Friday, March 1, 2019

భారత గడ్డ మీద అడుగు పెట్టిన అభినందన్ వర్తమాన్



అందరి ప్రార్థనలు ఫలించాయి.ఒక సైనిక యోధుడు,శత్రు దేశపు హస్తాలకు చిక్కి ,తిరిగి వస్తాడో రాడో అని ఎంతో టెన్షన్ పడిన భారతీయులు అందరు ఊపిరి పీల్చుకునేలా ,వింగ్ కమాండర్ అభినందన్ పరివర్తన్ మన గడ్డ పై అడుగు పెట్టాడు.అతడిని సైనిక నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంటేషన్ పనులు ,ఇతర వైద్య సంబంధ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఈ రాత్రి 9 గంటల తర్వాత మన సైన్యానికి ,తద్వారా IAF చీఫ్ కి వాఘా సరిహద్దు వద్ద పాక్ రోడ్ మార్గము ద్వారా తీసుకు వచ్చి ,అప్పగించింది. మన దేశ ప్రభుత్వం చేసిన దౌత్య పర ఒత్తిడికి కావచ్చు, జెనీవా యుద్ద ఖైదీల నిబంధనకు లోబడి కావచ్చు,లేదా ఒకవేళ విడుదల చేయక పోతే యుద్ధం వస్తుందనే భయం కావచ్చు, ఏది ఏమైనా పాకిస్తాన్ మన వాడిని మనకు అప్పగించింది.అభినందన్ చూడడానికి సంతోషంగా అనిపించింది.అతడిని స్వాగతించడానికి వేలాది మంది ఈ రోజు ఉదయం నుండి ఎదురు చూస్తున్న భారతీయులకు అభివాదం చేస్తూ నవ్వుతూ పాక్ గేట్ ను దాటి మన గడ్డ పై అడుగు పెట్టగానే ఒక్క సారి జనం హర్షాతిరేకాల తో సంబరాలలో మునిగి పోయారు.శత్రు దేశ పౌరుల చేతిలో ఎన్నో దెబ్బల కు ఓర్చి,ఎంతో గుండె నిబ్బరాన్ని కనబరచి ,తిరిగి వచ్చిన మన అభినందన్ ని కుల మతాలకు అతీతంగా అందరూ స్వాగతించారు.ఈ సంఘటన నిజంగా మనందరిలో ఐకమత్యాన్ని పెంచిందని చెప్పవచ్చు ..ఈ సందర్భంగా త్రిభువన విజయం అభినందన్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది. మీ కోసం వీడియో..

0 comments:

Post a Comment