• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, February 2, 2019

300 కోట్ల వైపు పరుగులు పెడుతున్న ". యురి" ది సర్జికల్ స్ట్రైక్.


హౌ ఈజ్ ద "జోష్" అంటూ తోటి జవానుల ఆత్మస్తైర్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు "యూరి" మూవి లో హీరో విక్కీ కౌశల్ అందుకు సమాధానంగా 'హై సర్' అంటూ  ముష్కరులపై యుద్దాన్ని సాగిస్తారు జవానులు. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ఇస్తున్న "జోష్" తో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. వందల కోట్ల బడ్జెట్, భారీ తారాగణం, అవసరం లేకున్నా వేసే సెట్టింగులు.. ఇవి ఏమి లేకున్నా.. ఒక కథాబలం ఉంటే ఎంతటి విజయం వరిస్తుందో ఈ సినిమాను చుస్తే అర్థం అవుతుంది. ఒక వాస్తవిక కథని కళ్ళకు కట్టినట్టు చూపిన విధానం ఇంతటి గొప్ప విజయానికి కారణంగా చెప్పొచ్చు. 250 కోట్ల ఫైన వసూళ్లు సాధించి హౌసుఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న యూరి మూవి పరుగు ఎంత మార్క్  వద్ద ఆగుతుందో చూడాలి. 

"వాల్మీకి" మూవీలో హీరోయిన్ గా తమిళ్ డబ్ స్మాష్ సంచలనం: మృణాళిని రవి.


 ఎఫ్- 2 మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఊపు మీదున్న వరుణ్ తేజ్ కెరియర్ లోనే మొదటిసారి నెగటివ్ పాత్రలో నటిస్తు, హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న వాల్మీకి మూవీలో హీరోయిన్ గా తమిళ్ డబ్ స్మాష్ బ్యూటీ మృణాళిని రవి ని తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే డబ్ స్మాష్ వీడియోస్ లో ఇచ్చే హావభావాలతో కుర్రకారును ఫిదా చేసిన  అమ్మడు మంచి ఛాన్స్ కొట్టిసినట్టే. ఇక "అప్పట్లో ఒకడుండేవాడూ" ఫేమ్ శ్రీ విష్ణు ని ఈ సినిమాకి తమిళ్ మాతృక అయినా "జిగర్తాండ"లో సిద్దార్థ్ పోషించిన పాత్రలో తీసుకుంటున్నట్టు ఇంకో వార్త బయటకొచ్చింది. సినిమా యూనిట్ నుండి ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నాగ బాబు పొలిటికల్ మెసేజ్ : ట్రెండింగ్

మెగా బ్రదర్ నాగ బాబు మరో కొత్త వీడియో తో ముందుకొచ్చాడు ...మీరు చూసెయ్యండి..

కార్తీ కొత్త మూవీ "దేవ్" ట్రైలర్

 కార్తీ కొత్త మూవీ  ట్రైలర్ ...dont miss it ...

" స్పైడర్ మ్యాన్ " - "ఫార్ ఫ్రం హోం" ట్రైలర్

 వాచ్ ఇట్ హియర్ ..ఇఫ్ యూ మిస్ డ్ ఇట్....

Friday, February 1, 2019

విజయ్ 'సర్కార్' కలెక్షన్ల ను బ్రేక్ చేసిన అజిత్ 'విశ్వాసం' :ఇంకా తగ్గని కలెక్షన్లు


తమిళ సూపర్ స్టార్ "తల" అజిత్ ,లేటెస్ట్ హిట్ ' విశ్వాసం ' రిలీజ్ అయి 20 రోజు లైనా ఇంకా కలెక్షన్స్ ఆగలేదు.20 రోజుల కలెక్షన్స్ గత సంవత్సరం బిగ్ హిట్ "ఇళయ దళపతి" విజయ్ సినిమా  'సర్కార్' (తమిళ నాడు రాష్ట్రంలో ) లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసింది.ట్రేడ్ అనలిస్టు రమేష్ బాల ట్వీట్ చేస్తూ, విశ్వాసం తమిళనాడు లో విజయ్ 'సర్కార్' రికార్డ్ లను బ్రేక్ చేయడమే కాకుండా తమిళనాడు లో 4 వ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా గా రికార్డ్ సృష్టించింది.బాహుబలి 2 ,రోబో 2.0,మెర్సల్ లు వరుసగా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి.అజిత్ 'విశ్వాసం ప్రస్తుత ధోరణి చూస్తుంటే విజయ్ మెర్సల్ రికార్డులను బద్దలు కొడుతుంద ని విశ్లేషకులు అంటున్నారు.

Thursday, January 31, 2019

తమిళ్ "96" మూవీ ఒక క్లాసిక్ తెలుగులో తప్పక హిట్ అవుతుంది : దిల్ రాజు. ఎఫ్- 2 సినిమా 60 కోట్ల షేర్ వసులు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్బంగ దిల్ రాజు అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన సందర్భం లో 96 మూవీ తెలుగు రీమేక్ విశేషాలను మీడియా తో పంచుకున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్ లో మొట్టమొదటి రీమేక్ మూవీ 96 అని. మొదటిసారి తమిళ్ 96 సినిమా చూసినపుడు డైలాగ్స్ అర్థం కాకున్నా నా మనసుకు హత్తుకున్నా ఒక క్లాసిక్ మూవీ ఈ సినిమా తప్పకుండ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అని తెలిపారు. ఈ సినిమాని తెలుగులో కూడా 96 పేరుతోనే నిర్మిస్తున్నట్టు చెప్పారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా ఫీల్ మిస్సవకుండా కథలో కొన్ని మార్పులు ఉంటాయి అని నిర్దారించారు దిల్ రాజు. 

"యాత్ర" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్: ముఖ్య అతిథిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి??? ఒక్కడిగా మొదలై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ప్రభంజనమ్ తో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ప్రధానంగా తెరకెక్కిన "యాత్ర" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు ఫిబ్రవరి 1 వ తేదిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఆర్. తనయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నట్టు ముందునుండి సినిమా టీం చెప్తూ వస్తుంది. కానీ ఇంకా జగన్ నుండి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మలయాళ అగ్ర కథానాయకుడు వై.ఎస్.ఆర్ పాత్రలో ట్రైలర్ లో కనిపించిన తీరు ఇటీవల రీలీజ్ అయినా పాటలకు వస్తున్న స్పందన బాగుంది. ఇక జగన్ ప్రీ రీలీజ్ ఈవెంట్ కి వస్తే ఫిబ్రవరి 8 న రిలీజ్ కాబోతున్న సినిమాకు ఇంకాస్త ఊపు వస్తుంది అనటంలో సందేహం లేదు. 

Wednesday, January 30, 2019

ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటింగ్:పేక మేడలా కుప్ప కూలిన వైనం- భారత్ కు అవమానకర ఓటమి


7,13,9,0,0,1,16,1,15,18,5
ఈ నెంబర్ లు ఏంటి అని ఆలోచిస్తున్నారా...? ఇవి న్యూజిలాండ్ తో మన టీమిండియా అడ్డుతున్న 4 వ వన్డే లో మన బ్యాట్సమెన్ చేసిన స్కోర్ లు. టీమిండియా 30.2 ఓవర్ల లో 92 పరుగులకు ఆలౌట్ అయ్యా రు. కోహ్లీ  , ధోనీ లేకున్నా మనవాళ్ళు బాగానే ఆడే వారు.కానీ మొట్ట మొదటి సారి వాళ్లిద్దరూ లేని ప్రభావం స్పష్టంగా కనిపించింది.న్యూజిలాండ్ బౌలర్ లలో ట్రెంట్ బౌల్ట్ 5 ,గ్రాండ్ హోమ్ 4 వికెట్లు తీశారు..అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్ ల లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రెంట్ బౌల్ట్

హీరో 'రామ్' ట్వీట్ ఆసక్తికరం:ఫిదా అవుతున్న నెటిజన్ లుతెలుగు సినిమా యంగ్ హీరో రామ్ పొత్తినేని ,ఏపీ లోని అనంత పురం లో నిన్న కియా కార్ల కంపనీ ఉత్పత్తి ప్రారంభం గురించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఒక ట్వీట్ కి సంబంధించి స్పందిస్తూ ,"ఇది నిజం ,ఇది మన రాష్ట్ర అభివృద్ధి కి పెద్ద ముందడుగు,ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలి" ట్వీట్ చేశాడు.దీనికి నెటిజన్స్ ఫిదా అయిపోయారు. రామ్ ని చాలా పొగిడారు. కొందరు  "ఏపీ అభివృద్ధి గురించి పొగిడిన  ఏకైక హీరో  "అని పొగిడారు దీనికి తిరిగి రామ్ స్పందిస్తూ "నా ఇల్లు సక్కపెట్టెటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్...నువ్వు చెయ్ నీకు ఇస్తా ఓ ట్వీటు....ఆంద్రా నాదే ,తెలంగాణా నాదే, ఇదే మాట మీదుంటా ! ఇక్కడ కులం లేద్ .........., ప్రాంతం లేద్..డిస్కషన్ అసల్ లేద్..!"#Love-R.A.P.O-#citizen first acotr next అని ట్వీట్ చేశాడు.మీ కోసం.ఆ ట్వీట్స్..


