• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Tuesday, October 15, 2019

"వార్" మూవీ రివ్యూ: తప్పకుండా చూడాల్సిన సినిమా


(ఈ సినిమా హిందీ సినిమా కాబట్టి కొంత ఆలస్యంగా చూడాల్సి వచ్చింది.అందుకే లేట్ రివ్యూ)
భారత చలన చిత్ర రంగం లో అత్యద్భుత డ్యాన్స్ చేయగలిగిన కథానాయకులలో హృతిక్ రోషన్ ముందు వరుసలో ఉంటాడు.అంతే కాదు గ్రీకు శిల్పం లాంటి దేహ సౌష్టవం,అమ్మాయిల మనసు కొల్లగొట్టే అతని నీలి కళ్ళు అతనికి మాత్రమే సొంతం.
ఇక ఈ  మధ్యే  బాలీవుడ్ తెరంగేట్రం చేసి అద్భుతమైన తన డ్యాన్స్ మూమెంట్స్ తో, అథ్లెటిక్ బాడీ తో చాలా తక్కువ కాలంలో  దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన చిచ్చర పిడుగు , ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్.
వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని తెలిసినప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు మిన్నంటాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని  సినీ అభిమానులు ఎదురు చూశారు.
అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
కథా పరంగా చూస్తే అంతా మిలిటరీ ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా లో ఒక  స్పై సినిమా కు ఉండాల్సిన మలుపులు,ట్విస్టులు ఛేజింగ్ లు సాహసాలు అన్నీ పుష్కలంగా  ఉన్నాయి.
Colonel Luthra(అశుతోష్ రాణా)  చీఫ్ గా ఉండి , రోగ్ (దేశ ద్రోహి) గా మారిన కబీర్(హృతిక్) ఒకప్పుడు మోస్ట్ ఎఫీషియంట్  ఇండియన్ ఏజెంట్  ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అతడు దొరకక పోగా అతడు మన దేశస్థులనే చంపుతుంటాడు.ఈ  సమయం లో ఖలీద్(టైగర్ ష్రాఫ్) అనే  యంగ్ ఏజెంట్  అసలు కబీర్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.ఎందుకంటే ఖలీద్ ఒకప్పుడు కబీర్ కు శిష్యుడు ఇద్దరూ కలిసి కొన్ని సక్సెస్ ఫుల్ ఆపరేషన్ లలో పాల్గొంటారు. దేశ ద్రోహి అయిన తన తండ్రి ని చంపిన  కబీర్ అంటే కోపం లేకపోగా ,ఒక ద్రోహిని చంపిన గొప్ప వీరుడు గా ఖలీద్ ,కబీర్ ను ఆరాదిస్తాడు. అతని దగ్గర "అన్నిటికన్నా ముఖ్యమైనది దేశమే " అని నేర్చుకుంటాడు ఖాలీద్.అలాంటి ఖాలీద్ చివరికి తన గురువు లాంటి కబీర్ నే పట్టుకునే ఆపరేషన్ ని లీడ్ చేయాల్సి వస్తుంది.అయితే అతడు కబీర్ ను పట్టుకున్నాడా? లేదా? ,ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాది నుండి దేశాన్ని ఎవరు రక్షిస్తారు ?అనేది సినిమాలో చూడండి.
ఇక్కడ కథలో మంచి మలుపులతో సినిమా మొదటి భాగం చాలా చక్కగా ఉంటుంది.ప్రేక్షకుడు తరువాత సీన్ ఏమై ఉంటుంది అని ఎదురు చూస్తాడు.
కానీ ఇందులో చెప్పుకోవాల్సింది హృతిక్  గురించే.అతడి లుక్ నిజంగానే ఒక గ్రీకు శిల్పం లాగా ఉంది ఈ సినిమాలో.The most handsome hero in Indian Cenima అంటే అతిశయోక్తి కాదు.కొన్ని కొన్ని సీన్ లలో టైగర్ ,హృతిక్ ముందు తేలిపోయాడు. ఫిజిక్ వైజ్ హృతిక్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడనే చెప్పాలి.చాలా సీన్ లలో హృతిక్ ఒక హాలీ వుడ్ హీరో లాగానే అనిపిస్తాడు.అసలు ఇంతవరకు హృతిక్ కి హాలీవుడ్ ఛాన్స్ ఎందుకు రాలేదా అని ఆశ్చర్యం వేస్తుంది.ఒక సీనియర్ ఏజెంట్ గా,ఎంతో మెచ్యూర్డ్ పెరఫార్మన్స్ ఇచ్చాడు  హృతిక్ .ఈ సినిమా కి అసలు హీరో హృతిక్ అనే విషయం సినిమా గడుస్తున్న కొద్దీ మనకు అర్ధమవుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే హృతిక్ గురించి ఎంతైనా చెప్పొచ్చు."జై జై శివ్  శంకర్ " పాటలో హృతిక్ స్టెప్పులకి ఎవరైనా ఫిదా కావాల్సిందే.వేసినవి తక్కువ స్టెప్స్ అయినప్పటికీ  'కళాత్మకత' అనే పదానికి నిర్వచనం ఇది కదా అనేలా హృతిక్ మూమెంట్స్ ఉంటాయి.ఇక ఈ సినిమాలో చేజింగ్ సీన్స్ చూస్తే బాండ్ సినిమాలు  లేదా ధూమ్ సిరీస్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఫైట్స్ కూడా ఎప్పటిలాగే హృతిక్ స్టయిల్ లో బాగుంటాయి .
ఇక ఈ సినిమాలో రెండో హీరో టైగర్ ష్రాఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.29 ఏళ్ళ వయసున్న ఈ కుర్రాడు మనకి 23 ఏళ్ల అబ్బయి లాగా లేతగా కనిపిస్తాడు.కానీ ఇతడి అథ్లెటిక్ బాడీ తో ,అచ్చెరువొందించే స్టంట్స్ తో ఆకట్టుకున్నాడు.కొన్ని సీన్స్ లో 'బోర్న్' సినిమా ల హీరో 'మాట్ డామన్' లాగా అనిపిస్తాడు.ముఖ్యంగా జంపింగ్ సీన్స్.ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా టైగర్ కే పడ్డాయి.కొన్ని ఫైట్స్ లలో టైగర్ ,"టోనీ జా"  లాగా            అని పిస్తాడు.ఫైట్స్ మరియు చేజ్ లలో టైగర్ దుమ్ము దులిపాడు.చాలా సీన్ లలో టైగర్ ,హృతిక్ తో పోటీ పడ్డాడు.అతని ముందు హృతిక్ ఉండడం వల్ల ,కొంత మనకి టైగర్ ప్రతిభ తగ్గినట్టు అనిపిస్తుంది.ఐనప్పటికీ టైగర్ తన పాత్రకు 100%  న్యాయం చేశాడనే చెప్పాలి.ఇక డ్యాన్స్ మూవ్స్ కూడా టైగర్ కే ఎక్కువ పడ్డాయి.  చివరలో అతడి నవ్వు మనకి కొంత భయం కలిస్తుంది అంత బాగా చేశాడు.ఈ సినిమా తో టైగర్ పూర్తి స్థాయి సూపర్ స్టార్ హోదాను పొందాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ,కథను అందించిన ఆదిత్య చోప్రా,దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ల గురించి చెప్పుకోవాలి.ఒక స్పై అడ్వెంచర్ కథను మంచి ట్విస్ట్ లతో ఆదిత్య చోప్రా అందించంగా, సినిమాని ఒక హాలీవుడ్ మూవీ లాగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు సిద్దార్థ్.ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకుని చాలా బ్యాలెన్సుడ్ గా తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ని మెచ్చుకోవాల్సిందే.
ఇక మిగితా నటీ నటుల లో అశుతోష్ రాణా కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండగా అతడు ఎప్పటిలాగే బాగా చేశాడు.హీరోయిన్ వాణీ కపూర్ చాలా అందంగా కనిపిస్తుంది.ఈమె పాత్ర తక్కువ సేపు ఉన్నా తన అందంతో ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ (అంకిత్,సంచిత్ ,విశాల్ డడ్లాని ,డేనియల్ జార్జ్).
జై జై శివ్ శంకర్ పాట చాలా బాగా వచ్చింది.(మ్యూజిక్ శేఖర్ రజ్వియాని ).
అయితే ఈ సినిమాలో ప్రధానంగా సెకండ్ హాఫ్ కొంత డల్ గా అనిపిస్తుంది.అంత అద్భుతమైన ఫస్ట్ హాఫ్ చూశాక ,సెకండ్ హాఫ్ పై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగి మనకు అలా అనపిస్తుందేమో. సినిమాలో హీరోలను గురించి పట్టించుకుని మిగితా క్యారెక్టర్ లను నెగ్లెక్ట్ చేశారు.  ముఖ్యంగా విలన్ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.అందుకే మిగతా పాత్రలు మనకు గుర్తుండవు.అయితే ఇవన్నీ లోపాలు ఉన్నప్పటికీ
ఓవరాల్ గా తప్పకుండా చూడాల్సిన సినిమా "వార్"

ఇప్పటికే (12 వ రోజు నాటికి )ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ ని, 270 కోట్ల షేర్ ని దాటేసింది.ఇంకా స్టడీ గా నే రన్ అవుతుంది.ఇది ఇంకా ఎన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

రేటింగ్......3.5/5
...............త్రిభువన విజయం 🙏

Friday, September 20, 2019

దుమ్ము లేపుతున్న "సైరా" నరసింహా రెడ్డి ట్రైలర్ : యూట్యూబ్ లో నెంబర్ వన్ ఇన్ ట్రెండింగ్ : 4.8 /5 రేటింగ్

సైరా నరసింహ రెడ్డి ,తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో భారీ తారాగణం నటించిన ,మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు.ఈ సినిమా ట్రైలర్  3 రోజుల క్రితం విడుదలైంది.ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో తొలిస్థానం లో నిలిచింది.ఈ సినిమా ట్రైలర్ లో మొత్తం కథ అంతా రివీల్ అయ్యింది.చిరంజీవి ఉరికంబం ఎక్కే సీన్ కూడా ట్రైలర్ లో చూపించారు.నిజంగా ఇప్పటి వరకు సినిమా ను చూడాలంటే ఎదో చిరంజీవి సినిమా కాబట్టి చూడాలి అన్నట్టు అనిపించింది.కానీ ఇప్పుడు ఈ సినిమా తప్పక చూడాలి అనిపించింది.మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది..


Thursday, September 12, 2019

"సైరా" ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18 న: ముఖ్య అతిథులు ఎవరో తెలుసా??


మెగాస్టార్ చిరంజీవి ,నయనతార,హీరో హీరోయిన్ లు గా నటించగా,అమితాబ్ బచ్చన్,జగపతిబాబు, సుదీప్,విజయ్ సేతుపతి లు ప్రధాన పాత్ర దారులుగా   సురేందర్ రెడ్డి దర్శకత్వంలో   రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా". గత కొన్ని నెలలు గా శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల అక్టోబర్ 2 ,అనగా ఈ గాంధీ జయంతి సందర్బంగా విడుదల కానున్న సంగతి తెల్సిందే.అయితే ఈ నెల 18 న హైదరాబాద్ లోని LB స్టేడియం లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా,తెలంగాణ పట్టణాభివృద్ధి మంత్రి శ్రీ K. తారకరామారావు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,SS. రాజమౌళి తో పాటు,VV వినాయక్,కొరటాల శివ గార్లు విచ్చేస్తున్నారని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ,SS రాజమౌళి లను ఒకే వేదిక పై చూడడం ప్రేక్షకులకు నిజంగా కన్నుల పండగే..ఇక.

Tuesday, August 20, 2019

“ సైరా” నర్సింహారెడ్డి టీజర్ : మెగా స్టార్ విశ్వ రూపమే.. రేటింగ్ 4.5/5..
ఎన్నో రోజుల నుండి సినీ అభిమానులు ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్న “సైరా” నర్సింహ రెడ్డి టీజర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర బృందం. ఒకే రోజు తెలుగు ,హిందీ తమిల్ ,మలయాళం,కన్నడ భాషలలో విడుదల చేశారు.
టీజర్ ఎలా ఉంది??
టీజర్ నిజంగా అద్భుతంగా ఉండి.ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  మెగా స్టార్ చిరంజీవి గురించే,ఈ వయసులో ఇలాంటి ఫైట్స్ ఎవరైనా చేస్తారా? అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే అది చేసింది చిరంజీవి నా లేక రాంచరణ్ లేదా ప్రభాస్ చేశారా ?అని అనిపిస్తుంది.  అసలు ఆ వేగం ,ఆ మూవ్ మెంట్స్  అస్సలు చూడాల్సిందే. చిరంజీవి చాలా ఫెరోషియస్ గా కన్పిస్తాడు.
ఇక ఈ టీజర్ కి మరో ఆకర్షణ ,ఈ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్.పవన్  కళ్యాణ్ చెప్పిన వాయిస్ ఓవర్ ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది.మెగా అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో ఎన్ని స్పెషల్స్ ఉన్నాయని...అమితాబ్ బచ్చన్, జగపతి బాబు,కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి,నయన తార,తమన్నా ఇలా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఇందులో..
“బాహుబలి “ తరువాత ఏ పెద్ద సినిమానైనా దానితో పోల్చడం కామన్ అయి పోయింది .అయితే అవి ఏవి కూడా ఆ రేంజ్ అనిపించుకోలేక పోయాయి.అయితే ఈ సినిమాలో హీరో చిరంజీవి కాబట్టి..ఇది బాహుబలి స్థాయి లో ఆదరణ పొందడానికి  అవకాశం ఉంది.
ఇక తమిళ్ వెర్షన్ లో వాయిస్ ఓవర్ ని కమల్ చెప్ప బోతున్నాడు. ఇది సినిమా ప్రారంభానికి ముందు,చివరలో వస్తుంది.
ఇక మలయాళం లో ఆల్రెడీ టీజర్ లో మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
ఇప్పటికే ఈ టీజర్ 15 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ ని సాధించింది.
ఇన్ని స్పెషల్ అట్రాక్షన్ లు ఉన్న సినిమా బహుశా గతంలో “బార్డర్ “ సినిమాలో నే చూశాం.
కొస మెరుపు :సోషల్ మీడియాలో ఒక అభిమాని “ టీజర్ కి టికెట్ పెడితే ,ఈ టీజర్  వంద కోట్లు వసూళ్లు చేస్తుంది” అని కామెంట్ చేశాడు.కొంచెం అతిగా అనిపించినా ...కరెక్ట్ గా అనిపిస్తుంది...

ఎనీ వే  5 భాషల టీజర్స్ ని ఎంజాయ్ చేయండి ....

TELUGU:TEASERHINDI TEASER
KANNADA TEASERMALYALAM TEASER
TAMIL TEASER
Saturday, August 10, 2019

"సాహో " ట్రైలర్ విడుదల : 4.8/5 రేటింగ్ ..."గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియం లో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది"

మొత్తానికి యావత్ సినీ అభిమానులు , సినీ జనాలు ఎంతో కాలం నుండి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది..."సాహో" తెలుగు యంగ్ రెబెల్ స్టార్ , ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "సాహో " ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించాడు UV క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరొయిన్ గా నటిస్తుంది.ఇక ఇందులో నీల్ నితిన్ ముఖేష్,మహేష్ భట్,అరుణ్ విజయ్,జాకీష్రాఫ్,మురళీ శర్మ మరియు మందిరా బేడీ వంటి తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం ఈ నెల 30 వ తారీఖున విడుదల కానున్నది.

ట్రైలర్ ఎలా ఉంది ?? 
బాహుబలి వంటి ఇంటర్ నేషనల్ రేంజ్ మూవీ లో నటించాక తరువాత మూవీ ఎవరైనా ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్  ఉన్న దర్శకునితో నటించాలి ఎవరైనా.. కానీ సుజిత్ లాంటి ఒక వెరీ యంగ్ దర్శకుడి తో నటించడం నిజంగా సాహసం అనే చెప్పాలి. అసలు సుజిత్ ప్రభాస్ ను హ్యాండిల్ చేయగల్గుతాడా అనే డౌట్ ఉండేది.ఈ ట్రైలర్ తో ఆ డౌట్ క్లియర్ అయ్యింది.ప్రభాస్ ని ఏ రకంగా చూపిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు సంతృప్తి చెందుతారో అలాగే చూపించాడు.ఇక ప్రభాస్ ధర్మేంద్ర తర్వాత బాలీవుడ్ హీ మాన్ అని పిలిపించుకుంటాడు.ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది..ట్రైలర్ ప్రకారం ప్రభాస్ ఒక అండర్ కవర్ ఏజెంట్ అని తెలుస్తుంది.అలాగే శ్రద్ధాకాపూర్ కపూర్ ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది.వేల్లిద్ధారి మధ్య రొమాన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయింది.ఇక సినిమాలో మెయిన్ గా ఒక బ్లాక్ బాక్స్ గురించి విలన్ల ప్రయత్నం అది దొరికితే బిలియనీర్ లు కావడం ఖాయం అని తెల్సి దాని కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ,హీరో వాల్లని ఎదుర్కోవడం ఎత్తుకు పై ఎత్తు వేయడం ఓవరాల్ గా ఇదీ కంటెంట్ అని తెలుస్తుంది.కానీ టేకింగ్ చూస్తే ఇది ఇండియన్ మూవీ కాదు ,హాలీవుడ్ మూవీ అని అనిపించడం ఖాయం.ఇప్పటికే బాహుబలి2 తో ఇంటర్ నేషనల్ హీరో అనిపించుకున్న ప్రభాస్ సాహో తో ,హాలీవుడ్ దృష్టిని ఆకర్షించడం ఖాయం....ట్రైలర్ చూసి ఆనందించండి...
మన్మధుడు గురించి - సుమ తో నాగార్జున ఫుల్ ఇంటర్వ్యూ

నో డౌట్ "ది మోస్ట్ హ్యాండ్సం పర్సన్ ఇన్ ఇండియా " మన నాగర్జుననే : ఈ పాట చూస్తే మీకే అర్థం అవుతుంది
Friday, August 9, 2019

అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న "సాహో" ప్రభాస్ కొత్త పోస్టర్


గత వారం రోజులుగా ప్రభాస్ సాహో ప్రచారం అదరగొడుతున్న సాహో టీమ్ నుండి విడుదలైన కొత్త పోస్టర్ అదిరిపోయింది. ఇంతవరకు విడుదల చేసిన అన్ని పోస్టర్స్ లోకి ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది అనడం లో సందేహం లేదు. ఇక పోస్టర్ విషయానికి వస్తే నుదుటి పైన నెత్తుటి మరక తో సాలిడ్ పర్సనాలిటీ తో సూపర్బ్ లుక్ తో ప్రభాస్ నిలబడి ఉండగా వెనక వైపు నుండి ఆయుధాలతో విలన్స్ ప్రభాస్ వైపు వస్తు ఉండటం కనిపిస్తుంది. ఇక ఈ రోజు విడుదల అవుతున్న ట్రైలర్ కోసం అభిమానులు అతృతతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ సినిమా పైన అంచనాలను ఎంత వరకు పెంచుతుందో చూడాలి. 

కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు

66 వ జాతీయ చలచిత్ర అవార్డు లలో నటి కీర్తి suresh కు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది.”మహానటి” చిత్రానికి గానూ మహానటి సావిత్రి పాత్ర లో నటనకు గానూ ఈ అవార్డు దక్కింది.అంతే కాకుండా ఈ చిత్రం ఉత్తమ ప్రాతీయ తెలుగు చిత్రం కేటగిరీ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇంకా ఉత్తమ కాస్ట్యూమ్ డిసైన్ అవార్డు కూడా "మహా నటి" కైవసం చేసుకుంది.
స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం లో “నానీ “ నిర్మాతగా వ్యవహరించిన “అ “ చిత్రం గెలుచుకుంది.ఇక మరొక అవార్డు రాహుల్ రవీంద్రన్ తన “చి.ల.సౌ .” చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు  గెలుచుకున్నాడు.తెలుగు దర్శకుడు సుధాకర్ రెడ్డి యక్కంటి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి గా తన మరాఠీ చిత్రం “నాల్” కి అవార్డు పొందాడు.ఇక ఆడియోగ్రఫీ విభాగం లో “రంగా స్థలం “ అవార్డు గెలుచుకుంది.
ఇక జాతీయ ఉత్తమ నటుడు గా ఈ సారి అంధా దున్ లో నటనకు గానూ –ఆయుష్మాన్ ఖురానా , “ఉరి “ సినిమాకి గానూ విక్కీ కౌశల్ లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.ఉత్తమ చిత్రమ్ హేల్లారో (గుజరాతీ)
తెలుగు చిత్ర సీమలో జాతీయం ఉత్తమ నటి గా అవార్డు కు ఎంపికైన నాల్గవ నటి కీర్తి సురేష్.గతంలో శారద(నిమజ్జనం),అర్చన( దాసి), విజయశాంతి( కర్తవ్యం) లకు ఈ అవార్డు వచ్చింది.

Thursday, August 8, 2019

సూపర్ స్టార్ మహేష్ బాబు " సరి లేరు నీకెవ్వరు" : మహేష్ ఇంట్రో సీన్ విడుదల : గూస్ బంప్స్ సృష్టిస్తున్న ఇంట్రో - 4.5/5 రేటింగ్


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం "సరి లేరు నీకెవ్వరు " అనిల్ రావి పూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ను 'దిల్' రాజు సమర్పిస్తుండగా , మహేష్ GMB సంస్థ,AK ఎంటర్ టెయిన్ మెంట్ లు సహ నిర్మాతలుగా ,రామ బ్రహ్మం సుంకర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మహేష్ బాబు యొక్క లుక్ రివీల్  సీన్ ను విడుదల చేశారు.మేజర్ అజయ్ కృష్ణ గా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్నాడు.నిజంగా ఈ లుక్ లో మహేష్ బాబు చాలా అద్భుతంగా ఉన్నాడు.మహేష్ ని ఆ లుక్ లో చూస్తే నిజంగా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం దీనికి దేవి శ్రీ ప్రసాద్  మ్యూజిక్  తోడయ్యి ఈ సీన్ ఓ లెవెల్ కెళ్ళి పోయింది.ఇక ఈ చిత్రం లో హీరొయిన్ గా రష్మిక మండన నటిస్తుండగా,లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ,నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులను అన్నిటినీ బద్దలు కొట్టడం ఖాయం .


ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభా కాంక్షలు "
-from :


సంపూర్ణేష్ బాబు "కొబ్బరి మట్ట " ట్రైలర్ : ఫుల్ ఫన్

" హృదయ కాలేయం" సినిమా తో ఇండస్ట్రీ ని మొత్తం తన వైపు తిప్పుకున్న సంపూర్ణేష్ బాబు "కొబ్బరి మట్ట" సినిమా ట్రైలర్ చూస్తే దాదాపు ఈ సారి కూడా "హృదయ కాలేయం"  ఫలిత్ఆఆమె రిపీట్ అయ్యేలాగే ఉంది.ట్రైలర్ ఫన్నీ గా అనిపిస్తుంది.ఒక్క లుక్ వేయండి.

