమిండియా : 2-0 తో సిరీస్ లో ముందంజనాగ్ పూర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డే లో భారత్ జయభేరి మోగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, భారత్ ని 48 . 2 ఓవర్ లలో   250 పరుగుల కే కట్టడి చేసింది .అయితే కెప్టెన్ కోహ్లీ 116 పరుగులు (120 బంతుల్లో 10 ఫోర్లు ),విజయ్ శంకర్ 46 పరుగులు ( 41 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ ) రాణించారు .విరాట్ కోహ్లీ కిది 40 వ వన్డే సెంచరీ .ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్  వికెట్లు ,జంపా 2 వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్ల లో 242 పరుగుల కి ఆలౌట్ అయింది.  స్టాయినిస్ 52 ,హాండ్స్ కూంబ్ 48 పరుగులతో రాణించారు. భారత్ తరుపున కుల్దీప్ 3 ,శంకర్ ,భుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు.
ఇది  భారత్ కి  500 వ అంతర్జాతీయ విజయం   
స్కోర్లు :


లండన్ కి చెందిన HIV పేషెంట్ కి పూర్తిగా విముక్తి : వైద్య రంగం లో నే అద్భుతంప్రస్తుతం మానవాళి కి కొరక రాని కొయ్య గా ఉన్న వ్యాధులలో HIV-AIDS వ్యాధి ముందు వరుసలో ఉంటుంది.దీనికి ఇంతవరకు పూర్తిగా నయం చేసే మందు ను శాస్త్ర వేత్తలు కానీ పెట్ట లేక పోయారు.HIV వైరస్ సోకిన  వ్యక్తి కి అతని యొక్క ఆర్జిత అసంక్రామ్యత  లో లోపం ఏర్పడి చాలా రకాల వ్యాధులకు ఆ పేషెంట్ గురై అవి నయం కావడం కష్టం అయ్యి నెమ్మదిగా మరణం సంభవిస్తుంది.దీనినే మనం ఆర్జిత అసంక్రామ్యత లోపం (acquired immuno deficiency syndrome) లక్షణము అంటాము. HIV వైరస్ నిరంతరం తన యొక్క రూపాన్ని మార్చుకునుట వల్ల దానికి ఇంతవరకు మందును కనుగొనుట చాలా కష్టం అవుతుంది.
 అయితే లండన్ కి చెందిన పేషెంట్ 2003 లో HIV వైరస్ బారిన పడి ఎయిడ్స్ గురి అయ్యాడు .అప్పటి నుండి అతడు రిట్రో వైరల్ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు.అయితే అతడికి HIV వల్ల హడ్కిన్స్ లింఫోమా అనే ఎముక మజ్జ కాన్సర్ కి గురయ్యాడు.2016 లో అతడు  స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్(వేరే వ్యక్తి  ఎముక మజ్జ ను పేషెంట్ కి ఇవ్వడం ) కి ఒప్పుకున్నాడు. ఇది అందరి పేషెంట్ లలో విజయ వంతం కాదు.    అంతే  కాకుండా ఎవరైతే దాత ఉన్నాడో అతని కణాలు చాలా అరుదైన ఉతపరివర్తన కణాలు.అతడి జన్యు పదార్థము లో ఉన్న ఈ ఉత్పరివర్తన HIV వైరస్ కి అసంక్రామ్యత (IMMUNITY) ప్రదర్శించును.ఐనప్పటికీ  ఈ హడ్కిన్స్ లింఫోమా వ్యాధి గ్రస్తులు ఎవ్వరికీ ఈ  మూలకణాల మార్పిడి విజయవంతం కాలేదు .ఈ లండన్ పేషెంట్ కి ఈ మార్పిడి విజయవంతం కావడమే కాకుండా ఆ దాత కణాల లోని జన్యు ఉత్పరివర్తన వల్ల ఈ పేషెంట్ లో HIV వైరస్ కి అతడు ఇమ్యునిటీ ని పొందాడు.ఈ మార్పిడి తర్వాత వైద్యులు కొన్నాళ్ళకు అతడి దేహం లో HIV వైరస్ లేక పోవడాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ పేషెంట్ ని వారు HIV మందులు ఆపివేశారు.ఎవరైనా HIV సోకిన వ్యక్తి మందులను ఆపివేస్తే  కొన్ని రోజులలోనే HIV వైరస్ పేషెంట్ లో కనబడుతుంది.అయితే ఈ వ్యక్తి  ని 18 నెలల పాటు అంటి రిట్రో వైరల్ డ్రగ్స్ తీసుకోకుండా ఉంచినప్పటికీ అతని లో HIV కనిపించలేదు. నిజంగా ఇదొక అసాదారణ మైన ,అద్భుతమైన విషయమని యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపాడు.
ఇలాగే అమెరికాకి చెందిన "తిమోతీ రే బ్రౌన్" అనే HIV పేషెంట్ 12 సంవత్సరాల క్రితం జర్మనీ లో చికిత్స పొంది HIV -AIDS నుండి విముక్తి పొందాడు. ఇవి రెండు కేసులలో మాత్రమే ఇలా జరిగింది .ఇది HIV పై పరిశోధనలను చేస్తున్న ఎంతోమంది శాస్త్రవేత్తలకి మరియు HIV పేషెంట్ లకి ఎన్నో ఆశలను కల్పిస్తున్నది.  

Monday, March 4, 2019

ప్రభాస్ ని చెంప దెబ్బ కొట్టిన ఓ లేడీ అభిమాని...ప్రేమతో...మెల్లిగా..
కొన్ని సార్లు అభిమానం ఎక్కువైతే ఆ షాక్ లో అభిమానులు ఏం చేయాలో తెలీక  ఏదోదో చేస్తారు.సడన్ గా ప్రభాస్ ను చూసిన ఈ అమ్మాయి ప్రభాస్ ను సరదా గా చెంప పై టచ్ చేసి వెళ్ళింది.ఆమె ఆనందానికి హద్దులు లేవు మరి మీరే చూడండి.