• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Wednesday, June 5, 2019

రోహిత్ సెంచరీ,తొలి మాచ్ లో దక్షిణాఫ్రికా పై భారత్ విజయం : క్రికెట్ ప్రపంచ కప్


సౌతాంఫ్టన్: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేయడం తో   దక్షిణాఫ్రికా తో జరిగిన     ప్రపంచ కప్
మొదటి లీగ్ మాచ్ లో భారత్ శుభారంభం చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ప్రతిభ తో 9 వికెట్ల నష్టానికి కేవలం 227 పరుగులు చేయ గలిగింది.భారత్ బౌలర్ల లో యజువేంద్ర చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టగా,భుమ్రా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ లను కట్టడి చేశాడు.మిగితా బౌలర్లు కూడా సహకారాన్ని అందించారు. నిజానికి దక్షిణాఫ్రికా ఇంకా తక్కువ స్కోరుకే ఆలౌట్ కావాల్సింది.కానీ టైలెండర్లు పోరాడటం తో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.


అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ శిఖర్ ధావన్ (8)వికెట్ ను  తొందరగానే కోల్పోయినా, కే ఎల్ రాహుల్ ,కోహ్లీ , ధోనీ ల సహాయంతో రోహిత్ శర్మ భారత్ ను గెలిపించాడు. అతడు 144 బంతుల్లో 122 పరుగుల(13 ఫోర్లు,3 సిక్స్ లు) తో నాటౌట్ గా నిలిచాడు. భారత్ నాలుగు వికెట్లు మాత్రమే  కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
స్కోర్లు:
దక్షిణాఫ్రికా బ్యాటింగ్:
భారత్ బౌలింగ్:

భారత్ బ్యాటింగ్:


Visit for more updates
www.thribhuavanavijayam.com

Monday, June 3, 2019

హాట్ ఫేవరేట్ ఇంగ్లాండ్ కు షాకిచ్చిన పాక్:ఇంగ్లాండ్ ఓటమి:క్రికెట్ ప్రపంచ కప్

ప్రపంచ కప్ లో నిన్న జరిగిన లీగ్ మాచ్ లో పాకిస్థాన్ జట్టు,ఇంగ్లాండ్ ను ఓడించింది.ప్రపంచ నంబర్ వన్ జట్టు మరియు టోర్నీ లో హాట్ పేవరేట్ అయిన ఇంగ్లాండ్ ,సొంత గడ్డ పై ఓడిపోయింది.పాక్ బౌలర్లు తమ భారీ స్కోరు 348 ని కాపాడు కోవడానికి శ్రమించాల్సి వచ్చింది.తొలుత బ్యాటింగ్ చెందిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్ల లో 348 పరుగులు చేయగా ,ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక 334 పరుగులకే       చతికిల పడింది. పాక్ జట్టులో హఫీజ్ 84,బాబర్ 63,కెప్టెన్ సర్ఫరాజ్ 55 లు   రాణించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 107, జాస్ బట్లర్ 103 సెంచరీలు చేసినప్పటికీ రన్ రేట్ లో వెనకబడి 14 పరుగుల తేడా తో ఒడి పోయింది.
మాన్ ఆఫ్ ద మాచ్ మొహంమ్మద్ హఫీజ్

Sunday, June 2, 2019

సౌతాఫ్రికా పై బాంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం : క్రికెట్ ప్రపంచ కప్



ప్రపంచ కప్ 2019 లో నిన్న ఓవల్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదర్శన తో పెద్ద జట్టు అయిన సౌతాఫ్రికా పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా బంగ్లా బ్యాట్స్ మన్  లను కట్టడి చేయలేక పోయింది.బంగ్లా దేశ్ బ్యాట్స్ మన్ సమిష్టి గా ఆడి 50 ఓవర్ల లో 6 వికెట్లు నష్టపోయి   330  పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లా టీమ్ కి ఇదే అత్యధిక  వన్డే టీమ్ స్కోర్.
బంగ్లా బ్యాట్స్ మన్ ల లో షకీబల్  హసన్ 75 ,ముష్పికర్ 78,మహమ్మదుల్లా 46 నాటౌట్ లు రాణించారు.అనంతరం బ్యాటింగ్  కి దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 309 పరుగులు ఆలౌట్ అయింది. కెప్టెన్ డూప్లెసిస్ 65,మార్క్ రామ్ 45,డుమినీ 45 పరుగులు చేశారు.బంగ్లా బౌలర్ల లో ముస్తాఫిజుర్ 3,  సైఫుద్దీన్ 2 వికెట్లు తీశారు. మాన్ ఆఫ్ ద మాచ్ - షకీబల్ హసన్.