• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Friday, February 22, 2019

కోడి రామ కృష్ణ గారి కొన్ని అత్యద్భుతమైన విజయాలు,రికార్డులు


Its very ..Sad  of  DEMISE of  KODI RAMAKRISHNA GARU
HERE ARE SOME IMPORTANT CONTRIBUTIONS OF HIM TO TFI...
1.Mangamma gari manavadu is still All Time best hit for bala krishna garu
2.Ankusham is still all time best hit for Rajashekhar garu..
3. Shathruvu &Srinivasa Kalyanam are one of the best movies of Venkatesh garu
4.Intlo ramaiah Veedhilo Krishnaiah played 500 days ,at that time ciranjeevei garu not even a Supreme hero then,he was just an upcoming hero who was playing charcters and small hero getups
5 Ammoru was industry hit then
6.Arundhathi was a trendsetter movie and still one of the best movies ever TFI produced and that film made Anushka as  RUDRAMA DEVI & DEVASENA
7.Devullu & Devi were hits only because of This legendary director...
8.PELLI movie was Super hit of its released year 1997
What an extraordinary director and actor and versatile personality like his Guru Dasari garu...Sir You may be not with us..Your movies always make you alive forever untill TFI lives..REST IN HEAVEN SIR ...SALUTE..

ప్రముఖ దర్శకుడు కోడి రామ కృష్ణ అనారోగ్యంతో మృతిప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటీన  ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.తెలుగు లో ఎన్నో మంచి సినిమాలు చేశారు.సూపర్ హిట్ సినిమాలు    "అమ్మోరు",  "అరుంధతి" ఆయన తీసినవే.ఆయన స్వర్గీయ దాసరి నారాయణరావు గారి శిష్యుడు.దాసరి గారి లాగే ఎన్నో కుటుంబ కథా చిత్రాలు తీశారు.నిజంగా ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకి తీరని లోటు.
సినీ రంగంలో కోడి రామ‌కృష్ణ‌ది 30 ఏళ్ళ ప్ర‌స్థానం. ఆయ‌న తొలి చిత్రం చిరంజీవితో చేసిన‌ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ . ఈ మూవీ అప్ప‌ట్లో 500 రోజుల‌కి పైగా ఆడింది. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా కోడి రామకృష్ణ పనిచేశారు. తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ గ‌తంలో హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంట‌నే కోలుకున్నారు. ఇప్పుడు కూడా త్వ‌ర‌గా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వ‌స్తార‌ని అనుకున్న స‌మ‌యంలో ఆయ‌న ఇక లేర‌నే వార్త తెలుసుకున్న అభిమానుల కంట క‌న్నీరు ఆగ‌డం లేదు. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో కోడి రామ‌కృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించ‌నున్నారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

ఆసలు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఇతనే....నేడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వర్ధంతి


భారత దేశపు మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వర్ధంతి నేడు.ఈ సందర్భంగా ఈ బయోపిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి ..అతని ఫోటోను ట్విట్టర్ లో పెట్టి నివాళులు అర్పించాడు.

Thursday, February 21, 2019

తప్పకుండా చూడాల్సిన ట్రైలర్ & సినిమా :కేసరి : అక్షయ్ కుమార్ వీరోచిత పోరాటాలు

చాలా రోజులైంది ఒక హిందీ సినిమా చూసి .ఈ మద్య ఇంతలా చూడాలి అనిపించినా హిందీ సినిమా బహుశా ఇదే."కేసరి"  21  మంది సిక్కు యోధులకు , 10000 మంది విదేశీ ఆక్రమణ దారులకు మధ్య జరిగే పోరాటమే ఈ  కేసరి.ఆల్రెడీ ఒక సారి సింగ్ ఈజ్ కింగ్ సినిమా లో సిక్కు వ్యక్తి గా మెప్పించిన అక్షయ్ ఇప్పుడు మరో సారి ఒక సిక్కు యోధుడిగా మన ముందుకు రాబోతున్నాడు.ధర్మా ప్రొడక్షన్  బ్యానర్ పై , అనురాగ్ సింగ్ దర్శకత్వం లో వస్తున్న "కేసరి " సినిమా లో పరినీతి చోప్రా హీరొయిన్ గా నటిస్తుంది.చాలా సహజంగా తీసిన ఈ పీరియాడిక్ డ్రామా మూవీ మార్చ్ 21 ణ విడుదల కానుంది.ట్రైలర్ ఒక్క సారి చూడండి.

