Tuesday, February 5, 2019

కత్తి చేత పట్టిన రాంగోపాల్ వర్మ : ఖబర్దార్ అంటూ వార్నింగ్. 



రాంగోపాల్ వర్మ అనే పేరు ఒక బ్రాండ్ గా ఉండేది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన వర్మ, ఒక్క హిట్ తో తిరిగి ఫామ్ లోకి వస్తాడని చూస్తున్న వర్మ అభిమానులు. ఇక ఆర్.జి.వి దర్శకత్వం లో నిర్మితమవుతున్న లక్ష్మిస్ ఎన్టీయార్ చిత్రాన్ని తన క్రియేటివ్ ఐడియాస్ తో బాగానే ప్రమోట్ చేస్తున్న వర్మ ఈ రోజు ట్విట్టర్ లో కత్తి చేత బట్టి వున్న ఫోటో (మార్ఫింగ్ ఫోటో) ఒకటి పోస్ట్ చేసి లక్ష్మిస్ ఎన్టీయార్ సినిమా విడుదలకు ఎవరైనా అడ్డు వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు వర్మ. ఈ ప్రొమోషన్స్ బాగానే వున్నా సినిమాలో విషయం లేకపోతె కష్టం ఆర్.జి.వి గారు. ఇక వర్మ పోస్ట్ చేసినా ఫోటో అదిరిపోయిందనే చెప్పాలి... ఈ గెటప్ తో హీరోగా  ఒక మాస్ మసాలా సినిమా వర్మ స్వీయదర్శకత్వంలో తీస్తే అదిరిపోతోంది.


0 comments:

Post a Comment