Sunday, April 7, 2019

మెగాస్టార్ ని కలిసిన అమీర్ ఖాన్: తన అభిమాన నటుడు చిరంజీవి గారు అని వ్యాఖ్య.


బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్     క్యోటో ఎయిర్ పోర్ట్  లో   మన మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాడు.సాధారణంగా అమీర్ ఖాన్ సోషల్ మీడియా కి చాలా దూరంగా ఉంటాడు.అలాంటిది చిరంజీవి గారిని చూడడం తో వెంటనే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి ఫోటోను షేర్ చేశాడు.అంతే కాదు చిరంజీవి గారు నా అభిమాన నటుల్లో ఒకరు. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందదాయకం అని రాశాడు."చిరంజీవి గారు తన నెక్స్ట్ ప్రాజెక్టు దేశభక్తుడు " ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి " చిత్రం గురించి వివరించారు ,మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం సర్" అని  అమీర్ ట్వీట్ చేశాడు

ఈ ఫోటో తో మెగాస్టార్ అభిమానులు ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అమీర్ ఖాన్ లాంటి హీరో నే ,మెగాస్టార్ ని పొగడడం మామూలు విషయం కాదు మరి. ఐతే ఇప్పటి వాళ్ళకి తెలియక పోవచ్చు, కానీ ఘరానా మొగుడు సినిమా వరకు నిజంగా చిరంజీవికి అమితాబ్ బచ్చన్ తో సమానమైన ఇమేజ్ ఉండేది. చిరంజీవి అంటే ఒక మనీ  మెషీన్ అనే పేరుండేది.     చిరంజీవి డ్యాన్స్ లకి బాలీవుడ్ హీరోలంతా ఫాన్స్ గా ఉండేవాళ్ళు.అప్పుడు అమీర్ లాంటి హీరోల కెరీర్ తొలి రోజులు.కాబట్టి చిరంజీవి అంటే అందుకే అభిమానం.


మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com


0 comments:

Post a Comment