Sunday, February 3, 2019

"పద్మశ్రీ చింతకింది మల్లేశం" బయోపిక్: "మల్లేశం" ఫస్ట్ లుక్ విడుదల. 



బయోపిక్ ల పర్వం లో మరొక మార్గదర్శి మూవీ, సామాన్యుడిగా మొదలై నిరంతర పట్టుదలతో ఒక అసామాన్య యంత్ర సృష్టి కర్త "పద్మశ్రీ చింతకింది మల్లేశం" గారి జీవితకథ దృశ్యరూపంగా తెరకెక్కుతు నటుడు ప్రియదర్శి టైటిల్ రోల్ లో నటుస్తున్న "మల్లేశం" మూవీ ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం "కల్వకుంట్ల తారక రామారావు" గారు ట్విట్టర్ లో విడుదల చేసారు. ఒక నిరుపేద చేనేత కుటుంబంలో యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, శారాజిపేట లో జన్మించిన చింతకింది మల్లేశం తన తల్లి ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పుతూ తీవ్రమైన భుజం నొప్పితో రోజు చీరను నేయడానికి పడుతున్న బాధను చూడలేక ఎదో చేయాలి అని తపించేవాడు. అతని ఆలోచనలను సహచరులతో పంచుకున్నా, ఎవరి ప్రోత్సాహం అందకున్న పట్టువదలని నిరంతర శ్రమకు ప్రతి రూపం "లక్ష్మి-ఆసు" యంత్రాన్ని విడతల వారీగా ఆవిష్కరించి ఎందరో నేతన్నల కళను తన కృషి తో నెరవేర్చారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని మల్లేశం గారి ప్రస్థానం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురష్కారంతో ఒక్కసారిగా అందరి కళ్ళు అటు వైపు మల్లాయి. ఓక స్ఫూర్తి దాయకమైన జీవితకథకు ఈ విదంగా దృశ్య రూపం ఇవ్వడం అభినందనీయం. ఇక మల్లేశం గారి తల్లి పాత్రలో ప్రముఖ నటి ఝన్సీ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా టాకి పార్ట్ పూర్తి కాగా నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు సినిమా ప్రజల చెంతకు చేరేలా ప్రమోషన్ కార్యక్రమాలు ఫస్ట్ లుక్ రిలీజ్ తో ప్రారంభించారు. ఒక మంచి ప్రయత్నానికి గొప్ప విజయం తొడవుతే మరిన్ని స్ఫూర్తిదాయకమైన చిత్రాల నిర్మాణానికి దారి సుగమము అవుతుంది. కావున అల్ ది బెస్ట్ మల్లేశం అండ్ టీం ఫ్రమ్ "త్రిభువనవిజయం". 

2 comments: