Sunday, January 27, 2019

సౌతాఫ్రికా ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు : పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కి 4 మ్యాచ్ ల సస్పెన్షన్


పాకిస్థాన్ కెప్టెన్ ,వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ కి తరువాతి 4 మ్యాచ్ ల అస్పెన్షన్ విధించింది ఐసీసీ.సౌతాఫ్రికా టీమ్ ప్లేయర్ ఆండీలే పేలుక్వాయో పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు ఐసీసీ ఈ సస్పెన్షన్ విధించింది.గత మంగళ వారం జరిగిన రెండో వన్డేలో ఆండీలే పేలుక్వాయో బ్యాటింగ్ చేస్తుండగా "అరేయ్ నల్లోడా ,మీ అమ్మ ఈ రోజు ఎక్కడ కూర్చుంది..?నీకు ఏం కావాలని ఆమెను ఆడిగావు ?" అని దూషించడం స్టంప్స్ మైక్ లో రికార్డ్ కావడం ,ఐసీసీ దీనిపై విచారణ జరపడం జరుగగా,సర్ఫరాజ్ తప్పును ఒప్పుకున్నాడు.అందుకే అతడు 3 వ వన్డే ఆడలేదు. 

0 comments:

Post a Comment