Thursday, January 24, 2019

భరతమాత సేవలో ప్రాణాలర్పించిన సైనికుడు నాజిర్ అహ్మద్ వనీ కి ప్రతిష్టాత్మక అశోక చక్ర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన భరతమాత ముద్దు బిడ్డ నాజిర్ అహ్మద్ వనీకి ప్రతిష్టాత్మక 'అశోక చక్ర' అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదిగా దేశానికి వ్యతిరేకంగా 2014 వరకు నాజిర్ అహ్మద్ వనీ పనిచేసి ఆ తరువాత అతని ఆలోచనలో మార్పు వచ్చి దేశానికి సేవ చేసేందుకు ఇండియన్ ఆర్మీ లో చేరాడు. ఇంతకు ముందు రెండు సార్లు సేనా మెడల్ ని పొందారు. ఈ నెల 26 న నాజిర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ఈ అవార్డు ను అందచేయనున్నారు.

0 comments:

Post a Comment