• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, January 19, 2019

'యాత్ర' మూవీలో YS. జగన్ పాత్రలో YS. జగన్


మమ్ముట్టి  టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'యాత్ర'.ఇది స్వర్గీయ YS. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ .ఇందులో ఆసక్తి కర విషయమేంటంటే YS.కుమారుడు జగన్ పాత్రను,YS కొడుకు ప్రస్తుత AP ప్రతిపక్ష నేత YS. జగన్ పోషిస్తున్నాడు. అయితే ఇది  నిజంగా ఆసక్తి కల్గించే విషయం. కాకపోతే YS. బ్రతికి ఉన్నప్పుడు,చనిపోయిన తర్వాత TV లలో వచ్చిన ఫుటేజ్ వాడతారు. ఇప్పటికే విడుదలైన 'యాత్ర ' మూవీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.YS పాత్రలో మమ్ముట్టి చాలా బాగా కుదిరాడు.కొన్ని సార్లు YS లాగానే అనిపిస్తుంది.ఈ చిత్రం ఫిబ్రవరి 9 ,2019 రోజున విడుదల కానుంది.ఈ చిత్రానికి దర్శకుడు Mahi.V.Raghav.

ఫెదరర్ తో 'విరుష్క'


ఆస్ట్రేలియా పై నెగ్గిన ఆనందం లో ఉన్న విరాట్ కోహ్లీ ,తన భార్య అనుష్క శర్మ తో కల్సి ఆస్ట్రేలియన్ ఓపెన్ కి వెళ్ళాడు అక్కడ లెజెండరీ రోజర్ ఫెదరర్ ని కలిశాడు .ఈ ఫోటోని 'ఆస్ట్రేలియన్ ఓపెన్' ట్వీట్ చేస్తూ '3 లెజెండ్స్ ' అని వ్యాఖ్యానించింది.

మిస్టర్.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్:ముఖ్య అతిధిగా రానున్న జూనియర్ ఎన్టీఆర్


అక్కినేని కుర్రోడు అఖిల్ మొదటి సినిమా 'అఖిల్' తో ఆకట్టుకోలేకపోయాడు ఆ తరువాత 'హలో' అని పలకరించిన ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఇక ముచ్చటగా ముడోసారి మజ్నుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించటం కోసం ఈ నెల 25 న Mr.మజ్ను గా థియేటర్స్ లోకి వస్తున్నాడు. తొలిప్రేమ సినిమా తో మంచి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమా కు దర్శకుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిలింనగర్ లోని జే. ఎం. సి కన్వెన్షన్ సెంటర్ లో  ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే థమన్ స్వరపరిచిన పాటలు విడుదలవగా వాటికి మంచి స్పందన వస్తుంది.

96 మూవీ రీమేక్ లో శర్వా అండ్ సమంతతమిళ్ బ్లాక్ బాస్టర్ 96 మూవీ రీమేక్ రైట్స్ ని దిల్ రాజు తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నటించే హీరో హీరోయిన్ లు ఎవరు అనే సందిగ్దానికి దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టాడు. శర్వానంద్ అండ్ సమంతల కలయిక లో ఈ మూవీ ఉంటుంది అని నిర్దారించాడు. తమిళ్ 96 మూవీలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అండ్ త్రిష ల నటన సినిమా కథకు తగ్గట్టు సహజంగా ఉండటం సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్కూల్ డేస్ లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాను ప్రేక్షకులు చాల కాలం గుర్తుంచుకునేలా చేసిన అంశాలు. ఇక శర్వానంద్ అండ్ సమంతలు ఇద్దరు మంచి నటులు గా పెరుతెచ్చుకున్నవారే. కానీ ఎటొచ్చి సినిమా కథ పరంగా మార్పులు చేస్తే కనుక సహజత్వానికి సినిమా కొంచెం దూరము కావొచ్చు. ఏది ఏమైనా ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని దిల్ రాజు గారు చేస్తున్న మంచి ప్రయత్నం విజయతీరాలను చేరాలని కోరుకుందాం.

Friday, January 18, 2019

జై హో.....టీమిండియా..ఆస్ట్రేలియా పై మరపు రాని, మధురమైన విజయం


అసలు ఎవరైనా ఊహించారా...!! టీమిండియా ,ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా పై టెస్ట్ సిరీస్ ,వన్డే సిరీస్ నెగ్గుతుందని,అసలు అది ఊహ కే అసాధ్యం అనిపించిన ఫీట్,కానీ టీమిండియా దానిని సాధించింది. 4 టెస్టు ల సిరీస్ ను 2-1తేడా తో నెగ్గిన భారత్,3 వన్డే  ల ద్వైపాక్షిక సిరీస్ ను కూడా 2-1 తేడాతో నెగ్గి T20 సిరీస్ ను 1-1 తో సమం చేసి  'న భూతో న భవిష్యతి' అనిపించింది.

శుక్రవారం  రోజు  మెల్ బొర్న్ లో జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత పోరాట పటిమ కు తోడు , కేదార్ జాదవ్ చేసిన అద్భుత హాఫ్ సెంచరీ, కోహ్లీ మెరుపులు ప్రత్యేకించి,  ఛాహల్ అద్భుత స్పిన్ తో 6 వికెట్ల ఫీట్ ,వెరసి టీమిండియా అద్భుతమైన విజయంతో ఆస్ట్రేలియా టూర్ ను ముగించింది.ఇంతకు ముందెప్పుడూ,ఇంతటి ఘన విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు.

టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్న టీమిండియా యజువేంద్ర ఛాహాల్ 6 వికెట్లకు తోడు,భువీ 2 వికెట్లు, షమీ 2 వికెట్లు తీయడం తో ,ఆతిథ్య జట్టు కేవల 48.4 ఓవర్లలో 230 పరుగుల కు ఆలౌట్ అయింది.తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి విజయం సాధించింది. ధోనీ 114 బంతుల్లో 87(6 ఫోర్లు) పరుగులు నాటౌట్  కు తోడు కేదార్ జాదవ్ 57 బంతుల్లోనే 61(7 ఫోర్లు) పరుగులు నాటౌట్ ,62 బంతుల్లో 46(3 ఫోర్లు) చేయడంతో ,ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.


మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యజువేంద్ర ఛాహల్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ MS. ధోనీ.

Thursday, January 17, 2019

'సేనాపతి' మరోసారి చేయి తిప్పేది రేపటి నుండే :భారతీయుడు -2 లో కమల్ పూర్తి లుక్ విడుదల


 కమలహాసన్ కెరీర్ లో గొప్ప పాత్రగా గుర్తుండిపోయే పాత్ర  భారతీయుడు లోని సేనాపతి పాత్ర. శంకర్ దర్శకత్వం లో రూపొందిన భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా నిర్మిత మవుతున్న, భారతీయుడు 2 మూవీ షూటింగ్ రేపు ప్రారంభం కాబోతుంది. కాసేపటి క్రితం సేనాపతి పూర్తి లుక్ ని శంకర్ విడుదల చేసారు. మరోసారి సేనాపతి అవినీతి పై చేసే పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న శంకర్ కి అండ్ క్రూ కి అల్ ది బెస్ట్  ఫ్రమ్  "త్రిభువనవిజయం".

మాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్ తో రఫ్ఫాడిస్తున్న రామ్ చరణ్


"వినయ విధేయ రామ'' సినిమా విడుదలైన మొదటి షో నుండే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని మెగా అభిమానులు తీవ్ర నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను కు అండ్ హీరో రామ్ చరణ్ కు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ వల్ల అనుహ్యంగా సంక్రాంతి హాలీడేస్ అయినా , గత నాలుగు రోజుల్లో 20 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విడుదలైన మొదటి రోజు 25 కోట్ల పై చిలుకు వసూళ్ల తో కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధించింది. ఫుల్ రన్ లో 60 కోట్ల వరకు వసూలు చేయోచ్చు. డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు సాధించటం చాలా అరుదు. సినిమా రొటీన్ గా వున్నా మాస్ ఫాలోయింగ్ వున్న దర్శకుడు అండ్ హీరో ఇమేజ్ ఈ సినిమాకు భారీ నష్టాల నుండి కాపాడిన అంశాలు. ఒక మంచి అవకాశాన్ని బోయపాటి వాడుకోలేక పోయాడు అని మాత్రం చెప్పొచ్చు. సినిమా హిట్ టాక్ వచ్చి ఉంటే మాత్రం రికార్డుల మోతమోగేదే.

