Thursday, January 31, 2019

తమిళ్ "96" మూవీ ఒక క్లాసిక్ తెలుగులో తప్పక హిట్ అవుతుంది : దిల్ రాజు. ఎఫ్- 2 సినిమా 60 కోట్ల షేర్ వసులు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్బంగ దిల్ రాజు అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన సందర్భం లో 96 మూవీ తెలుగు రీమేక్ విశేషాలను మీడియా తో పంచుకున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్ లో మొట్టమొదటి రీమేక్ మూవీ 96 అని. మొదటిసారి తమిళ్ 96 సినిమా చూసినపుడు డైలాగ్స్ అర్థం కాకున్నా నా మనసుకు హత్తుకున్నా ఒక క్లాసిక్ మూవీ ఈ సినిమా తప్పకుండ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అని తెలిపారు. ఈ సినిమాని తెలుగులో కూడా 96 పేరుతోనే నిర్మిస్తున్నట్టు చెప్పారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా ఫీల్ మిస్సవకుండా కథలో కొన్ని మార్పులు ఉంటాయి అని నిర్దారించారు దిల్ రాజు. 

0 comments:

Post a Comment