Tuesday, February 5, 2019

'వినయ విధేయ రామ' ఫలితం పై రామ్ చరణ్ అభిమానులకు ,మీడియాకి బహిరంగ లేఖ



"మెగా పవర్ స్టార్" రామ్ చరణ్ నటించిన రీసెంట్ చిత్రం 'వినయ విధేయ రామ' అనుకున్నంత ఆడలేని విషయం తెలిసిందే.ఈ చిత్రం 80 కోట్లకు అమ్ముడు పోగా ,కేవలం 62 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.దీంతో డిస్ట్రిబ్యూటర్ లు తీవ్రంగా నష్ట పోయారు.అభిమానులు కూడా కొంత అసంతృప్తి తో వున్నారు. ఇలాంటి సమయం లో రామ్ చరణ్ అభిమానులకు ,మీడియాకి ఫేస్ బుక్ ద్వారా బహిరంగ లేఖ రాశాడు.దీనిలో రామ చరణ్ స్పందన ఇలా ఉంది."ఎంతో కష్టపడి 'వినయ విధేయ రామ ' చిత్రాన్ని నేను ,చిత్రాన్ని నిర్మించిన నిర్మాత,దర్శకుడు,యూనిట్ సభ్యులు అందరూ పని చేసి మిమ్మల్ని అందరినీ సంతృప్తి
పరచాలని చేశాం.అయితే ఫలితం మీరు అనుకున్నంతగా రాలేదు.ఇక ముందు నేను తీయ బోయే చిత్రాలు తప్పకుండా మిమ్మల్ని సంతోష పెట్టే విధంగా తీస్తాను అని, మీ అందరి అభిమానానికి,మీడియా వారికి ఎంతో కృతజ్ఞతలు" అని లేఖ లో పేర్కొన్నాడు.అన్నట్టు ఈ సినిమా వల్ల నష్ట పోయిన   డిస్ట్రిబ్యూటర్ లకు  డబ్బులు వాపస్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.గ్రేట్..మీ కోసం ఆ లేఖ



0 comments:

Post a Comment