• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Friday, February 8, 2019

చరిత్ర సృష్టించిన టీమిండియా :న్యూజీలాండ్ తో 2 వ టీ20 లో విజయం
ఈడెన్ పార్క్ ఆక్లాండ్ :   మొత్తానికి న్యూజీలాండ్ లో ఇంతవరకు ఒక్క టీ20 కూడా నెగ్గ లేదు అనే అపప్రధనుండి  టీమిండియా బయటపడింది.న్యూజీలాండ్ తో ఇక్కడ జరిగిన రెండో టీ20 లో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది.ముందుగా  టాస్ నెగ్గి  బ్యాటింగ్ ఎంచుకున్న   న్యూజీలాండ్  20 ఓవర్ లలో  8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లలో గ్రాండ్ హాం 50, రాస్ టేలర్ 42 పరుగులు చేసి రాణించారు.   క్రునాల్ పాండ్యా 3 ,ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసి రాణించారు.తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 18.5 ఓవర్ లలో 3 వికెట్లు కోల్పోయి 162 పరుగులుఇ చేసి విజయం సాధించింది.రోహిత్ 50 ,ధావన్ 30,రిశభ్ పంత్ 40 నాటౌట్  పరుగులు చేయగా ధోనీ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ టీ 20 లలో అత్యధిక పరుగులు(2288)  చేసిన బ్యాట్స్ మెన్ లలో మొదటి స్థానానికి చేరాడు.

నాన్నను ఆటపట్టిస్తున్న "అల్లు అర్జున్" కూతురు అర్హ : వైరల్ గా మారిన వీడియో. అల్లు అర్జున్  కూతురు అర్హ సరదాగా అల్లు అర్జున్ ని ఆటపట్టిస్తున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను' అని అల్లు అర్జున్ చెప్తుంటే 'అర్హ' కూడా నేను నాన్న చెప్పిన అబ్బాయి ని పెళ్లి చేసుకుంటాను అనడం ఆతరువాత అల్లు అర్జున్ 'చేసుకుంటావా' అని అడుగగా 'చేసుకోను' అని అర్హ ఆటపట్టించటం... చేసుకొవా! దొంగ ఫెలో.. 'చేసుకుంటాను అని అను' అని అల్లు అర్జున్ అనటం... దానికి సమాధానంగా చేసుకోను అంటూ అర్హ చెప్పటం... ప్లీజ్ ప్లీజ్ నాన్న చేసుకుంటాను అని చెప్పు అంటూ అల్లు అర్జున్ చేసిన సంభాషణ చాల సరదాగా వుంది. ఇలా కొడుకుతో, కూతురుతో వున్నా వీడియోలను అల్లు అర్జున్ అభిమానులతో షేర్ చేస్తూ వుంటారు. ఈ ఫాదర్ అండ్ డాటర్ సరదా వీడియోను మీరు చూసేయండి మరి. 

Thursday, February 7, 2019

ఈ ఇల్యుజన్ లు మిమ్మల్ని వావ్.. అనిపిస్తాయి..


ఈ వీడియో లో వున్న ప్రతీ సీన్ మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది.
https://m.facebook.com/story.php?story_fbid=1044963149039015&id=831062993762366

హమ్మయ్య..! బ్రహ్మీ ఈజ్ వెరీ హెల్దీ : బ్రహ్మీ ని కలసి బెస్ట్ విషెస్ చెప్పిన బన్నీహాస్య బ్రహ్మ " పద్మశ్రీ " బ్రహ్మానందం ఆరోగ్యం బాగాలేక పోవడం అయన ముంబై వెళ్లి గుండె ఆపరేషన్ చేసుకోవడం వంటి వార్తలను గత కొన్ని రోజులు గా చూస్తున్న ప్రేక్షకులకి ,అసలు బ్రహ్మానందం ఎలా ఉన్నాడో అనే ఆందోళన ఉన్న మాట వాస్తవం .అయితే ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు  అర్జున్ బ్రహ్మానందం ని కల్సి అతని ఫోటో ని ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.ఈ ఫోటో లో బ్రహ్మానందం ఫుల్ హెల్దీ గా వున్నాడు.దీంతో అభిమానుల అనుమానాలు అన్నీ పటా పంచలు అయ్యాయి. బ్రహ్మానందం మళ్ళీ సిన్మాల్లో నటిస్తాడు అనే నమ్మకం అందరిలో కల్గింది.థాంక్స్ బన్నీ...we love you both ...

