• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, January 26, 2019

ఓహ్..! మన సూపర్ హీరోలు చేసే సాహసాలు ,షూటింగ్ టైం లో ఇలా ఉంటాయా..!

సూపర్ మాన్ ,ఐరన్ మాన్, స్పైడర్ మాన్, కెప్టెన్ అమెరికా,బ్లాక్ పాంతర్, హల్క్ , జురాసిక్ పార్క్ వంటి సినిమాలలో మనం ఎన్నో అద్భుతమైన సీన్ లను,ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలను,గాలిలో ఎగిరే సన్నివేశాలను,అవతార్ ,జురాసిక్ పార్క్ వంటి సినిమాలలో పాత్ర దారుల వేష ధారణ ,జంతువుల కదలికలు ఇవన్నీ ఎంతో బాగుంటాయి.కానీ ఇవన్నీ గ్రాఫిక్స్ అనే విషయం మనకు తెలిసిందే.ఈ చిత్రాలలో ని సీన్ లు షూట్ చేసే తప్పుడు ఎలా ఉంటాయో చూస్తే మీరు చాలా నిరుత్సాహ పడటం ఖాయం..ఒకసారి చూడండి...

మరిన్ని అప్డేట్స్ కోసం www.thribhuvanavijayam.com ని విజిట్ చేయండి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ.విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! 
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! 
కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... అంటూ సృష్టికి మూలం అయిన ఓంకార నాదం గురించి చెప్పడానికి మహా మనిషి కలం నుండి అక్షరాలు జాలు వారాల్సిందే... 

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం... అంటూ ఉద్వేగంగా సమాజాన్ని మేల్కొల్పాలి అన్న కానీ ఆ మహానుభావుడి కలం కదలాడాల్సిందే...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు, నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా... అంటూ ఆశావాహ దృక్పదాన్ని రగల్చాలి అన్న కూడా ఆ మహా మూర్తి కలం కాగితం ఫై కసితో పోరాడాల్సిందే... 

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాక అల సాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా... అంటూ సమాజం లో కొన్ని కళలు కొన్ని వర్గాల వారివే కావు అవి అందరివీ అనే భావజాలాన్ని చెప్పాలన్న ఆ సరస్వతి పుత్రుని కలం అక్షరాల అంతరంగాన్ని చూపాల్సిందే...

ఇలా ఎన్నో మరెన్నో అద్భుతమైన, అందమైన ఆహ్లాదమైన, ఉద్వేగమైన పాటలు... కాదు కాదు మాటల పదనిసలు పువ్వుల మాలలుగా కూర్చి మనకు అందించిన ఆ సరస్వతి పుత్రుడు శ్రీ సిరివెన్నెల "సీతారామశాస్త్రి" గారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక "పద్మశ్రీ" పురస్కారాన్ని ప్రకటించిన సందర్భం లో "త్రిభువనవిజయం"తరుపున హృదయ పూర్వక అభినందనలు. పద్మశ్రీ.. సీతారామశాస్త్రి గారిని చేరటానికి కొంచం సమయం పెట్టిన మాట నిజం. అయిన కూడా శాస్త్రీ గారి చెంతకు చేరింది పద్మశ్రీ పురష్కారం. సీతారామశాస్రి గారు ఎప్పుడో ఈ అర్హతను దాటి వెళ్లారు. ఎలాంటి వున్నత పురష్కారాలకు అయిన సిరివెన్నెల గారు అర్హులు అని సగర్వంగా చెప్పొచ్చు. తెలుగువారిగా తెలంగాణ రాష్ట్ర కోటాలో వారికి ఈ పురష్కారం లభించింది. తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమా రంగానికి చేసిన సేవకు గాను ఇలాంటి మరెన్నో పురష్కారాలు వారి చెంతకు చేరి వాటి ప్రతిష్టను పదిల పరచుకోవాలి అని ఆశిద్దాం.

మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' మూవీ టైటిల్ లోగో పోస్టర్ విడుదల. మాస్ మహారాజ్ అని అభిమానులు అతడికి ఇచ్చిన పేరుకు అతికినట్టుగా సరిపోయే హీరో రవితేజ. అయితే కొంత కాలంగా ఫామ్ కోల్పియాన రవితేజ అభిమానులను నిరుత్సాహ పరిచిన మాట నిజం. రాజా ది గ్రేట్ బాగానే ఆడిన ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలు టచ్ చేసి చూడు.. టచ్ చేయలేదు ఆ తరువాత వచ్చిన నేల టిక్కెట్ కు.. టికెట్స్ తెగని పరిస్థితి. ఇక రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ హాలులో నిలబడ లేకపోయింది. మాస్ మహారాజ్ "డిస్కో రాజా" మూవీ తో అదిరిపోయే సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుగా వున్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన "డిస్కో రాజా" మూవీ టైటిల్ లోగో చూస్తుంటే డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ని ఇవ్వబోతున్నట్టుగా వున్నాడు. టైటిల్ ని బట్టర్ ఫ్లయ్ ఆకారం లో డిజైన్ చేశారు. టైటిల్ కి బ్యాక్ సైడ్ లైట్ షేడింగ్ లో న్యూరాన్స్ ని చూపిస్తు, టైటిల్ కి పైన ఈజ్ ను క్రాస్ మార్క్ తో చూపిస్తూ, వాజ్ అని రాయడం మరియు టైటిల్ క్రింది భాగం లో రివైండ్, ఫార్వార్డ్, ప్లే, కిల్ అని రాసి "ప్లే" ని రెడ్ కలర్‌తో కొట్టేసి ఉండటాన్ని ఆధారంగా ‘డిస్కో రాజా’ స్టోరీ కి సంబందించిన హింట్స్ ని లోగో తోనే చెప్పే ప్రయత్నం చేసారు. ఇక టైటిల్ కి తగ్గ ఎనర్జీ సినిమా కథలో ఉంటే మాస్ మహారాజ్ తన అభిమానులకు థియేటర్స్ లో డిస్కో డాన్స్ చేసే ఊపును ఇచ్చేయటం కాయం. 

రెండో వన్డే లో భారత్ సునాయాస విజయం : న్యూజీలాండ్ తో 5 వన్డేల సిరీస్ 2-0 తో భారత్ ఆధిక్యం


 న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 90 పరుగుల తేడాతో
 న్యూజీలాండ్ ను ఓడించింది.  325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ బ్యాట్స్ మెన్
 విఫలమయ్యారు.  234 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి
 సత్తా చాటి, 4 వికెట్లతో కివీస్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్  50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు
సాధించింది. రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్
22 పరుగులు చేశారు.కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్ లు చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ కి  దిగిన కివీస్... క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. బ్రేస్ వెల్ ఒక్కడే
భారత్ ను   కొంత వరకు ఎదుర్కోగలిగాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో  మన్రో 31,  టేలర్ 22, లాథమ్ 34,
నికోల్స్ 28 పరవా లేదనిపించారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లో
చెరో వికెట్ పడగొట్టారు.  రోహిత్ శర్మకు  మ్యాన్  ఆఫ్   ది మ్యాచ్ దక్కింది

'సీత' తో వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్: 'సీత' మూవీ ఫస్ట్ లుక్ విడుదల. 


పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ దర్శకత్వలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న 'సీత' సినిమా ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదల అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి శ్రీనివాస్ కాజల్ ని ఆటపట్టిస్తు గట్టిగ నవ్వుతుంటే ఆశ్చర్యం తో కూడిన చూపుతో శ్రీనివాస్ ని కాజల్ చూస్తుంది. టైటిల్ ని బట్టి కథ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న కథనం లాగా వుంది. ఈ సినిమాతో బెల్లకొండ ఆశిస్తున్న విజయం దక్కాలని కొరుకుందాము.

ప్రొడక్షన్ నంబర్ 34 గా తెలుగులో తెరకెక్కుతున్న 96 తమిళ మూవీ.
 గణతంత్ర దినోత్సవం సందర్బంగా దిల్ రాజు నిర్మాణం లో సమంత మరియు శర్వానంద్ జంటగా తమిళ 96 మూవీని తెలుగులో నిర్మిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. తమిళ మూవీకి డైరెక్టర్ గా పనిచేసిన సి. ప్రేమ్ కుమార్ నే ఈ సినిమాకు దర్శకుడిగా తీసుకున్నారు. షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుంది అనే వివరాలు తెలియాల్సి వుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు త్రిషల అభినయం సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. అదే మేజిక్ సమంత అండ్ శర్వానంద్ లు రిపీట్ చేయాలనీ ఆశిస్తూ అల్ ది బెస్ట్ ఫ్రమ్ 'త్రిభువనవిజయం' .

Friday, January 25, 2019

భారీ స్కోర్ చేసిన భారత్ : న్యూజిలాండ్ లక్ష్యం 325.భారత్ తో రెండో వన్డే


న్యూజిలాండ్ తో జరుగుతున్న 2 వ వన్డే లో భారత్ 324/4 పరుగులు చేసింది.రోహిత్ 87,ధావన్ 66  పరుగుల తో రాణించగా, మిిగతా బ్యాట్స్మెన్ 40   ప్లస్ పరుగులు సాధించారు.న్యూజిలాండ్ 11   ఓవర్లలో 69/2 పరుగులు చేసింది ..

70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు“త్రిభువన విజయం” పాఠకులకు మరియు సమస్త భారతావనికి 70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య భారతదేశం అనేక మతాలు, కులాలు, జాతులు కలిగిన దేశం అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అందుకే స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత భారతీయులందరికి సమన్యాయం, సమాన హక్కులు మరియు స్వేచ్ఛ ను అందించటం కోసం 1947 ఆగస్టు 29 న డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలనలోకి తీసుకొని అనేక సవరణలతో పొందుపరిచిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ తదుపరి 1950 జనవరి 26 న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుంటు ప్రతి సంవత్సరం ఈ రోజు జాతీయ జెండాకు వందనం చేస్తూ త్యాగధనులను గుర్తుచేసుకుంటున్న పండుగే మన ఈ గణతంత్రం. అనేక సంవత్సరాల బానిసత్వము నుండి దేశానికి విముక్తి కలిగించి ఈ రోజు మనము పొందుతున్న స్వేచ్ఛ హక్కుల కోసం ఎందరో మరెందరో త్యాగధనులు భావితరాల కోసం విదేశీ తూటాలకు ఎదురుగా నిలిచి రక్తం కారుతున్నా, కొరడా దెబ్బలకు చర్మం పగులుతున్న , ప్రాణాలు పోతున్న ఎంతోమంది తలలు వాల్చితే అందిన ఫలాలు ఇవి. ఈ 70 వసంతాల గణతంత్ర స్వరాజ్యంలో ఎందరో మహానుభావులు దేశకీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు రెపరెప లాడించిన అద్భుత ఘట్టాలు చాల. ఇంకో వైపు చుస్తే 70 వసంతాల గణతంత్రన్ని ఘనంగా జరుపుకుంటున్న భారతావని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది. ఆ త్యాగధనుల త్యాగాలను మరచి ప్రస్తుత సమాజం కులం కోసం మతం కోసం స్వార్ధపూరిత రాజకీయాలతో నవభారతం ప్రయాణిస్తుంది. ఆగష్టు 15 మరియు జనవరి 26 న మాత్రమే జెండాకు వందనం చేయకుండా ఇది మాతరం వందేమాతరం అంటూ కుల, మత, స్వార్ధ రాజకీయాలను మాని ఇది నా దేశం ఇవి నా పరిసరాలు సమస్త దేశ ప్రజలు నా సోదరి సోదరీమణులు అనే విశాల దృక్పధంతో ప్రతి భారతీయుడు ఆలోచించిన రోజు మనం వేసే ప్రతి అడుగు చేసే ప్రతి ఆలోచన భావితరాలకు మార్గదర్శకంగా మారినపుడు రోజు గణతంత్రమే ప్రతి రోజు స్వాతంత్య్రమే. జై హింద్.

Mr. మజ్ను ఓవరాల్ రేటింగ్స్ఈ రోజు విడుదల అయిన అక్కినేని అఖిల్ చిత్రం Mr మజ్ను పాజిటివ్ టాక్ ని తెచ్చుకుందని క్రింది రేటింగ్స్ ని బట్టి తెలుస్తుంది.ఇది జస్ట్ హిట్ 
Indian express -2.5/5
గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ -2.75/5
తుపాకీ డాట్ కామ్-2.5/5
హన్స్ ఇండియా -2.75/5
ఇండియా టుడే -2.5/5
gulte.com -3/5
sify.com- 2.5 /5
123 తెలుగు డాట్ కామ్ -2.75/5
టాలీవుడ్ డాట్ నెట్ -2.5/5
చిత్ర మాల -2.5 /5

న్యూస్ 18   -3.25/5
తెలుగు 360 డాట్ కామ్ -2.75/5
ఫిల్మి బీట్ -3/5
మిర్చి 9 డాట్ కామ్ -2.5/5
తెలుగు మిర్చి డాట్ కామ్- 3/5
టాలీ వుడ్ .నెట్ -2.5/5

ఆకట్టుకుంటున్న నిహారిక "సూర్యకాంతం"-టీజర్.

కొణిదెల నిహారిక ఈ సారి 'సూర్యకాంతం' గా ముందుకు రాబోతుంది.ఈ సాయంత్రం విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. రాహుల్ విజయ్ నిహారిక కి జోడీ గా నటిస్తున్న ఈ చిత్రాన
నికి,  ప్రణీత్  బ్రమండ పల్లి  దర్శకుడు.అంతే కాదు వరుణ్ తేజ్ ఏఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. సుహాసిని నిహారిక తల్లి పాత్రలో నటిస్తుంది.టీజర్ ని బట్టి ఇది బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పాత్ర లాగా అనిపిస్తుంది.ఒక సారి టీజర్ మీరే చూడండి

పూరీ జగన్నాథ్,రామ్ ల కొత్త చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ ప్రారంభం


పూరీ జగన్నాథ్ ఇప్పుడు లైం లైట్ లో లేని దర్శకుడు, ఇప్పుడు డిమాండ్ లేని దర్శకుడు కావచ్చు.అతని గత కొన్ని చిత్రాలు సరిగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ అతడు ఎపుడు కూడా బ్యాడ్ మూవీ తీయ లేదు.ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంతే.అతడు తీసిన బుజ్జి గాడు, నేనింతే,ఏక్  నిరంజన్  దేవుడు చేసిన మనుషులు,పైసా వసూల్ వరకు చూస్తే ఈ సినిమాలు కమర్షియల్ గా క్లిక్ కాలేదు.కానీ ఈ సినిమాలు టీవీ లో వస్తే ఎవ్వరూ వదలకుండా  చూస్తారు.అంతెందుకు ప్రభాస్ తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాల్లో ‘బుజ్జిగాడు’ ఒకటి అని చెప్తాడు.ఇక విషయానికొస్తే పూరిజగన్నాథ్ త్వరలోనే హీరో  రామ్ తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నాడు. ఆ చిత్రం టైటిల్ గా ‘ismart shankar’(ఇస్మార్ట్ శంకర్) అని పెట్టాడు.ఈ సినిమా షూటింగ్ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ లుక్ పూర్తిగా కొత్త గా ఫుల్ మాస్ గా ఉంది.హెయిర్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంది.చూస్తుంటే ఈ సినిమా తో పూరి, రామ్ లు ఇద్దరూ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నారు.ఈ కార్యక్రమం లో ఛార్మీ పాల్గొన్నది All the best both of you..పూరి &రాం from THRIBHUVANA VIJAYAM.

Thursday, January 24, 2019

సల్మాన్ ఖాన్ 'భరత్' టీజర్ విడుదల

బాలీవుడ్ 'భాయ్' సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్  కొత్త  చిత్రం 'భరత్' టీజర్ విడుదల అయింది.ఇందులో సల్మాన్ ఖాన్ నేవీ ఆఫీసర్ గా కనిపించ బోతున్నాడు.ఇది దేశ భక్తి సినిమా అని అర్థమవుతుంది. ఇందులో సల్లూ భాయ్ పాత సల్మాన్ లాగా స్లిమ్ గా కనిపిస్తున్నాడు.అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని T-సిరీస్ నిర్మిస్తుంది.ఈ సినిమా రాబోయే 'ఈద్' కి విడుదల కానుంది.మీ కోసం టీజర్ వీడియో.


విజయవంతమైన ఇస్రో PSLV C-44 మిషన్: కక్ష్య లో కి ప్రవేశించిన మైక్రోశాట్ -ఆర్ అండ్ కలామ్ శాట్.


 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయ పరంపర కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుండి జనవరి 24, రాత్రి 11 గంటల 37 నిమిషాలకు PSLV C-44 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 26 గంటల నిరీక్షణ తరువాత భారత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్‌-ఆర్‌ మరియు తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్‌ను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డాయి. అనంతరం ఇస్రో చైర్మన్ డా. కే. శివన్  PSLV C-44 మిషన్ లో పాల్గొన్న టీమ్ కు మరియు కలామ్ శాట్ ని రూపొందించిన హై స్కూల్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


ఇండియా టుడే సర్వే: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలలో ఎవరికి ఎన్ని సీట్లు.


తాజాగా ఇండియాటుడే రాబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాల ఫై నిర్వహించిన సర్వేను బట్టి ఏ పార్టీకి పూర్తి మద్దతు ప్రజలు ఇవ్వరు అని హంగ్ ఏర్పడుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార ఎన్డీయే కూటమి 237 సీట్లు, యూపీఏ కూటమి 166 సీట్లు , మరియు ఇతర పార్టీలకు 140 సీట్లు గెలుపొందుతాయి అని తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 ని ఏ కూటమి చేరుకోలేదని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇదే కనుక జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని 40 లోక్ సభ స్థానాలలో మెజారిటీ స్థానాలు పొందే పార్టీల అవసరం కీలకంగా మారొచ్చు. తెలంగాణ సీఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ మోస్తరుగా సక్సెస్ అయినా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించొచ్చు.

'RRR' లో కీలక పాత్రలో సముధ్రఖని.

'RRR' మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. విసారణై చిత్రము లో నటనకు గాను జాతీయ ఉత్తమ సహాయనటుడిగా అవార్డు గెలుచుకున్న తమిళ నటుడు అండ్ డైరెక్టర్ సముధ్రఖని, ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR’ లో కీలక పాత్ర లో కనిపించనున్నాడు. ఈ విషయాన్నీ  సముధ్రఖని ఒక మీడియా ఇంటర్వ్యూ లో తెలిపాడు. రాజమౌళిగారు ఒక రోజు ఇంటికి ఆహ్వానించి ‘RRR’ లో ఒక మంచి రోల్ వుంది చేస్తారా అని అడుగగా ఇంకో ఆలోచన లేకుండ ఒప్పేసుకున్నాను, కానీ రాజమౌళి గారు ముందు మీరు స్క్రిప్ట్ చదవండి అని అన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. రవితేజ హీరో గా నటించిన శంభో శివ శంభో సినిమాకు తెలుగు తో పాటు తమిళ్ మూవీ కి సముద్రఖనే డైరెక్టర్. తమిళ్ లో గొప్ప పాత్రలు పోషిస్తున్న సముధ్రఖని ని జక్కన్న చెక్కే 'RRR'లో ఒక అద్భుతమైన పాత్రలో ఊహించుకోవచ్చు.


సంక్రాంతి అల్లుళ్ళు చితక్కొడుతున్నారుగా!


ఈ సంక్రాంతికి అంతేగా అంతేగా అంటూ ఎఫ్- 2 మూవీ తో మొదలైన నవ్వుల తుఫాన్ ఆలోచనలకూ అందనంత సూపర్ డూపర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ కి కూత వేటు దూరంలో ఉంది. సినిమా ప్రారంభమైనప్పుడు ఎలాంటి అంచనాలు లేవు మూవీ కి బజ్ క్రియేట్ చేసేందుకు అప్డేట్స్ ఇచ్చినపుడు ప్రేక్షకుల నుండి తక్కువ రెస్పాన్సే వచ్చింది. సినిమా ట్రయిలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సినిమా రిలీజ్ అయ్యాక ఇచ్చిన రివ్యూస్ అండ్ మౌత్ టాక్ తో ఎఫ్ - 2 మూవీ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక డైరెక్టర్ అనిల్ రావి పూడి రాసుకున్న కథ అందరికి బాగా తెలిసినదే అయిన కథను నడిపిన విధానం వెంకీ పాత్రలో విక్టరీ వెంకటేష్ పరకాయ ప్రవేశము చేసి నవ్వుల చిచ్చు బుడ్డిలను సినిమా చూస్తున్న ప్రేక్షకుల ముందు వెలిగించిన తీరు సినిమాను ఈ రేంజ్ విజయతీరాలను తాకేలా చేసిన ప్రధానాంశాలు. ఇక వరుణ్ తేజ్ సపోర్ట్ మరియు హీరోయిన్స్ తమన్నా మెహ్రిన్ ల గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ గా నిలిచాయి. ఇదే విధమైన కలెక్షన్స్ మరో వారం రోజులు ఉంటే నాన్ బాహుబలి రికార్డులను దాటడం కాయం.


భరతమాత సేవలో ప్రాణాలర్పించిన సైనికుడు నాజిర్ అహ్మద్ వనీ కి ప్రతిష్టాత్మక అశోక చక్ర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన భరతమాత ముద్దు బిడ్డ నాజిర్ అహ్మద్ వనీకి ప్రతిష్టాత్మక 'అశోక చక్ర' అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదిగా దేశానికి వ్యతిరేకంగా 2014 వరకు నాజిర్ అహ్మద్ వనీ పనిచేసి ఆ తరువాత అతని ఆలోచనలో మార్పు వచ్చి దేశానికి సేవ చేసేందుకు ఇండియన్ ఆర్మీ లో చేరాడు. ఇంతకు ముందు రెండు సార్లు సేనా మెడల్ ని పొందారు. ఈ నెల 26 న నాజిర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ఈ అవార్డు ను అందచేయనున్నారు.

Wednesday, January 23, 2019

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా ప్రియాంక గాంధీ :కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా ప్రియాంక నియామకం 
అమెరికా వెళ్లి ఒప్పించిన రాహుల్.
కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు 
వాళ్లకు కుటుంబమే పార్టీ ;మాకు పార్టీయే కుటుంబం :మోడీ 

కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్య దర్శి గా ప్రియాంకా గాంధి నియమితురాలైంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.తన సోదరుడు రాహుల్ స్వయంగా అమెరికా వెళ్లి ఆమెను ఒప్పించినట్టు తెలిపాడు.ప్రస్తుతం యూపీ లో SP-BSP పార్టీ లు కాంగ్రెస్ ను తమతో చేర్చుకు పోక పోయే సరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.అచ్చం తన నానమ్మ ఇందిరా గాంధీ లాగా ఉండే ప్రియాంక రాక తో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటుంది అని కాంగ్రెస్ వారు అనుకుంటుండగా,వారికి కుటుంబమే పార్టీ అని,మాకు మాత్రం పార్టీనే కుటుంబమని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రియా వారియర్ లవర్స్ డే సినిమా ఆడియో లాంచ్ : ముఖ్య అతిథిగా అల్లు అర్జున్.

ప్రియా వారియర్ లవర్స్ డే సినిమా ఆడియో లాంచ్ : ముఖ్య అతిథిగా అల్లు అర్జున్. 

