• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, June 1, 2019

న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి:క్రికెట్ వరల్డ్ కప్


సోఫియా గార్డెన్స్: ప్రపంచ కప్ లీగ్ మాచ్ లో నిన్న ఇక్కడ,         న్యూజిలాండ్ తన ఫాస్ట్ బౌలింగ్ తో శ్రీలంక ను కుప్ప కూల్చింది. శ్రీలంక బ్యాట్స్ మన్ ల లో ఓపెనర్ డిముక్ కరుణ రత్నే  52 పరుగులతో   నాటౌట్ గా నిలిచాడు.న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ,3, డీ గ్రంధమ్ 3 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ శ్రీలంక ను 136 పరుగులు ఆలౌట్ చేయగా,అనంతరం బ్యాటింగ్ లో వికెట్లేమీ నష్టపోకుండా కేవలం  ..ఓవర్లలో ఛేదించింది. గుప్తిల్ 73 నాటౌట్     మన్రో 58 నాటౌట్ లు రాణించారు.  మాన్   ఆఫ్ ద మాచ్ హెన్రీ.రేపే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2019 పరీక్షదాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ లు రేపు అంటే జూన్ 2 న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష రాయబోతున్నారు.ఈ పరీక్ష ను దేశ వ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష IAS,IPS వంటి ఉద్యోగాలతో పాటు,ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్ష కు కూడా ఉమ్మడి ప్రిలిమ్స్ పరీక్ష.దేశం లోని 72 నగరాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.  ఈ సంవత్సరం 896 పోస్టుల ను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.ఈ పరీక్ష 3 దశలుగా ఉంటుంది.1.ప్రిలిమ్స్ 2. మెయిన్స్ 3. ఇంటర్వ్యూ.
ప్రిలిమ్స్ లో రెండు పేపర్లు ఉంటాయి.అవి
ఉదయం : జనరల్ స్టడీస్ మధ్యాహ్నం: సి-సాట్
 ఈ సందర్బంగా UPSC అభ్యర్థులకు  కొన్ని ముఖ్యమైన సూచనలను విడుదల చేసింది.
1.పరీక్ష కేంద్రానికి గంట సమయం ముందుగా చేరుకోవాలి.
2.ఈ పరీక్ష కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అందరికీ ఏప్రిల్ 30 వ తేదీన e-admit card(హాల్ టికెట్) లను వెబ్ సైట్ లో కమిషన్ ఉంచింది. వీటిని అభ్యర్థులు తమ వెంట పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి.
3.అంతే కాకుండా అభ్యర్థి తన యొక్క ఏదేని ఒక  ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా తీసుకు వెళ్ళాలి.
4.ఒక వేళ       e-admit card(హాల్ టికెట్) పై   అభ్యర్థి ఫోటో  లేదా signature సరిగా ప్రింట్ కాకపోతే ,అభ్యర్థి రెండు ఫోటోలను తమ వెంట తీసుకు వెళ్ళాలి.(రెండు సెషన్ లకు)
5.అభ్యర్థులు ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ పరికరాలను(సెల్ ఫోన్,డిజిటల్ వాచ్ మొదలగునవి)తమ వెంట తీసుకు వెళ్ళ రాదు.
6.సాధారణ వాచ్ లు అనుమతించబడును.

మరిన్ని updates కోసం visit చేయండి
www.paatshaalaindia.blogspot.com

Friday, May 31, 2019

సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరూ.."లో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.


సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరూ.." సినిమా లో ఒక కీలక మైన పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తున్నారు.ఈ విషయాన్ని విజయశాంతి స్వయంగా తెలియజేశారు.ఆమె మాట్లాడుతూ "నా మొదటి  9 సినిమాలు తమిళ సినిమాలు,కానీ నేను నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారితోనే చేశాను.ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండటం వల్ల సినిమాలకి దూరంగా ఉన్న నేను,మళ్లీ నా రెండో ఇన్నింగ్స్ కాకతాళీయంగా, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు తో నే ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.ఇప్పటి వరకు 182 సినిమాల్లో నటించిన నేను ,ఎంతో అంకితభావంతో పని చేశాను,ఇక ముందు కూడా అలాగే పనిచేస్తాను" అని తెలిపారు.కాగా మహేష్ బాబు బాల నటుడిగా విజయ శాంతి తో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెల్సిందే. యిప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి కలిసి నటిస్తున్నారు. నిజంగా ఇది సినీ అభిమానులకి ఎంతో ఆనంద దాయకం.ఈ కాంబినేషన్ వల్ల సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.తెలుగు సినీ చరిత్రలో అగ్రగణ్యులయిన నటీ మణుల్లో,భానుమతి,సావిత్రి గార్ల తర్వాత ఆ స్థాయి ని అందుకున్న ఏకైక నటి విజయశాంతి మాత్రమే.ఈ కాంబినేషన్ ని సెట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావి పూడి కి నిజంగా థాంక్స్ చెప్పాలి,ఎందుకంటే ఎంతో ప్రతిభగల్గిన నటి అయిన విజయశాంతి లాంటి నటీ మణులు ఈ కాలం లో సినిమాలకు దూరంగా ఉండడం నిజంగా లోటుగా ఉండేది.ఇప్పుడు ఆ లోటు తీరింది.ఇక నుండి మంచి మంచి పాత్రల తో ప్రేక్షకులను విజయశాంతి అలరించాలని కోరుకుందాం.
All the best Vijayashanthi గారు.
త్రిభువనవిజయం. కామ్

తొలి మాచ్ లో వెస్టిండీస్ పై భారీ ఓటమి పాలైన పాకిస్థాన్: వన్డే ప్రపంచ కప్ 2019


నాటింగ్ హం: వరల్డ్ కప్ 2019 టోర్నీ ని పాక్ పేలవంగా ప్రారంభించింది.ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన తొలి లీగ్ మాచ్ లో కేవలం 27.4 ఓవర్ల లో 105 పరుగులకే కుప్ప కూలింది.అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 13.4 ఓవర్ల లో 108 పరుగులు చేసి విజయం సాధించింది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ,పాకిస్థాన్ బ్యాట్స్ మన్ను ముప్పతిప్పలు పెట్టింది.విండీస్ బౌలర్ల బౌన్స్ బౌలింగ్ కి పాక్ బ్యాట్స్ మన్ హడలి పోయారు.పాక్ జట్టు లో బాబర్ ఆజం 22,ఫకర్ జమాన్ 22 లు మాత్రమే  కొంత సేపు విండీస్ బౌలింగ్ ను తట్టుకోగలిగారు.చివర్లో వాహబ్ రియాజ్ ధాటిగా ఆడడం తో స్కోర్ 100 పరుగుల ను దాటగలిగింది.అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ ,గేల్ 34 బంతుల్లో 50,పూరన్ 19 బంతుల్లో34 నాటౌట్ లు రాణించడంతో విండీస్ కేవలం 13.4 ఓవర్ల లొనే గెలుపొందింది. పాకిస్తాన్ కు వరల్డ్ కప్ లో ఇది రెండవ స్వల్ప స్కోర్.ఈ మాచ్ లో క్రిస్ గేల్ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ లు(40) నమోదు చేసిన బ్యాట్స్ మన్ గా  రికార్డు సృష్టించాడు.2 వ స్థానం ఏబీ డివిలియర్స్( 37).

పాకిస్థాన్:
వెస్టిండీస్:Thursday, May 30, 2019

మహేష్ బాబు,అనిల్ రావి పూడి దర్శకత్వంలో రానున్న సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మహేష్- "సరి లేరు నీకెవ్వరు".


సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 వ చిత్రం అనిల్ రావి పూడి దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. ఇందులో రష్మిక మండన హీరోయిన్.   ఈ రోజు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా, మహేష్ బాబు అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ అర్ధరాత్రి తన 26 వ సినిమా "సరి లేరు నీకెవ్వరూ" టైటిల్ పోస్టర్ ని విడుదల చేశాడు.ఈ సినిమా ని దిల్ రాజు,అనిల్ సుంకర మరియు మహేష్ బాబు లు ముగ్గురు కల్సి నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని రూమర్లు వచ్చాయి.కానీ ఈ టైటిల్ పోస్టర్ ని చూస్తే ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.F2 తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావి పూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా రాబోయే 2020  సంక్రాంతికి  విడుదల కానుంది.

తొలి మ్యాచ్ లో ఓడిన దక్షిణాఫ్రికా:ఇంగ్లాండ్ చేతిలో చిత్తు


ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బోణీ చేసింది.రెండు బలమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్ ,నువ్వా నేనా అన్నట్టు ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ ఐంది.ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ,దక్షిణాఫ్రికా ను మట్టి కరిపించింది.తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్ లలో   8 వికెట్ల నష్టానికి   311 పరుగులు చేసింది.ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ లలో బెన్ స్టోక్ 89 (79 బంతుల్లో ),మోర్గాన్ 57,జేసన్ రాయ్ 54, కెప్టెన్ రూట్ 51 పరుగులు చేసి భారీ స్కోరు ను అందించారు.అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 38.5 ఓవర్లలో ఆల్ అవుట్ ఐంది.డికాక్ 68,డుసెన్ 50 పరుగులతో రాణించారు.ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ (3/27) ,ఫ్లంకెట్ 2/37 ,స్టోక్స్ 2/12 లు బంతి తో రాణించారు.అద్భుత ఆల్ రౌండ్ నైపుణ్యం ప్రదర్శించటమే కాకుండా ,ఒక అద్భుత క్యాచ్ అందుకున్న బెన్ స్టోక్స్ కి "మాన్ ఆఫ్ ద మాచ్ " అవార్డు లభించింది.

క్రికెట్ ప్రపంచ కప్ మొదలు :టోర్నీ పూర్తి షెడ్యూల్ మీ కోసం

ప్రపంచ క్రికెట్ అభిమానుల పండగ , ICC -వరల్డ్ కప్ 2019 నిన్న లండన్ లో ఘనంగా ప్రారంభమయ్యింది.మే 30 నుండి ప్రారంభమయిన ఈ మెగా టోర్నీ జూలై 14 వరకు జరుగనుంది.దీనిని ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డ్ లు నిర్వహిస్తున్నాయి.కాగా ఈ టోర్నీ లో మొదటి మ్యాచ్ ,ఇంగ్లాండ్ -ద .ఆఫ్రికా ల మధ్య జరుగుగా,ఫైనల్ జూలై 14 న జరుగుతుంది.భారత్ మొట్ట మొదటి మ్యాచ్ జూన్ 5 న ద.ఆఫ్రికా తో తలపడుతుంది.వామప్ మ్యాచ్ లలో ఒక మ్యాచ్ ఓడినా,రెండో మ్యాచ్ లో పుంజుకుని ఇండియా గాడిలో పడింది.అయితే ఈ టోర్నీ లో ప్రస్తుతానికయితే ఇంగ్లాండ్ హాట్ ఫేవరైట్ గా ఉంది.కాగా ఆస్ట్రేలియా ,ఇండియా లు కూడా ఈ రేసులో ఉన్నాయి.ఈ టోర్నీ షెడ్యూల్ ఇలా ఉంది. 

నేడు ఒకే రోజు విడుదల కానున్న 4 కొత్త సినిమాలు


ఈ వారం ఒకే రోజు 4 ప్రముఖ చిత్రాలు విడుదల కానున్నాయి. శ్రీ రాఘవ దర్శకత్వం లో    సూర్య , సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్ లు  నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ "NGK" , ట్రైలర్ తో TFI లో సంచలనం సృష్టించిన "ఫలక్ నూమా దాస్ " సినిమా, ప్రభు దేవా ,తమన్నా ల "అభినేత్రి2" , మరియు ఇంగ్లీష్ డబ్డ్ మూవీ "గాడ్జిల్లా
2 " లు విడుదల కానున్నాయి.వీటిలో సూర్య "NGK" సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో సూర్య "యువ " తర్వాత మళ్ళీ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు.అదే విధంగా "ఫలక్ నూమా దాస్ " సినిమా కూడా .ఈ  నగరానికి ఏమైంది ఫేం విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు.అంతే కాకుండా దీనిని సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు.  దీని పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.