మహేష్ బాబు నిర్మాతగా 'చార్లీ' : డిటెక్టీవ్ జానర్లో సాగే కథ తో... ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా "చార్లీ" అనే 'వెబ్ సిరీస్' మొదలుకావడానికి రంగం సిద్ధం అయింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చిత్రం నాన్నకు ప్రేమతో కి రచయిత గ పని చేసిన హుసేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. చార్లీ కి సంబందించిన పూర్తి వివరాలు...నటి నటులు మరియు ఎన్ని భాష లలో తెరకెక్క నుంది అనే విషయాలు తెలియాల్సి వుంది. 

Tuesday, January 29, 2019

జైలు పాలైన 'కట్టప్ప'


ప్రముఖ  తమిళ నటుడు , ఎండీఎం కే పార్టీ సభ్యుడు సత్య రాజ అలియాస్ బాలు జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతి లో చిప్ప పట్టుకున్నట్టు ఉన్న ఒక కార్టూన్ ను సత్య రాజ్ అలియాస్ బాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ ఐంది.ఎండీఎం కే  పార్టీ ,నాగ పట్టణం  జిల్లా ఇంచార్జి అయిన సత్య రాజ్ ,ఆ పార్టీ మొద్దీ కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులు గా చేస్తున్న క్యాంపెయిన్ కు మద్దతుగా మోడీ చిప్ప పట్టుకుని ఉన్న కార్టూన్ ని పోస్టు చేశాడు.దీని కి తీవ్రంగా ఆగ్రహించిన తమిళనాడు బీజేపీ కార్య కర్తలు ,ఆయన పై కేసు నమోదు చేయగా ,ఆయనను   విచారణ నిమిత్తం కోర్టు జ్యుడీషియల్ కస్టడీ లో ఉంచాలని  ఆదేశించడం తో నిన్న రాత్రి అరెస్టు చేసి జైలు కు తరంచారు.
Courtesy: andhrajyothi..today's edition

ఓ బేబీ, డిస్కో రాజా ల మధ్య పోలిక ఉందంటున్నారు!!సమంత హీరొయిన్ గా  నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ మిస్ గ్రానీ మూవీ థీమ్ ఆధారంగా  తెలుగులో  రూపొందుతున్న 'ఓ బేబీ' (వర్కింగ్ టైటిల్) సినిమాకి మరియు ఇటీవలే రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రానికి కథ పరమైన పోలిక వున్నట్టుగా ఫిలింనగర్ లో ఒక పుకారు షికారు చేస్తుంది. ఓ బేబీ సినిమాలో 80 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు ఒకానొక సందర్భంలో 20  సంవత్సరాల యువతిగా మారె పాత్రను సమంత పోషిస్తుంది, దీనికి కొంచెం అటు ఇటుగా డిస్కో రాజా మూవీ లో వృద్దుడిగా వుండే రవితేజ పాత్ర కొన్ని కారణాల వలన అదృశ్యం అయిపోయి తరువాత యువకుడిగా మారి ప్రతీకారం తీర్చుకొనే కథాంశం తో సినిమా సాగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజం అయినా కూడా కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ బేబీ కామెడీ ప్రధానంగా సాగె కథనం. ఇటు కథ లో కొంత పోలిక వున్నా కూడా డిస్కో రాజా సైంటిఫిక్ అండ్ రివెంజ్ ప్రదానంగా సాగబోతున్నట్టు ఇటీవల రిలీజ్ అయినా లోగో పోస్టర్ ని బట్టి హింట్స్ ఇచ్చారు. అందువల్ల రెండు సినిమాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశాలే ఎక్కువ.  

గుండెల్ని తాకుతున్న 'యాత్ర' మూవీ సాంగ్ :  మరుగైనావ రాజన్నా...'యాత్ర' మూవీ నుండి కాసేపటి క్రితం సింగర్ కం రైటర్ పెంచల్ దాస్ ఆలపించిన 'యాత్ర' సినిమాలోని మూడవ పాటను రిలీజ్ చేసారు. మరుగైనావ రాజన్నా, కనుమరుగైనావ రాజన్నా అంటూ సాగే పాటను పెంచల్ దాస్ ఆలపించారు. పాటను చాల హృద్యంగా రాసిన పెంచల్ దాస్ గుండెల్ని తాకేలా ఆలపించారు. విడుదలయిన పాట వై.ఎస్.ఆర్  అభిమానులను ఆకట్టుకోవడం తధ్యం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వై.ఎస్.ఆర్  పాత్రలో నటిస్తున్న  ఈ మూవీ ఫిబ్రవరి 8 న తెలుగు మలయాళం మరియు తమిళ్ లో విడుదలవుతుంది. పెంచల్ దాస్ పాడిన ఈ పాట వినాలంటే కింది వీడియో ను  క్లిక్ చేయండి.

Mandu babula Swargam Narakam..Fun bingiri-8

Athadu..Scene practice 1- Direct acting by village heroes

JUMANJI-(కోతలు,ఏతులు,గెంతులు,) BY thirushadow

'RRR' లో ముగ్గురు హీరోయిన్లు....?RRR ఇప్పుడు దేశం అంతా ,ఎదురు చూస్తున్న మూవీ  . దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తీయబోతున్న తర్వాతి మూవీ RRR. టాలీవుడ్ సూపర్ స్టార్స్ ,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లు నటించబోతున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది.అయితే ఇంత వరకు ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ కాలేదు.కథ ప్రకారం , ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్ లు అవసరం.మొన్నటి వరకు పరిణితి చోప్రా ను సంప్రదించిన చిత్ర బృందం, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ లు సోనాక్షి సిన్హా,మరియు ఆలియా భట్ లను తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తుండగా,సంగీతం MM. కీరవాణి.

వివాదం లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య :మహిళ చేతిలో మైక్ లాగ బోతే..


కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి సిద్ద రామయ్య వివాదం లో చిక్కుకున్నాడు .తన కుమారుడి నియోజకవర్గానికి చెందిన మైసూర్ జిల్లాలోని ,వరుణ మండలంలో అతడు ఒక కార్యక్రమానికి హాజరు కాగా ,అక్కడికి వచ్చిన ఒక మహిళా సిద్ద రామయ్య కుమారుడు ఒక ఎమ్మెల్యే గా ఉండి తమకు ఎలాంటి పనులు చేయట్లేదని ,ఆవేశంగా నిలదీయడంతో,అసలే అధికారం కోల్పోయి అసహనం గా ఉన్న సిద్ద రామయ్య ,ఆ మహిళ చేతి లోని మైక్ ను లాక్కోవడానికి ప్రయత్నించగా ,అనుకోకుండా ఆమె చున్నీ కూడా ,సిద్ద రామయ్య చేతికి అంది కోడ్ మేర లాగినట్లు గా కింద పడింది.ఇక అంతే ... దీని పై మీడియా విస్తృత ప్రచారం చేయడం వల్ల ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది.దీనికి స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ,తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,వెంటనే తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆజ్ఞలు జారీ చేసింది.పాపం సిద్ద రామయ్య ను ఇప్పుడు ఛీ ...ద్ద రామయ్య .. అంటున్నారు ! watch video here


for more updates visit...www.thribhuvanavijayam.com

త్వరలోనే "మార్వెల్" సంస్థ నుండి "బ్లాక్ విడో":ఫాన్స్ కి సూపర్ కిక్
మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన  సూపర్ హీరో సినిమాలన్నీ ఎంత హిట్ అయ్యాయో మనకి తెలిసిందే.అవెంజర్స్ ఫ్రాంచైజ్,కెప్టెన్ అమెరికా ఫ్రాంచైజ్,ఐరన్ మ్యాన్ సిరీస్ అన్నింటిలోనూ మనల్ని ఆకర్షించే పాత్ర "బ్లాక్ విడో".స్కార్లెట్ జాన్సన్ ఎంత అద్భుతంగా పోషించిందో మనకి తెలిసిందే.ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇక సూపర్ హీరో మూవీ లు 'మార్వెల్'  ఆపేస్తుందని అనుకుంటున్న తరుణం లో అభిమానులు ఎగిరి గంతేసే న్యూస్ ఇది.త్వరలోనే మార్వెల్ స్టూడియో నుండి "బ్లాక్ విడో" సినిమా రాబోతుంది.ఇందు లో కూడా స్కార్లెట్ జాన్సన్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు తెల్సింది.  దీనికి కేట్ షార్ట్ ల్యాండ్ దర్శకత్వం వహిస్తుండగా,  జాక్ షెఫర్ రచయిత.....  సో ఇట్ విల్ బీ ఐ ఫీస్ట్ ఫర్ అజ్...

Monday, January 28, 2019

'సైరా'కి ఒకే ఒక్కడు

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం గా రాబోతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రానికి పాటల రచయితగా ఇటీవలే  పద్మశ్రీ అవార్డు కు ఎంపికైన "సిరి వెన్నెల" సీతా రామ శాస్త్రి గారిని ఎంపిక చేసినట్టు  మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.ఈ సినిమా కి సిరివెన్నెల గారు మాత్రమే లిరిక్ రైటర్ గా పని చేస్తున్నారు.అన్ని పాటలు ఆయన చేతనే రాయిస్తున్నట్టు తెలిపారు.పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత చిరంజీవి స్వయంగా ,సిరివెన్నెల గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే.గతం లో తమ రుద్రవీణ సినిమాలో రాసిన "తరలి రాద తనే వసంతం " పాటకు జాతీయ అవార్డు ఒక్క ఓటుతో మిస్ అయిందని,కానీ ఈ సారి సైరా కి తప్పక జాతీయ అవార్డు వస్తుందని తెలిపారు. 

"ఇస్మార్ట్ శంకర్" కు జతగా ఇస్మార్ట్ హీరోయిన్. అతడి సినిమాలు తెలుగు సినిమా హీరో కారెక్టరైజేషన్ కి కొత్త నిర్వచనంతో పాటు ఇండస్ట్రీ హిట్స్ ని ఇచ్చాయి. ఎవరి సినిమాలో హీరో ఇడియట్ గా వుంటూ దేశముదురు పనులు చేస్తూ పోకిరిగా తిరుగుతూ టెంపర్ ను చూపిస్తాడో అతడే పూరీ. కొద్దీ రోజులుగా ప్లాప్స్ తో అతడి అభిమానులను నిరుత్సాహ పరుస్తున్న పూరి జగన్నాద్ మరో సారి అతడికి అచ్చొచ్చిన  జానర్ లో రామ్ పోతినేని లాంటి స్మార్ట్ హీరోని "ఇస్మార్ట్ శంకర్" గా చూపించబోతున్నాడు. "ఇస్మార్ట్ శంకర్" కి జతగా అందాల నిధి అయిన నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసారు. గత వారమే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా లో మొదట చాల మంది హీరోయిన్స్ పేర్లు వినిపించిన కూడా ఆ ఛాన్స్ ని నిధి అందిపుచ్చుకుంది. మొదటి సినిమా ప్లాఫ్ తో మొదలెట్టి రెండో సినిమాతో ఓకే అనిపించుకున్న నిధి అగర్వాల్ ముచ్చటగా మూడో సినిమాతో హిట్ కొట్టాలని. పూరి తిరిగి పునర్ వైభవాన్ని ఈ సినిమాతో సాదించాలి అని కొరుకుందాం.

ఎదురు లేని భారత్ 3 వ వన్డేలో సునాయాస విజయం:సిరీస్ ను గెలిచిన భారత్న్యూజిలాండ్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఓవల్ బే మైదానం లో జరిగిన 3 వన్డే లో భారత సునాయాసంగా గెలిచింది. ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ నెగ్గింది.   టాస్  గెలిచి , మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 49 ఓవర్ ల లో 243 పరుగులు చేసింది.రాస్ టేలర్ 90 ,లాథం 51 పరుగుల తో రాణించారు. షమీ,3 భువి 2,హార్దిక్ 2 ,ఛాహల్ 2 వికెట్లు పడగొట్టారు.తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలో ఛేదించింది.రోహిత్ 62 ,కోహ్లీ 60 పరుగులు చేయగా,రాయుడు 40,కార్తిక్ 38 లిద్దరూ నాటౌట్ గా నిలిచారు.

'వాల్మీకి' గా వరుణ్ తేజ్ 


తమిళ సూపర్ హిట్ మూవీ 'జిగర్తాండ' ని తెలుగు లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న 'వాల్మీకి' సినిమా షూటింగ్ ప్రారంభమైనది. తమిళ్ మూవిలో సిద్దార్థ్ హీరోగా, బాబీ సింహ విలన్ గా నిర్మితమైన ఈ సినిమా ను టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే మూవీ డైరెక్టర్ కావాలనుకునే హీరోకి అండ్ ఒక రౌడీకి మధ్యనడిచే స్టోరీ. బాబీ సింహ పోషించిన భయంకరమైన రౌడీ పాత్రను వాల్మీకిలో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు వరకు బాబీ సింహ చిన్నా చితక పాత్రలు పోషిస్తూ వుండే నటుడు. జిగర్తాండ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ బాబీ సింహ లో ఉన్న ఒక గొప్ప నటుణ్ని చూసింది. ఈ సినిమాలో బాబీ నటనకు గాను జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. బాబీ నటన, కార్తీక్ సుబ్బరాజు కథను నడిపిన తీరు మరియు చివరి 15 నిముషాలు సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి. ఇక వాల్మీకి విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఒక రౌడీ గా ఆకట్టుకోగలడా, చివరి 15 నిమిషాల కథను ఎంతవరకు మాతృకకి దగ్గరగా చూపిస్తారు అనేవి సినిమా విజయం ఫై ప్రభావం చూపే అంశాలు. ఇక హీరో పాత్ర పోషించిన సిద్దార్థ్ పాత్రను తెలుగు లో ఎవరు చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు. దబాంగ్ లాంటి హిందీ బ్లాక్ బస్టర్ ని తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేర మార్పులు చేసి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ వాల్మీకి ని ఏ స్థాయి లో నిలబెడుతాడో చుడాల్సిందే. 

Sunday, January 27, 2019

సౌతాఫ్రికా ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు : పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కి 4 మ్యాచ్ ల సస్పెన్షన్


పాకిస్థాన్ కెప్టెన్ ,వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కి తరువాతి 4 మ్యాచ్ ల అస్పెన్షన్ విధించింది ఐసీసీ.సౌతాఫ్రికా టీమ్ ప్లేయర్ ఆండీలే పేలుక్వాయో పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు ఐసీసీ ఈ సస్పెన్షన్ విధించింది.గత మంగళ వారం జరిగిన రెండో వన్డేలో ఆండీలే పేలుక్వాయో బ్యాటింగ్ చేస్తుండగా "అరేయ్ నల్లోడా ,మీ అమ్మ ఈ రోజు ఎక్కడ కూర్చుంది..?నీకు ఏం కావాలని ఆమెను ఆడిగావు ?" అని దూషించడం స్టంప్స్ మైక్ లో రికార్డ్ కావడం ,ఐసీసీ దీనిపై విచారణ జరపడం జరుగగా,సర్ఫరాజ్ తప్పును ఒప్పుకున్నాడు.అందుకే అతడు 3 వ వన్డే ఆడలేదు. 

" హెల్ బాయ్ 3 "ట్రైలర్ విడుదల..


గతం లో హెల్ బాయ్ -1 ,  2004 లో వచ్చింది.అందులో రాన్ పెరల్ మన్ టైటిల్ రోల్ పోషించాడు.అది చాలా బాగా ఆడింది.తర్వాత దాని సీక్వెల్ కూడా వచ్చింది.అది కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు డేవిడ్ హార్బర్ హెల్ బాయ్ గా రాబోతున్నాడు. ఇందులో కిల్ బిల్ ఫేమ్ మిల్లా    జెవోవిచ్ హీరోయిన్ గా రాబోతుంది
ఈ ఏప్రిల్ లో రానున్న ఈ మూవీ ట్రైలర్ చూడండి

మరిన్ని అప్ డేట్స్ కోసం visit.. thribhuvanavijayam.com

."మణి కర్ణిక" రెండు రోజుల వసూళ్లు

"మణి కర్ణిక" రెండు రోజుల వసూళ్లు ఎన్నో వివాదాల తర్వాత  ,క్రిష్   దర్శకత్వంలో ,కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో,బాహుబలి రచయిత వి.విజయేంద్రప్రసాద్ కథనం లో వచ్చిన వీర నారి ఝాన్సీ లక్ష్మీ బాయి బయోపిక్ గా వచ్చిన "మణి కర్ణిక"మూవీ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.ఈ చిత్రం దేశ వ్యాప్తంగా తొలి రోజు 8.11 కోట్లు వసూలు చేయగా,రెండో రోజు రిపబ్లిక్ డే కావడం వల్ల  11.2 కోట్ల వసూళ్లు వచ్చాయి.క్రిటిక్స్ నుండి తీవ్ర నెగెటివ్ రివ్యూలు ఎదుర్కున్న ఈ సినిమా ముందు ముందు ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.