Monday, March 25, 2019

తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన మహేష్ బాబు @ madam tussads సింగపూర్ శాఖ



ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన యొక్క మైనపు విగ్రహాన్ని హైదరాబాద్   లో, మేడం టుస్సాడ్ మ్యూజియం         నిర్వాహకుల     సమక్షం  లో ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మహేష్ భార్య ,నమ్రత ,పిల్లలు గౌతమ్,సితార లు పాల్గొన్నారు. తన విగ్రహాన్ని చూసుకుని మహేష్ బాబు ఆనంద పడ్డాడు.దానితో సెల్ఫీ లు దిగాడు.మహేష్ తో సెల్ఫీ లు దిగడానికి  అభిమానులు ,రిపోర్టర్ లు కూడా ఎగబడ్డారు.మహేష్ పిల్లలు తమ తండ్రి మైనపు విగ్రహాన్ని చూసి ఆనంద పడ్డారు.


అనంతరం మహేష్ సోషల్ మీడియా లో స్పందిస్తూ తన విగ్రహాన్ని మొదట చూడగానే wow.. అని అనిపించిందని, ఇది అచ్చం తనను పోలి ఉందని..ఇంతకంటే ఎవరూ బాగా చేయలేరని,నన్ను పోలిన మరో నాతో ఫోటో దిగడం మరచిపోలేని అనుభూతి అని,తన విగ్రహాన్ని తన సొంత ఊరిలో,సొంత మనుషులు,అభిమానుల మధ్య ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చాడు మహేష్.

0 comments:

Post a Comment