• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, March 30, 2019

అర్జున్ రెడ్డి ,ప్రీతి ని మీట్ అయ్యాడు...! వైరల్ అవుతున్న ఫోటోలు.
అదేంటి అర్జున్ రెడ్డి ప్రీతిని కలవడం ఏంటి అనుకుంటున్నారా..! అదేం లేదు,మన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ,కియార అద్వానీ కలిశారు.మరి ప్రీతి అని ఎందుకు రాశారు..అంటారా..అక్కడికే వస్తున్నాం.తెలుగు లో  బ్లాక్ బస్టర్ హిట్ అయిన "అర్జున్ రెడ్డి" ని హిందీ లో "కబీర్ సింగ్" పేరుతో  రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరో షాహిద్ కపూర్ కాగా..హీరోయిన్ ,ప్రీతి పాత్ర ను  హిందీలో కియారా అద్వానీ చేస్తోంది. ఇటీవల ముంబై లో మన విజయ్ దేవర కొండ ను చూడగానే..కియారా.. చాలా ఎక్సైట్ అయ్యి, విజయ్ తో దిగిన ఫోటో లను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ల లో షేర్ చేసి ..when preethi meets Arjun అని ,my fan girl moment అని పోస్ట్ చేసింది.ఈ ఫోటోలను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కు కూడా షేర్ చేసింది.అన్నట్టు హిందీ వెర్షన్ కి కూడా తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడు " సందీప్ రెడ్డి వంగా" నే.విజయ్ దేవర కొండ ,కియారా ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.


Friday, March 29, 2019

నితిన్ నెక్స్ట్ మూవీ భీష్మ :ముందుగా అనౌన్స్ చేసిన రష్మిక:థాంక్స్ చెప్పిన నితిన్.


 నితిన్ తన నెక్స్ట్ మూవీ ని వెంకి కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీని పేరు 'భీష్మ'.ఇది పక్కా ఔట్ అండ్ ఔట్ commercial మూవీ అని నితిన్ తెలిపాడు.ఇందులో అద్భుతమైన కామెడీ ఉంటుందని,దీనిని 5ముందుగా ప్రకటించిన రష్మిక కు థాంక్స్ అని చెప్పాడు.అయితే ఈ సినిమా కి టాగ్ లైన్ 'సింగిల్ ఫరెవర్' అని కూడా తన ట్వీట్ లో యాడ్ చేయగా,నితిన్ దీనికి స్పందిస్తూ..అనౌన్స్ చేసినందుకు థాంక్స్.కానీ మా అమ్మ నిన్ను చంపుతుంది,ఈ టాగ్ లైన్(సింగల్ ఫరెవర్) పెట్టినందుకు అని ఫన్ గా బదులిచ్చాడు.
మరో సినిమా   శ్రేష్ట్ మూవీస్ వారి    ప్రొడక్షన్ నంబర్ 6 గా రాబోతుంది అని తెలిపాడు.ఇది తన కెరీర్ లొనే చాలెంజింగ్ సినిమా అని నితిన్ తెలిపాడు.ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ తెరకెక్కిస్తుంది.2020 లో ఇది విడుదల అవుతుంది.

"కాంచన-3" ట్రైలర్-మరోసారి భయపెట్టేలా ఉంది..రేటింగ్ 3/4


 రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన గత మూడు హారర్ కామెడీ చిత్రాలు ,ముని,కాంచన,శివలింగ(కాంచన2), ల తర్వాత     వస్తున్న ఫ్రాంచైజ్    చిత్రం కాంచన 3.ఈ సినిమా కూడా హారర్ కామెడీ గా రాబోతుంది.దీనిలో లారెన్స్ ద్విపాత్రాభినయం చేయబోతున్న ట్లు తెలిపాడు.ఒకసారి ట్రైలర్ చూడండి.

Thursday, March 28, 2019

"మహర్షి" ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చోటి చోటి బాతే' వెరీ స్వీట్: రేటింగ్- 4/5సూపర్ స్టార్ మహేశ్ బాబు నెక్స్ట్ " మూవీ మహర్షి"సినిమా నుండి మొదటి సాంగ్ లిరికల్ వీడియో రూపం లో ఈ రోజు 9.00 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేశారు.ఈ పాట చాలా సింపుల్ గా ,స్వీట్ గా ఉంది.ఇక విసువల్స్ పరంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.ఈ పాట తో సినిమాలో మహేష్ బాబు(రిషి..?) ,అల్లరి నరేష్, హీరోయిన్ పూజా హెగ్డే లు క్లాస్ మేట్స్  అండ్ గుడ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది.దేవిశ్రీ మ్యూజిక్ కి తోడు ,మంచి విజువలైజేషన్ కూడా పాటను మరింత ఆకర్షణీయంగా మార్చింది.ఇక మహేష్ బాబు స్టూడెంట్ గా చాలా చక్కగా సెట్ అయ్యాడు.చాలా హ్యాండ్సమ్ గా వున్నాడు.ఈ పాట తో ఈ సినిమా పై మరిన్ని expectations పెరిగి పోయాయి. ఖచ్చితంగా అల్లరి నరేష్ ఈ సినిమా లో మంచి పాత్ర చేస్తున్నాడు అని తెలుస్తుంది.   మొత్తానికి ఈ పాట బాగుంది        ఒక్కసారి చూసి ఆనందించండి.


Wednesday, March 27, 2019

" మహర్షి " ఫస్ట్ లిరికల్ సాంగ్ 29 న విడుదల : చాలా మ్యాటర్ చెప్పేసిన పోస్టర్ : చాలా మంచి రెస్పాన్స్

"మహర్షి "  -మహేష్ బాబు కొత్త చిత్రం.   దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్-అశ్వనీ దత్ వైజయంతీ మూవీస్ మరియు pvp సినిమా వంటి అతి పెద్ద సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తూ,   వంశీ పైడి పల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో హీరొయిన్ పూజా హెగ్డే.అల్లరి నరేష్ మహేష్ కి స్నేహితుడిగా నటిస్తున్నాడు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.ఈ చిత్రం యొక్క  1st లిరికల్ సాంగ్ " చోటి చోటి బాతే...." ని ఈ నెల 29 కి విడుదల చేస్తున్నాట్టు గా ఒక పోస్టర్ విడుదల చేశారు.అయితే ఈ పోస్టర్ ఎన్నో విషయాలను చెపుతున్నట్టుగా కన్పిస్తుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండపై  హీరో మహేష్ మధ్యలో ఉండి సముద్రాన్ని చూస్తుండగా ,హీరొయిన్ ఒక వైపు చూడడం,అతని స్నేహితుడైన అల్లరి నరేష్ మరో వైపు చూడటం ఎదురుగా సముద్రం, వెనుక పచ్చికలో 3 సైకిళ్ళు మనకి కన్పిస్తున్నాయి.దీనిని బట్టి వాళ్ళు ఏదో ఒక నిర్ణయం విషయం లో మదన పడుతున్నట్టు అర్ధమవుతుంది.అంతే కాదు ఇక్కడ నరేష్ వేషం చూస్తుంటే తన ఒక పేద వాడని తెలుస్తుంది.అయితే గతం లో వచ్చిన రూమర్ల ప్రకారం మహేష్  కి అల్లరి నరేష్ బాల్య స్నేహితుడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం .ఇక హీరొయిన్ చాలా రిచ్ అని తెలుస్తుంది. అభిమానులకైతే ఈ పోస్టర్ పిచ్చిగా నచ్చుతుంది .

"మిషన్ శక్తి"- విజయవంతం. ఇది సాధించిన 4 వ దేశం భారత్:ప్రధాని హర్షం


భారత దేశ శాస్త్రవేత్తలు మరో ఘనతను సాధించారు.మన దేశ అమ్ముల పొది మరో అస్త్రం చేరింది.ఎన్నో దేశాలు సాధించలేని ఘనతను భారత్ సాధించింది. స్పేస్ లో ఉన్న ఒక శాటిలైట్ ను మిస్సైల్ తో కూల్చే, సాంకేతిక పరిజ్ఞానం ను భారత్ "మిషన్ శక్తి" పేరిట ఈ రోజు సాధించింది. ఈ మిస్సైల్ ని ASAT(Anti Satilite missile) అంటారు.పరీక్ష కోసం మన drdo శాస్త్రవేత్తలు తయారు చేసిన ఒక శాటిలైట్ ను భూమి నుండి 300 కి.మీ.ఎత్తులో, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్(వీలర్స్ ఐలాండ్) నుండి ప్రయోగించిన  మిస్సైల్ తో పేల్చేశారు.     ఈ సాంకేతికత పూర్తి స్వదేశీ సాంకేతికత. ఈ విజయం పై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు.శాస్త్రవేత్తల కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటివరకూ అమెరికా (1958), రష్యా(1964) , చైనా(2007) లు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను కూల్చివేశామని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఇండియా ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు అందరూ ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చైనా దేశం ఈ విజయం పై ఆచి తూచి స్పందించింది.ఆసియా లో రెండు దేశాలు అంతరిక్షం లో శాంతి కి కృషి చేయాలని పిలుపునిచ్చింది.


Tuesday, March 26, 2019

సూర్య కాంతం ట్రైలర్ విడుదల : ఎలా వుంది నిహారిక ?


మెగా బ్రదర్ నాగ బాబు కూతురు హీరొయిన్ గా ,రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా సూర్య కాంతం .ఈ సినిమా టైటిల్ కి పాజితివే రివ్యూస్ వచ్చాయి.నిహారిక కూడా క్యూట్ గా అనిపించింది.దీనికి నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నే సమర్పకుడు .ఈ చిత్రం  మార్చ్ 29 న విడుదల కాబోతుండ గా ,చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం నిర్వాణ  సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కింది.దీనికి దర్శకుడు ప్రదీప్ బ్రమాండం పెల్లి.    ఒకసారి  ట్రైలర్    చూసి ఆనందించండి.Written & Directed by: Pranith Bramandapally Producers - Sundeep Yerramreddy , Srujan Yarabolu , Ram Naresh Executive Producer - Raj Nihar Banner - Nirvana Cinemas DOP - Hari Jasthi Music - Mark K Robin Editor - Raviteja Girijala Art director - Avinash Kolla Lyricist - Krishna Kanth Co writer: Karthik Thupurani PRO - Vamsi Shekar Costume Designers: Ambati Bhargavi, Gauri Naidu Creative Designs: Vinci Raj Publicity Designs: Dinesh Reddy Chief Co-director: Dasam Prasad Co - Director: Ravi Sankar

Monday, March 25, 2019

చిత్రలహరి- నుండి 'గ్లాసు మేట్సు ' సాంగ్ లిరికల్ వీడియో విడుదల -రేటింగ్ 3/5

సాయిధరమ్ తేజ్ , కల్యాణి ప్రియదర్శన్ ,నివేద పేతురాజ్ లు హీరో హీరోయిన్ లుగా నటించిిిన చిత్రం "చిత్ర లహరి".సునీల్ ఇందులో కమెడియన్ గా నటిస్తున్నాడు. 'నేను శైలజ' ఫేమ్ కిశోరె తిరుమల దీనికి దర్శకుడు.కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమా లిరికల్ వీడియో ను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది.ఒక సారి చూడండి.

Movie - Chitralahari
Song - Glassmates
Music - Devi Sri Prasad

Singers - Rahul Sipligunj, Penchal Das
Lyrics - Chandrabose
Cast - Sai Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj, Sunil, Vennela Kishore, Posani Krishna Murali, Brahmaji.
Director - Kishore Tirumala
Producers - Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM)
Editor - Srikar Prasad
Cinematography - Karthik Ghattamaneni
Art Director - AS Prakash

Musician Credits
Keyboards: KP
Rhythm: Kalyan
Trumpet & Trombones: Babu
Sarangi: Manonmani
Chorus: Deepak, Shenbagaraj, Narayanan & Vignesh
Album Mixed & Mastered by A. Uday Kumar @ "Brindavan–The Garden Of
Music"
Album Recorded by A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi.
Orchestra In-Charge: Murugan
Studio Asst: Pugalendhi
Album Co-ordinator: B. Manikandan
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

X-MEN- డార్క్ ఫీనిక్స్ అఫీషియల్ ట్రైలర్---రేటింగ్-- 3/5


X-men అభిమానుల కు శుభవార్త. రాబోయే జూన్ లో X-Men డార్క్ ఫీనిక్స్ రాబోతుంది.మార్వెల్ సంస్థ దీని అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసింది.అయితే ఈ ట్రైలర్ లో వోల్వోరిన్ పాత్ర లేదు మరి మూవీ లో ఉందా లేదా ..? చూడాలి.

మన్మధుడు 2 షూటింగ్ మొదలు..అక్కినేని నాగార్జున కెరీర్ లో మన్మధుడు సినిమాకు చాలా.ప్రాముఖ్యత ఉంటుంది. విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ మాటలతో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అయింది.అంతే కాదు టెలివిజన్ రంగం లో ఇప్పటికీ దీనికి ఎంతో క్రేజ్.అలాంటి మన్మధుడు సినిమాకి సీక్వెల్ కి రంగం సిద్ధమైంది.దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.RX100 సినిమా కి సంగీతం అందించిన చేతన్ భరద్వాజ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తుంది.ఈ రోజు ముహూర్తం షాట్ కి అక్కినేని అమల క్లాప్ నివ్వగా,నాగచైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.మనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై తెరకెక్కే  ఈ సినిమా కు నాగార్జున నిర్మాత .

తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన మహేష్ బాబు @ madam tussads సింగపూర్ శాఖఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన యొక్క మైనపు విగ్రహాన్ని హైదరాబాద్   లో, మేడం టుస్సాడ్ మ్యూజియం         నిర్వాహకుల     సమక్షం  లో ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మహేష్ భార్య ,నమ్రత ,పిల్లలు గౌతమ్,సితార లు పాల్గొన్నారు. తన విగ్రహాన్ని చూసుకుని మహేష్ బాబు ఆనంద పడ్డాడు.దానితో సెల్ఫీ లు దిగాడు.మహేష్ తో సెల్ఫీ లు దిగడానికి  అభిమానులు ,రిపోర్టర్ లు కూడా ఎగబడ్డారు.మహేష్ పిల్లలు తమ తండ్రి మైనపు విగ్రహాన్ని చూసి ఆనంద పడ్డారు.


అనంతరం మహేష్ సోషల్ మీడియా లో స్పందిస్తూ తన విగ్రహాన్ని మొదట చూడగానే wow.. అని అనిపించిందని, ఇది అచ్చం తనను పోలి ఉందని..ఇంతకంటే ఎవరూ బాగా చేయలేరని,నన్ను పోలిన మరో నాతో ఫోటో దిగడం మరచిపోలేని అనుభూతి అని,తన విగ్రహాన్ని తన సొంత ఊరిలో,సొంత మనుషులు,అభిమానుల మధ్య ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చాడు మహేష్.

Sunday, March 24, 2019

కూతురు డాన్స్ కి మురిసి పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు:#సితార.ఏ తండ్రి కైనా తమ ,పిల్లలు చిన్న తనం లొనే కనబరిచే ప్రతిభా పాటవాలు ఎంతో ఆనందాన్ని కల్గిస్తాయి. దానికి సూపర్ స్టార్ లు మినహాయింపు కాదు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార చేసిన డాన్స్ కి ఎంతో మురిసి పోతూ  సోషల్ మీడియా లో   చేసిన  పోస్ట్ అందరినీ అలరిస్తుంది.ఈ వీడియో లో మహేష్ కూతురు సితార చేసిన డాన్స్ అచ్చెరువొందిస్తుంది.ఒకసారి చూసి ఆనందించండి.కే ఏ పాల్ ఫన్నీ స్పీచ్ | Trending now
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో అందరూ సీరియస్ గా ప్రచారం చేస్తుంటే ,గౌరవ కే .ఏ .పాల్ గారు తన వింత వింత మేనరిజమ్స్ తో అందరినీ అలరిస్తున్నాడు.నిన్నటి వరకు పాలకొల్లు  లో పోటీ చేస్తాను అన్న పాల్ ,ఇప్పుడు 'మనసు మార్చుకున్నాను అని ,ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ కి పోటీగా నరసాపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

పవన్ కల్యాణ్ సింప్లిసిటీ కి ..ఫిదా అవుతున్న ఫాన్స్..& సాదారణ ప్రజలు


ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో చాలా బిజీ గా ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య తీరిక వేళల్లో బస చేయడానికి టైం లేక ఎక్కడ వీలైతే అక్కడ ఆగి భోజనం చేయడం చూస్తున్నాం.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతం లో నేల పై ఒక చిన్న చాప మీద కూర్చుని ఒక మట్టి పాత్ర లో భోజనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫాన్స్ తమ హీరో సింప్లిసిటీ కి జోహార్లు చెబుతున్నారు.సామాన్య ప్రజలు కూడా ఈ ఫోటోలను ఆసక్తి గా చూస్తున్నారు.
కృష్ణా జిల్లా ప్ర‌చారంలో భాగంగా పవన్ క‌ళ్యాణ్ ,మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్ హౌస్ వ‌ద్ద కాసేపు సేద‌తీరి, ఆహారం తీసుకున్నారు. మ‌ట్టిగిన్నెలో జొన్నఅన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు.
వేప‌చెట్టు కింద కూర్చొవ‌డానికి తాటాకు చాప‌ల   కార్య కర్త లు ఏర్పాటు చేశారు. ఆ వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాదం క‌లిగించ‌డంతో  జ‌న‌సేనాని కాసేపు తాటాకు చాప‌ల‌పైనే సేద‌తీరారు.


వెంకీ కూతురు పెళ్లిలో సల్మాన్ ఖాన్ తో డాన్స్..వైరల్ అవుతున్న వీడియోవెంకటేష్ కూతురు  ఆశ్రిత  పెళ్లి నిన్న జైపూర్ లో జరిగిన విషయం తెల్సిందే.దీనికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ హాజరు కాగా, రానా ,  రామ్ చరణ్ -ఉపాసన,చై-సామ్ ల జంటలు  ,వరుణ్ తేజ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ కి      సల్మాన్ ఖాన్ కి ఎన్నో ఏళ్ల నుండి మంచి స్నేహం ఉంది.అందుకే సల్లూ భాయ్ ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. అంతే కాదు వెంకీ రానా ల తో కల్సి సూపర్ డాన్స్ కూడా చేశాడు చూడండి.


ఫోటోలు