Wednesday, January 23, 2019

విజృంభించిన భారత బౌలర్లు: 38 ఓవర్ల మాచ్ లో 156 పరుగులకే ఆలౌట్:అలవోకగా ఛేదించిన భారత్.



న్యూజిలాండ్ టూర్ లో భాగంగా జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో మొదటి వన్డే లో భారత్ గెలుపు దిశగా సాగుతుంది.భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ కుప్ప కూలారు.కులదీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ 3,ఛాహల్ 3,కేదార్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ల లో ఒక్క కేన్ విలియంసన్ మాత్రమే 64 పరుగులు చేయగా,రాస్ టేలర్ చేసిన  24 పరుగులే 2 వ అత్యుత్తమ స్కోర్..తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ ధావన్ (75),కోహ్లీ (45) లు రాణించారు.వాతావరణం అననుకూలం వల్ల 38 ఓవర్ లకు కుదించారు.భారత్ 82 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మాన్ ఆఫ్ ద మాచ్ మొహమ్మద్ షమీ.

0 comments:

Post a Comment