Tuesday, April 23, 2019

దుమ్ము రేపుతున్న సల్మాన్ ఖాన్ "భారత్ " ట్రైలర్: Salman Khan | Katrina Kaif

సల్మాన్ ఖాన్ "భారత్ " ట్రైలర్ దుమ్ము రేపుతుంది.కత్రినా కైఫ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 1947 సంవత్సరం నుండి 2010 వరకు ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనల సమాహారం ఈ సినిమా.ఇందులో సల్మాన్ ఒక నేవీ ఆఫీసర్ గా ,ఒక గని కార్మికుడుగా,ఒక సర్కస్ లో షో మ్యాన్ గా,దేశ భక్తుడు గా , వివిధ పాత్రలలో కనిపిస్తాడు.సల్మాన్ కత్రినా ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. జాకీ ష్రాఫ్ ,సునీల్ గ్రోవర్ ,దిశా పటాని,నోరా ఫథెహ్ లు ఇతర ముఖ్య పాత్రధారులు.  జూన్ 5 న  ఈద్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కి దర్శకుడు అలీ అబ్బాస్ జఫార్ . గుల్షన్ కుమార్ & T- సిరీస్  సమర్పణ లో ,సల్మాన్ ఖాన్ మరియు రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్  ఫిల్మ్  పతాకం పై ,అతుల్ అగ్నిహోత్రి ,అల్వీరా ఖాన్ అగ్నిహోత్రి ,భూషణ్ కుమార్ & కిషన్ కుమార్ లు నిర్మాతలు గా ఈ సినిమా తెరకెక్కుతుంది.0 comments:

Post a Comment