Wednesday, March 13, 2019

అన్ని కళ్ళూ అటు వైపే :రేపే రాజమౌళి ,రామారావు,రామ్ చరణ్ ల ప్రెస్ మీట్



" RRR "  ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే.ఎన్నో రూమర్లు,ఎన్నో ఊహాగానాలు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ , ఎన్నో లెక్కలు ఎవరికి తోచింది వారు,ఎవరికి తెలిసింది వారు,తెలుగు సినిమా వెబ్సైట్ ల వారు ఎన్నో కథనాలు వండి వార్చారు.ఈ మధ్య ఈ రూమర్లు సినిమా పై ప్రభావం చూపేల ,రాజమౌళి ఇమేజ్ పై ప్రభావం పడేలా ఉండడం తో ,ఇక ఆలస్యం చేస్తే బాగుండదని, భావించి మొత్తం RRR యూనిట్ రేపు 14 వ తేదీన ప్రెస్ మీట్ పెట్టబోతుంది.ఇందులో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్,రాంచరణ్ ,నిర్మాత దానయ్య అందరూ పాల్గొని అందరి అనుమానాలను నివృత్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు..1. కథ ఏ జానర్ లో ఉంటుంది. 2.హీరో ల పాత్రలు ఏంటి ?ఎలా ఉంటాయి? 3.హీరోయిన్ లు ఎవరు..? 4.ఇతర తారాగణం ఏంటి?
ప్రస్తుతం ఈ విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది.మరి రాజమౌళి ఈ విషయాలను బయట పెడతాడా? కథ ముందే చెప్పేస్తాడా..? లేక బాహు బలి  లాగే దీనికి కూడా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తాడా..?వేచి చూడాలి.ఏది ఏమైనా..రేపు RRR టీమ్ ప్రెస్ మీట్ కోసం జాతీయ మీడియా కూడా వెయిట్ చేస్తుంది అనేది వాస్తవం.

0 comments:

Post a Comment