Saturday, January 19, 2019

96 మూవీ రీమేక్ లో శర్వా అండ్ సమంత



తమిళ్ బ్లాక్ బాస్టర్ 96 మూవీ రీమేక్ రైట్స్ ని దిల్ రాజు తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నటించే హీరో హీరోయిన్ లు ఎవరు అనే సందిగ్దానికి దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టాడు. శర్వానంద్ అండ్ సమంతల కలయిక లో ఈ మూవీ ఉంటుంది అని నిర్దారించాడు. తమిళ్ 96 మూవీలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అండ్ త్రిష ల నటన సినిమా కథకు తగ్గట్టు సహజంగా ఉండటం సినిమా విజయం లో కీలక పాత్ర పోషించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్కూల్ డేస్ లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాను ప్రేక్షకులు చాల కాలం గుర్తుంచుకునేలా చేసిన అంశాలు. ఇక శర్వానంద్ అండ్ సమంతలు ఇద్దరు మంచి నటులు గా పెరుతెచ్చుకున్నవారే. కానీ ఎటొచ్చి సినిమా కథ పరంగా మార్పులు చేస్తే కనుక సహజత్వానికి సినిమా కొంచెం దూరము కావొచ్చు. ఏది ఏమైనా ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని దిల్ రాజు గారు చేస్తున్న మంచి ప్రయత్నం విజయతీరాలను చేరాలని కోరుకుందాం.

0 comments:

Post a Comment