• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, April 27, 2019

కళ్ళు చెదిరే లా అవెంజర్స్ ఎండ్ గేమ్ తొలి రోజు ప్రపంచ వ్యాప్త వసూళ్లు


మార్వెల్ సినిమాటిక్  యూనివర్స్  (MCU) సంస్థ నుండి వచ్చిన 22 వ సినిమా "అవేంజర్స్ ఎండ్ గేమ్".ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది.(చైనా లో రెండు రోజులు ముందే విడుదల అయింది.) తొలి రోజు ఈ సినిమా ఇంతకు ముందు సినిమాల కలెక్షన్ల రికార్డు ను బద్దలు కొడుతూ 1186 కోట్ల వసూళ్లను సాధించింది.వీటికి తోడు చైనా లో మొదటి రోజు కలెక్షన్లు కలుపుకుని మొత్తం సుమారు రూ. 1900 కోట్లు  వసూళ్లు సాధించింది.
ఇక ఇండియా లో ఈ సినిమా తొలి రోజు 53 కోట్ల షేర్ ను 63 కోట్ల గ్రాస్ ను సాధించి,అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీ గా రికార్డుల్లోకి ఎక్కింది.
తొలి వారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000 కోట్ల రూపాయలను(800 మిలియన్ డాలర్స్) వసూల్ చేయబోతుందని అంచనా.అదే విదంగా ఇండియా లో సుమాయారు 400 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా.


మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

Thursday, April 25, 2019

ఒక్క రోజు లొనే 750 కోట్ల వసూళ్లు:'అవెంజర్స్ ఎండ్ గేమ్' నేడు భారత్ లో విడుదల .


అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. The Most awaited మూవీ 'అవేంజర్స్:ఎండ్ గేమ్'  చైనా లో రెండు రోజుల ముందే విడుదల అయ్యింది.అక్కడ తొలి రోజే 750 కోట్ల రూపాయలు(106 మిలియన్ డాలర్స్) వసూల్ చేసి చైనా లో తొలి రోజు వసూళ్ల రికార్డ్ ను బద్దలుకొట్టింది.ఇంతకు ముందు చైనా లో ఆ దేశ చిత్రం Monster Hunt2 పేరిట ఉండేది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా మరియు భారత్ లో ఈ సినిమా నేడు అంటే ఏప్రిల్ 26 న విడుదల కానుంది.భారత్ లో హిందీ,ఇంగ్లీష్,తెలుగు ,తమిళ ,మలయాళ  భాషల్లో  ఇది భారీ స్థాయిలో విడుదల కానుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ ల రికార్డ్ జేమ్స్ క్యామెరాన్ "అవతార్" సినిమా పేరిట ఉంది.ఈ రికార్డ్ ను "అవేంజర్స్ ఎండ్ గేమ్"బద్దలు కొట్టడం ఖాయం గా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com



Wednesday, April 24, 2019

"మహర్షి" సినిమా నుండి మరో సూపర్ సాంగ్: "పదర ,పదర పదర" విడుదల : అదరగొట్టిన శంకర్ మహదేవన్....4/5


మహేష్ బాబు "మహర్షి" సినిమా నుండి మరో సూపర్ లిరికల్  సాంగ్ ని విడుదల చేశారు.ఈ పాటను శంకర్ మహదేవన్ పాడాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాటను శంకర్ మహదేవన్ పాడాడు.దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.ఈ పాట ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఖాయం. మీరూ వినండి.


                       


మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

" అవెంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా - 24x7 ( రోజూ నాన్ స్టాప్ గా) ప్రదర్శనకి అనుమతి.


ఇప్పుడు ఎక్కడ చూసినా అవేంజర్స్ ఎండ్ గేమ్ గురించిన చర్చనే నడుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లలో ఇప్పటికే రికార్డుల ను తిరగరాసిన ఈ సినిమా మరో రికార్డ్ నెలకొల్పింది.విదేశాలలో ప్రతిరోజూ రాత్రి 12 తర్వాత కూడా (లేట్ నైట్ షో) షో లు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే మన పక్క దేశం పాకిస్థాన్ లో కూడా ఈ అనుమతి ఉంది.కానీ మన దేశం లో సెకండ్ షో నే ఆ రోజుకు చివరి షో.

