Wednesday, April 24, 2019

" అవెంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా - 24x7 ( రోజూ నాన్ స్టాప్ గా) ప్రదర్శనకి అనుమతి.


ఇప్పుడు ఎక్కడ చూసినా అవేంజర్స్ ఎండ్ గేమ్ గురించిన చర్చనే నడుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లలో ఇప్పటికే రికార్డుల ను తిరగరాసిన ఈ సినిమా మరో రికార్డ్ నెలకొల్పింది.విదేశాలలో ప్రతిరోజూ రాత్రి 12 తర్వాత కూడా (లేట్ నైట్ షో) షో లు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే మన పక్క దేశం పాకిస్థాన్ లో కూడా ఈ అనుమతి ఉంది.కానీ మన దేశం లో సెకండ్ షో నే ఆ రోజుకు చివరి షో.

అయితే ఇప్పుడు అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి వివిధ మల్టీ ప్లెక్స్ ల ఓనర్లు ప్రభుత్వానికి 24x7 ప్రదర్శనలకి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రభుత్వం దీనికి అనుమతినిచ్చింది.అంటే అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా నాన్ స్టాప్ గా షో తర్వాత షో నడుస్తుందన్న మాట.ఎందుకంటే ప్రేక్షకులు  చాలా మంది కి అడ్వాన్స్ టికెట్లు దొరక లేదు మరి. దీంతో అభిమానులు సంబర పడుతున్నారు.అయితే ఈ అనుమతి కేవలం ఇండియా ప్రధాన నగరాల లోని IMAX,4D థియేటర్లలో మాత్రమే.
దేశం లోని అతి పెద్ద మల్టీ ప్లెక్స్  సంస్థ ప్రదర్శన వివరాలు













మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

0 comments:

Post a Comment