Tuesday, October 15, 2019

"వార్" మూవీ రివ్యూ: తప్పకుండా చూడాల్సిన సినిమా


(ఈ సినిమా హిందీ సినిమా కాబట్టి కొంత ఆలస్యంగా చూడాల్సి వచ్చింది.అందుకే లేట్ రివ్యూ)
భారత చలన చిత్ర రంగం లో అత్యద్భుత డ్యాన్స్ చేయగలిగిన కథానాయకులలో హృతిక్ రోషన్ ముందు వరుసలో ఉంటాడు.అంతే కాదు గ్రీకు శిల్పం లాంటి దేహ సౌష్టవం,అమ్మాయిల మనసు కొల్లగొట్టే అతని నీలి కళ్ళు అతనికి మాత్రమే సొంతం.
ఇక ఈ  మధ్యే  బాలీవుడ్ తెరంగేట్రం చేసి అద్భుతమైన తన డ్యాన్స్ మూమెంట్స్ తో, అథ్లెటిక్ బాడీ తో చాలా తక్కువ కాలంలో  దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన చిచ్చర పిడుగు , ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్.
వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని తెలిసినప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు మిన్నంటాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని  సినీ అభిమానులు ఎదురు చూశారు.
అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
కథా పరంగా చూస్తే అంతా మిలిటరీ ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా లో ఒక  స్పై సినిమా కు ఉండాల్సిన మలుపులు,ట్విస్టులు ఛేజింగ్ లు సాహసాలు అన్నీ పుష్కలంగా  ఉన్నాయి.
Colonel Luthra(అశుతోష్ రాణా)  చీఫ్ గా ఉండి , రోగ్ (దేశ ద్రోహి) గా మారిన కబీర్(హృతిక్) ఒకప్పుడు మోస్ట్ ఎఫీషియంట్  ఇండియన్ ఏజెంట్  ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అతడు దొరకక పోగా అతడు మన దేశస్థులనే చంపుతుంటాడు.ఈ  సమయం లో ఖలీద్(టైగర్ ష్రాఫ్) అనే  యంగ్ ఏజెంట్  అసలు కబీర్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.ఎందుకంటే ఖలీద్ ఒకప్పుడు కబీర్ కు శిష్యుడు ఇద్దరూ కలిసి కొన్ని సక్సెస్ ఫుల్ ఆపరేషన్ లలో పాల్గొంటారు. దేశ ద్రోహి అయిన తన తండ్రి ని చంపిన  కబీర్ అంటే కోపం లేకపోగా ,ఒక ద్రోహిని చంపిన గొప్ప వీరుడు గా ఖలీద్ ,కబీర్ ను ఆరాదిస్తాడు. అతని దగ్గర "అన్నిటికన్నా ముఖ్యమైనది దేశమే " అని నేర్చుకుంటాడు ఖాలీద్.అలాంటి ఖాలీద్ చివరికి తన గురువు లాంటి కబీర్ నే పట్టుకునే ఆపరేషన్ ని లీడ్ చేయాల్సి వస్తుంది.అయితే అతడు కబీర్ ను పట్టుకున్నాడా? లేదా? ,ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాది నుండి దేశాన్ని ఎవరు రక్షిస్తారు ?అనేది సినిమాలో చూడండి.
ఇక్కడ కథలో మంచి మలుపులతో సినిమా మొదటి భాగం చాలా చక్కగా ఉంటుంది.ప్రేక్షకుడు తరువాత సీన్ ఏమై ఉంటుంది అని ఎదురు చూస్తాడు.
కానీ ఇందులో చెప్పుకోవాల్సింది హృతిక్  గురించే.అతడి లుక్ నిజంగానే ఒక గ్రీకు శిల్పం లాగా ఉంది ఈ సినిమాలో.The most handsome hero in Indian Cenima అంటే అతిశయోక్తి కాదు.కొన్ని కొన్ని సీన్ లలో టైగర్ ,హృతిక్ ముందు తేలిపోయాడు. ఫిజిక్ వైజ్ హృతిక్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడనే చెప్పాలి.చాలా సీన్ లలో హృతిక్ ఒక హాలీ వుడ్ హీరో లాగానే అనిపిస్తాడు.అసలు ఇంతవరకు హృతిక్ కి హాలీవుడ్ ఛాన్స్ ఎందుకు రాలేదా అని ఆశ్చర్యం వేస్తుంది.ఒక సీనియర్ ఏజెంట్ గా,ఎంతో మెచ్యూర్డ్ పెరఫార్మన్స్ ఇచ్చాడు  హృతిక్ .ఈ సినిమా కి అసలు హీరో హృతిక్ అనే విషయం సినిమా గడుస్తున్న కొద్దీ మనకు అర్ధమవుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే హృతిక్ గురించి ఎంతైనా చెప్పొచ్చు."జై జై శివ్  శంకర్ " పాటలో హృతిక్ స్టెప్పులకి ఎవరైనా ఫిదా కావాల్సిందే.వేసినవి తక్కువ స్టెప్స్ అయినప్పటికీ  'కళాత్మకత' అనే పదానికి నిర్వచనం ఇది కదా అనేలా హృతిక్ మూమెంట్స్ ఉంటాయి.ఇక ఈ సినిమాలో చేజింగ్ సీన్స్ చూస్తే బాండ్ సినిమాలు  లేదా ధూమ్ సిరీస్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఫైట్స్ కూడా ఎప్పటిలాగే హృతిక్ స్టయిల్ లో బాగుంటాయి .