అయితే ఇప్పుడు అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి వివిధ మల్టీ ప్లెక్స్ ల ఓనర్లు ప్రభుత్వానికి 24x7 ప్రదర్శనలకి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రభుత్వం దీనికి అనుమతినిచ్చింది.అంటే అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా నాన్ స్టాప్ గా షో తర్వాత షో నడుస్తుందన్న మాట.ఎందుకంటే ప్రేక్షకులు  చాలా మంది కి అడ్వాన్స్ టికెట్లు దొరక లేదు మరి. దీంతో అభిమానులు సంబర పడుతున్నారు.అయితే ఈ అనుమతి కేవలం ఇండియా ప్రధాన నగరాల లోని IMAX,4D థియేటర్లలో మాత్రమే.
దేశం లోని అతి పెద్ద మల్టీ ప్లెక్స్  సంస్థ ప్రదర్శన వివరాలు













మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

Tuesday, April 23, 2019

మహర్షి నెక్స్ట్ లిరికల్ సాంగ్ : "పద పదరా"రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల

మహేష్ బాబు "మహర్షి" పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు విడుదల చేసిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.మొన్న విడుదల చేసిన "ఎవరెస్ట్ అంచున" పాటకి అనూహ్యమైన స్పెన్షన్ వచ్చింది.ఇక రేపు సాయంత్రం 4 గంటలకి విడుదల చేయబోయే పాట..శంకర్ మహదేవన్ పాడినది. "పద పదరా" పల్లవితో మొదలవుతుంది. ఈ పాట లో మహేష్ బాబు నాగలి తో పొలం దున్నుతూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంది.ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ కాగా,దర్శకుడు వంశీ పైడిపల్లి.




దుమ్ము రేపుతున్న సల్మాన్ ఖాన్ "భారత్ " ట్రైలర్: Salman Khan | Katrina Kaif

సల్మాన్ ఖాన్ "భారత్ " ట్రైలర్ దుమ్ము రేపుతుంది.కత్రినా కైఫ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 1947 సంవత్సరం నుండి 2010 వరకు ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనల సమాహారం ఈ సినిమా.ఇందులో సల్మాన్ ఒక నేవీ ఆఫీసర్ గా ,ఒక గని కార్మికుడుగా,ఒక సర్కస్ లో షో మ్యాన్ గా,దేశ భక్తుడు గా , వివిధ పాత్రలలో కనిపిస్తాడు.సల్మాన్ కత్రినా ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. జాకీ ష్రాఫ్ ,సునీల్ గ్రోవర్ ,దిశా పటాని,నోరా ఫథెహ్ లు ఇతర ముఖ్య పాత్రధారులు.  జూన్ 5 న  ఈద్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కి దర్శకుడు అలీ అబ్బాస్ జఫార్ . గుల్షన్ కుమార్ & T- సిరీస్  సమర్పణ లో ,సల్మాన్ ఖాన్ మరియు రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్  ఫిల్మ్  పతాకం పై ,అతుల్ అగ్నిహోత్రి ,అల్వీరా ఖాన్ అగ్నిహోత్రి ,భూషణ్ కుమార్ & కిషన్ కుమార్ లు నిర్మాతలు గా ఈ సినిమా తెరకెక్కుతుంది.



జేసన్ స్టాథం ,డ్వేన్ జాన్సన్( ద రాక్ ) ల : "హాబ్స్ & షా " ట్రైలర్ (ఫాస్ట్ & ఫ్యూరియస్ సమర్పణ లో)


ఇప్పటి వరకు 8 వచ్చిన ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్ లోని పాత్ర లను హీరోలుగా చూపిస్తూ వస్తున్న ఆక్షన్ ,కామెడీ చిత్రం "హాబ్స్ & షా ".ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చాలా funny గా మంచి ఆక్షన్ ఎపిసోడ్స్ తో అలరిస్తుంది .ఇందులో హాబ్స్ గా ద రాక్(డ్వేన్ జాన్సన్ ) మరియు 'షా' గా జేసన్  స్టాథంలు నటించారు.ఇప్పటివరకు వచ్చిన 8 భాగాలు 5 బిలియన్ డాలర్లను వసూలు చేయగా ,వాటికి అదనంగా ఈ తొమ్మిదవ భాగం ఎంత చేస్తుందో చూడాలి.ఇది ప్రధానంగా , లాస్ ఏంజెల్స్ నుండి లండన్ వరకు,  చెర్నోబిల్ మరియు అమెరికన్ సమోవా  వరకు ప్రధానంగా సాగుతుంది.దీనికి డైరెక్టర్ డెడ్ పూల్ 2 ని డైరెక్ట్ చేసిన David Leitch.