• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, February 16, 2019

కెప్టైన్ మార్వెల్ తెలుగు ట్రైలర్ :సూపర్ గా ఉంది


' అవెంజర్స్ ఎండ్ గేమ్ ' లో హీరో లందరి కీ న్యూ సూట్స్"అవెంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా కి సంబంధించిన ట్రైలర్ తర్వాత ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు మరికొన్ని ఫోటోలు విడుదల చేశారు.ఈ ఫోటో లలో అవన్జర్స్ అందరూ కూడా కొత్త సూట్ లలో ఉన్నారు.ఈ సూట్ లు సిల్వర్ వైట్ & రెడ్ మిక్స్డ్ గా ఉండి చూడా దానికి బాగున్నాయి.ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే   "mad titan థానోస్ ఒక్క చిటిక తో సగం జనాభా ను అంతం చేస్తాడు.అంతే కాదు విశ్వం లోని చాలా ప్రపంచాలను అంతం చేస్తాడు.దీని ని సరి చేయాలంటే అవెంజర్స్   అందరూ  ఒకసారి మళ్ళీ  గతం లోకి వెళ్లి కలవాలి.జరిగిన దాన్ని  ,మళ్ళీ ఇక ఎప్పటికీ జరగకుండా సరి చేయాలి" .ఇదీ ఈ చిత్ర సారాంశం అని తెలుస్తుంది.అయితే మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ చిత్ర డబ్బింగ్ కి తమిళ మాటలను ప్రముఖ దర్శకుడు AR.మురుగదాస్ రాయనున్నాడు.


పుల్వామా దాడి పై పాక్ కు అనుకూలంగా మాట్లాడినందుకు సిద్ధూ ని " కపిల్ శర్మ " షో నుండి తొలగింపు


ఫిబ్రవరి 14 రాత్రి మన దేశ CRPF కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసి 49 మంది సైనికుల మరణానికి కారణమైన ఘటన పై మాజీ క్రికెటర్ సిద్దూ ,స్పందన వివాదాస్పదమైంది.ఈ ఘటన పై స్పందిస్తూ " కొంత మంది పిరికి వాళ్ళ చర్యను ఒక దేశం మొత్తానికి ముడి పెట్టడం సరికాదు అలాగే ఒక్క వ్యక్తిని కూడా బాధ్యుణ్ణి చేయలేము.అయితే జరిగిన సంఘటన చాలా నీచం,దీన్ని నేను ఖండిస్తున్నాను.హింస ఎప్పటికీ సమర్థ నీయం కాదు .ఇది ఎవరైతే చేశారో వారు తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే " అని స్పందించాడు.అయితే దీని పై ట్విట్టర్ లో తీవ్ర దుమారం చెలరేగింది. సిద్దూ ప్రకటన పాకిస్తాన్ ను సమర్థించి నట్టు  ఉందని  చాలా మంది మండి పడ్డారు .అంతే కాదు అతనికి ఎంతో పేరు తెచ్చిన హిందీ  షో  "కామెడీ నైట్స్ విత్ కపిల్ " నుండి సిద్దూ ని తొలగించాలని లేక పోతే ఈ షో ని బహిష్కరిస్తామని ట్వీట్స్ చేయడం తో, సోనీ టీవీ యాజమాన్యం చాలా చర్చల అనంతరం సిద్దూ ని ఈ షో నుండి తొలగించిందని సమాచారం.సిద్దూ స్థానం లో హిందీ నటి 'అర్చనా పురాన్ సింగ్' ను నియమించ నున్నారు.

ఎన్టీఆర్ మహా నాయకుడు ట్రైలర్ విడుదల : ఆసక్తికరంగా సాగిన ట్రైలర్

"ఎన్టీఆర్ కథా నాయకుడు"  సినిమా తర్వాత  దాని రెండవ భాగం " ఎన్టీఆర్ -మహా నాయకుడు " ఈ నెల 22 న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ ఒక ట్రైలర్ ని విడుదల చేసింది.ట్రైలర్ అంతా ఎమోషనల్  గా సాగింది. ఇందులో నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ ప్రధానంగా  సాగుతుంది అనే విషయం అర్ధమవుతుంది. స్వర్గీయ ఇందిరా గాంధీ పాత్రను కూడా ఇందులో చూపించారు.మొదటి భాగం కన్నా రెండవ భాగం లో హరి కృష్ణ , చంద్ర  బాబు ల పాత్రల నిడివి ఎక్కువ గా ఉండ బోతున్నాయి. కీరా వాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది . బాల కృష్ణ పూర్తిగా ఎన్టీఆర్ లాగా మారినట్టు ఉంది. మొత్తంగా ట్రైలర్ పాజిటివ్ గా అనిపిస్తుంది. 

Friday, February 15, 2019

తర్వాతి జేమ్స్ బాండ్ గా 'టామ్ హిడిల్ స్టన్' లేదా 'మైకేల్ ఫాజ్ బెండర్.. '?


'జేమ్స్ బాండ్' వింటేనే సినీ అభిమానులు పులకించి పోతారు.అంత క్రేజ్ గల ఈ మూవీ ఫ్రాంచైజ్ ఇప్పటి వరకు 26 సినిమాలు గా వచ్చాయి.దాదాపు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇయాన్ ఫ్లెమింగ్ నవలలు "జేమ్స్ బాండ్ 007" ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రాలకి ప్రపంచ వ్యాప్తంగా ,అన్ని భాషలలో కూడా విపరీత మైన క్రేజ్ ఉంది.1962 లో ప్రారంభ మైన (Dr.No) తో మొదలైన ఈ సినిమా ప్రస్థానం మొన్నటి 'స్పెక్టర్' వరకు కొనసాగింది.ది మోస్ట్ స్టైలిష్ బాండ్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత బాండ్ 'డేనియల్ క్రెయిగ్' ప్రస్తుతం షూటింగ్  ప్రారంభం కాని బాండ్ చిత్రానికి డేనియల్ క్రెయిగ్ ఒప్పుకుంటే ఓకే ఇదే  చివరిది అవుతుందిX. ఒకవేళ ఒప్పుకోక పోతే క్రెయిగ్ తర్వాతి బాండ్ ఎవరన్నది ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది.Thor మూవీ లలో అవెంజర్స్ సిరీస్ లలో  "లోకి" గా ఎంతో     మంచి ఎంతో పేరు తెచ్చుకున్న 'టామ్ హిడిల్ స్టన్' ను నెక్స్ట్ బాండ్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.ఆల్రెడీ టామ్ ,బాండ్ గా ఉంటే ఎలా ఉంటుందో ఫోటో లు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. టామ్ అయితే బాగానే ఉంటాడు అని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే మరీ కొందరు  "X-మెన్" సిరీస్  లలో    "స్టీవ్ జాబ్స్"  మూవీ లో ఫేమ్ అయిన మైకేల్ ఫాస్ బెండర్ కూడా ఈ రోల్ కి పోటీలో ఉన్నట్టు సమాచారం.ఈ ఇద్దరూ ఈ రోల్ కి సరిగ్గా సరిపోతారు.

RRR లో అజయ్ దేవగన్ ఖాయం కాదా ..????


ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న చిత్రం RRR. భారత చలన చిత్ర రంగం లో అగ్రదర్శకుల జాబితా లో ముందు వరుసలో నిలిచే దర్శకుడు SS రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం లో జాతీయ స్థాయి లో గుర్తింపు ఉన్న తెలుగు సూపర్ స్టార్లు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లు ఇందులో కథానాయకులు గా నటిస్తుండటమే దీనికి కారణం.అంతే కాదు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా లో వివిధ భాషల నటులను ఎంపిక చేశారు.తమిళ నటుడు సముద్ర ఖని, బాలీవుడ్ భామ ఆలియా భట్ దాదాపు ఓకె అయ్యారు.ఇక ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ ఏంటంటే ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ ని ఎంపిక చేసినట్టు తెలిసింది.గతం లో రోబో 2.0  ,  భారతీయుడు సినిమాల కోసం      విలన్ గా ముందు అజయ్ దేవ్ గణ్ నే సంప్రదించగా ,తనకి తెలియని భాషలో నటించనని చెప్పాడు.అయితే రాజ మౌళి 'ఈగ' హిందీ వెర్షన్ లో డబ్బింగ్ మాత్రం చెప్పాడు.అప్పుడు ఏర్పడిన స్నేహం తో రాజమౌళి RRR  సినిమా కోసం అజయ్ దేవగన్ ని   ఒక గెస్ట్ రోల్ కోసం సంప్రదించగా అతడు ఒప్పుకున్నట్టు తెల్సింది.దీంతో ఈ చిత్రానికి మరింత అదనపు ఆకర్షణ మరియు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడినట్టు అయింది.అయితే ఇందులో నిజం లేదని అజయ్ స్పందించాడు.తనను శంకర్ భారతీయుడు సినిమా కోసం విలన్ గా చేయడానికి సంప్రదించిన మాట వాస్తవమే కానీ ,రాజమౌళి ఇంతవరకు తనకు కలవ నే లేదని తేల్చి చెప్పాడు.

Thursday, February 14, 2019

ఈ మార్చి లో పెళ్లి చేసుకోబోతున్న ఆర్య ,సాయేషా సైగల్సాయేషా సైగల్ గుర్తుందా..అక్కినేని వారసుడు అఖిల్ మొదటి సినిమా "అఖిల్"లో నటించిన హీరోయిన్. కోలీవుడ్ మన్మధుడు ఆర్య తెలుగు వారికి కూడా సుపరిచితమే. వీరిద్దరూ "గజినీకాంత్"అనే సినిమా లో   కలిసి నటించారు.అప్పటినుండి వీళ్ళు  ప్రేమలో ఉన్నారు.నిన్న వాలెంటైన్స్ డే రోజు ఆర్య వీరి ప్రేమ గురించి చెప్తూనే , ఈ మార్చి నెలలో నే పెళ్లి చేసుకోబోతున్నామని,తమని ఆశీర్వదించాలని fb ద్వారా అందరినీ కోరాడు.సాయేషా సైగల్ ,ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్,సైరాభాను ల మేన కోడలు.ఆర్య కు సాయేషా కి దాదాపు 14 ఏళ్ల తేడా ఉంది.అయినా వీరు పెళ్లికి సిద్ధమయ్యారు.వీరిద్దరి కీ త్రిభువనవిజయం తరుపున శుభాకాంక్షలు...
మరిన్ని సినిమా న్యూస్ కోసం విజిట్ చేయండి
Www.thribhuvanavijayam. com

టీజర్ టాక్: విజయతీరాలకు చేరేలా కనిపిస్తున్న చై-సామ్ "మజిలీ".


 
నిన్ను కోరి లాంటి ఒక చక్కటి లవ్ స్టొరీ తో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ రెండో ప్రయత్నముగా ఒక సగటు మధ్య తరగతి యువకుడి జీవితంలో వుండే ప్రేమ, పెళ్లి అనే అంశాల చుట్టూ సాగె కథని చూపించబోతున్నట్టు గా మజిలీ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. క్రికెటర్ కావలి అనే ఆశయం తో ఉన్న యువకుడు ఒక రిచ్ అండ్ పోష్ గర్ల్ తో ప్రేమలో పడటం అనివార్య కారణాల వళ్ళ క్రికెటర్ కాలేక పోవడం అలాగే ప్రేమించిన అమ్మాయి దూరం కావడం.. గ్రౌండ్ లో బంతిని కొట్టాల్సిన చైతు పబ్ లో మందు కొడుతూ మాస్ అవతారంలో కి మారడం కొంత కాలానికి పెద్దలు కుదిర్చిన అమ్మాయి సమంత తో పెళ్లి.. గతం మర్చిపోలేని చైతన్య మనసులోకి చేరాలని ప్రయత్నించే ఒక మధ్య తరగతి గృహణి చేసే మజిలీ గా సాగింది టీజర్. రొటీన్ లైన్ తీసుకున్నప్పటికీ అందరిని కనెక్ట్ చేసే అవకాశం ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. టీజర్ సినిమా ఫై ఆసక్తిని పెంచింది. ఇక సినిమా కథకు తగ్గట్టు గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. శివ నిర్వాణ స్టోరీ తో పాటు రాసిన మాటలు చాలా బాగున్నాయి. ఒక్కాసారి పోతే మల్లి అది తిరిగి రాదు రా అది వస్తువైనా మనిషైనా, నువ్వు నా రూమ్ లొపలికి రాగలవేమో కానీ నా మనసు లొపలికి ఎప్పుడు రాలేవు, మా ఆయనికి మంచు ప్రదేశాలంటే బాగా ఇష్టం, వేదవలకెప్పుడు మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వు మల్లి ప్రూవ్ చేసావ్, లాంటి సంభాషణలు బాగా కుదిరాయి. ఏప్రిల్ 5 వ తేదీన ఈ మజిలీ థియేటర్స్ లో మొదలవుతుంది.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి :40 మంది CRPF జవాన్లు మృతి ..!మరోసారి ఉగ్రవాదులు తమ రాక్షస క్రీడ ను సాగించారు.  జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ,అవంతి పోరా లోని గోరిపార వద్ద ,జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఐఈడీ బాంబు దాడిని చేసింది.ఈ దాడిలో 40 మంది CRPF జవాన్లు మరణించగా,అనేకమంది గాయాల పాలు అయ్యారు.సెలవుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తున్న సుమారు 78 వాహన శ్రేణుల పై ,ఉగ్రవాదులు ఐఈడి దాడికి పాల్పడ్డారు.దీని కోసం ఉగ్రవాదులు 350 కిలోల ఆర్డీఎక్ష్ వాడినట్టు CRPF తెలిపింది.యురీ దాడి తర్వాత ఇదే అతి పెద్ద దాడి .  దాడికి పాల్పడింది తామేనని జైషేమొహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.    ఇదే విషయాన్ని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్రువీకరిచారు.దాడిని గూర్చి పరిశోధించడానికి రేపు  12 మంది సభ్యులతో  NIA బృందం జమ్మూ-కాశ్మీర్ కి ఫోరెన్సిక్ పరికరాలతో  వెళ్లనుంది. ఉగ్రవాదుల తో పోరాటానికి భారత్ కి తాము పూర్తిగా సహకరిస్తామని ,ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్తర్   ప్రకటించారు.ఈ ఘటనను నేపాల్ ప్రాధాని ఖండించారు.రేపు ఉదయం 9.05 నిమిషాలకు భద్రతావ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఈ విషయం పై చర్చించ బోతుంది.ఈ సందర్భంగా ఇంటర్ నెట్ సేవలను దక్షిణ కాశ్మీర్ ప్రాంతం లో నీలి వేశారు.కొన్ని ప్రాంతాలలో 2G  మాత్రమే నిలిచేలాగా చేశారు.అయితే ఈ ఘటన సందర్భంగా టీవీ    చానెళ్ళు ఎలాంటి రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేయొద్దని కేంద్రం సూచించింది.

" లక్ష్మీ స్ ఎన్టీఆర్ " మూవీ ట్రైలర్: వివాదాలు కావచ్చు..మొదటి నుండి వివాదాస్పదం  అవుతున్న చిత్రం లక్ష్మీ స్ ఎన్టీఆర్.స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకం లో చోటు చేసుకున్న పరిణామాలను  ఇంత బోల్డ్ గా తీయడం నిజంగా సాహసం అనే చెప్పాలి.అసలు వర్మ ఉద్దేశ్యం ఏమిటో తెలీదు కానీ ,దీని వల్ల ఎంత వివాదం అవుతుందో... ట్రైలర్ ఒకసారి చూడండి.

