Monday, January 7, 2019

ఆస్ట్రేలియా పై భారత్ చారిత్రాత్మక విజయం


ఆస్ట్రేలియా పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని 2-1 తో చేజిక్కించుకుంది.చివరిదైన 4 వ టెస్టు ఐదవ రోజు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.దీంతో భారత్ సిరీస్ ని గెలిచింది.1947 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 12 సార్లు ఆస్ట్రేలియా ను సందర్శించిన భారత్ ఒక టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియాలో గెలవడం ఇదే మొదటి సారి.ఈ మాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 622/7 కి డిక్లేర్ చేయగా ,ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 300 పరుగు లకు ఆల్ ఔట్ అయి ఫాలో ఆన్ లో పడి తమ 2 వ ఇన్నింగ్స్ లో వికెట్లేమి నష్టపోకుండా  6 పరుగులు చేయగా ,చివరి రోజు వర్షం కారణంగా ఆటను డ్రా గా అంపైర్లు ప్రకటించారు.చెటేశ్వర్ పుజారా కి "మ్యాన్ ఆఫ్ ది మాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లను గెల్చుకున్నాడు... 


0 comments:

Post a Comment