తమిళ్ అర్జున్ రెడ్డి వర్మ మొత్తం రీషూట్.....?

తెలుగు లో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.ఈ సినిమా ని తమిళ్ లో బాలా దర్శకత్వం లో హీరో విక్రం తనయుడు ద్రువ్  కథానాయకుడు గా  "వర్మ " అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మద్యనే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు.అయితే ఇప్పుడు నేట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమా నిర్మాతలు అయిన E4 ఎంటర్టెయిన్ మెంట్ వారు సినిమా ఫస్ట్ కాపీ చూసి ఖిన్నులయ్యారని,అసలు వారికి సినిమా ఏ మాత్రం నచ్చలేదని కాబట్టి సినిమా లో నటించిన అందరినీ ,మరియు టెక్నీషియన్ లను తొలగించి పూర్తిగా కొత్త వాళ్ళతో ఇదే సినిమాని తీయబోతున్నారని ఇంటర్  నెట్ కోడై కూస్తుంది.ఇందులో ట్విస్ట్ ఏంటంటే దర్శకుడు బాలా ను కూడా పక్కన బెడుతున్నారట.దీనికి సంబంధించి ఒక లెటర్ ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.అయితే హీరో  ద్రువ్ ను మాత్రం కొన సాగిస్తారని ఆ లేఖ సారాంశం.ఇదే గనుక నిజమైతే దేశ సినీ చరిత్ర లోనే ఇలా జరగటం మొదటి సారి అవుతుంది.అంతే కాకుండా బాలా వంటి పెద్ద దర్శకుడి సినమా ఇలా కావడం ..చాలా ఆశ్చర్య కర విషయం.

"యాత్ర" మూవీ ప్రివ్యూ.


 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై మహి వి రాఘవ దర్శకత్వంలో "మమ్ముట్టి" లాంటి దిగ్గజ నటుడు దివంగత నాయకుడు వై.ఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర పోషించిన "యాత్ర" మూవీ రేపు విడుదల అవుతుంది. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే అందరికి తెలిసిన వై.ఎస్.ఆర్ పాదయాత్ర నేపథ్యం లో సాగనుంది అని తెలిసిందే. ఈ తెలిసిన కథ వెనుకాల ఉన్న తపన, ప్రజల నుండి వచ్చిన స్పందన తెరపై ఎలా ఆవిష్కరించారు అనేది సినిమా విజయం ఫై ప్రభావం చూపే అంశాలు. ఇక ఒక పొలిటికల్ డాక్యూమెంటరి కథ చెప్పి మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ ని ఒప్పించడం కష్టంతో కూడిన పని. మమ్ముట్టి లాంటి నటుడు ఒప్పుకోవటమే సినిమా కథ లో, కథనం లో విషయం వుంది అని చెప్పుకోవచ్చు. ఇక మమ్ముట్టి గారు వై.ఎస్.ఆర్ పాత్రలో టీజర్, ట్రైలర్ లో కనిపించిన తీరు కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ ని బట్టి ఒక రాజకీయనాయకుడి నుండి ప్రజలు ఎం కోరుకుంటున్నారు అని ప్రజల గుండె చప్పుడు వినడానికి ప్రజలమధ్యకు వెళ్లే లైన్ తో సినిమా మొదలు అవుతుంది. ఒక రాజకీయనాయకుడు తన గడప దాటి తన చుట్టూ ఉన్న కోటరీలు దాటి పల్లెల్లో కి వస్తే రైతే రాజు అని తెలిసిన ఆ నాయకుడికి చెరువుల్లో కాలువల్లో ఉండాల్సిన నీళ్లు, రాజుగా పిలవబడే  రైతు కళ్ళలో ఉండటం, గిట్టు బాటు దర లేక రైతు నాగలికి కట్టాల్సిన తాడు రైతు అనే రాజు మెడకు కట్టుకుట్టున్న సందర్భం, వయసు పెరిగి ఏ పని చేయలేని వృద్ధుల కష్టాలు, ఆసుపత్రుల చుట్టూ లక్షల్లో ఉన్న ఫీజలు కట్టలేని నిరుపేదలు, లక్షల్లో ఉన్న ఫీజులు కట్టలేని దేశ భవిత అనబడే యువత కష్టాలు ఇలా ఒక కొత్త ప్రపంచాన్ని చుసిన ఆ నాయకుడి స్పందన తీసుకోబేయే నిర్ణయాల సమాహారమే ఈ యాత్ర మూవీ. ఒక సినిమాకు కావల్సిన కథ వస్తువులు చాల వున్నాయి. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడు ఉన్న ఈ సినిమాను దర్శకడు తెరపై ఎంత పట్టుసడలని స్క్రిన్ ప్లే తో ఆవిష్కరించాడో అనేది సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటల కు స్పందన బాగుంది. దర్శకుడు చెప్తున్నట్టు ఇది ఒక పార్టీ కి సంబంధించిన సినిమా అనే కోణంలో ప్రేక్షకులు చూడకుండా సినిమాను ఆదరించాలి అంటే మాత్రం తప్పకుండ ఎలాంటి కాంట్రవర్సీ విషయాలు గాని ఎన్నికల స్టంట్ గా తీసిన సినిమా అనికాని అనిపించకపోతే సినిమా కి పాజిటివ్ గా మారె అవకాశం వుంది. మరికొన్ని గంటల్లో ఈ "యాత్ర" జైత్రయాత్ర గా మారుతుందో లేదో తెలిసిపోతుందు. 

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న "ప్రియ ప్రకాష్ వారియర్" ముద్దు సీన్


'ఒరు అదార్ లవ్' మలయాళ చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది.అందులో హీరోయిన్ 'ప్రియా ప్రకాష్ వారియర్' అందరికీ గుర్తుండే ఉంటుంది.ఒక్క ఐ వింక్ తో రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ మరో సీన్ విడుదల చేసింది.ఇందులో ఆ సినిమా హీరో 'రోషన్ అబ్దుల్ రౌఫ్' తో ఆధర  చుంబనం దృశ్యాన్ని చూపించారు.ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..ఒక సారి చూడండి...

Wednesday, February 6, 2019

విజయ్ 'మెర్సల్' కలెక్షన్ల రికార్డుల ను బద్దలు కొట్టిన అజిత్ 'విశ్వాసం': ఆల్ టైం 3 వ స్థానం


సంక్రాంతికి సూపర్ స్టార్ రజని కాంత్ 'పేట' సినిమా తో పాటు విడుదలైన 'తల' అజిత్   'విశ్వాసం'  నిన్నటి వరకు నాలుగో స్తానం లో ఉండేది.ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర పరిధి లో 3 వ స్థానం లో ఉన్న    'మెర్సల్' రికార్డు ను బ్రేక్ చేసి 3  వ స్థానం లో నిలిచింది.తమిళ నాడు లో ఈ చిత్రం 133.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా ఇది 180 కోట్లు వసూల్ చేసింది. బహు బలి 2 , రోబో 2.0 లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అయితే ప్రపంచ వ్యాప్త కలెక్షన్ ల పరంగా 'పేట' ముందంజలో ఉంది.

Jr.ఎన్టీఆర్ "టెంపర్" తమిళ రీమేక్ విశాల్ "ఆయోగ్య" టీజర్ టాక్: తమిళ్ లో కూడా సాలిడ్ హిట్ పడేలావుందే
పూరి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ మూవీ తో చేసిన రచ్చ తెలిసిందే. ఈ మూవీ ఇటీవల హిందీ లో "సింబా" పేరుతొ రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ వంతు వచ్చింది అనిపిస్తుంది విశాల్ హీరో గా నటిస్తున్న "అయోగ్య" టీజర్ చుస్తుంటే. కాసేపటి క్రితం రిలీజ్ అయినా టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పవర్ ప్యాకెడ్ యాక్షన్ తో విశాల్ అదరగొట్టాడు. ఆయోగ్య అంటే యోగ్యతా లేనివాడు... హీరో క్యారెక్టరైజేషన్ కి పక్కా గా సూట్ అయ్యే టైటిల్ తో కోత దర్శకుడు వెంకట్ మోహన్ తెలుగు టెంపర్ స్టోరీ కి పెద్దగా మార్పులు లేకుండా తీసినట్టుగా వున్నాడు. తెలుగు ప్రేక్షకులకు మాములుగా అనిపించొచ్చు కానీ తమిళ్ సినీ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ. ఇక తెలుగు లో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర ను సీనియర్ నటుడు పార్తీ బన్ చేయగ హీరయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. ఇక సినిమాకు సన్నీ లియోన్ ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. ఈ ఏప్రిల్ కి విశాల్ టెంపర్ ని థియేటర్స్ లో చూడొచ్చు. "ఆయోగ్య" ట్రయిలర్ ఫై ఒక లుక్ వేయండి మరి. 

మొదటి t20 లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం.న్యూజిలాండ్ ,లో న్యూజిలాండ్ పై ఇంతవరకు ఒక్క t20 అయినా గెలవలేదు అనే అపప్రథ ను తొలగించుకుందామ నుకున్న భారత జట్టు ,కోరిక ఇంకా తీర లేదు.వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి t20 లో భారత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.భారత్ బౌలింగ్ ని చాలా సులభంగా ఎదుర్కున్న ,న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ని పరుగు లెత్తించింది.ముఖ్యంగా వికెట్ కీపర్ సీఫర్ట్ 80(43 బంతుల్లో 7 ఫోర్లు,6 సిక్స్ లు)  ,భారత్ బౌలర్ల పై ఎదురు దాడి చేశాడు.తర్వాత ,మన్రో 34,విలియంసన్ 34, రాస్ టేలర్ 29 ,చివర్లో కుగులెయిన్ 20 ( 7 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్ ) రాణించడం తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేశారు.తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది.ధావన్ 29,శంకర్ 27,ధోనీ 39 లు రాణించారు.సౌథీ 3 వికెట్ల తో
రాణించాట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సీఫర్ట్

Tuesday, February 5, 2019

"తిప్పరా మీసం" అంటున్న శ్రీ విష్ణు. 


పక్కింటి కుర్రాడిలా  కనిపిస్తూ, చాల సహజంగా నటిస్తు, తాను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్న యువ హీరో శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కుతున్న తిప్పరా మీసం సినిమా ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లో శ్రీ విష్ణు చాల మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టు గుబురు గడ్డం, పెద్ద మీసం కట్టు తో, పగిలిన కళ్లజోడుతో షర్ట్ లేకుండా ఉన్న శ్రీ విష్ణు లుక్ ని కొత్తగా డిజైన్ చేసారు. ఈ సినిమాకు కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

