Thursday, May 30, 2019

నేడు ఒకే రోజు విడుదల కానున్న 4 కొత్త సినిమాలు


ఈ వారం ఒకే రోజు 4 ప్రముఖ చిత్రాలు విడుదల కానున్నాయి. శ్రీ రాఘవ దర్శకత్వం లో    సూర్య , సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్ లు  నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ "NGK" , ట్రైలర్ తో TFI లో సంచలనం సృష్టించిన "ఫలక్ నూమా దాస్ " సినిమా, ప్రభు దేవా ,తమన్నా ల "అభినేత్రి2" , మరియు ఇంగ్లీష్ డబ్డ్ మూవీ "గాడ్జిల్లా
2 " లు విడుదల కానున్నాయి.వీటిలో సూర్య "NGK" సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో సూర్య "యువ " తర్వాత మళ్ళీ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు.అదే విధంగా "ఫలక్ నూమా దాస్ " సినిమా కూడా .ఈ  నగరానికి ఏమైంది ఫేం విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు.అంతే కాకుండా దీనిని సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు.  దీని పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment