Tuesday, January 29, 2019

ఓ బేబీ, డిస్కో రాజా ల మధ్య పోలిక ఉందంటున్నారు!!



సమంత హీరొయిన్ గా  నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ మిస్ గ్రానీ మూవీ థీమ్ ఆధారంగా  తెలుగులో  రూపొందుతున్న 'ఓ బేబీ' (వర్కింగ్ టైటిల్) సినిమాకి మరియు ఇటీవలే రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రానికి కథ పరమైన పోలిక వున్నట్టుగా ఫిలింనగర్ లో ఒక పుకారు షికారు చేస్తుంది. ఓ బేబీ సినిమాలో 80 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు ఒకానొక సందర్భంలో 20  సంవత్సరాల యువతిగా మారె పాత్రను సమంత పోషిస్తుంది, దీనికి కొంచెం అటు ఇటుగా డిస్కో రాజా మూవీ లో వృద్దుడిగా వుండే రవితేజ పాత్ర కొన్ని కారణాల వలన అదృశ్యం అయిపోయి తరువాత యువకుడిగా మారి ప్రతీకారం తీర్చుకొనే కథాంశం తో సినిమా సాగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజం అయినా కూడా కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ బేబీ కామెడీ ప్రధానంగా సాగె కథనం. ఇటు కథ లో కొంత పోలిక వున్నా కూడా డిస్కో రాజా సైంటిఫిక్ అండ్ రివెంజ్ ప్రదానంగా సాగబోతున్నట్టు ఇటీవల రిలీజ్ అయినా లోగో పోస్టర్ ని బట్టి హింట్స్ ఇచ్చారు. అందువల్ల రెండు సినిమాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశాలే ఎక్కువ.  

0 comments:

Post a Comment