• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, July 27, 2019

అమోఘం...అవెంజర్స్ ఎండ్ గేమ్ లో టోనీ స్టార్క్ కి నివాళులు అర్పించిన డిలీటేడ్ సీన్ ఇప్పుడు వైరల్..

అవెంజర్స్ ఎండ్ గేమ్ ..అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన సినిమా ..ఈ సినిమా ని ఎంజాయ్ చేసిన వారికన్నా క్లైమాక్స్ లో ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ చని పోయే సీన్ చూసి ప్రతీ ఫ్యాన్ ఎంతో హర్ట్ అయిన మాట వాస్తవం.అయితే ఇప్పుడు ఆ సీన్ లో చివర్లో ఉండాల్సిన ఒక డిలీటేడ్ సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఈ సీన్ లో చనిపోయిన ఐరన్ మ్యాన్ కి మిగితా అవెంజర్స్ అందరూ గౌరవ సూచక నివాళి అర్పించే సీన్.అప్పుడు లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల తొలగించిన సీన్ ను ఇప్పుడు youtube లో విడుదల చేయడం తో అవెంజర్స్ ఫ్యాన్స్ మరొకసారి ఉద్వేగానికి లోనవుతున్నారు.మీరు కూడా ఒకసారి చూసి ....

9 రోజుల్లో 63 కోట్లను వసూల్ చేసిన "ఇస్మార్ట్ శంకర్".అస్సలు తగ్గడం లేదు.


ఆకలితో ఉన్న పులికి ఆహారం దొరికినట్టుగా, వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న పూరికి "ఇస్మార్ట్ శంకర్" మూవీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రూపంలో ఆయనకి ఆకలి తీర్చిందనే చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, చార్మి కౌర్ నిర్మాత గా తెరకెక్కిిన ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేని,  నభా నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ నెల 19న వర్ల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండటంతో,  తొమ్మిది రోజుల్లో 63కోట్లను క్రాస్ చేసి ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో చాలా కాలంగా వెనుక బడిపోయిన మణిశర్మ అందించిన సంగీతం సినిమాకి రిపీట్ ఆడియన్స్ ని వచ్చేలా చేస్తుంది. పూరి రాసుకున్న డైలాగులు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. పక్క మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను చేరుకునేలాగే ఉంది. ఒకరకంగా అటు హీరో రామ్  ఫ్యాన్స్ కి, ఇటు ప్రేక్షకులకి ముఖ్యంగా బీ,సీ సెంటర్ ల ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు పూరి రాసుకున్న మెమోరీ ట్రాన్స్ఫర్ , అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక చూడాలి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో..

-రత్నం..

త్వరలోనే వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ సదుపాయం:తీవ్రంగా ప్రభావితం కానున్న,పేటీఎం,గూగుల్ పే మరియు ఫోన్ పే.


త్వరలోనే ప్రముఖ మెసేజింగ్ ఆప్ వాట్సాప్ , UPI ఆధారిత మనీ ట్రాన్స్ ఫర్ విదానాన్ని తీసుకురాబోతుంది.ఈ మేరకు ఇప్పటికే దేశం లోని ఒక పది లక్షల మంది వాట్సాప్ యూజర్ల కు ఈ అవకాశాన్ని కల్పించి ,ఇది ఎలా పని చేస్తుందో పరీక్షిస్తున్నారు. అయితే కొన్ని పేమెంట్ విధానాలలో కొంత లోపం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.కాబట్టి ఈ లోపాలను ప్రస్తుతం సవరిస్తున్నట్లు  తెల్సింది.అందుకే ఈ సంవత్సరం చివరలో వాట్సాప్ పేమెంట్ విధానం అందుబాటులోకి తేబోతున్నట్లు వాట్సాప్ ఇండియా ప్రతినిధి cathart తెలిపారు.
ఫేస్ బుక్ యొక్క కంపెనీ అయిన వాట్సాప్ కి ఇండియా లో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.నీతి ఆయోగ్ సీ ఈ ఓ  అమితాబ్ కాంత్ మాటలలో చెప్పాలంటే "ఒక బిలియన్ మంది స్మార్ట్ ఫోన్ లు,అతి తక్కువ డేటా చార్జీ లు,అత్యధిక డేటా వినియోగం గల మన దేశం లో  40 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు   ఆ సంస్థకు ఇండియా  భవిషత్తు అవుతుందని తెలిపాడు.
ఈ దెబ్బతో ఇతర పేమెంట్ సంస్థలైన,పేటీఎం జీపే,ఫోన్ పే,వంటి సంస్థ లు తీవ్రంగా నష్టపోవడం ఖాయం.ఎందుకంటే వాట్సప్ వీడియో కాలింగ్ రాకముందు ,వీడియో కాలింగ్ చేయాలంటే స్కైప్ ఒక్కటే ఉండేది,ఒక్క సారి వాట్సప్ వీడియో కాలింగ్ వచ్చాక అసలు ఇప్పుడు అందరూ స్కైప్ ను దాదాపు మర్చిపోయారు.కాబట్టి వాట్సాప్ పేమెంట్ మిగితా పేమెంట్ సంస్థలకు తీవ్ర నష్టం ఖాయం.