అల్లాదిన్ -ట్రైలర్ - విల్ స్మిత్ జీనీ భూతం గా ... ఆసక్తికరం

  అల్లాదిన్ ఎంతో కాలంగా సుపరిచితమైన అరబ్ కథానాయకుడి పేరు.ఈ పేరు తో చాలా కథలు సినిమాలు వచ్చాయి.ఇప్పుడు మాళ్ళీ ఈ పేరు తో మూవీ వస్తుంది .ఈ సారి స్పెషల్ ఏంటంటే ఇందులో విల్ స్మిత్ జీనీ (భూతం ) గా నటిస్తున్నాడు .కాబట్టి ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఒక సారి ట్రైలర్ చూడండి. 

పాకిస్తాన్ కి సింధూ జలాలు కట్ చేసిన భారత్ : ఫస్ట్ పంచ్ పడింది.


మన దేశం పై ఉగ్రవాదులను ఎగదోస్తూ మనకు తీవ్ర నష్టాన్ని కల్గ జేస్తున్న ,పాకిస్తాన్ కి భారత్ తగిన గుణ పాఠం చ్ప్పడానికి కృత నిశ్చయించు కుంది.మొన్న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడి తో ఉలిక్కి పడ్డ భరత్ 43 మంది జవాన్ లను కొల్పొవడాన్ని తీవ్రంగా పరిగణించింది.ఎన్నో రోజుల నుండి ఆ దేశానికి అన్ని రకాలుగా చెక్ పెట్టాలని అనుకుంటున్నా ,ఆ దేశం ప్రజలను ఇబ్బందికి గురి చేయరాదనే ఉద్దేశ్యం తో ఇన్నాళ్ళూ ఆగింది.ఇక ఉపేక్షిస్తే మనకు ఇంకా నష్టం జరగ  వచ్చు అందుకే భారత్ మొదటి చర్య గా ఆ దేశ వ్యవసాయం పై ,తాగు నీటి పై దెబ్బ కొట్టింది.మన దేశం నుండి ఆ దేశం లోకి వెల్లే నీటిని మన దేశానికి మళ్ళించింది.సింధూ నదీ జలాలను ,మన దేశ రాష్ట్రాలైన కాశ్మీర్ ,పంజాబ్ లకు మళ్ళించింది.అదే విధంగా రావి ,బియాస్ నదుల నీటిని కూడా మళ్ళించింది.మరో వైపు కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం తీవ్ర మైన గాలింపు చర్యలను చేపడుతుంది భారత్. 

Wednesday, February 20, 2019

సడన్ గా రాంగోపాల్ వర్మ లో దేశభక్తి:ఈ సారి నిజాయితీగా: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చుక్కలు


సడన్ గా  రాం గోపాల్ వర్మ కి దేశ భక్తి గుర్తొచ్చింది.అంటే ఇన్నాళ్ళు
లేదా ? అంటే ఏమో గానీ ఎప్పుడూ బయట పెట్టలేదు.
పుల్వామా దాడుల తర్వాత ,పాక్ ప్రధాని ఇమ్రాన్
ఖాన్ ఆలస్యంగా 5 రోజుల తర్వాత ,పాక్ ప్రమేయం,
లేదనడం ,ఆధారాలు చూపితే సహకరిస్తాం అనడం ,ఇదంతా
కావాలనే ఎన్నికల కోసం మన దేశ నాయకులు
చేస్తున్నారు అనడం అందరు భారతీయుల లాగానే రామ్ గోపాల్
వర్మ కి కూడా చిర్రెత్తుకొచ్చినట్టుంది.వెంటనే ట్వీట్ల
 యుద్ధం మొదలు పెట్టాడు.అసలు అవి ఎలా ఉన్నాయంటే
ఇన్నాళ్ళు వర్మను ద్వేషించిన వాళ్ళంతా అతనికి
ఇప్పుడు అభిమానులు అయిపోయేలా ఉన్నారు.అంత బాగా
ట్వీట్లు పెట్టాడు.పాక్ ప్రధాని ని టార్గెట్ చేస్తూ వర్మ ఎంత
 వెటకారంగా అన్నాడంటే ..ఆహా.. ఏం మాట్లాడాడురా..అనిపించక మానదు.

