• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, March 2, 2019

రాణించిన కేదార్ జాదవ్ , ధోనీ :ఆస్ట్రేలియా తో తొలి వన్డే లో భారత్ జయకేతనం

 


Rajiv Gandhi International Stadium uppal,  Hyderabad: 
ఇక్కడి రాజీవ్ గాంధి స్టేడియం లో నిన్న జరిగిన మొదటి వన్డేలో భారత్ ఆస్ట్రేలియా పై నెగ్గింది.ఇటీవల జరిగిన టీ20 సిరీ స్ లో రెండింటికీ రెండూ ఓడి పోగా వన్డే లో చాంపియన్ లైన టీమిండియా ఆస్త్రేలియ తో 5 వన్డేల సిరీస్ లో బోణీ చేసింది .టాస్ గెలిచ ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ,బౌలర్లు విజృంభించడం తో ఆస్ట్రేలియా 50 ఓవర్ ల లో 7 వికెట్ల నష్టానికి  236  పరుగులు చేసింది .ఆస్త్రేలియన్ బ్యాట్స్ మన్ లలో ఉస్మాన్ ఖ్వాజా 50 పరుగులు  (76 బంతుల్లో 5 ఫోర్లు  1 సిక్స్ )  ,మాక్ష్ వెల్( 40) ,స్టాయినిస్( 37)  రాణించారు.భారత బౌలర్లలో భుమ్రా ,షమీ ,కుల్దీప్ యాదవ్ లు తలా 2 వికెట్లు పడగొట్టారు.కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ,ఓపెనర్ శిఖర్ ధావన్ డక్ అవుట్ ఐనపటికీ కెప్టెన్ కోహ్లీ (44),రోహిత్ 37 ,పరుగుల తో రాణించి అవుట్ కాగా ,మ్యాచ్ చేజారుతున్న సమయంలో ధోనీ,59 నాటౌట్   (72 బంతుల్లో 6 ఫోర్లు , 1 సిక్స్) కేదార్ జాదవ్ 81( 87 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్ ) నాటౌట్   లు పరిస్థితి ని  చక్క దిద్ది భారత్ కు విజయాన్ని అందించారు. 

షేడ్స్ ఆఫ్ సాహో: రెండో టీజర్ విడుదల చేసిన సాహో టీమ్

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్ గా మారిన మన రెబెల్ స్టార్ ప్రభాస్  నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "సాహో".సుజిత్ దర్శకత్వం లో వస్తున్న  ఈ చిత్రం లో బాలీ వుడ్ హీరొయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే .గతం లో షేడ్స్ ఆఫ్  " సాహో " అనే పేరు తో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది .ఇప్పుడు శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా  షేడ్స్ ఆఫ్  " సాహో " చాప్టర్ 2 పేరుతో మరో మేకింగ్ వీడియో విడుదల చేశారు.శ్రద్ధాకాపూర్ ను  ఇందు లో బాగా చూపించారు. Friday, March 1, 2019

భారత గడ్డ మీద అడుగు పెట్టిన అభినందన్ వర్తమాన్అందరి ప్రార్థనలు ఫలించాయి.ఒక సైనిక యోధుడు,శత్రు దేశపు హస్తాలకు చిక్కి ,తిరిగి వస్తాడో రాడో అని ఎంతో టెన్షన్ పడిన భారతీయులు అందరు ఊపిరి పీల్చుకునేలా ,వింగ్ కమాండర్ అభినందన్ పరివర్తన్ మన గడ్డ పై అడుగు పెట్టాడు.అతడిని సైనిక నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంటేషన్ పనులు ,ఇతర వైద్య సంబంధ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఈ రాత్రి 9 గంటల తర్వాత మన సైన్యానికి ,తద్వారా IAF చీఫ్ కి వాఘా సరిహద్దు వద్ద పాక్ రోడ్ మార్గము ద్వారా తీసుకు వచ్చి ,అప్పగించింది. మన దేశ ప్రభుత్వం చేసిన దౌత్య పర ఒత్తిడికి కావచ్చు, జెనీవా యుద్ద ఖైదీల నిబంధనకు లోబడి కావచ్చు,లేదా ఒకవేళ విడుదల చేయక పోతే యుద్ధం వస్తుందనే భయం కావచ్చు, ఏది ఏమైనా పాకిస్తాన్ మన వాడిని మనకు అప్పగించింది.అభినందన్ చూడడానికి సంతోషంగా అనిపించింది.అతడిని స్వాగతించడానికి వేలాది మంది ఈ రోజు ఉదయం నుండి ఎదురు చూస్తున్న భారతీయులకు అభివాదం చేస్తూ నవ్వుతూ పాక్ గేట్ ను దాటి మన గడ్డ పై అడుగు పెట్టగానే ఒక్క సారి జనం హర్షాతిరేకాల తో సంబరాలలో మునిగి పోయారు.శత్రు దేశ పౌరుల చేతిలో ఎన్నో దెబ్బల కు ఓర్చి,ఎంతో గుండె నిబ్బరాన్ని కనబరచి ,తిరిగి వచ్చిన మన అభినందన్ ని కుల మతాలకు అతీతంగా అందరూ స్వాగతించారు.ఈ సంఘటన నిజంగా మనందరిలో ఐకమత్యాన్ని పెంచిందని చెప్పవచ్చు ..ఈ సందర్భంగా త్రిభువన విజయం అభినందన్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది. మీ కోసం వీడియో..