ఇక ఈ సినిమాలో రెండో హీరో టైగర్ ష్రాఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.29 ఏళ్ళ వయసున్న ఈ కుర్రాడు మనకి 23 ఏళ్ల అబ్బయి లాగా లేతగా కనిపిస్తాడు.కానీ ఇతడి అథ్లెటిక్ బాడీ తో ,అచ్చెరువొందించే స్టంట్స్ తో ఆకట్టుకున్నాడు.కొన్ని సీన్స్ లో 'బోర్న్' సినిమా ల హీరో 'మాట్ డామన్' లాగా అనిపిస్తాడు.ముఖ్యంగా జంపింగ్ సీన్స్.ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా టైగర్ కే పడ్డాయి.కొన్ని ఫైట్స్ లలో టైగర్ ,"టోనీ జా"  లాగా            అని పిస్తాడు.ఫైట్స్ మరియు చేజ్ లలో టైగర్ దుమ్ము దులిపాడు.చాలా సీన్ లలో టైగర్ ,హృతిక్ తో పోటీ పడ్డాడు.అతని ముందు హృతిక్ ఉండడం వల్ల ,కొంత మనకి టైగర్ ప్రతిభ తగ్గినట్టు అనిపిస్తుంది.ఐనప్పటికీ టైగర్ తన పాత్రకు 100%  న్యాయం చేశాడనే చెప్పాలి.ఇక డ్యాన్స్ మూవ్స్ కూడా టైగర్ కే ఎక్కువ పడ్డాయి.  చివరలో అతడి నవ్వు మనకి కొంత భయం కలిస్తుంది అంత బాగా చేశాడు.ఈ సినిమా తో టైగర్ పూర్తి స్థాయి సూపర్ స్టార్ హోదాను పొందాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ,కథను అందించిన ఆదిత్య చోప్రా,దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ల గురించి చెప్పుకోవాలి.ఒక స్పై అడ్వెంచర్ కథను మంచి ట్విస్ట్ లతో ఆదిత్య చోప్రా అందించంగా, సినిమాని ఒక హాలీవుడ్ మూవీ లాగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు సిద్దార్థ్.ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకుని చాలా బ్యాలెన్సుడ్ గా తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ని మెచ్చుకోవాల్సిందే.
ఇక మిగితా నటీ నటుల లో అశుతోష్ రాణా కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండగా అతడు ఎప్పటిలాగే బాగా చేశాడు.హీరోయిన్ వాణీ కపూర్ చాలా అందంగా కనిపిస్తుంది.ఈమె పాత్ర తక్కువ సేపు ఉన్నా తన అందంతో ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ (అంకిత్,సంచిత్ ,విశాల్ డడ్లాని ,డేనియల్ జార్జ్).
జై జై శివ్ శంకర్ పాట చాలా బాగా వచ్చింది.(మ్యూజిక్ శేఖర్ రజ్వియాని ).
అయితే ఈ సినిమాలో ప్రధానంగా సెకండ్ హాఫ్ కొంత డల్ గా అనిపిస్తుంది.అంత అద్భుతమైన ఫస్ట్ హాఫ్ చూశాక ,సెకండ్ హాఫ్ పై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగి మనకు అలా అనపిస్తుందేమో. సినిమాలో హీరోలను గురించి పట్టించుకుని మిగితా క్యారెక్టర్ లను నెగ్లెక్ట్ చేశారు.  ముఖ్యంగా విలన్ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.అందుకే మిగతా పాత్రలు మనకు గుర్తుండవు.అయితే ఇవన్నీ లోపాలు ఉన్నప్పటికీ
ఓవరాల్ గా తప్పకుండా చూడాల్సిన సినిమా "వార్"

ఇప్పటికే (12 వ రోజు నాటికి )ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ ని, 270 కోట్ల షేర్ ని దాటేసింది.ఇంకా స్టడీ గా నే రన్ అవుతుంది.ఇది ఇంకా ఎన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

రేటింగ్......3.5/5
...............త్రిభువన విజయం 🙏

0 comments:

Post a Comment