Friday, July 26, 2019

ఆద్యంతం ఎంటర్ టెయినింగ్ గా ఉండబోతున్న నానీ "గ్యాంగ్ లీడర్": టీజర్ సూపర్ ; 3/5 రేటింగ్.నాచురల్ స్టార్  నానీ సినిమా ఓకే చేశాడంటే అందులో ఎదో సరుకు ఉంటె తప్ప ఓకే చేయడు.అతడి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు అంతే ,ఏ సినిమాకు ఆ సినిమా నే ప్రత్యేకం.ఇక ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ నానీ చిత్రం "గ్యాంగ్ లీడర్ ". మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం  టైటిల్ తో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని ప్రేక్షకులు అనుకోకూడదని ,టీజర్ లోనే సినిమా ఏంటో చెప్పేశారు. టీజర్ అద్భుతంగా ఫుల్ ఎంటర్ టెయినింగ్ గా ఉండి.నానీ ఎప్పటిలాగే కుమ్మేశాడు.విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.సంగీతం అనిరుద్ రవిచందర్ .


Wednesday, July 24, 2019

దిమ్మ తిరిగేలా బాక్సాఫీసు దుమ్ము దులుపుతున్న పూరీ "ఇస్మార్ట్ శంకర్".


ఎవరన్నారు పూరీ పనయిపోయిందని..అసలు ఈ టైం లో పూరీ నుండి ఎవరూ ఇలాంటి సినిమా ఆశించి ఉండరు.ఒకప్పుడు కేవలం "ఇడియట్","పోకిరి" సినిమాలకి యూత్ ఎంత ఊగి పోయిందో... ఇప్పుడు ఆ రేంజ్ లో .."ఇస్మార్ట్ శంకర్" దుమ్ము రేపుతుంది.అసలు నైజామ్ లోనైతే అస్సలు టికెట్ల వరద పారుతుంది.టికెట్ ల కోసం ఇంకా ఎగబడుతున్నారు.రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా..కేవలం 6 రోజులలో 56 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.పూరీ జగన్నాథ్ డైలాగులకి జనాలు పిచ్చెక్కి పోతున్నారు. ఇంకొక్క విషయం చెప్పుకోవాలి ఇక్కడ..ఈ సినిమాలో మణిశర్మ సంగీతం లేకపోతే ఈ సినిమా హిట్ అయ్యేదేమో కానీ ...ఇంతలా సూపర్ డూపర్ హిట్ అయ్యేది మాత్రం కాదు.. ఏదేమైనా..రామ్ ఎనర్జీ పీక్స్ లో చూపించిన పూరీ కి మరపురాని విజయం దక్కింది.చాలు పూరీ మరో 20 ఏళ్ల వరకు తిరుగు లేదిక... 

Sunday, July 21, 2019

అవతార్ రికార్డ్ ను బద్దలు కొట్టిన “అవెంజర్స్ ఎండ్ గేమ్”: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లుఇట్స్ అఫీషియల్ ...మొన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు సాధించిన చిత్రం ఏది అంటే జేమ్స్ క్యామెరాన్  విజువల్ వండర్ “అవతార్ “ అని చెప్పే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ రికార్డును మార్వెల్ మాగ్నం ఓపస్ “అవెంజర్స్ ఎండ్ గేమ్” బద్దలు కొట్టింది.”అవతార్ “ గతం లో 2.778 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేయగా , “అవెంజర్స్ ఎండ్ గేమ్” 2.789 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.గత 22 ఏళ్ళు గా జేమ్స్ కామెరూన్ సినిమాలు రెండు అగ్ర స్థానం లో ఉండగా (మొదట టైటానిక్ తర్వాత అవతార్) ఇప్పుడు ఆ రికార్డును “అవెంజర్స్ ఎండ్ గేమ్” అధిగమిచింది .అయితే డైరెక్ట్ రిలీజ్ లో ఇది సాధ్యం కాలేదు,అందుకే “అవెంజర్స్ ఎండ్ గేమ్” లో రెండు పోస్ట్ క్రెడిట్ సీన్ లు ఆడ్ చేసి మళ్ళీ విడుదల చేయడం తో ఇది సాధ్యమయ్యింది.