కత్తి చేత పట్టిన రాంగోపాల్ వర్మ : ఖబర్దార్ అంటూ వార్నింగ్. రాంగోపాల్ వర్మ అనే పేరు ఒక బ్రాండ్ గా ఉండేది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన వర్మ, ఒక్క హిట్ తో తిరిగి ఫామ్ లోకి వస్తాడని చూస్తున్న వర్మ అభిమానులు. ఇక ఆర్.జి.వి దర్శకత్వం లో నిర్మితమవుతున్న లక్ష్మిస్ ఎన్టీయార్ చిత్రాన్ని తన క్రియేటివ్ ఐడియాస్ తో బాగానే ప్రమోట్ చేస్తున్న వర్మ ఈ రోజు ట్విట్టర్ లో కత్తి చేత బట్టి వున్న ఫోటో (మార్ఫింగ్ ఫోటో) ఒకటి పోస్ట్ చేసి లక్ష్మిస్ ఎన్టీయార్ సినిమా విడుదలకు ఎవరైనా అడ్డు వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు వర్మ. ఈ ప్రొమోషన్స్ బాగానే వున్నా సినిమాలో విషయం లేకపోతె కష్టం ఆర్.జి.వి గారు. ఇక వర్మ పోస్ట్ చేసినా ఫోటో అదిరిపోయిందనే చెప్పాలి... ఈ గెటప్ తో హీరోగా  ఒక మాస్ మసాలా సినిమా వర్మ స్వీయదర్శకత్వంలో తీస్తే అదిరిపోతోంది.


'వినయ విధేయ రామ' ఫలితం పై రామ్ చరణ్ అభిమానులకు ,మీడియాకి బహిరంగ లేఖ"మెగా పవర్ స్టార్" రామ్ చరణ్ నటించిన రీసెంట్ చిత్రం 'వినయ విధేయ రామ' అనుకున్నంత ఆడలేని విషయం తెలిసిందే.ఈ చిత్రం 80 కోట్లకు అమ్ముడు పోగా ,కేవలం 62 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.దీంతో డిస్ట్రిబ్యూటర్ లు తీవ్రంగా నష్ట పోయారు.అభిమానులు కూడా కొంత అసంతృప్తి తో వున్నారు. ఇలాంటి సమయం లో రామ్ చరణ్ అభిమానులకు ,మీడియాకి ఫేస్ బుక్ ద్వారా బహిరంగ లేఖ రాశాడు.దీనిలో రామ చరణ్ స్పందన ఇలా ఉంది."ఎంతో కష్టపడి 'వినయ విధేయ రామ ' చిత్రాన్ని నేను ,చిత్రాన్ని నిర్మించిన నిర్మాత,దర్శకుడు,యూనిట్ సభ్యులు అందరూ పని చేసి మిమ్మల్ని అందరినీ సంతృప్తి
పరచాలని చేశాం.అయితే ఫలితం మీరు అనుకున్నంతగా రాలేదు.ఇక ముందు నేను తీయ బోయే చిత్రాలు తప్పకుండా మిమ్మల్ని సంతోష పెట్టే విధంగా తీస్తాను అని, మీ అందరి అభిమానానికి,మీడియా వారికి ఎంతో కృతజ్ఞతలు" అని లేఖ లో పేర్కొన్నాడు.అన్నట్టు ఈ సినిమా వల్ల నష్ట పోయిన   డిస్ట్రిబ్యూటర్ లకు  డబ్బులు వాపస్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.గ్రేట్..మీ కోసం ఆ లేఖMonday, February 4, 2019

"RRR" మూవీ : స్నేహితులు మరియు అన్నదమ్ములు గా రామ్ చరణ్ అండ్ ఎన్టీయార్??? 


ఒకటి కాదు, రెండు కాదు, మూడు కొదమ సింహాలు అడవిలో కసిగా, చాకచక్యంగా వేటాడుతున్న ఒక ఫోటోని చూపించి ఆ వేటకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు తెలియనీకుండ వేట సాగుతూనే ఉంటే ఏంజరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎలా ఉంటుందో అలా వుంది ఇప్పుడు యావత్ సినీ అభిమానుల పరిస్థితి. షూటింగ్ మొదలు అయినా రోజు ఒక ఫోటో వదిలారు వేట మొదలయింది అని చూచాయప్రాయంగా తెలిపేందుకు.. ఇక అంతే అప్పటి నుండి అందరి కళ్ళు అటు వైపే....  ఇప్పటికే అర్థం అయివుంటుంది మాట్లాడుతుంది కోట్లాది సినీ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న "RRR" మూవీ గురించి అని. ఏ చిన్న విషయం బయటకి వస్తుందా అని చూస్తున్న చరణ్ అండ్ ఎన్టీయార్ అభిమానులకు ఇంకో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. "RRR" మూవీ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుంది అని.. సినిమా మొదట 1940 వ సంవత్సర కాలం లో ప్రారంభమవుతూ చరణ్ అండ్ ఎన్టీయార్ లు అన్నదమ్ములు గా కనిపిస్తారని ఇక ఆ తరువాత కథ ప్రస్తుత కాలమానం లో కి ప్రవేశించటం చరణ్, ఎన్టీయార్ లు స్నేహితులుగా కథ సాగుతుంది అని ఈ వార్త సారాంశం. ఇక ఇంతకు ముందు ఎన్టీయార్ బందిపోటుగా చరణ్ పోలీస్ పాత్రలో సినిమా సాగుతుంది అనే మరో రూమర్ వచ్చిన విషయం తెలిసిందే. కథ ఏదైనా ఈ మూడు కొదమసింహాలు వేటను రక్తి కట్టిస్తాయి అనడం లో సందేహమే లేదు. ఈ వార్తల సారాంశం లోని నిజా నిజాలు ఎంతవరకు కరెక్టో తెలియాలి అంటే సినిమా ఫస్ట్ లుక్ లేదా ప్రీ లుక్ అయినా రిలీజ్ అవ్వాల్సిందే. 

రాజశేఖర్ కొత్త చిత్రం "కల్కి" టీజర్ సూపర్బ్

డా. జీవితా రాజశేఖర్ హీరో గా , ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వస్తున్న మూవీ " కల్కి" .ఈ చిత్ర టీజర్ ని నిన్న డా.రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.నిజంగా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది..ఓ సారి చూడండి..

ఫోర్బ్స్ ఇండియా -30 జాబితాలో మన విజయ్ దేవరకొండటాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర కొండ 2019 సంవత్సరానికి గానూ  ఫోర్బ్స్ ' 30 అండర్ 30 ' జాబితాలో చోటు సంపాదించాడు.ఈ జాబితా లో 2019 సంవత్సరం లో ఉన్నత స్థానం సంపాదించిన ఇండియా లోని , 30 ఏళ్ల లోపు యువతీ యువకుల 30 మంది జాబితాను తయారు చేసింది .అందులో విజయ్ చోటు సంపాదించాడు.విజయ్ వయస్సు 29 ఏళ్ళు .తెలుగులో నువ్విలా సినిమాతో సినీ జీవితాన్ని ఆరంభించిన విజయ్,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం లో చిఇన నెగెటివ్ రోల్ వేశాడు.తర్వాత ఎవడే సుబ్రమణ్యం లో మంచి పాత్ర వేయడం తో విజయ్ కి మంచి గుర్తింపు లభించింది.తర్వాత వచ్చిన "పెళ్లి చూపులు " సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది.2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్ కి సూపర్ స్టార్ డం తీసుకు రాగా ,గత సంవత్సరం విడుదలైన  "గీతా గోవిందం" తో విజయ్ రేంజ్ ఇంకా ఎంతో ఎత్తుకు చేరింది.
ఇంకా ఈ లిస్టు లో అథ్లెటిక్ స్టార్ హిమ దాస్ ,విమెన్ క్రికెటర్ స్మ్రితి మందాన కూడా ఉండి.

