Sunday, July 21, 2019

అవతార్ రికార్డ్ ను బద్దలు కొట్టిన “అవెంజర్స్ ఎండ్ గేమ్”: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు



ఇట్స్ అఫీషియల్ ...మొన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు సాధించిన చిత్రం ఏది అంటే జేమ్స్ క్యామెరాన్  విజువల్ వండర్ “అవతార్ “ అని చెప్పే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ రికార్డును మార్వెల్ మాగ్నం ఓపస్ “అవెంజర్స్ ఎండ్ గేమ్” బద్దలు కొట్టింది.”అవతార్ “ గతం లో 2.778 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేయగా , “అవెంజర్స్ ఎండ్ గేమ్” 2.789 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.గత 22 ఏళ్ళు గా జేమ్స్ కామెరూన్ సినిమాలు రెండు అగ్ర స్థానం లో ఉండగా (మొదట టైటానిక్ తర్వాత అవతార్) ఇప్పుడు ఆ రికార్డును “అవెంజర్స్ ఎండ్ గేమ్” అధిగమిచింది .అయితే డైరెక్ట్ రిలీజ్ లో ఇది సాధ్యం కాలేదు,అందుకే “అవెంజర్స్ ఎండ్ గేమ్” లో రెండు పోస్ట్ క్రెడిట్ సీన్ లు ఆడ్ చేసి మళ్ళీ విడుదల చేయడం తో ఇది సాధ్యమయ్యింది.

0 comments:

Post a Comment