Monday, January 28, 2019

"ఇస్మార్ట్ శంకర్" కు జతగా ఇస్మార్ట్ హీరోయిన్.



 అతడి సినిమాలు తెలుగు సినిమా హీరో కారెక్టరైజేషన్ కి కొత్త నిర్వచనంతో పాటు ఇండస్ట్రీ హిట్స్ ని ఇచ్చాయి. ఎవరి సినిమాలో హీరో ఇడియట్ గా వుంటూ దేశముదురు పనులు చేస్తూ పోకిరిగా తిరుగుతూ టెంపర్ ను చూపిస్తాడో అతడే పూరీ. కొద్దీ రోజులుగా ప్లాప్స్ తో అతడి అభిమానులను నిరుత్సాహ పరుస్తున్న పూరి జగన్నాద్ మరో సారి అతడికి అచ్చొచ్చిన  జానర్ లో రామ్ పోతినేని లాంటి స్మార్ట్ హీరోని "ఇస్మార్ట్ శంకర్" గా చూపించబోతున్నాడు. "ఇస్మార్ట్ శంకర్" కి జతగా అందాల నిధి అయిన నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసారు. గత వారమే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా లో మొదట చాల మంది హీరోయిన్స్ పేర్లు వినిపించిన కూడా ఆ ఛాన్స్ ని నిధి అందిపుచ్చుకుంది. మొదటి సినిమా ప్లాఫ్ తో మొదలెట్టి రెండో సినిమాతో ఓకే అనిపించుకున్న నిధి అగర్వాల్ ముచ్చటగా మూడో సినిమాతో హిట్ కొట్టాలని. పూరి తిరిగి పునర్ వైభవాన్ని ఈ సినిమాతో సాదించాలి అని కొరుకుందాం.

0 comments:

Post a Comment