' కెప్టెన్ మార్వెల్ ' ట్రైన్ చేజ్ ఫైట్ సీన్


ఒకే దెబ్బతో రాజమౌళి & తన అన్నయ్య, ల కలెక్షన్ ల రికార్డు ను బద్దలు కొట్టిన తమ్ముడి సినిమా
' మగధీర ' తెలుగు సినిమా రికార్డు లు అన్నీ తిరగ రాసిన ఒక సంచలనం . అప్పట్లో అదే నెంబర్ సినిమా. మొన్నటి వరకు దీని స్థానం 10. ఇప్పుడు అది 11 వ స్థానానికి పడి పోయింది.అవును మీరు ఊహించింది నిజమే.. విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ లు హీరోలుగా ,  అనిల్ రావి పూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం  F2 .ఇది ఇప్పుడు కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది.మగధీర లైఫ్ టైం కలెక్షన్స్ 76 కోట్లు షేర్.కాగా ఇప్పటి వరకు F2,  80 కోట్ల షేర్ సాధించింది ఇప్పటికీ ప్రతీ రోజూ 50 లక్షలు  సగటున వసూల్ చేస్తుంది.ఈ లెక్కన ఇది ఇంకా 15 కోట్లు సాధిస్తే టాప్ 5 వ స్థానానికి చేరుతుంది. ఈ దెబ్బతో చరణ్ తమ్ముడు ఒక మంచి ఫీట్ సాధించినట్టే కదా.

Sunday, February 3, 2019

అవెంజర్స్ -ఎండ్ గేమ్ కొత్త టీజర్...విడుదల

మార్వెల్స్ మోస్ట్ అవైటింగ్ మూవీ అవెంజర్స్ ఫ్రాంచైజ్ లో చివరి సినిమా..'అవెంజర్స్-ఎండ్ గేమ్' .ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ ట్రయిలర్ విడుదల చేశారు.ఇప్పుడు దాని టీజర్ ని విడుదల చేశారు.ఒక సారి చూసేయ్యండి.

5 వన్డే లో భారత్ విజయం : సిరీస్ 4-1 తో కైవసం .

                   
                                            

న్యూజీలాండ్ తో జరుగుతున్న 5 వన్డే ల సిరీస్ లో  5 వ వన్డే లో   భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ లోని వెస్ట్ ప్యాక్ స్టేడియం లో జరిగిన చివరిదైన వన్డే మాచ్ లో  టాస్ గెలిచి , తొలుత  బ్యాటింగ్ చేపట్టిన భారత్ 49.5 ఓవర్ లలో  252 పరుగులు చేసింది.టాప్ బ్యాట్స్మన్ ఫెయిల్ ఐనప్పటికీ అంబటి రాయుడు 90(113 బంతుల్లో 8 ఫోర్లు,4 సిక్స్ లు ), విజయ్ శంకర్ 45, కేదార్ జాదవ్ ,34 , హార్దిక్ పాండ్యా 45 (22 బంతుల్లో 2 ఫోర్లు ,5 సిక్స్ లు )  పరుగులతో రాణించడం తో భారత్ ఆమాత్రం  స్కోరు చేయగలిగింది.ముక్యంగా చివరి ఓవర్ ల లో పాండ్యా  మొత్తమ్ , 5 సిక్స్ లతో   విరుచుకు పడడం తో స్కోరు 252 చేరుకోగలిగింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ , క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం తో 44.1 ఓవర్ లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది.న్యూజీలాండ్ బ్యాట్స్ మన్ లలో మున్రో 24, కెప్టెన్ విలియం సన్ 37, నీషం44, లు రాణించారు.భారత బౌలర్ లలో చాహల్ 3 ,షమీ 2 ,పాండ్యా 2 జాదవ్,భువీ 1 చొప్పున వికెట్లను తీశారు.1967 నుండి ఇప్పటి వరకు  న్యూజిలాండ్ పై ఇదే  అతిపెద్ద గెలుపు.2008-09 లో 3-1 తేడా తో .
 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంబటి రాయుడు ,  మ్యాన్ ఆఫ్ ద సిరీస్  మొహమ్మద్ షమీ.