Thursday, February 28, 2019

'అతడి' విడుదల రేపే.....:ఇమ్రాన్ ఖాన్.


పాకిస్థాన్ ఆర్మీ కి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ పరివర్తన్ ను రేపు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.లేకపోతే యుద్ధం వస్తుందని లేదా పరిస్థితి మరింత జఠిలం అవుతుందని భావించిన  పాక్,
రేపు అతడి ని విడుదల చేయనుంది అని వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా ఈ విషయం లో ప్రపంచ దేశాలు అన్నీ భారత్ వైపే ఉండడం తో పాక్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా మన వీర కమాండర్ అభినందన్ తిరిగి రావడం మనకు కావాల్సింది,ప్రజలు కోరుకునేది. చూడాలి రేపు పాక్ ,గతం లో మన పైలట్ నచికేత ను విడుదల చేసినట్టు చేస్తుందో లేదో...

Wednesday, February 27, 2019

రెండో టీ20 లో కూడా ఆస్ట్రేలియా పై భారత్ ఓటమి: సిరీస్ ఆసీస్ కైవసం


భారత్ ,ఆస్ట్రేలియా ల మధ్య బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగిన రెండో టీ20 లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.దీంతో రెండు మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ ను నిలువరించ లేక పోయింది.
20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 190 పరుగు చేసింది.కోహ్లీ 72 (38) పరుగులు,  లోకేష్ రాహుల్ 47 (26),ధోనీ చివర్లో 40 పరుగుల తో ధాటిగా ఆడి రాణించారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 190 పరుగుల ను 19.4 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.మాన్ ఆఫ్ ద మ్యాచ్ గ్లేన్ మాక్స్ వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేయగా షార్ట్ 28 బంతుల్లో 40 పరుగులతో రాణించారు.

 స్కోర్ బోర్డ్:

మొత్తం దేశం అతని కోసం ప్రార్థిస్తుంది:మన పైలట్ ని నిర్భందించిన పాక్ :అతని పేరు అభినందన్ పరివర్తన్


                       

"I am an IAF officer. My service No is 27981,“Am I with the Pakistani Army?”

ఇది పాక్ బలగాలకు చిక్కిన మన దేశ పైలట్ చెప్పిన మాటలు .పాక్ మిలటరీ చెప్పిన దాని ప్రకారం వారి దేశం లోకి చొరబడ్డ మన దేశపు  మిగ్ -21  బైసన్ జెట్ ను కూల్చి వేశామని ఇద్దరు పైలట్ లను పట్టుకున్నామని    Pakistani military spokesperson Major General Asif Ghafoor   చెబుతుండగా ,భారత విదేశాంగ శాఖ అభినందన్ అనే Wing commander   మిస్సింగ్ అని ధ్రువీకరించింది.పాక్ మీడియాలో వస్తున్న వీడియో లో మన పైలట్ అభినందన్ ని వాళ్ళు ఈడ్చు కేల్లడం ,కొట్టడం అతని ముఖం నిండా రక్తం ఉండటం ,ప్రతీ భారతీయుడి గుండెను పిండేస్తున్నది.మరొక వీడియో లో అతడి కళ్ళకు గంతలు కట్టి ,చేతులు వెనక్కి విరిచి కట్టి అతడిని ప్రశ్నిస్తుంటే అతడు  "I am an IAF officer. My service No is 27981,“Am I with the Pakistani Army?”   చెబుతున్న వీడియో భారతీయులను తీవ్ర బాధకు గురి 
చేస్తుంది. కాగా ఈ వీడియో లు నిజమైనవేనని ఇంకా భారత్ ధ్రువీకరించలేదు...మన దేశ ప్రజలు అందరూ అభినందన్ కి ఏమీ కాకూడదు అని ప్రార్థిస్తున్నారు .may god save him..
అయితే ఈ సంఘటనలతో భారత్ ,పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Tuesday, February 26, 2019

పాకిస్తాన్ లోని POK లో తీవ్ర వాదుల స్థావరాల పై భారత్ బాంబుల వర్షం:సుమారు 300 టెర్రరిస్టుల హతంగత ఫిబ్రవరిలో ,భారత్ పై  పుల్వామా లో   జరిగిన ఆత్మాహుతి దాడి కి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ,తీవ్రవాద అడ్డాల పై భారత్ విరుచుకు పడింది.దీనికోసం భారత్ తన అమ్ముల పొది లోని మిరాజ్ 2000 జెట్ ల తో పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని     బాలకోట్ లోని  ఉగ్రవాద స్థావరాల పై  సుమారు 1000 కిలోల పే లోడ్ తో,   ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతం లో దాడు లను చేసింది.ఈ దాడి లో సుమారు 200 నుండి 300 వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు అంచనా.అయితే పాకిస్థాన్ అధికారులు మాత్రం భారత్ దాడికి ప్రయత్నించిన మాట వాస్తవం కానీ మేము తిప్పి కొట్టాము అని చెబుతుండగా ,భారత్ తమ  దాడిని 

Sunday, February 24, 2019

ఒకే వేదిక పై నందమూరి బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ :అభిమానులకి పండగ


బాబాయి , నందమూరి బాలకృష్ణ ,మరియు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదిక ను మరో సారి పంచుకోనున్నారు.గతం లో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ లు అస్సలు కలిసే వారు కాదు.ఇంకా చెప్పాలంటే బాలయ్య కలిసే వాడు కాదు.కానీ నందమూరి హరికృష్ణ మరణానంతరం ,అంతా కల్సిపోయారు.అందుకే ఎన్టీఆర్ -కథానాయకుడు ,మహానాయకుడు ల టీజర్ ల విడుదల కి అబ్బాయి,అలాగే అరవింద సమేత ,ఆడియో లాచ్ కి బాబాయి లు కల్సి ఒకే వేదికను పంచుకున్నారు.ఇక ఈ రోజు సాయంత్రం జరిగే నందమూరి కళ్యాన్ రాం  కొత్త సినిమా 118  మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి , వీరు     మరో సారి   కలవబోతుండటం అభిమానులకి పండగే 

థ్రిల్లర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం-ఆస్ట్రేలియా తో మొదటి టీ20


విశాఖ పట్నం లోని ACA-VDCA మైదానం లో  నిన్న ఆస్ట్రేలియా తో జరిగిన    మొదటి t20  లో ఆస్ట్రేలియా భారత్ పై విజయం సాధించింది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమిండియా ను 120 పరుగులకే కట్టడి చేయగా,తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్ల లో లక్ష్యం ఛేదించింది. జస్ప్రీత్ బుమ్ర అద్భుత బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా చివరి ఓవర్  లో 14 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా,చివరి ఓవర్ వేసిన ఉమేష్ దానిని కాపాడలేక పోయాడు.ఆస్ట్రేలియా చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.
Man of the match :కల్టర్‌ నైల్‌
స్కోర్ లు :జపాన్ వెళ్లబోతున్న ప్రభాస్ ,అనుష్క..! ఎందుకు..??


టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, సూపర్ స్టార్ ప్రభాస్,ది మోస్ట్ లవ్ లీ హీరోయిన్  అనుష్కలు కలిసి 4 సినిమాల్లో  నటించిన విషయం తెలిసిందే.అయితే వారు కలిసి నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయి, హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.ముఖ్యంగా 'బాహుబలి' లో అయితే అమరేంద్ర బాహుబలి , దేవసేన గా వాళ్ళిద్దరి జంట అభిమానులకు కన్నుల పంట అయింది.దీంతో సహజంగా నే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని,త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ఐతే,'కాఫీ విత్ కరణ్ షో 'లో ప్రభాస్ తమ మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదని,2 సంవత్సరాలు కలిసి పనిచేస్తే అలాంటి రూమర్లు రావడం సహజమేనని ఈ బాహుబలి హీరో తేల్చేశాడు. అదేవిధంగా అనుష్క కూడా బాహుబలి-దేవసేన రిలేషన్ స్క్రీన్ వరకే నని ,బయట అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది. అయినా ఎన్నో కోట్ల మంది అభిమానులు వారిద్దరూ ఒక్కటైతే బాగుండును అని అనుకుంటున్నారనేది వాస్తవం.

                అయితే ఇక విషయానికి వస్తే బాహుబలి తర్వాత,ప్రభాస్ కి జపాన్ లో ఎంతోమంది అభిమానులు ఏర్పడడం తో ఇప్పుడు ప్రభాస్ పాత సినిమాలు జపాన్ లో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ప్రభాస్ అనుష్క నటించిన 'మిర్చి' మరియు ప్రభాస్ ,కాజల్ నటించిన 'డార్లింగ్ ' సినిమాలు రెండూ కూడా జపాన్ లో మార్చి 2 వ తేదీన ప్రదర్శించడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ షో లకి ప్రభాస్ మరియు అనుష్క లు జపాన్ వెళ్ల బోతున్నారు. వీరు అక్కడికి వెళ్తే సినిమాలకు బాగా ప్రచారం జరిగి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఇలా ఏర్పాట్లు జరిగాయి.సో బాహుబలి చేసిన మ్యాజిక్ ఇక్కడ  ఈ సినిమాల   విషయం లో కూడా జరుగుతుందేమో చూడాలి.