Wednesday, January 16, 2019

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్


రకుల్ ప్రీత్ సింగ్  ట్విట్టర్ అకౌంట్ లో తన ఫోటోలను పెట్టింది.ఇవి అప్లోడ్ చేయగానే ఎన్నో లైక్ లు వచ్చాయి.కారు లో నుండి దిగుతున్న ఈ ఫోటోలలో రకుల్ చాలా పొట్టి షార్ట్ ను ధరించింది. ఒక ఆకతాయి ఈ ఫోటో ల పై అసభ్యంగా కామెంట్ చేయడం తో ,అతడికి రకుల్ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.

వావ్..! విజయ్ సేతుపతి @ సైరా...

ఈ రోజు విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా , ' సై రా ' నిర్మాత రామ్ చరణ్ ,విజయ్ సేతుపతి మోషన్ టీజర్ విడుదల చేశాడు. ఈ లుక్ లో అతడి రోల్ ని రివీల్ చేశాడు.అతడి రోల్ పేరు 'రాజా పాండి' . విజయ్ సేతుపతి ఈ లుక్ లో అద్భుతంగా ఉన్నాడు.నిజంగా 'సై రా' సినిమాకు సంబంధించి, ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని లుక్స్ ల లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Tuesday, January 15, 2019

కోహ్లీ సెంచరీ ,ధోనీ హాఫ్ సెంచరీ :రెండో వన్డే లో భారత్ విజయం
                                          


ఆస్ట్రేలియా తో జరుగుతున్న 3 వన్డే ల సిరీస్ లో భాగంగా ,ఆడిలైడ్ లో జరిగిన రెండో వన్డే లో భారత్ విజయం సాధించి సిరీస్ 1-1 గా సమం చేసింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.షాన్ మార్ష్ అద్భుతంగా ఆడి 103 పరుగులు చేశాడు.తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్49.2 ఓవర్లలో , కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 299 పరుగులు సాధించింది.కెప్టెన్ కోహ్లీ 104 పరుగులు చేయగా,ధోనీ 54 పరుగుల తో నాటౌట్ గా నిలిచాడు.

వెంకీ ఈజ్ బ్యాక్ నో డౌట్


దగ్గుబాటి వెంకటేష్ సినిమాలు సాధించిన విజయాలు అతడి పేరు ముందు 'విక్టరీ' ని ఇంటి పేరు గా మార్చి విక్టరీ వెంటేష్ ని చేసాయి. వెంకటేష్ సాధించిన విజయాలు అతడికి టాప్ హీరో స్టేటస్ ని కట్టబెట్టాయి. గడిచిన కొన్ని సంవత్సరాలు గా వెంకటేష్ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వక పోవడం తో యంగ్ స్టార్స్ తో పోటీలో వెనుక బడి పోయాడు. వెంకటేష్ అభిమానులు వెంకీ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ సంక్రాంతి కి దిల్ రాజు ప్రొడక్షన్ లో వెంకీ చేసిన ఎఫ్ 2 సూపర్ టాక్ తో బ్లాక్ బస్టర్ దిశా గా దూసుకు పోతుంది. ఈ సినిమా లో వెంకీ ఒక భార్య చేతిలో ఇబ్బంది పడే భర్తగా చేసిన నటనకు సినీ ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఎక్కడ చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. థియేటర్ ల సంఖ్యను కూడా పెంచారు. ఈ సినిమా లో వెంకీ నటన ప్రేమించుకుందాం రా నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి మూవీలో నటించిన వెంకీ ని మల్లి గుర్తుకు తెచ్చాయి. ఒక మంచి క్యారెక్టర్ పడితే వెంకీ ఎంతలా ప్రేక్షకులను మెప్పించగలడో ఈ సినిమాను బట్టి చెప్పొచ్చు. ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే వెంకీ ఈజ్  బ్యాక్ అనకుండా ఉండలేము.

