Monday, July 29, 2019

నానీ గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కార్తికేయ..?



నాచురల్ స్టార్ నానీ,మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో  , మనం,24,  చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "గ్యాంగ్ లీడర్". ఈ మధ్యనే దీనికి సంబంధించి విడుదలైన టీజర్ ను బట్టి చూస్తే, ఐదుగురు లేడీస్ తో నాని కలిసి చేస ఫన్ ఫిల్ల్డ్ రివేంజ్ డ్రామా అని స్పష్టమవుతుంది. ఇకపోతే ఇందులో మరో యూత్ హీరో కార్తికేయ (Rx 100 ఫేమ్ ) ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు తెల్సింది. కానీ టీజర్ లో ఇతన్ని చూపించలేదు, అయితే ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్  ఇపుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ పాత్ర ఏంటి?  దీని ప్రకారం చూస్తే కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం.ఇతని ఎంట్రీ ఇంటెర్వెల్ బ్లాక్ లో వస్తుందట , ఈ కథలో అతని పాత్ర చాలా కీలకం కావడంతో టీజర్ లో అతన్ని చూపించకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది.
మొదట్లో గ్యాంగ్ లీడర్ టైటిల్ మీద వచ్చిన మెగా ఫ్యాన్స్ వ్యతిరేకతను టీజర్ చూడడం వలన తగ్గించుకుంటున్నారట. వరుస ఫ్లాప్ లలో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఈ గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ కావడం చాలా అవసరం.

మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.thribhuvanavijayam.com

0 comments:

Post a Comment