Friday, January 25, 2019

70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు



“త్రిభువన విజయం” పాఠకులకు మరియు సమస్త భారతావనికి 70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య భారతదేశం అనేక మతాలు, కులాలు, జాతులు కలిగిన దేశం అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అందుకే స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత భారతీయులందరికి సమన్యాయం, సమాన హక్కులు మరియు స్వేచ్ఛ ను అందించటం కోసం 1947 ఆగస్టు 29 న డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలనలోకి తీసుకొని అనేక సవరణలతో పొందుపరిచిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ తదుపరి 1950 జనవరి 26 న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుంటు ప్రతి సంవత్సరం ఈ రోజు జాతీయ జెండాకు వందనం చేస్తూ త్యాగధనులను గుర్తుచేసుకుంటున్న పండుగే మన ఈ గణతంత్రం. అనేక సంవత్సరాల బానిసత్వము నుండి దేశానికి విముక్తి కలిగించి ఈ రోజు మనము పొందుతున్న స్వేచ్ఛ హక్కుల కోసం ఎందరో మరెందరో త్యాగధనులు భావితరాల కోసం విదేశీ తూటాలకు ఎదురుగా నిలిచి రక్తం కారుతున్నా, కొరడా దెబ్బలకు చర్మం పగులుతున్న , ప్రాణాలు పోతున్న ఎంతోమంది తలలు వాల్చితే అందిన ఫలాలు ఇవి. ఈ 70 వసంతాల గణతంత్ర స్వరాజ్యంలో ఎందరో మహానుభావులు దేశకీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు రెపరెప లాడించిన అద్భుత ఘట్టాలు చాల. ఇంకో వైపు చుస్తే 70 వసంతాల గణతంత్రన్ని ఘనంగా జరుపుకుంటున్న భారతావని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది. ఆ త్యాగధనుల త్యాగాలను మరచి ప్రస్తుత సమాజం కులం కోసం మతం కోసం స్వార్ధపూరిత రాజకీయాలతో నవభారతం ప్రయాణిస్తుంది. ఆగష్టు 15 మరియు జనవరి 26 న మాత్రమే జెండాకు వందనం చేయకుండా ఇది మాతరం వందేమాతరం అంటూ కుల, మత, స్వార్ధ రాజకీయాలను మాని ఇది నా దేశం ఇవి నా పరిసరాలు సమస్త దేశ ప్రజలు నా సోదరి సోదరీమణులు అనే విశాల దృక్పధంతో ప్రతి భారతీయుడు ఆలోచించిన రోజు మనం వేసే ప్రతి అడుగు చేసే ప్రతి ఆలోచన భావితరాలకు మార్గదర్శకంగా మారినపుడు రోజు గణతంత్రమే ప్రతి రోజు స్వాతంత్య్రమే. జై హింద్.

1 comments: