Wednesday, January 23, 2019

కోహ్లీకి విశ్రాంతి: సారధ్య బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగింత.

కోహ్లీకి విశ్రాంతి: సారధ్య బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగింత.



ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ మరోవైపు ఐ.సి.సి 2018 గాను ఇటివల ప్రకటించిన అవార్డులలో ప్రతిష్టాత్మక అవార్డ్స్  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో భాగంగా జరుగనున్న చివరి రెండు వన్డేలకు మరియు టి-20 సిరీస్ కి కెప్టెన్ కోహ్లీ కి విశ్రాంతిని ఇస్తున్నట్టు బిసీసీఐ ప్రకటించింది. కోహ్లీ స్థానంలో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ జట్టు సారధ్య బాధ్యతలు తీసుకుంటాడు. 5 వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెల్సిందే. రెండవ వన్డే ఈ నెల 26 వ తేదీన బే ఓవల్ స్టేడియం లో జరుగనుంది.

0 comments:

Post a Comment