డియర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు
అంటూ..సంబోధిస్తూ ..

"జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్ ఖాయిదా వంటి సంస్థలను బంతులుగా భావించి పాకిస్థాన్ బౌండరీలను 
దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి పంపుతున్నారు, వాటిని 

మీరు బంతులనుకుంటున్నారా? లేకబాంబులనుకుంటున్నారో చెప్పాలండీ..."

"సామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి మీ దేశం లో ఉన్న సంగతి అమెరికాకు తెలిసింది, కానీ మీ దేశానికి  

తెలియలేదు.. అసలు  మీదీ ఒక దేశమేనా?...  ఒక అమాయక  

భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు 

సమాధానం చెప్పండి , మాకు మీ అంత తెలివి లేదు ,మీరు 

మాకు  కొంచెం తెలివి నేర్పాలి "

 "జైషే మహ్మద్, లష్కరే తోయిబాతాలిబన్, అల్‌ ఖాయిదా 

వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లు అని నాకు 

ఎవరూ చెప్పలేదు అయితే, ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న 

విషయాన్ని మీరెప్పుడూ చెప్పలేదు''

"సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైతే మీరు మూడు 

పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదు కదా.... ".. 

"ఒక వ్యక్తి టన్ను ల కొద్దీ   పేలుడు పదార్థాలతో భారత్‌ వైపు 

పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా

జరపాలో మా అమాయక  భారతీయులకు నేర్పాలి తమరు  ,

 ఫ్రీగా ఏం కాదు లెండి మేము  ట్యూషన్ 

ఫీజు కూడా ఇస్తాము " అని చెడుగుడు ఆడుకున్నాడు. దీన్ని 

ఇమ్రాన్ ఖాన్ చదువుతాడో లేడో  

తెలియదు కానీ..నెటిజన్స్ 

ఫిదా అవుతున్నారు...అదిరిందయ్యా వర్మా...
'Where is the వెంకట లక్ష్మి'-మరో " ప్రేమ కథా చిత్రం"..? ట్రెండింగ్ అవుతున్న ట్రైలర్ ..

ప్రేమ కథా చిత్రం సినిమా తెలుగు లో ఒక కొత్త ట్రెండ్ ని ప్రారంభించింది. ఈ సినిమా తో హార్రర్ కామెడీ అనే కొత్త జానర్ స్టార్ట్ అయింది.ఈ సినిమా తర్వాత ఇలాంటివే చాలా వచ్చాయి.కానీ ఏదీ పెద్దగా ఆడలేదు.అయినా అలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి.అదే కోవా లోని సినిమా "Where is వెంకట లక్ష్మి " రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో ,పూజిత,కార్తిక్ లు జంటగా , బ్రహ్మాజీ,మధునందన్,ప్రవీణ్ ముఖ్య పాత్రలుగా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తి కరంగా యూత్ ని టార్గెట్ చేస్కోని కట్ చేశారు.ఈ సినిమా కి డైరెక్టర్ కిషోర్ (లడ్డా ).ABT పతాకం పై వస్తుంది.ట్రైలర్ ప్రస్తుతం మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఉంది.

అదరగొట్టిన రానా:హీటెక్కిస్తున్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' మేకింగ్ వీడియో

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా షూటింగ్ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఇందులో రానా చెప్పే డైలాగులకు విజిల్స్ పడేట్టు గా ఉన్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ పై కొంచెం అసంతృప్తి తో ఉన్న వారికి ఇది మంచి కిక్ ఇస్తుంది.ఒకసారి చూడండి. 

Tuesday, February 19, 2019

ఉద్యోగులకు 3% DA పెంచిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుండి 3 శాతం కరువు భత్యం పెంచింది.మంగళ వారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్ల కు 3% DA ను ఈ జనవరి నుండి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.దీనివల్ల 48.41 లక్షల  కేంద్ర     ఉద్యోగులు, 62.03 లక్షల పెన్షనర్లు లబ్ది పొందుతారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా   9168 కోట్ల భారం పడుతుంది.ఇప్పటి వరకు 9 శాతం గా ఉన్న కరువు భత్యం 12 శాతం గా కానున్నది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల DA  27.24% .రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జులై 2018 DA ప్రకటించలేదు,అంటే 2 DA లు ప్రకటించాల్సి ఉంది.

Monday, February 18, 2019

మొట్ట మొదటి సారి RRR గురించి మాట్లాడిన రాజమౌళి : RRR బాహుబలి ని మించి ఉండబోతుంది:రాజమౌళి


RRR  మూవీ మొదలు పెట్టిన నాటి నుండి ఇంతవరకు సినిమాకి సంబంధించి ఒక్క అఫీషియల్ న్యూస్ కూడా రాలేదు . కానీ ఇప్పుడు ఏకంగా సినిమా దర్శకుడు SS  రాజమౌళి నే డైరెక్ట్ గా సినిమా గురించి మాట్లాడాడు. ఈ మధ్యనే రాజమౌళిని హార్వర్డ్ విశ్వ విద్యాలయం వారు  "హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2019" వారు మాట్లాడాల్సింది గా రాజా మౌళిని ఆహ్వానించారు.ఇక్కడ రాజమౌళి తన గత చిత్రాల గురించి ముఖ్యం గా 'బాహుబలి' గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న RRR  చిత్ర విశేషాలను వివరించడానికి మాత్రం నిరాకరించాడు.అయితే ఒక విషయాన్ని మాత్రం వె ళ్ళడించాడు అదేంటంటే "RRR  చిత్రం పాన్ ఇండియా -మార్కెట్ గల చిత్రమని చెప్పాడు.ఇది చాలా భారీ చిత్రం కాబోతుందని చాలా స్పష్టం గా చెప్పాడు.అయితే ఈ చిత్రం ఏ జానర్ కి చెందినది అని అడగగా మాత్రం ,రాజమౌళి సున్నితంగా తిరస్కరించాడు. ఒక వేళ బడ్జెట్ సమస్య లేకపోతే తాను రామాయణం,మహాభారతాలనే తీస్తానని చెప్పాడు. ఇక RRR  చిత్రం భారీ చిత్రం కానుందని స్వయంగా రాజమౌళి నే చెప్పడం తో ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెరగనున్నాయి. 

కన్నుల పండుగ గా TSR అవార్డు ఫంక్షన్:ముగ్గురు త్రిమూర్తులు ఒకే వేదిక పై.


ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీ. సుబ్బిరామిరెడ్డి వైజాగ్ లో సినీ అవార్డు ల వేడుక ను నిర్వహించారు.ఈ వేడుక లో ప్రధాన ఆకర్షణ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ లు .వీరు ముగ్గురి తో పాటు,మంచు మోహన్ బాబు కూడా రావడం ఫంక్షన్ కి నిండుదనం వచ్చింది.ఈ వేడుక లో 2017 ,18 సంవత్సరానికి గౌతమీ పుత్ర శాత కర్ణి కి బాల కృష్ణకి,దేవదాస్ చిత్రానికి నాగార్జున, రంగస్థలం చిత్రానికి రామ్ చరణ్ కి ఉత్తమ నటులు అవార్డు లు గెలుచుకోగా ,బాల కృష్ణ ,నాగార్జున లకు అవార్డు ఇవ్వడానికి tsr తో పాటు చిరు,మోహన్ బాబు  లు వేదిక మీదికి రావడం అభిమానులకు కన్నుల పండగ అయింది.ఇటీవల బాల కృష్ణ పై చిరు తమ్ముడు నాగ బాబు చేసిన వ్యాఖ్యల తర్వాత వీరు కలవడం ఇదే మొదటి సారి.అయితే చిరు ,బాలయ్య చాలా నవ్వుతూ కనిపించారు.అంతే కాదు రామ్ చరణ్ అవార్డు ను చిరు తీసుకోగా వేదిక పైన బాలయ్య కూడా ఉన్నాడు.ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ, బాలకృష్ణ ను తన సోదరుడు గానూ,నాగార్జున ను తన హృదయానికి దగ్గరైన వ్యక్తి గా అభివర్ణించడం ఇరు వర్గాల ప్రేక్షకుల ను ఎంతో ఆనందానికి గురిచేసింది.ఇక మోహన్ బాబు ను చిరు సంబోధిస్తూ,పెద్దాయన కానీ కుర్రాయన అనటం అందరినీ నవ్వించింది.చిరంజీవి మాట్లాడుతూ ,రామ్ చరణ్ తండ్రిగా గర్వ పడుతున్నానని,చరణ్ తన అంచనాలకు మించి రాణిస్తున్నాడని తెలిపాడు.తర్వాత నాగార్జున మాట్లాడేటప్పుడు,  తన కన్నా పెద్దవాడు , అన్నయ్య లాంటి వాడు మోహన్ బాబు అని అనగానే అందరూ ఘొల్లున నవ్వారు.మొత్తానికి  ఈ ప్రోగ్రామ్ చాలా ఆహ్లాదకరంగా జరిగింది.

Sunday, February 17, 2019

కోటి వ్యూస్ ని చేరుకున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్ " ట్రైలర్.


రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ .ఫెబ్రవరి 14 వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కేవలం 4 రోజుల్లో కోటి వ్యూస్ ని సాధించినదని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.ఇందులో ప్రదాననగాయూట్యూబ్ ద్వారా ఎక్కువ వ్యూస్ అవగా మిగతా డిజిటల్ విధానాల ద్వారా మొత్తం కోటి వ్యూస్ సాధించినట్టు వర్మ తెలిపాడు.కాగా దీనికి వర్మ విచిత్రమైన పబ్లిసిటీ విధానాలు వాడాడు.ఈ ట్రైలర్ ని రాహుల్ గాంధీ చూసినట్టు,సోనియా గాంధీ ,జగన్,లోకేష్, మాయా బజార్ నటులు ఇంకా చాలా మంది చూసి కామెంట్ చేసినట్టు ఫోటో లు తయారు చేసి అన్నిటినీ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయగా, ట్రైలర్ కి విపరీతమైన వీస్ వచ్చాయి.అంతే కాకుండా పై నుండి ఎన్టీఆర్ తనను ఆశీర్వదించాడు అని చెప్పడం , ఇంకా   ఇందులో చాలా బోల్డ్ గా సీన్ లు పెట్టడం కూడా ఇన్ని వ్యూస్ రావడానికి కారణం .

అభిమానులకి షాకిచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్.


సూపర్ స్టార్ రజినీ కాంత్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లలో పాల్గోనట్లేదు అని తన అభిమాన సంఘాల మీటింగ్ లో తేల్చేశాడు .తన దృష్టి అంతా 2021 లో జరిగే తమిళ నాడు అసెంబ్లీ ఎలక్షన్ లె నని తేల్చేశాడు.కాబట్టి ఈ పర్ల మెంట్ ఎన్నికలలో నేను ఏ పార్టీ కి మద్దతు ఇవ్వటం లేదు .ణా పేరు ను గాని,ఫోటో ను గానీ ఎన్నికల ప్రచారం లో ఎవరూ వాడు కోవద్దు.తమిళ నాడు రాష్ట్ర ప్రధాన సమస్య నీటి సమస్య.ఏ పార్టీ అయితే తమిళనాడు నీటి సమస్యను తీరుస్తామని స్పస్తమైన హామీ ,నమ్మకం కల్గిస్తాయో ఆ పార్టీ కె ఓటు వేయాలని రజినీ సూచించాడు.

RRR ప్రోగ్రెస్ రిపోర్ట్: రామ్ చరణ్ పై మెగా ఫైట్ చిత్రీకరణ


SS రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తర్వాతి చిత్రం RRR. అభిమానులు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురించి కేవలం హీరోలు రాంచరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ పేర్లు మాత్రమే అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యాయి. మిగితా అన్నీ రూమర్లు మాత్రమే.సముద్ర ఖని ఎంపిక మాత్రమే కొంతవరకు నిజం.ఇక మిగతా అన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్.ఈ చిత్ర సంబంధీకులు ఒకరు ముంబై కి చెందిన 'మిర్రర్' మ్యాగజైన్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా పీరియాడిక్ డ్రామా మూవీ.స్వాతంత్రం రాక ముందు కాలం నాటి సినిమా. ఈ  సినిమా లో రామ్ చరణ్ బ్రిటిష్ ప్రభుత్వం లో పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండగా, ఎన్టీఆర్ ఇందులో బందిపోటు గా నటిస్తున్నట్టు తెల్సింది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక పోలీస్ స్టేషన్ ముందు సెట్ లో గన్స్ ,ఇతర ఆయుధాలతో  చాలా పెద్ద ఫైట్ రాంచరణ్ పై  సుమారు 1000 మంది ఫైట్ ఆర్టిస్టు ల తో  చిత్రీకరిస్తున్నట్టు తెల్సింది.  అంతే కాకుండా హైదరాబాద్ శివారు  లో  ఒక పాత అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక పెద్ద సెట్ వేస్తున్నారట. సినిమా లో ప్రధాన భాగం ఇక్కడే షూట్  చేస్తారట .       ఇక బాహుబలి కి పాటించినట్టు ,రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు చరణ్ look  ని  రివీల్ చేస్తారా   లేదా అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు.దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ అందించారు. కాగా mm కీరవాణి ఈ చిత్రానికి సంగీతం.త్వరలోనే హీరోయిన్ ల పేర్లు బయటకు రానున్నాయి.

పుల్వామా దాడి లో మరణించిన జవాన్లకు దేశం మొత్తం నివాళి: అద్భుతమైన స్పందన


జమ్మూ కశ్మీర్ లో ఫిబ్రవరి 14 రాత్రి జరిగిన దాడి లో మరణించిన వీర జవాన్ లకు దేశం యావత్తు నివాళులు అర్పించింది. ప్రధాని నుండి మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు అద్భుతంగా స్పందించారు.ఈ విషయం లో ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా చక్కగా స్పందించాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 5 కోట్ల ను భారత్ కె వీర్ ఫౌండేషన్ (army)  కి దానం చేశాడు.
అమితాబ్ 2.4 కోట్ల సాయం ప్రకటించగా, వీరేంద్ర సెహ్వగ్ మరణించిన జవాన్ ల పిల్లలు అందరినీ చదివిస్తానని ప్రకటించాదు.ముఖేష్  అంబానీ దంపతులు ఆ సైనికుల కుటుంబాల లో ప్రతి ఇంటికి ఒక శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.సినీ నటి మాధవి తమ రాష్ట్ర సైనికుడి కుటుంబానికి అర ఎకరం భూమి రాసిచ్చింది.ఇక సైనిక నిధి కోసం సేకరించిన విరాళాలు ఇప్పటికే 7 కోట్లు దాటాయి.ఇవన్నీ మన వాళ్ళకి దేశం పై ఎంత భక్తి ఉందో తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఎంతో మంది కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.