Thursday, February 21, 2019

పాకిస్తాన్ కి సింధూ జలాలు కట్ చేసిన భారత్ : ఫస్ట్ పంచ్ పడింది.


మన దేశం పై ఉగ్రవాదులను ఎగదోస్తూ మనకు తీవ్ర నష్టాన్ని కల్గ జేస్తున్న ,పాకిస్తాన్ కి భారత్ తగిన గుణ పాఠం చ్ప్పడానికి కృత నిశ్చయించు కుంది.మొన్న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడి తో ఉలిక్కి పడ్డ భరత్ 43 మంది జవాన్ లను కొల్పొవడాన్ని తీవ్రంగా పరిగణించింది.ఎన్నో రోజుల నుండి ఆ దేశానికి అన్ని రకాలుగా చెక్ పెట్టాలని అనుకుంటున్నా ,ఆ దేశం ప్రజలను ఇబ్బందికి గురి చేయరాదనే ఉద్దేశ్యం తో ఇన్నాళ్ళూ ఆగింది.ఇక ఉపేక్షిస్తే మనకు ఇంకా నష్టం జరగ  వచ్చు అందుకే భారత్ మొదటి చర్య గా ఆ దేశ వ్యవసాయం పై ,తాగు నీటి పై దెబ్బ కొట్టింది.మన దేశం నుండి ఆ దేశం లోకి వెల్లే నీటిని మన దేశానికి మళ్ళించింది.సింధూ నదీ జలాలను ,మన దేశ రాష్ట్రాలైన కాశ్మీర్ ,పంజాబ్ లకు మళ్ళించింది.అదే విధంగా రావి ,బియాస్ నదుల నీటిని కూడా మళ్ళించింది.మరో వైపు కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం తీవ్ర మైన గాలింపు చర్యలను చేపడుతుంది భారత్. 

0 comments:

Post a Comment