Monday, January 14, 2019

భారతీయుడు 2 ఫస్ట్ లుక్

ప్రస్తుత సమాజంలో అడుగడుగునా కనిపించే అవినీతి ఫై ఒక స్వతంత్ర సమరయోధుడు సాగించే పోరాటం నేపథ్యం లో గుర్తుండిపోయే సినిమాను అందించిన డైరెక్టర్ శంకర్ అండ్ పద్మ శ్రీ. డా. కమలహాసన్ నుండి భారతీయుడు- 2 గా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే భారతీయుడు గా కమలహాసన్ తన చేతులతో మరోసారి ప్రాచీన  కళ 'మర్మకళ' ని లంచగొండి వ్యవస్థకు పూర్థిస్థాయి లో రుచి చూపించేలా ఉన్నాడు. ఫస్ట్ లుక్ కి కమల్ హాసన్ అభిమానుల నుండి అద్భుత స్పందన వస్తుంది. కమల్ కి కొద్దీ కాలంగా దూరంగా ఉన్న బారి విజయం ఈ మూవీ తో అన్ని రికార్డులకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు అని అభిమానులు నమ్మకం తో వున్నారు.

'మజిలీ' తో మాయ చేసేలా ఉన్నాడే: మజిలీ సెకండ్ పోస్టర్


అక్కినేని నాగచైతన్య-సమంత పెళ్లి తరువాత మొదటిసారిగా నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమాకి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్సకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెకండ్ లుక్ రిలీజ్ అయింది. చైతన్య తో పాటు సెకండ్ హీరోయిన్ గా చెస్తున్న దివ్యంశిక ఉన్న పోస్టర్ ను సెకండ్ లుక్ గా రిలీజ్ చేశారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని చైతు ఉండగా హీరోయిన్ దివ్యంశిక చైతు ని ప్రేమగా కౌగిలించుకొని నిలబడి బ్యాక్ గ్రౌండ్ లో పచ్చని క్రికెట్ స్టేడియం వున్న లుక్ ఆకుట్టుకునేలా వుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ ని బట్టి మజిలీ రూపంలో మరో గుర్తుండిపోయే  లవ్ స్టొరీని ప్రేక్షకులు ఆశించొచ్చు. యువ హీరోలతో పోటీ లో వెనుకబడిపోయిన చైతన్య మజిలీ తో అందరిని మాయచేసేలా వున్నాడు.

Sunday, January 13, 2019

సంక్రాంతి అల్లుళ్ళ హంగామా అదిరిపోయింది:F2 మినీ రివ్యూ


విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలు గా తమన్నా మరియు మెహ్రిన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో సంక్రాంతి అళ్ళుల్లు అనే అనే క్యాప్షన్ తో వచ్చిన ఎఫ్ 2 మూవీ అద్భుతమైన టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎఫ్ 2 అనే గన్ తో అనిల్ రావి పూడి పేల్చిన బుల్లెట్ల నవ్వుల జల్లులో ప్రేక్షకులు తడిసి ముద్దౌతున్నారు అంటే ఆతిశయోక్తి కాదు. కథ లో కొత్తదనము లేకున్నా, అనిల్ కథను నడిపిన తీరు సంభాషణలు వెంకటేష్ పాత్ర లో , పరకాయ ప్రవేశం చేసి పండించిన కామెడీ థియేటర్ లో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేంత నవ్వులను అందిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మది అయినప్పటికీ ప్రకాష్ రాజ్ అండ్ పృద్వి రాజ్ అన్నదమ్ములుగా చేసిన కామెడీ, క్లైమాక్స్ లో వెన్నెలకిషోర్ చేసే కామెడీతో ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ముఖ్యంగా వెంకటేష్ కు కొట్టిన పిండి వంటి పాత్రలో అదరగొట్టాడు. వరుణ్ తేజ్ కూడా చాలా బాగా చేసినప్పటికీ,వెంకీ చేసిన అల్లరి ముందు కొంచెం తక్కువగా కన్పిస్తుంది. ఇక హీరోయిన్స్ కూడా చక్కటి హాస్యాన్ని పంచే క్యారెక్టర్స్ దక్కాయి. మొత్తానికి ఈ సంక్రాంతి కి ఫామిలీ తో కలసి చక్కగా ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 2. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో ఎఫ్ 2 మూవీ అసలు సిసలు సంక్రాతి సినిమా గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు... ఆ ఏమంటారు సినిమా చూసాక.. 'అంతేగా అంతేగా' అని ఒప్పుకుంటారు.