' సైరా ' లో చరణ్ , బన్నీ , అనుష్క ...!'మెగాస్టార్' చిరంజీవి కథానాయకుడిగా, నయన తార హీరోయిన్ గా,    కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ప్రతిష్టాత్మక  చిత్రం 'సైరా' నరసింహా రెడ్డి .ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,కిచ్చా సుదీప్ , విజయ్ సేతుపతి , తమన్నా,  వంటి హేమా హేమీ లు ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే.ఐతే ఈ సినిమా గురించే మరో రెండు ఆసక్తి కర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో రామ్ చరణ్ ,అల్లు అర్జున్ లు తళుక్కున మెరవబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.అంతే కాదండోయ్ టాలీవుడ్ సూపర్ లేడీ ,సౌత్ ఇండియన్ లేడీ ఫైర్ బ్రాండ్ ,బాహుబలి బ్యూటీ అనుష్క ఇందులో అతిథి పాత్రలో నటిస్తుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ లు కనీవినీ రీతి లో ఉండడం ఖాయం.బాహుబలి రికార్డు లను బద్దలు కొట్టగల ఏకైక సినిమా ఇదే అవుతుంది.

నల్ల చొక్కాల తో జగన్ vs బాబు

అసెంబ్లీలో జగన్ ,బాబు లు ఇద్దరు కూడా నల్ల చొక్కాల తో ..

"పద్మశ్రీ చింతకింది మల్లేశం" బయోపిక్: "మల్లేశం" ఫస్ట్ లుక్ విడుదల. బయోపిక్ ల పర్వం లో మరొక మార్గదర్శి మూవీ, సామాన్యుడిగా మొదలై నిరంతర పట్టుదలతో ఒక అసామాన్య యంత్ర సృష్టి కర్త "పద్మశ్రీ చింతకింది మల్లేశం" గారి జీవితకథ దృశ్యరూపంగా తెరకెక్కుతు నటుడు ప్రియదర్శి టైటిల్ రోల్ లో నటుస్తున్న "మల్లేశం" మూవీ ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం "కల్వకుంట్ల తారక రామారావు" గారు ట్విట్టర్ లో విడుదల చేసారు. ఒక నిరుపేద చేనేత కుటుంబంలో యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, శారాజిపేట లో జన్మించిన చింతకింది మల్లేశం తన తల్లి ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పుతూ తీవ్రమైన భుజం నొప్పితో రోజు చీరను నేయడానికి పడుతున్న బాధను చూడలేక ఎదో చేయాలి అని తపించేవాడు. అతని ఆలోచనలను సహచరులతో పంచుకున్నా, ఎవరి ప్రోత్సాహం అందకున్న పట్టువదలని నిరంతర శ్రమకు ప్రతి రూపం "లక్ష్మి-ఆసు" యంత్రాన్ని విడతల వారీగా ఆవిష్కరించి ఎందరో నేతన్నల కళను తన కృషి తో నెరవేర్చారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని మల్లేశం గారి ప్రస్థానం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురష్కారంతో ఒక్కసారిగా అందరి కళ్ళు అటు వైపు మల్లాయి. ఓక స్ఫూర్తి దాయకమైన జీవితకథకు ఈ విదంగా దృశ్య రూపం ఇవ్వడం అభినందనీయం. ఇక మల్లేశం గారి తల్లి పాత్రలో ప్రముఖ నటి ఝన్సీ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా టాకి పార్ట్ పూర్తి కాగా నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు సినిమా ప్రజల చెంతకు చేరేలా ప్రమోషన్ కార్యక్రమాలు ఫస్ట్ లుక్ రిలీజ్ తో ప్రారంభించారు. ఒక మంచి ప్రయత్నానికి గొప్ప విజయం తొడవుతే మరిన్ని స్ఫూర్తిదాయకమైన చిత్రాల నిర్మాణానికి దారి సుగమము అవుతుంది. కావున అల్ ది బెస్ట్ మల్లేశం అండ్ టీం ఫ్రమ్ "త్రిభువనవిజయం". 

spider man trailer release

On 5th spider man trailer 2 will be released