Thursday, February 14, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి :40 మంది CRPF జవాన్లు మృతి ..!



మరోసారి ఉగ్రవాదులు తమ రాక్షస క్రీడ ను సాగించారు.  జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ,అవంతి పోరా లోని గోరిపార వద్ద ,జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఐఈడీ బాంబు దాడిని చేసింది.ఈ దాడిలో 40 మంది CRPF జవాన్లు మరణించగా,అనేకమంది గాయాల పాలు అయ్యారు.సెలవుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తున్న సుమారు 78 వాహన శ్రేణుల పై ,ఉగ్రవాదులు ఐఈడి దాడికి పాల్పడ్డారు.దీని కోసం ఉగ్రవాదులు 350 కిలోల ఆర్డీఎక్ష్ వాడినట్టు CRPF తెలిపింది.యురీ దాడి తర్వాత ఇదే అతి పెద్ద దాడి .  దాడికి పాల్పడింది తామేనని జైషేమొహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.    ఇదే విషయాన్ని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్రువీకరిచారు.దాడిని గూర్చి పరిశోధించడానికి రేపు  12 మంది సభ్యులతో  NIA బృందం జమ్మూ-కాశ్మీర్ కి ఫోరెన్సిక్ పరికరాలతో  వెళ్లనుంది. ఉగ్రవాదుల తో పోరాటానికి భారత్ కి తాము పూర్తిగా సహకరిస్తామని ,ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్తర్   ప్రకటించారు.ఈ ఘటనను నేపాల్ ప్రాధాని ఖండించారు.రేపు ఉదయం 9.05 నిమిషాలకు భద్రతావ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఈ విషయం పై చర్చించ బోతుంది.ఈ సందర్భంగా ఇంటర్ నెట్ సేవలను దక్షిణ కాశ్మీర్ ప్రాంతం లో నీలి వేశారు.కొన్ని ప్రాంతాలలో 2G  మాత్రమే నిలిచేలాగా చేశారు.అయితే ఈ ఘటన సందర్భంగా టీవీ    చానెళ్ళు ఎలాంటి రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేయొద్దని కేంద్రం సూచించింది.

0 comments:

Post a Comment