• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, March 16, 2019

లక్ష్మీ స్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి.ఆర్జీవి హ్యాపీ


వివాదాస్పద లక్ష్మీ స్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ని ఇచ్చింది.ఈ సినిమా చంద్రబాబు ప్రతిష్ట కి భంగం కలిగించే లాగా ఉందని ఎలక్షన్ కమిషన్ కి టీడీపీ పిర్యాదు చేయగా,దీనికి ఆర్జీవి ఎలక్షన్ కమిషన్ కి వెళ్లడం వాళ్ళ హక్కు,పోరాడటం నా హక్కు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కమిషన్ ,ఈ సినిమా విడుదలకు అనుమతి నివ్వడం తో ఇక దీని విడుదలకు రంగం సిద్ధం అవుతుంది.వచ్చే వారం దీనిని విడుదల చేయబోతున్నారు.

Thursday, March 14, 2019

అన్నీ చెప్పేసిన రాజమౌళి:RRR :అల్లూరి సీత రామరాజు ,కొమురం భీమ్ ల కల్పిత కథ


అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెల్సి పోయాయి.RRR సినిమా కి సంబంధించి సినీ అభిమానులకి ఉన్న అనుమానాలన్నీ తీరి పోయాయి.సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో దాదాపు గంటకు పైగా సాగిన విలేఖరుల సమావేశంలో RRR సినిమా కి సంబంధించిన అన్ని వివరాలను చాలా ఓపికగా,చాలా వివరంగా రాజమౌళి,ఎన్టీఆర్,రాంచరణ్ ,DVV దానయ్య  లు వివరించారు.
RRR కథేంటి...?
దీనికి రాజమౌళి అద్భుతమైన సమాధానం చెప్పాడు.ఇది అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల కథ.అయితే వాళ్ళు పోరాట యోధులు ఎలా అయ్యారు అనే విషయం చరిత్రలో లేదు.దీన్ని రాజమౌళి వాడుకోబోతున్నాడు.వీరిద్దరు స్వాతంత్ర్య సమర యోధులు ఇద్దరూ ఒకే సంవత్సరంలో ఇల్లు వదిలి వెళ్లారు. అప్పుడు వాళ్ళు ఉత్తర భారత దేశానికి వెళ్తారు.అక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు.కాబట్టి రాజమౌళి ఈ కాలం లో  ఈ ఇద్దరు ఒకవేళ కలిసి ఉంటే ఎలా ఉండేది అనే కల్పిత కథ.వీళ్ళిద్దరూ తిరిగి ఇంటికి చేరి స్వాతంత్ర్య పోరాటం లో చేరడం తో కథ ముగుస్తుంది.ఇది మొత్తం కల్పిత కథ.ఉత్తర భారతదేశంలో జరుగుతుంది.
నటీ నటులు?
ఎన్టీఆర్ ఇందులో కొమురం భీమ్ పాత్రలో ,రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. వీరి తో పాటు  ఇప్పటి వరకు సముద్రఖని మాత్రమే ప్రధాన క్యారెక్టర్ పేరు బయటపెట్టారు.ఇక మరో ముఖ్య పాత్ర లో ,ఫ్లాష్ బ్యాక్ లో అజయ్ దేవ్ గన్  నటిస్తున్నాడు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే
ఆలియా భట్ -రామ్ చరణ్ సరసన సీత పాత్రలో  నటిస్తుండగా
ఎన్టీఆర్ సరసన -ఒక బ్రిటిష్  టెలివిజన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్
నటిస్తుంది.
ఇక నిర్మాత DVV దానయ్య,సంగీతం MM. కీరవాణి అనే విషయం తెలిసిందే.
బడ్జెట్ : 350 నుండి 400 కోట్లు
విడుదల: జూన్ 30, 2020.


Wednesday, March 13, 2019

అన్ని కళ్ళూ అటు వైపే :రేపే రాజమౌళి ,రామారావు,రామ్ చరణ్ ల ప్రెస్ మీట్" RRR "  ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే.ఎన్నో రూమర్లు,ఎన్నో ఊహాగానాలు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ , ఎన్నో లెక్కలు ఎవరికి తోచింది వారు,ఎవరికి తెలిసింది వారు,తెలుగు సినిమా వెబ్సైట్ ల వారు ఎన్నో కథనాలు వండి వార్చారు.ఈ మధ్య ఈ రూమర్లు సినిమా పై ప్రభావం చూపేల ,రాజమౌళి ఇమేజ్ పై ప్రభావం పడేలా ఉండడం తో ,ఇక ఆలస్యం చేస్తే బాగుండదని, భావించి మొత్తం RRR యూనిట్ రేపు 14 వ తేదీన ప్రెస్ మీట్ పెట్టబోతుంది.ఇందులో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్,రాంచరణ్ ,నిర్మాత దానయ్య అందరూ పాల్గొని అందరి అనుమానాలను నివృత్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు..1. కథ ఏ జానర్ లో ఉంటుంది. 2.హీరో ల పాత్రలు ఏంటి ?ఎలా ఉంటాయి? 3.హీరోయిన్ లు ఎవరు..? 4.ఇతర తారాగణం ఏంటి?
ప్రస్తుతం ఈ విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది.మరి రాజమౌళి ఈ విషయాలను బయట పెడతాడా? కథ ముందే చెప్పేస్తాడా..? లేక బాహు బలి  లాగే దీనికి కూడా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తాడా..?వేచి చూడాలి.ఏది ఏమైనా..రేపు RRR టీమ్ ప్రెస్ మీట్ కోసం జాతీయ మీడియా కూడా వెయిట్ చేస్తుంది అనేది వాస్తవం.

Tuesday, March 12, 2019

"F2" మొత్తం కలెక్షన్స్:బ్లాక్ బస్టర్ గా నిలిచిన- F2


విక్టరీ వెంకటేష్ కి హిట్ కరువు తీరేలా..ఒకప్పటి 'నువ్వునాకు నచ్చావ్' రేంజ్ లో ,వరుణ్ తేజ్ కెరీర్ లో మర్చి పోలేని విధంగా , దిల్ రాజు బ్యానర్ పరువు జెండాను రెపరెప లాడించే విధంగా ,అనిల్ రావిపూడి ని టాప్ డైరెక్టర్ ల లిస్టు లోకి తీసుకు
వెళ్లిన   చిత్రం  "F2". ఈ సినిమా సంక్రాంతి కి విడుదలైన ప్పుడు ఇన్ని కలెక్షన్స్ సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.బరిలో ఎంత పెద్ద సినిమాలు పోటీలో నిలిచినా అన్నీటినీ తట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ 8 స్థానం లో నిలిచింది.
మొత్తం ఈ సినిమా 81.05 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.

ఏరియాల వారిగా :
నైజాం : 22.8 కోట్లు
సీడెడ్ : 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర : 10.50 కోట్లు
గుంటూరు : 5.6 కోట్లు
ఈస్ట్ : 7 కోట్లు
వెస్ట్ : 4.3 కోట్లు
కృష్ణ : 5.2 కోట్లు
నెల్లూరు : 2.05 కోట్లు

తెలుగు రాష్ట్రాలలో మొత్తం షేర్ : 66.15 కోట్లు

ఇతర రాష్ట్రాలు : 5.60 కోట్లు
విదేశాల్లో : 9.30 కోట్లు

మొత్తం : 81.05 కోట్లు

Sunday, March 10, 2019

చెలరేగిన టర్నర్ : మొహాలీ లో 4 వ వన్డే లో టీమిండియా ఓటమి


టాస్ గెలిచి   ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్ట పోయి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.శిఖర్ ధావన్ 143(115 బంతుల్లో 18 ఫోర్లు 3 సిక్స్ లు),రోహిత్ శర్మ 95(92 బంతుల్లో 7 ఫోర్లు ,2 సిక్స్ లు ) రాణించారు.వీరిద్దరూ తొలి వికెట్ కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదే భారత్ కి రెండవ అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం.
ఆస్ట్రేలియా బౌలర్ లలో కమిన్స్ 70 పరుగులిచ్చినా 5 వికెట్లు తీయ గలిగాడు. జె.రిచర్డ్సన్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తరపున హ్యాండ్స్ కూంబ్117(105 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్స్ లు)   ఉస్మాన్ క్వాజా91(99 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు.అయితే
 'మాన్ ఆఫ్ ద మ్యాచ్' విజేత A. టర్నర్ వీరోచితంగా ఆడి కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు ,6 సిక్స్ లతో 80 పరుగులు చేసి ఆస్ట్రేలియా కి విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా కి ఇదే అత్యధిక చేజింగ్ స్కోర్.