ఒక్క కన్ను గీటుతో కుర్రకారు మనస్సులను కొల్లగొట్టిన మలయాళీ సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన లవర్స్ డే (ఒరు ఆధార్ లవ్) సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. బన్నీ మాట్లాడుతు ఒక సౌత్ ఇండియన్ స్టార్ హీరోని అని చెప్పుకోవడం చాల గొప్పగా అనిపిస్తుంది అలాగే ఒక భాష సినిమాలను మరియు నటులను ఇతర భాషలలో ఆదరించడం చాల మంచి పరిణామం అని ఈ సినిమా తెలుగు లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 14 న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాతో మరోమారు ప్రియా వారియర్ కన్ను గీటుతో  ఏ మేరకు కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతుందో చుడాల్సిందే

కోహ్లీకి విశ్రాంతి: సారధ్య బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగింత.

కోహ్లీకి విశ్రాంతి: సారధ్య బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగింత.ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ మరోవైపు ఐ.సి.సి 2018 గాను ఇటివల ప్రకటించిన అవార్డులలో ప్రతిష్టాత్మక అవార్డ్స్  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో భాగంగా జరుగనున్న చివరి రెండు వన్డేలకు మరియు టి-20 సిరీస్ కి కెప్టెన్ కోహ్లీ కి విశ్రాంతిని ఇస్తున్నట్టు బిసీసీఐ ప్రకటించింది. కోహ్లీ స్థానంలో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ జట్టు సారధ్య బాధ్యతలు తీసుకుంటాడు. 5 వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెల్సిందే. రెండవ వన్డే ఈ నెల 26 వ తేదీన బే ఓవల్ స్టేడియం లో జరుగనుంది.

రేపే (24 వ తేదీ న) ఆస్కార్ అవార్డుల ప్రకటన

2018 సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డుల  వేడుక  24 వ తేదీ న జరుగ నున్నది . ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా సినీ ప్రియులు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నరు.ఈ సారి అత్యధికంగా 'నెట్ ఫ్లిక్ష్ రోమా' , 'ద ఫేవరైట్' చిత్రాలు  10 నామినేషన్ లను పొందాయి.  ' ద స్టార్ ఈజ్ బోర్న్ ' వైస్' చిత్రాలు 8 నామినేషన్ లు పొందాయి.ఈ సంవత్సరం ఆస్కార్ కి నామినేట్ అయిన వివిధ విభాగాల వారీ వివరాలు 
ఉత్తమచిత్రం: బ్లాక్‌ ప్యాంథర్బ్లాక్లాంన్స్‌మాన్బొహెమియాన్‌ రాప్సోడిది ఫేవరెట్గ్రీన్‌బుక్,
రోమాఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్వైస్‌.
ఉత్తమ నటుడు: క్రిస్టియన్‌ బాలే (వైస్‌)బ్రాడ్లీ కూపర్‌ (ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)విలియమ్‌ దఫోయ్‌ (ఎట్‌ ఇటర్నిటీస్‌ గేట్‌)రామీ మాలిక్‌ (బొహెమియాన్‌ రాప్సోడి)విగ్గో మార్టెన్‌సెన్‌ (గ్రీన్‌ బుక్‌).
ఉత్తమ నటి: యలిట్జా అపారిసియో (రోమా)గ్లెన్‌ క్లోజ్‌ (ది వైఫ్‌)ఒలివియా కోల్మన్‌ (ద ఫెవరెట్‌)లేడీ గగా ( ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)మెలిస్సా మెకర్తీ(కెన్‌ యు ఎవర్‌ ఫర్‌గివ్‌ మీ?).
ఉత్తమ దర్శకుడు: స్పైక్‌ లీ (బ్లాక్లాంన్స్‌మాన్‌)పావెల్‌ పౌలీకోస్కీ(కోల్డ్‌వార్‌)యోర్గోస్‌ లాంతిమోస్‌ (ది ఫేవరెట్‌)అల్ఫోనో క్వారోన్‌ (రోమా)
ఆడమ్‌ మెక్కే (వైస్‌).
ఉత్తమ సహాయనటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్‌)ఆడమ్‌ డ్రైవర్‌ (బ్లాక్లాంన్స్‌మాన్‌)సామ్‌ ఎల్లియోట్‌ (ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)రిచర్డ్‌ ఈ గ్రాంట్‌ (కెన్‌ యు ఎవర్‌ ఫర్‌గివ్‌ మీ?), సామ్‌ రాక్‌వెల్‌ (వైస్‌).
ఉత్తమ సహాయనటి: అమీ ఆడమ్స్‌ (వైస్‌)మరినా డిటవీరా (రోమా)రెజీనా కింగ్‌ (ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)ఎమ్మా స్టోన్‌ (ది ఫేవరెట్‌)రాచెల్‌ వీజ్‌ (ది ఫేవరెట్‌)
ఉత్తమ విదేశీ చిత్రం: కేపర్నామ్‌ (లెబనాన్‌)కోల్డ్‌ వార్‌ (పోల్యాండ్‌)నెవర్‌ లుక్‌ అవే (జర్మనీ)రోమా (మెక్సికో)షాప్‌ లిఫ్టర్స్‌ (జపాన్‌)
ఇంకా ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఒరిజినల్‌ స్కోర్ఫిల్మ్‌ ఎడిటింగ్కాస్ట్యూమ్‌ డిజైన్సౌండ్‌ మిక్సింగ్,  విజువల్‌ ఎఫెక్ట్స్మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌.. ఇలా మొత్తం  24 విభాగాలకు నామినేషన్లు ప్రకటించారు.

Mr.మజ్ను ట్రైలర్F2 మూవీ డైరెక్టర్ అనిల్ రావి పూడి ఇంటర్వ్యూ వీడియో

 సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాలలో తన  చిత్రాన్ని అద్భుత విజయం సాధించేలా తీసిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి ఐ డ్రీం మీడియా మీడియా తో తన సంతోషాన్ని పంచుకున్నాడు. F 2 మూవీ కి 4 పెద్ద సినిమాలు పోటీ లో ఉన్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టి 100 కోట్ల వసూలు దిశగా దూసుకు పోతున్న సందర్భం లో ఈ ఇంటర్వ్యూ ..

