Saturday, January 26, 2019

మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' మూవీ టైటిల్ లోగో పోస్టర్ విడుదల. 



మాస్ మహారాజ్ అని అభిమానులు అతడికి ఇచ్చిన పేరుకు అతికినట్టుగా సరిపోయే హీరో రవితేజ. అయితే కొంత కాలంగా ఫామ్ కోల్పియాన రవితేజ అభిమానులను నిరుత్సాహ పరిచిన మాట నిజం. రాజా ది గ్రేట్ బాగానే ఆడిన ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలు టచ్ చేసి చూడు.. టచ్ చేయలేదు ఆ తరువాత వచ్చిన నేల టిక్కెట్ కు.. టికెట్స్ తెగని పరిస్థితి. ఇక రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ హాలులో నిలబడ లేకపోయింది. మాస్ మహారాజ్ "డిస్కో రాజా" మూవీ తో అదిరిపోయే సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుగా వున్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన "డిస్కో రాజా" మూవీ టైటిల్ లోగో చూస్తుంటే డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ని ఇవ్వబోతున్నట్టుగా వున్నాడు. టైటిల్ ని బట్టర్ ఫ్లయ్ ఆకారం లో డిజైన్ చేశారు. టైటిల్ కి బ్యాక్ సైడ్ లైట్ షేడింగ్ లో న్యూరాన్స్ ని చూపిస్తు, టైటిల్ కి పైన ఈజ్ ను క్రాస్ మార్క్ తో చూపిస్తూ, వాజ్ అని రాయడం మరియు టైటిల్ క్రింది భాగం లో రివైండ్, ఫార్వార్డ్, ప్లే, కిల్ అని రాసి "ప్లే" ని రెడ్ కలర్‌తో కొట్టేసి ఉండటాన్ని ఆధారంగా ‘డిస్కో రాజా’ స్టోరీ కి సంబందించిన హింట్స్ ని లోగో తోనే చెప్పే ప్రయత్నం చేసారు. ఇక టైటిల్ కి తగ్గ ఎనర్జీ సినిమా కథలో ఉంటే మాస్ మహారాజ్ తన అభిమానులకు థియేటర్స్ లో డిస్కో డాన్స్ చేసే ఊపును ఇచ్చేయటం కాయం. 

0 comments:

Post a Comment