Monday, February 4, 2019

ఫోర్బ్స్ ఇండియా -30 జాబితాలో మన విజయ్ దేవరకొండ



టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర కొండ 2019 సంవత్సరానికి గానూ  ఫోర్బ్స్ ' 30 అండర్ 30 ' జాబితాలో చోటు సంపాదించాడు.ఈ జాబితా లో 2019 సంవత్సరం లో ఉన్నత స్థానం సంపాదించిన ఇండియా లోని , 30 ఏళ్ల లోపు యువతీ యువకుల 30 మంది జాబితాను తయారు చేసింది .అందులో విజయ్ చోటు సంపాదించాడు.విజయ్ వయస్సు 29 ఏళ్ళు .తెలుగులో నువ్విలా సినిమాతో సినీ జీవితాన్ని ఆరంభించిన విజయ్,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం లో చిఇన నెగెటివ్ రోల్ వేశాడు.తర్వాత ఎవడే సుబ్రమణ్యం లో మంచి పాత్ర వేయడం తో విజయ్ కి మంచి గుర్తింపు లభించింది.తర్వాత వచ్చిన "పెళ్లి చూపులు " సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది.2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్ కి సూపర్ స్టార్ డం తీసుకు రాగా ,గత సంవత్సరం విడుదలైన  "గీతా గోవిందం" తో విజయ్ రేంజ్ ఇంకా ఎంతో ఎత్తుకు చేరింది.
ఇంకా ఈ లిస్టు లో అథ్లెటిక్ స్టార్ హిమ దాస్ ,విమెన్ క్రికెటర్ స్మ్రితి మందాన కూడా ఉండి.

0 comments:

Post a Comment