KA పాల్ కామెంట్ల పై వర్మ సమాధానం


KA  పాల్  కామెంట్ల పై  రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ నేను పాల్ కాళ్లు పట్టుకున్నది, అతడిని కింద పడేసి అతని మెదడు ను సరి చేయడానికి అని చెప్పాడు.గతం లో పాల్ మీడియా తో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తన దగ్గరికి వచ్చి ,కాళ్ళ పై పడి ,తన ఆశీర్వాదం తీసుకున్నాడు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వీడియో చూడండి..


విజృంభించిన భారత బౌలర్లు: 38 ఓవర్ల మాచ్ లో 156 పరుగులకే ఆలౌట్:అలవోకగా ఛేదించిన భారత్.న్యూజిలాండ్ టూర్ లో భాగంగా జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో మొదటి వన్డే లో భారత్ గెలుపు దిశగా సాగుతుంది.భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ కుప్ప కూలారు.కులదీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ 3,ఛాహల్ 3,కేదార్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ల లో ఒక్క కేన్ విలియంసన్ మాత్రమే 64 పరుగులు చేయగా,రాస్ టేలర్ చేసిన  24 పరుగులే 2 వ అత్యుత్తమ స్కోర్..తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ ధావన్ (75),కోహ్లీ (45) లు రాణించారు.వాతావరణం అననుకూలం వల్ల 38 ఓవర్ లకు కుదించారు.భారత్ 82 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మాన్ ఆఫ్ ద మాచ్ మొహమ్మద్ షమీ.

Tuesday, January 22, 2019

దివి నుండి దిగి వచ్చిన తార వలె...! ' ప్రవాసీ భారతీయ దివస్ ' లో హేమా మాలిని అద్భుత నృత్య ప్రదర్శన; అచ్చెరువొందిన సుష్మాస్వరాజ్


బాలీవుడ్ దివా,5 పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో ఇప్పటికీ అలరిస్తున్న బాలీవుడ్ ' డ్రీమ్ గర్ల్' హేమామాలిని వారణాసి లో జరుగుతున్న 'ప్రవాసీ భారతీయ దివస్'  లో తన నృత్య ప్రదర్శన తో అలరించింది.ఇక్కడ ఆమె నృత్యమే కాకుండా ఆమె వేష ధారణ సభికులను సంభ్రమాశ్ఛర్య చకితులను చేసింది.నిజంగా దివి నుండి దిగి వచ్చిన ఒక తార లా,ఒక దేవ కన్య లా ఆమె ఆహూతుల ను అలరించింది.ఈ కార్యక్రమనికి విచ్చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆనందా శ్చర్యాల కు గురైంది.మీ కోసం ఆ వీడియో లింక్
https://youtu.be/ArtaTfGwYsk

మాధవన్ హీరో గా ది రాకెట్రి మూవీ : ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ గా మాధవన్.

చాలా తక్కువ సంఖ్యలో ఉన్న నిబద్దత గల నటుల్లో ఆర్ మాధవన్ ఒకరు. ఒక పాత్ర కు న్యాయం చేయాలంటే నటుడిగా పడేకష్టం ఎలా ఉంటోందో రాకెట్రి మూవీ లో మాధవన్ లుక్ చూస్తే తెలుస్తుంది. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మాధవన్ లుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అచ్చంగా నంబి నారాయణన్ ని దింపేసాడు మాధవన్. ఈ లుక్ కోసం రోజు కి దాదాపుగా 15 గంటలు మేకప్ కి టైం కేటాయించాల్సి వస్తుందట. తెలుగు హింది తమిళ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా కి మాధవన్ తొలిసారిగా దర్శకత్వము వహిస్తుండటం మరో విశేషం.

భారీ రేటుకు RRR మూవి శాటిలైట్ హక్కులు !!!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రాంచరణ్ ద్వయం కలయిక లో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ మూవి RRR ఇంకా రెండో షెడ్యూల్ కూడా పూర్తి కాకముందే ప్రముఖ టి.వి నెట్ వర్క్ సంస్థ దాదాపుగా 150 కోట్ల బారి మొత్తమ్ సినిమా అన్ని భాషల శాటిలైట్ హక్కులకు కలిపి ఆఫర్ చేసినట్టు వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. నమ్మశక్యంగానే వున్నా మూవీ యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో నిజమెంతో తెలియాలి అంటే సినిమా యూనిట్ స్పందిచాల్సిందే.

యాత్ర మూవీ సెన్సార్ పూర్తి: క్లీన్ యూ సర్టిఫికెట్


 దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం లో కీలక ఘట్టం అయిన పాదయాత్ర ప్రధానాంశంగా మమ్ముట్టి కధానాయకుడుగా నటిస్తున్న యాత్ర మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఇప్పటికే రీలీజ్ అయిన ట్రయిలర్ కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 8 వ తేదిన రిలీజ్ కాబోయే యాత్ర మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. ఈ మధ్యే రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ కి మంచి టాక్ వచ్చినా ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేకపోవడం తెల్సిన విషయమే. ఇక యాత్ర మూవీ విషయంలో డైరెక్టర్ మహి వి రాఘవ కొన్ని సినిమాటిక్ మార్పులు చేసి మూవీ చూస్తున్న ప్రేక్షకుడు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండ ఉండేలా 2 గంటల 6 నిమిషాల తక్కువ నిడివితో సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒక రాజకీయనాయుకుడి గా వైయస్ రాజశేఖర్ రెడ్డి చరిస్మా మరియు మమ్ముట్టి నటన ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్స్ కు రప్పిస్తాయో చూడాల్సిందే.

"కెప్టెన్ మార్వెల్ " తెలుగు ట్రైలర్

ది స్ట్రాంగెస్ట్ అవెంజర్ అయిన ''కెప్టెన్ మార్వెల్'' సినిమా  official ట్రైలర్ మీ కోసం.ఈ ట్రైలర్ చూస్తే సినిమా చాలా బాగా ఉండబోతున్నది అనే విషయం తెలుస్తుంది.ఒక సారి ఓ లుక్ వేయండి ..

సాహో సెట్ నుండి మరో ఫోటో విడుదల

 'బాహుబలి' తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'.ఈ చిత్రానికి సంబంధించి ,ఇప్పటివరకు ఒక టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.తర్వాత చిత్ర యూనిట్ నుండి పెద్దగా అప్ డేట్ లేమి లేవు.అయితే చిత్రం లో నటిస్తున్న నటుల్లో ఒకడైన అరుణ్ విజయ్ (నటుడు విజయ్ కుమార్ కొడుకు ) ,షూటింగ్ స్పాట్ లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు.ఈ ఫోటో లో హీరో ప్రభాస్,అరుణ్ విజయ్,జాకీ ష్రాఫ్, మరియు లాల్ ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రన్ రాజా రన్ ఫేం సుజిత్ అన్న విషయం తెలిసిందే.

ఏప్రిల్ 25 న వస్తున్న మహర్షి.

         


సూపర్ స్టార్ మహేష్ 25 వ సినిమా మహర్షి రిలీజ్ విషయం లో నెలకొని ఉన్న సందేహాలకు నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహర్షి ఏప్రిల్ 25 న విడుదలవుతుంది అని దిల్ రాజు ప్రకటించాడు. కృష్ణుడు-కుచేలుడి మధ్య ఉన్న స్నేహం ఇతివృత్తంగా సినిమా కథ సాగుతుంది అని మొదటి నుండి వినిపిస్తున్న టాక్. వంశీ పైడి పల్లి చెక్కుతున్న మహర్షి ప్రిన్స్ మహేష్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలవటం కాయంగా కనిపిస్తుంది.

RGV లక్ష్మీ'స్ ఎన్టీఆర్ -లక్ష్మీ పార్వతి లుక్ విడుదలరామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం లక్ష్మీ'స్ ఎన్టీఆర్ సినిమా కి సంబంధించి మరో పోస్టర్ ని విడుదల చేశాడు.ఇంతకు ముందు ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ విడుదల చేయగా ,ఇప్పుడు లక్ష్మీ పార్వతి పాత్ర కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశాడు.అయితే ఇందులో ఆమె ముఖం కనిపించదు.దూరంగా ఎన్టీఆర్ ఈ పోస్టర్ లో ఉంటాడు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సారా అలీ ఖాన్ ,మలైకా అరోరా ల జిమ్ వర్కవుట్ వీడియో -వైరల్.మలైకా అరోరా ఎంత ఫిట్ నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికీ తెలిసిందే.ఆమె వర్కౌట్ వీడియోలు ఇంటర్ నెట్ లో ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి.ఇప్పుడు అలాంటిదే మరోటి.ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్.సైఫ్ అలీ  ఖాన్ కూతురు,సింబా హీరోయిన్ లేటెస్ట్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ , స్లిమ్ బ్యూటీ మలైకా అరోరా తో జత కల్సి వర్కౌట్ చేస్తున్న వీడియో ను వీరి ట్రైనర్  నమ్రతా పురోహిత్ ట్విట్టర్ లో ఉంచగా అది, ఇప్పుడువైరల్ గా మారింది.ఒక సారి వీక్షించండి ..

Monday, January 21, 2019

ఇది కన్ ఫర్మ్ - కొరటాల శివ తో చిరు మూవీ-స్క్రిప్టు సిద్ధం.ఎన్నో అనుమానాలు,పుకార్ల తర్వాత , కొరటాల శివ,మెగాస్టార్ చిరంజీవి ల సినిమా పై క్లారిటీ వచ్చింది. సినిమాకి సంబంధించి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయిందని చిత్ర యూనిట్ తెలిపింది."సైరా" మూవీ తర్వాత ఈ చిత్రం పట్టాలకెక్కనున్నది.ఇది తెలుగు సినిమా చరిత్రలో నే మోస్ట్ అవైటెడ్ మూవీ.ఖచ్చితంగా ఇది చరిత్ర సృష్టించ బోయే మూవీ అవుతుంది.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ మరియు మ్యాట్నీ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

చిరంజీవి కుటుంబం నుండి 9 వ హీరో : వైష్ణవ్ తేజ్ :ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టిన మెగాస్టార్


ఇప్పటికే మెగా స్టార్ కుటుంబం నుండి  8 మంది హీరోలు వచ్చారు.ఈ మద్యనే చిరంజీవి చిన్న కూతురు భర్త ,చిరంజీవి చిన్నల్లుడు కూడా 'విజేత ' సినిమాతో ఆరంగేట్రం చేశాడు.ఇక ఇప్పుడు చిరంజీవి చెల్లెలి చిన్న కొడుకు,హీరో సాయి ధరం తేజ్ తమ్ముడు ,పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.ముందుగా నిన్న(20 వ తేదీ ) సాయి ధరం తేజ్ తన తమ్ముడి తెరంగేట్రాన్ని తెలుపుతూ ,తనలాగే ,తన తమ్ముడ్ని కూడా ఆశీర్వదించాలి  అని కోరుతూ మొదటి పోస్టర్ ని twitter లో విడుదల చేయగా.ఈ రోజు హైదరాబాద్ లో పూజ మరియు ముహూర్తం షాట్ కి చిరు వచ్చి,క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించాడు.ఈ సినిమా రంగస్థలం సినిమాకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుందని తెలిపాడు.ఈ సినిమాకి దర్శకుడు బుచ్చి బాబు సానా.ఇతడు సుకుమార్ శిష్యుడు.అందుకే ఇతడు ఈ సినిమా నిర్మాణంలో ,మైత్రీ మూవీ మేకర్స్ తో చేతులు కలిపాడు.ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కాగా ఈ సినిమా లో కొత్త అమ్మాయి ,'మనీషా' హీరోయిన్ గా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో నాగ బాబు,అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్,సుకుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.
                   

లక్ష్మిస్ ఎన్టీఆర్ మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్రాం గోపాల్ వర్మ తీస్తున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్.ఈ మూవీ టైటిల్ పెట్టింది మొదలు దీని పై ఎన్నో విమర్శలు ,బెదిరింపులు ,చర్చా కార్యక్రమాలు ఇలా ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ రావాలో అంత పబ్లిసిటీ రానే వచ్చింది.ఇక తాజాగా RGV విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వస్తుంది.దీనికి క్యాప్షన్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో పునర్జీవితు  య్యాడు అనే క్యాప్షన్ పెట్టాడు వర్మ.మీ కోసం ఆ వీడియో.

రణ్వీర్ సింగ్ 'సింబా' 24 రోజుల్లో కెరీర్ బెస్ట్ వసూళ్లు


బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రణ్వీర్ సింగ్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సింబా' సినిమా 24 రోజుల్లో 236 కోట్ల వసూళ్లు సాధించి ,అతడి కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 24 వ రోజున ఇది 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఇది దర్శకుడు రోహిత్ శెట్టి కెరీర్ లో కూడా హయ్యెస్ట్ వసూళ్లు.ఈ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మన తెలుగు మూవీ 'టెంపర్' కు రీమేక్ అన్న విషయం తెలిసిందే.

Sunday, January 20, 2019

వావ్..!బాలయ్యా ..! హౌ స్వీట్..! లవ్ యూ...మాకు ఇలాంటి బాలయ్య కావాలి..సినీ అభిమానుల సంతోషం..


నందమూరి బాలకృష్ణ అంటేనే అగ్రిసివ్ నెస్,ఎన్నో సార్లు,అభిమానులను కొట్టినా,కొంచెం వివాదాస్పదంగా మాట్లాడినా అది బాలయ్యకే చెల్లింది.బాలయ్య ముక్కు సూటిదానం,ఆయన వ్యాఖ్యలు,కొన్ని సార్లు ఆయన అభిమానులను కూడా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.అయితే ఈ మధ్య విడుదల అయిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా ప్రమోషన్ లో భాగంగా జెమినీ టీవీ లో  రానా తో ,  'నంబర్ వన్ యారీ విత్ రానా ' ప్రోగ్రామ్  లో బాలకృష్ణ ,రాపిడ్ ఫైర్ రౌండ్ ప్రశ్నలకు బాలకృష్ణ ఎలాంటి భేషజం లేకుండా చెప్పిన సమాధానాలు,ఆయన అభిమానులను, సినీ ప్రేమికులను  ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇందులో రానా ఒక ప్రశ్న అడుగుతూ చిరంజీవి సినిమాలలో నచ్చిన మూవీ అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అని చెప్పడం, చిరంజీవి అభిమానులను కూడా సంతోష పెడుతుంది.మరో ప్రశ్నకు లవర్ బాయ్ అనగానే ఎవరు గుర్తువస్తారు అన్న ప్రశ్నకు నాగార్జున అని చెప్పడం అది కూడా ఎంతో సంతోషంగా ,కల్మషం లేకుండా చెప్పడం అందరికీ సంతోషాన్ని కల్గిస్తుంది.బాలయ్య గనుక ఇలాగే ఉంటే ప్రతీ సినీ అభిమాని బాలయ్య కు అభిమాని గా మారడం ఖాయం.మీ కోసం ఆ వీడియో  ఇక్కడ.


యురి(URI) - ది సర్జికల్ స్ట్రైక్: భారతావని గర్వించదగిన గొప్ప సినిమా.


హిందీ లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఆదిత్య దారి దర్శకత్వములో 2016 లో ఇండియా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యం లో సాగిపోయే కథనం తో తెరకెక్కిన సినిమా గత వారం విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడికి ఒక నిజమైన యుద్దాన్ని మరియు ఆర్మీ జవాన్ నిజజీవితంలోని సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా డైరెక్టర్ ఆదిత్య దార్ చూపారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడు గుండెల నిండా దేశభక్తి తో ఇండియన్ ఆర్మీ సాగించే పోరాట దృశ్యాలను చూస్తూ చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. సన్నివేశాలకు తగిన కెమెరా పనితనం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇండియన్ ఆర్మీ దేశంకోసం చేసే సాహసాలకు ప్రతి భారతీయుడి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. సినిమా కథపై చాల రీసెర్చ్ చేసి కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజ్స్ తీసుకుని ప్రేక్షకుడికి సినిమాను కనెక్ట్ చేసిన తీరు అద్భుతం. సినిమా మొదలు అవగానే ఇండియన్ ఆర్మీ ఫై తీవ్రవాదులు సర్జికల్ స్ట్రైక్ చేయటం ఆ తరువాత పీ.ఎం.ఓ స్టార్ట్ చేసే ఆపరేషన్ తో సినిమా ప్రథమార్థం సాగుతుంది. హీరో తల్లి హెల్త్ సమస్యలవల్ల స్వచ్చంద పదవి విరమణ పొంది తల్లికి సేవచేద్దాం అనుకునే టైం లో పీఎంఓ నుండి వచ్చిన ఆదేశాల మేరకు పి.ఓ.కె ఫై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రతిపాదించిన సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొందుకు హీరో వెళ్లే సీన్ ఆర్మీ జవాన్ దేశానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో సర్జికల్ స్ట్రైక్ మిషన్ కి సంబంధించి వచ్చే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుడికి నిజమైన ఆర్మీ సాహసాలను త్యాగాలను ఆర్మీ కష్టాలను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఈ సినిమా సమస్త భారతావనికి ఒక గొప్ప దేశభక్తి నిండిన యదార్థ కథను అందించింది. సెల్యూట్ టు ఉరి టీమ్ అండ్ కుదోస్ టు ఇండియన్ ఆర్మీ. 
                                   జై హింద్.