మన్మధుడు గురించి - సుమ తో నాగార్జున ఫుల్ ఇంటర్వ్యూWednesday, August 7, 2019

నో డౌట్ "ది మోస్ట్ హ్యాండ్సం పర్సన్ ఇన్ ఇండియా " మన నాగర్జుననే : ఈ పాట చూస్తే మీకే అర్థం అవుతుంది

 అవును ఇది అతిశయోక్తి కాదు నిజం.గతం లో స్టార్ మా లో ప్రసారమైన "మీలో ఎవరు కోటీశ్వరుడు " షో కి అతిథి గా వచ్చిన విద్యా బాలన్ స్వయంగా అన్న మాట ఇది.విద్యా బాలన్ అన్నాడని కాదు గానీ నిజంగా నాగార్జున వయసు పెరుగుతున్న కొలదీ వైన్ లాగ ఇంకా అందంగా మారి పోతున్నాడు. ఈ 9 వ తేదీన విడుదల కాబోతున్న మన్మధుడు 2 సినిమా కి సంబంధించి ఈ రోజు "హే మేనైన " అనే పాట వీడియో ను విడుదల చేశారు .ఇందులో నాగార్జున చాలా చాలా గ్లామరస్ గా ఉన్నాడు.మన్మధుడు 1 కన్నా యంగ్ గా కనిపించాడు. కావాలంటే మీరు కూడా చూడండి.
మన్మధుడు 2 గురించి - సుమ తో నాగార్జున ఫుల్ ఇంటర్వ్యూ
వా.....వ్...! వాట్ ఎ లుక్ ....!!! ఏంజెలీనా జోలీ నెక్స్ట్ సినిమా "మాలేఫిసెంట్ -మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్ " పోస్టర్ అద్భుతం


Tuesday, August 6, 2019

తెలంగాణ చిన్నమ్మ ,బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) అస్తమయం


బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) గారు స్వర్గస్థులయ్యారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..గుండె పోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు.

ఈమె భౌతిక కాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుండి జంతర్ మంతర్ లోని ఆమె నివాసానికి తరలించారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు తమ నివాసం లో ఉంచనున్నారు.
ఈ సాయంత్రం డిల్లీ లోధి రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మా
గారి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
గత ప్రభుత్వం లో ఈమె విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి గా పనిచేశారు.
ఈమె 1953 ఫిబ్రవరి 14 న హర్యానా లోని అంబాల లో జన్మించారు.
ఈవిడ 1977 లో అంబాలా లో తొలి సారిగా ఎమ్మెల్యే గ గెలిచారు,
1996,1998 లో వాజ్ పెయ్ మంత్రి వర్గం లో పని చేశారు.
1998 లో డిల్లీ లో సీఎం గా పనిచేశారు.
ఏడు సార్లు ఎంపీ గా మూడు సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహించటం జరిగింది.
అటు సుప్రీమ్ కోర్టులో న్యాయవాది గా కూడా పనిచేశారు.
---శివ్

వా.....వ్...! వాట్ ఎ లుక్ ....!!! ఏంజెలీనా జోలీ నెక్స్ట్ సినిమా "మాలేఫిసెంట్ -మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్ " పోస్టర్ అద్భుతం


ఎంజెలినా జోలీ ..ఈ పేరు వింటేనే ప్రపంచం లోని సినీ అభిమానులు పులకరించి పోతారు.కేవలం అందం మాత్రమే కాదు హీరోలు కూడా చేయలేని ఎన్నో రిస్కీ ఫైట్ లు చేయగలిగిన అచ్చమైన హాలీవుడ్ భామ .గతం లో ఈమె నటించిన సూపర్ హిట్ చిత్రం "మాలేఫిసెంట్ " .ఈ చిత్రానికి కొనసాగింపు గా ఇప్పుడు   "మాలేఫిసెంట్-మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్ " పేరు తో కొత్త చిత్రం రాబోతుంది.ఈ సినిమా పోస్టర్ చూస్తే సిఇనిమాలను ఇష్ట పడే వారు ఫిదా ఐపోవాల్సిందే.నిజంగా వేరే లోకపు ఏంజెల్ లాగా ఉన్న ఎంజెలిన జోలీ ని ఒక్కసారి చూడాల్సిందే....
ఈ సినిమా ని డిస్నీ సంస్థ నిర్మిస్తుంది. ప్రిన్సెస్ అరోరా మరియు మలేఫిసెంట్ ల మధ్య దూరాన్ని పెంచే ఒక రాణి ని ఎలా ఎదుర్కునారు అనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో ప్రిన్సెస్ గా ఎల్లె ఫ్యానింగ్ ,మహా రాణి  ఇంగ్రిస్ గా , మిషెల్ పెఫర్ లు నటిస్తున్నారు.ఈ చిత్రానికి దర్శకుడు జోచిం రోనింగ్. కాగా ఈ సినిమా అక్టోబర్ 18 రోజు విడుదల కానుంది.

ఎవ్వరినీ పొగడనంత గా వెన్నెల కిషోర్ ని పొగిడిన నాగార్జున


"సైరా" విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి.
శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

ఎవ్వరినీ పొగడనంత గా వెన్నెల కిషోర్ ని పొగిడిన నాగార్జున


 మనమధుడు 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున  వెన్నెల కిశోర్ ని బాగా మెచ్చుకున్నాడు.నాగార్జున ఎప్పుడు కూడా ఎవ్వరినీ ఇంతగా పొగిడి ఉండడు.గతం లో బ్రహ్మానందం తో కల్సి చేసినప్పుడు కూడా బ్రహ్మానందం ఎంత నవ్వించింది చెప్పేవాడు కానీ ,ఇప్పుడు వెన్నెల కిషోర్ ని ఏకంగా మిస్ అవుతున్నట్టు చెప్పడం చాలా నిజాయితీ గా అనిపించింది.ఇక ఈ పొగడ్తలతో ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆకాశం లో విహరిస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు...
"సైరా" విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి.
శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

"సైరా" విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ "సైరా" నర్సింహారెడ్డి సినిమా కి సంబంధించి సూపర్ హాట్ న్యూస్ ఇది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా స్వాతంత్ర్య సమర యోధుడు కర్నూల్  " ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" జీవిత చరిత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన మేగజైన్ "Bpositive"  కోసం తన మామయ్య చిరంజీవి ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి ని ఉపాసన "సైరా"సినిమా విడుదల ఎప్పుడు అని అడగగా దీనికి సమాధానంగా చిరంజీవి ఈ సినిమా అక్టోబర్ 2 ,2019 రోజున అనగా గాంధీ జయంతి రోజున విడుదల చేయనున్నట్లు సమాధానం చెప్పారు.దీంతో చిరు అభిమానులకు ఇది ఎంతో జోష్ ని తెచ్చి పెట్టింది.బాహుబలి సినిమాకి సంబంధించి ఇంతవరకు ఏ రికార్డు కూడా దాని దరిదాపుల్లోకి రాకపోగా,ఆ సత్తా ఉన్న సినిమాగా "సైరా"ను చెప్పుకుంటున్నారు.ఎందుకంటే ఇది కూడా అన్ని భాషల్లో నిర్మితం కావడం,ఇందులో అమితాబ్ బచ్చన్,కిచ్చా సుదీప్ తమన్నా,నయన తార వంటి తారలు ఇందులో నటించడమే కాకుండా,ఈ సినిమాలోని అంశము కూడా పాన్ ఇండియా కి సంబంధించినది కావడం,అంతే కాకుండా చిరంజీవికి తెలుగు భాషతో సమానంగా,తమిళ్, కన్నడ ,హిందీ లో అభిమానులు ఉండడం దీనికి కారణం గా చెప్పవచ్చు.ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి సినిమా గురించి చెబుతూ తనకు భగత్ సింగ్ పాత్ర చేయాలని ఉండేదని అయితే అనేక కారణాల వల్ల చేయలేక పోయానని,ఇక ఇప్పుడు చేస్తే తనకు సెట్ కాదని అనుకుంటుండగా తనకు సరిగ్గా సరిపోయే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అన్నట్టు ఈ ఇంటర్వ్యూ కోసం చిరు మేక్ ఓవర్ చూసి అందరూ ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు.ఎందుకంటే 64 ఏళ్ల వయసులో చిరంజీవి 40 ఏళ్ళ వ్యక్తి లాగా ఉన్నాడు మరి.

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల

ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

Monday, August 5, 2019

ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కొడుకు కరణ్ డియోల్ హీరో గా "ఫల్ ఫల్ దిల్ కే పాస్ " -టీజర్


 బాలీ వుడ్ హీ మాన్ గా పిలువ బడే super star "ధర్మేంద్ర ". పాత తరం హీరోలలో అందం తో పాటు సూపర్ ఫిజిక్ ఉన్న ఏకైక హీరో ధర్మేంద్ర.అలాంటి ధర్మేంద్ర కొడుకులు ఇద్దరూ సన్నీ డియోల్ ,బాబీ డియోల్ లు హీరో లుగా సక్సెస్ అయ్యారు.ముఖ్యంగా ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ సూపర్ స్టార్ క్రేజ్ ను సంపాదించాడు.ఇప్పుడు అతని కొడుకు కరణ్ డియోల్ హీరోగా పరిచయం చేస్తూ తనే దర్శకత్వం చేస్తున్న సినిమా "ఫల్ ఫల్ దిల్ కే పాస్" టీజర్ విడుదల చేశారు .ఒక సారి చూసినట్లయితే కరణ్ డియోల్ ఇంకా లేతగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది హీరొయిన్ సాహేర్ బామ్బా పరవాలేదు. ఈ సినిమా కి నిర్మాతలుగా సన్నీ మరియు జీ స్టూడియోస్.ఒక్క సారి టీజర్ చూడండి.శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
శర్వానంద్ హీరో గా కాజల్ , కల్యాణి ప్రియ దర్శన్ హీరొయిన్ లు గా "స్వామి రారా " ఫేం  సుధీర్ వర్మ దర్శకత్వం లో  pdv ప్రసాద్  సమర్పిస్తున్న  చిత్రం "రణరంగం " ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్ చాలా కీలకంగా ఉండేలా ఉండి.బహుశా శర్వా ఇందులో ద్విపాత్రాభినయం అయి ఉంటుంది.ఈ సినిమా లో కల్యాణి ప్రియదర్శన్ చాలా  క్యూట్ గా చూపించారు.  సుదీర్ వర్మ గత చిత్రమ్ కిర్రాక్ పార్టీ ఆవరేజ్ గా ఆడింది. ఈ చిత్రానికి మ్యూజిక్ ప్రశాంత్ పిళ్ళై .సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది.

ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
అడవి శేష్ ఆలోచనలు ,సినిమాలు ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి.ఇంతకు ముందు తను నటించిన సినిమాలు ,ఈ విషయాన్ని మనకు తెలియ జేస్తాయి. తన మొదటి సినిమా కర్మ నుండి  ఈ మధ్యనే సూపర్గూ హిట్ఢ అయిన గూఢ చారి వరకు మనకు అడవి శేష్ సినిమాలు భిన్నంగా అనిపిస్తాయి.ప్రస్తుతం వెంకట్ రాం జీ అనే కొత్త దర్శకుడి తో pvp సంస్థ వారు నిర్మించిన "ఎవరు " సినిమా  ట్రైలర్ ని చూస్తే కూడా మనకు ఆ విషయం స్పష్టమవుతుంది.నిజంగా ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉండి సినిమా పై అంచనాలను పెంచింది.ట్రైలర్ లోనే రెజీనా నటన ఎంతో ఆకట్టుకోగా ఇక సినిమాలో ఇంకా బాగుంటుందని అర్థమవుతుంది.  నవీన్ చంద్ర కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.మర్డర్,మిస్టరీ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ కి సంగీతం  శ్రీ చరణ్.

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల


బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్Friday, August 2, 2019

-

బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు


పట్టువదలని విక్రమార్కుడిలా హిట్టు కోసం ప్రయత్నిస్తున్న బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నిన్న విడుదల అయిన రాక్షసుడు మూవీ తో ఒక సాలిడ్ హిట్టు అందుకోబోవడం కాయంగా కనిపిస్తుంది. రాక్షసుడు మూవీకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా సాగే కథనం తో తెరకిక్కిన ఈ సినిమా మంచి రివ్యూ లను పొంది, సినీ క్రిటిక్స్ ప్రశంసలను అందుకుంది. తమిళ బ్లాక్బస్టర్ రాచసన్ సినిమా కి రీమేక్ అనే విషయం విదితమే. ఈ వారం చెప్పుకో దగిన సినిమాలు లేకపోవడం రాక్షసుడు సినిమాకి కలిసి వచ్చే అంశం. 

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల
ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్యంగ్ రెబెల్ స్టార్,ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు జంటగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న  మోస్ట్ అవైటెడ్ మూవీ "సాహో".ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ వీడియో సాంగ్ ను నిన్న చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.ఈ పాట చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంగీతం సమకూర్చి న గురు రంధావా నే , తులసి కుమార్,హరిచరణ్ శేషాద్రి ల తో కల్సి ఈ పాట ను పాడారు.యూట్యూబ్ ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది.


Wednesday, July 31, 2019

నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్.ఇండియా లో బెస్ట్ డాన్సర్ ఎవరు..? అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో ముందుగా గుర్తొచ్చే పేరు హృతిక్ రోషన్.ఈ మధ్య కాలం లో హృతిక్ ని డాన్స్ లో మరిపించింది ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా టైగర్ ష్రాఫ్ అని చెప్పొచ్చు.అతనిలో హృతిక్ లాగా    కళాత్మకంగా డాన్స్ చేయడమే కాదు,హై ఎనర్జీ తో స్టెప్స్ వేయడమే కాదు,అద్భుతమైన ఆక్రోబాట్స్ కూడా చేయగలడు గ్రేట్ అథ్లెటిక్ బాడీ,ఆరు ఫలకల దేహం..వెరసి చూస్తే టైగర్ ష్రాఫ్..ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే,ఫైట్స్ చేస్తే...అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి ఒకే పాటకి డాన్స్ చేస్తే...అబ్బబ్బ...ఆ కిక్కే వేరు..ఇలాంటివన్నీ ఒకే సినిమాతో తీరబోతున్నాయి.. అదే ..."WAR" సినిమా.
యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.దీనికి సంగీతం విశాల్ -శేఖర్.వాణీ కపూర్ హీరోయిన్.
హై voltage action డ్రామా గా రాబోయే ఈ సినిమా ట్రైలర్ ని ఒక్కసారి చూడండి..