Wednesday, February 20, 2019

సడన్ గా రాంగోపాల్ వర్మ లో దేశభక్తి:ఈ సారి నిజాయితీగా: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చుక్కలు


సడన్ గా  రాం గోపాల్ వర్మ కి దేశ భక్తి గుర్తొచ్చింది.అంటే ఇన్నాళ్ళు
లేదా ? అంటే ఏమో గానీ ఎప్పుడూ బయట పెట్టలేదు.
పుల్వామా దాడుల తర్వాత ,పాక్ ప్రధాని ఇమ్రాన్
ఖాన్ ఆలస్యంగా 5 రోజుల తర్వాత ,పాక్ ప్రమేయం,
లేదనడం ,ఆధారాలు చూపితే సహకరిస్తాం అనడం ,ఇదంతా
కావాలనే ఎన్నికల కోసం మన దేశ నాయకులు
చేస్తున్నారు అనడం అందరు భారతీయుల లాగానే రామ్ గోపాల్
వర్మ కి కూడా చిర్రెత్తుకొచ్చినట్టుంది.వెంటనే ట్వీట్ల
 యుద్ధం మొదలు పెట్టాడు.అసలు అవి ఎలా ఉన్నాయంటే
ఇన్నాళ్ళు వర్మను ద్వేషించిన వాళ్ళంతా అతనికి
ఇప్పుడు అభిమానులు అయిపోయేలా ఉన్నారు.అంత బాగా
ట్వీట్లు పెట్టాడు.పాక్ ప్రధాని ని టార్గెట్ చేస్తూ వర్మ ఎంత
 వెటకారంగా అన్నాడంటే ..ఆహా.. ఏం మాట్లాడాడురా..అనిపించక మానదు.

డియర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు
అంటూ..సంబోధిస్తూ ..

"జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్ ఖాయిదా వంటి సంస్థలను బంతులుగా భావించి పాకిస్థాన్ బౌండరీలను 
దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి పంపుతున్నారు, వాటిని 

మీరు బంతులనుకుంటున్నారా? లేకబాంబులనుకుంటున్నారో చెప్పాలండీ..."

"సామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి మీ దేశం లో ఉన్న సంగతి అమెరికాకు తెలిసింది, కానీ మీ దేశానికి  

తెలియలేదు.. అసలు  మీదీ ఒక దేశమేనా?...  ఒక అమాయక  

భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు 

సమాధానం చెప్పండి , మాకు మీ అంత తెలివి లేదు ,మీరు 

మాకు  కొంచెం తెలివి నేర్పాలి "

 "జైషే మహ్మద్, లష్కరే తోయిబాతాలిబన్, అల్‌ ఖాయిదా 

వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లు అని నాకు 

ఎవరూ చెప్పలేదు అయితే, ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న 

విషయాన్ని మీరెప్పుడూ చెప్పలేదు''

"సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైతే మీరు మూడు 

పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదు కదా.... ".. 

"ఒక వ్యక్తి టన్ను ల కొద్దీ   పేలుడు పదార్థాలతో భారత్‌ వైపు 

పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా

జరపాలో మా అమాయక  భారతీయులకు నేర్పాలి తమరు  ,

 ఫ్రీగా ఏం కాదు లెండి మేము  ట్యూషన్ 

ఫీజు కూడా ఇస్తాము " అని చెడుగుడు ఆడుకున్నాడు. దీన్ని 

ఇమ్రాన్ ఖాన్ చదువుతాడో లేడో  

తెలియదు కానీ..నెటిజన్స్ 

ఫిదా అవుతున్నారు...అదిరిందయ్యా వర్మా...
0 comments:

Post a Comment