• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, April 6, 2019

RRR మూవీ నుండి తప్పుకున్న హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ .


 SS రాజమౌళి   దర్శకత్వంలో ,రాంచరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా నటిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ "RRR" .ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ కు జోడీ గా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు.రామ్ చరణ్ కి జోడీ గా ఆలియా భట్ ని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకుంది. ఈ విషయాన్ని  RRR చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.తప్పనిసరి పరిస్థితుల్లో డైసీ ఎడ్గర్ జోన్స్ RRR చిత్రం నుండి తప్పుకుంది అని ఆ చిత్ర యూనిట్ తెలిపింది.

మరో వైపు స్వయంగా డైసీ ఎడ్గర్ జోన్స్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తను ,తప్పనిసరి పరిస్థితుల్లో RRR మూవీ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపింది.RRR అద్భుతమైన స్క్రిప్ట్ అని,దీనిని మిస్ చేసుకోవడం బాధాకరమని,ఇందులో తన పాత్ర చాలా మంచి పాత్ర అనీ,నా స్థానం లో ఎవరు నటించినా,వారికి మంచి పేరు రావడం ఖాయం అనీ వారికి నేను స్వాగతం పకుకుతానని తెలిపింది.


మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com


ఉగాది సందర్భంగా మహర్షి టీజర్ విడుదల: ఫాన్స్ కి పండగ


ఉగాది పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ చిత్రం "మహర్షి" చిత్ర యూనిట్  చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ అభిమానులకు పండగే.ఇందులో మహేష్ పూర్తిగా కొత్తగా ఉన్నాడు.ఒక బిలియనీర్ అని తెలుస్తుంది.ఓటమి ఎరుగని ధనవంతుడు గా మహేష్ పాత్ర ఉంది.కొద్దిగా శ్రీమంతుడు ఛాయలు కనిపిస్తాయి.అయినా పూర్తిగా లావిష్ గా ,ఒక కొత్త మహేష్ బాబు మనకి కనిపిస్తాడు.ఈ టీజర్ ని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఖాయం.మీరు కూడా ఒకసారి చూడండి.

మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు ప్రతిరోజు   విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

Friday, April 5, 2019

వెంకీ,చైతూ ల "వెంకీ మామ" ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరింది.వెంకటేష్ ,నాగ చైతన్య లు హీరో లుగా నటిస్తున్న చిత్రం "వెంకీ మామ".సురేష్ ప్రొడక్షన్స్ pvt లిమిటెడ్ పతాకం పై KS రవీంద్ర(బాబీ-'జై లవ కుశ' ఫేమ్)  దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ,ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేశారు.ఈ పోస్టర్ లో వెంకీ,చైతూ లిద్దరూ ధాన్యపు బస్తాల పైన పొలం పక్కన కొంచెం మాస్ ,కొంచెం క్లాస్ లుక్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళ పక్కనే అరటి గెల,వెనకాల గుడి ఇవన్నీ మంచి VILAAGE ఫీల్ ని కల్గిస్తున్నాయి. ఈ ఉగాది సందర్భంగా "వెంకీ మామ" టీమ్ కి 'త్రిభువనవిజయం'
శుభాకాంక్షలు.

మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం  ప్రతి రోజూ  విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com

Thursday, April 4, 2019

ఎమ్మెస్ ధోనీ ఆల్వేస్ గ్రేట్ : ఒక స్పెషల్ ఫ్యాన్ పై ధోనీ చూపిన రెస్పాన్స్ కి ఫిదా అవుతున్న అభిమానులుఎమ్మెస్ ధోనీ ప్రపంచ cricket లో పరిచయం అక్కర్లేని పేరు. భారత కెప్టెన్ లలో అతడు సాధించిన విజయాలు మరెవరూ సాధించ లేదు.అంతే కాదు 3 ICC ప్రపంచ  టోర్నీ లు(వన్డే వరల్డ్ కప్ ,టీ 20 వరల్డ్ కప్ మరియు ICC నాక్ అవుట్ టోర్నీ ) నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోనీ ఎంతటి ఒత్తిడిలోనైనా కూల్ గా ఉండడం ధోనీ కే సాధ్యం .అంతే కాదు మైదానం బయట కూడా ధోనీ చాలా సింపుల్ గా ఉండే విధానం అతనికి ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యేలా చేసింది.ఇప్పుడు ఐపీఎల్ లో కూడా నిన్న ఒక మ్యాచ్ సందర్భంగా ఒక 60 ఏళ్ల పెద్దావిడ ,చేతి లో ఒక ప్లకార్డు పట్టుకుని ,దానిపై నేను కేవలం ధోనీ కోసం వచ్చాను అని రాసి ,ప్రదర్శించింది.దీనిని లైవ్ లో అందరూ చూశారు.అయితే ఇది చూసిన ధోనీ మ్యాచ్ అనంతరం ఆమెను కలిసి ఆమెతో ఫోటో దిగి  ఆమెను ఎంతో సంతోషపెట్టాడు.ఆమె అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించింది.ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ అవడమే కాదు,ధోనీ పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది.

https://www.youtube.com/watch?v=hzcqu3tdB60

Wednesday, April 3, 2019

RRR షూటింగ్ లో చరణ్ కి గాయం : హుటా హుటిన ఆస్పత్రికి : వాయిదా పడిన షూటింగ్ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ షూటింగ్ లో హీరో రాం చరణ్ చీలమండకు గాయం కాగా ,హుటాహుటిన ఆస్పత్రి కి తీస్కెళ్ళారు   చిత్ర   బృందం. అయితే చరణ్ కాలిని పరీక్షించిన వైద్య బృందం గాయం పెద్దది కాదు గానీ ,కనీసం 3 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారట .ఈ విషయాన్ని స్వయంగా రాం చరణ్ సోషల్ మీడియా లో ప్రకటించాడు.షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే ,వెంటనే పూణే లో మరో షెడ్యూల్ షూట్ చేయాల్సి ఉంది.ఇప్పుడు చరణ్ కి గాయం కావడం తో షూటింగ్ కి బ్రేక్ పడింది.మరో విషయం ఏంటంటే త్వరలోనే ఈ సినిమాలో  "సీత" పాత్ర దారి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలిసింది.  

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ,చరణ్ బైక్ రైడ్: బైక్ ని ఎన్టీఆర్ నే రైడ్ చేయమన్న చరణ్


'RRR' షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర లో జరుగుతుంది.ఇక్కడ భారీ షెడ్యూల్ లో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు పాల్గొనే సీన్ లను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలసి ఉన్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఇందులో చరణ్ ఒక స్కూటర్ పై ఉండగా ఎన్టీఆర్ రాగానే తనకి డ్రైవింగ్ ఇచ్చేశాడు,తారక్ స్కూటర్ స్టార్ట్ చేశాడు
     

Tuesday, April 2, 2019

"అవెంజర్స్ ఎండ్ గేమ్" లేటెస్ట్ ట్రైలర్...


"అవేంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా ఈ నెల 26 న  విడుదల కాబోతున్న సందర్బంగా ఇప్పటికే రెండు ట్రైలర్స్ విడుదల చేసిన మార్వెల్ సంస్థ ,మరో స్పెషల్ లుక్ ని విడుదల చేసింది.విడుదల చేయగానే యూట్యూబ్ ట్రెండింగ్ లో ఇది నెంబర్ వన్  గా ట్రెండ్ అవుతుంది.ఈ ట్రైలర్ లో కొత్త గా చూడాల్సింది ఏంటంటే స్పేస్ లో చిక్కుకున్న ఐరన్ మ్యాన్ బ్రతికి రావడం,పెప్పర్ పాట్స్ తో కలియడం,అలాగే పాత కోపాన్ని వదిలి క్యాప్టెన్ అమెరికా తో కలవడం చూస్తాం. అంతే కాదు,"ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎంత మందిని కోల్పోయామని కాదు,ఎంత మంది మిగిలారు అనే దాని గురించి"అనే డైలాగ్ కూడా ఐరన్ మ్యాన్ చెబుతాడు.ఇందులో క్యాప్టెన్ మార్వెల్ ,థోర్ ల సీన్ కూడా బాగుంది ...ఒకసారి చూసేయండి.

అవెంజర్స్ -ఎండ్ గేమ్ - ANTHEM by AR.REHAMAN. ****అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ నెల 26 వ తేదీన విడుదల కాబోతుంది.ఇండియా లో ప్రమోషన్స్ లో భాగంగా మార్వెల్ సంస్థ వారు AR. రెహమాన్ తో ఒక గీతాన్ని ప్లాన్ చేశారు. ఈ గీతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.దీని లో స్వయంగా AR రెహమాన్ నటించాడు.అవెంజర్స్ ఇన్ ఫీనిటీ వార్ లో స్పైడర్ మ్యాన్,డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ పాంథర్, హ్యాక్ ఐ, విజన్ ,గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ,స్కార్లెట్ విచ్  తో పాటు భూమండలం  పైన ఉన్న    సగం జనాభా  థానోస్ ,వేసిన ఒక్క చిటిక తో అంతమవుతారు.వారిని రక్షించుకోవడానికి మిగతా అవేంజర్స్ అందరూ ఏం చేయబోతారు అనేదే,అవేంజర్స్ ఎండ్ గేమ్.దీన్ని ప్రమోట్ చేయడానికి రెహమాన్ స్వరపరిచిన గీతం ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.మీరైతే ఒకసారి ఈ వీడియో చూడండి.

ఇండియా లో ఇప్పటి వరకు బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?


 ఈ వీడియో లో ఇండియా లో ది బెస్ట్ డాన్సర్స్ డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి.నిజానికి వీళ్ళంతా వాళ్ళ నృత్య ప్రతిభ తో యావత సినీ జగత్తును ,అభిమానులను అలరించారు.అందరూ బెస్ట్ డ్యాన్సర్ లే అయితే వీరిలో అందరికన్నా బెస్ట్ డ్యాన్సర్ ఎవరో మీరే తేల్చాలి......!
                         

తేజ "సీత" టీజర్ బాగుంది: ***

 'నేనె రాజు నేనె మంత్రి'       సినిమా తర్వాత డైరెక్టర్ తేజా కి ఎన్టీఆర్ బయోపిక్ తీయమని ఆఫర్ వచ్చింది.కానీ అది క్రిష్ చేతిలోకి వెళ్లి పోవడం తో,తన నెక్స్ట్ మూవీకి కొంత టైం తీలుకుని కాజల్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లు జంటగా "సీత"  తీయబోతున్నాడు.ఈ సినిమా ని AK ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకం నిర్మిస్తున్నారు. ఒక్కసారి టీజర్ చూసేయ్యండి.

         

Monday, April 1, 2019

ప్రియాంక చోప్రా తో తరువాతి సినిమా లో పని చేయ బోతున్నా: AAVENGERS-END GAME డైరెక్టర్ 'జో రుసో'ఇప్పుడు ఎక్కడ చూసినా AVENGERS-END GAME గురించే చర్చ.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్'  సినిమా తర్వాత AVENGERS-END GAME ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా యూనిట్ ప్రచారం లో భాగంగా ముంబై కి వచ్చారు.ఇక్కడ విలేఖరులు ఇండియన్ యాక్టర్స్ ల లో ఎవరితో నైనా కల్సి పని చేయాలని ఉందా అని అడగగా ,ఈ సినిమా డైరెక్టర్ జో రుసో "ప్రియాంక చోప్రా తో తర్వాతి ప్రాజెక్టు గురించి చాల సార్లు చర్చించాను.త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పాడు.ఇప్పటి వరకు 4 MCU సినిమా లకు దర్శకత్వం వహించిన రుసో ,MCU కి ఇండియా  భవిష్యత్  పెద్ద మార్కెట్ అని, తెలిపాడు.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్ సినిమాలో లాస్ట్ ఫైట్ లో  థోర్ వచ్చినప్పుడు ఇండియన్ ఫాన్స్ రియాక్షన్ చూసి తాము షాక్ కి గురయ్యామని, వాళ్ళ అరుపులు ఒక FOOT BALL స్టేడియంలో ని అరుపుల లాగా అనిపించాయని,ఎప్పుడైనా అలసిపోయినప్పుడు , ఇండియన్ ఫాన్స్ అరిచిన ఆ వీడియో చూసి మళ్లీ రిఫ్రెష్ అయ్యే వాళ్ళ మని తెలిపాడు.ఇంకా ఇండియన్ మూవీస్ లో రోబో చూశామని తెలిపాడు రుసో.అవేంజర్స్-' ఇన్ ఫీనిటీ వార్ ,అవేంజర్స్- ఎండ్ గేమ్ లను ఆంటోనీ రుసో,జో రుసో సోదరులు డైరెక్ట్ చేశారు.అవేంజర్స్- ఎండ్ గేమ ఈ నెల 26 న విడుదల అవుతుంది.ఇండియా లో ఇంగ్లీష్,హిందీ,తెలుగు,తమిళ్ భాష లలో విడుదల అవుతుంది.

" మజిలీ " ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున,వెంకి, చైతూ,సమంతా, ల స్పీచ్ లు

అక్కినేని నాగ చైతన్య,సమంత జంటగా వస్తున్న కొత్త చిత్రం ,"మజిలీ" . ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.దీనికి అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా వచ్చి ప్రసంగించారు.ఒక సారి చూడండి.

         


Sunday, March 31, 2019

"మజిలీ" ట్రైలర్ - చై-సామ్ లు వారి పాత్రల్లో జీవించారు - ***

                   

"జెర్సీ" -మేకింగ్ వీడియో సాంగ్ ..రేటింగ్ 4.5/5 ..నానీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు.


 "అణిగిమనిగిన  అలలిక ఎగసెను చూడరా..అసలు అవధులు లేవు రా" .."జెర్సీ " సినిమా యూనిట్ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో చాలా అద్భుతంగా ఉంది.70 రోజుల పాటు నానీ క్రికెట్ నేర్చుకున్న విధానం చూపించారు ఇందులో.ఇక ఈ సినిమా కోసం 2 ఇంటర్నేషనల్ స్టేడియం లను , 5 డొమెస్టిక్ స్టేడియం లను ఉపయోగించారు.ఇందులో 250 మంది ఈ చిత్రం కోసం పని చేసినట్టు ,130 మంది ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్ ,18 మంది ఇంగ్లాండ్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఈ షూటింగ్ కోసం పనిచేసినట్టు , 24 రోజులు క్రికెట్ సంబంధించిన సీన్ లు షూట్ చేసినట్టు ఈ వీడియో ద్వారా తెలిపారు.ఇక ఈ వీడియో ద్వారా, నాని ముక్కుకి  క్రికెట్ బాల్ తాకి ,గాయం అయినట్టు తెలుస్తోంది.అంతే కాకుండా ఈ సినిమా లో  ,సత్యరాజ్ మరియు  నటుడు సంపత్ లు    నటిస్తున్నట్టు తెలుస్తుంది.  బహుశా వీరు కూడా క్రికెట్ కి  సంబంధించిన పాత్రలే వేస్తున్నారేమో.ఇక ఈ వీడియో లోని పాట చాలా ఉత్తేజ భరితంగా ఉంది.ఈ పాట లో వచ్చే విజువల్స్ చూస్తుంటే నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేలాగా ఉన్నాడు.ఈ సినిమా కి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి,నిర్మాత నాగ వంశీ S. సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకం పై ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. హీరోయిన్ కొత్త అమ్మాయి శ్రద్ధా శ్రీనాథ్.   అనిరుధ్   స్వరపరిచిన   పాట గల ఈ జెర్సీ మేకింగ్ వీడియో ని కనీసం రెండు సార్లు వినండి,ఈ పాట మిమ్మల్ని వెంటాడుతోంది.