Wednesday, February 13, 2019

" ఫలక్ నామ దాస్ " టీజర్ భీభత్సం : మాములుగా లేదు : లొల్లి లొల్లి :సూడాలంతే" ఫలక్ నామ దాస్ "   ఇది మలయాళ క్రైమ్ డ్రామా   "ఆంగ్ మలై డైరీస్".  కానీ... అస్సలు ఈలాంటి  టీజర్.... ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రల.... ఇంత బోల్డ్ గా ఎవ్వరూ రిలీజ్ చేయలేదు. టీజర్  చూసిన సినిమా అభిమాని షాక్ అవుతాడు అంతే. ఏవో రెండు బూతు మాటలు ఉన్నంత మాత్రాన సినిమా హిఒట్టు కాకపోవచ్చు.కానీ ఈ మూవీ స్టఫ్ ఉన్న మూవీ లాగా కన్పిస్తుంది. వన్మాయే పతాకం పై ,కరాటే రాజు సమర్పకుడిగా , విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ ,దర్శకత్వం వహిస్తున్న " ఫలక్ నామ దాస్ "  .ఈ చిత్రం టీజర్ చూస్తుంటే ఇది మరో కల్ట్ క్లాసిక్ అయ్యేలాగ అనిపించక మానదు.ఈ నగరానికి  ఏమైంది ఫేం విశ్వక్ సేన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.ఒక మాస్ హీరో కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అతనిలో.  మరో విజయ్ దేవర కొండ ఆన్ ది వే అని అంటున్నారు. ఇందులో ఇంకా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక కాప్ గా నటిస్తున్నాడు.ఉత్తేజ్ కూడా ఇందులో ఉన్నాడు అని టీజర్ ద్వారా తెలుస్తుంది. చూస్తుంటే లో బడ్జెట్ ఫిలిం ఐనప్పటికీ చూడగానే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ,ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది . టీజర్ మాత్రం ..కేక ..  చూడండి ..షేర్ చేయండి...

 మరిన్ని సినిమా అప్ డేట్స్ కోసం విసిట్ చేయండి ...www.thribhuvanavijayam.com

 ప్రియా ప్రకాష్ వారియర్ "లవర్స్ డే" మూవీ ప్రివ్యూ.


 ప్రియా ప్రకాష్ వారియర్ మరియు రావూఫ్ రోషన్ జంటగా మళయాలం లో నిర్మితమైన ఓరు ఆధార్ ఓరు కాదల్ సినిమా తెలుగు లో లవర్స్ డే పేరుతో రేపు వాలంటేన్స్ డే సందర్బంగా థియేటర్స్ లో కి రాబోతుంది. ప్రియా ప్రకాష్ వారియర్ అనే పేరు గత ఏడాది కాలంగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ లో మారు మోగుతుంది. ఈ సినిమా నుండి మొదట విడుదలైన టీజర్ లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక్క కన్ను గిటుతో యువ హృదయాలపై ఒక పెద్ద యుద్ధాన్నే ప్రకటించింది. ఈ టీజర్ లో ప్రియా ఇచ్చిన ఒక్క ఎక్సప్రెషన్ ఈ సినిమా ఫై నేషనల్ వైడ్ అటెన్సన్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే స్కూల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథగా తెలుస్తుంది టీజర్స్ చూస్తుంటే. ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్ తో సినిమా లో రొమాంటిక్ పాళ్ళు ఎక్కువగా వున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఈ అదనపు ఆకర్షణలు బాగానే వున్నా కథ పరంగా కొత్తదనం కథనాన్ని ఆసక్తిగా నడపడం అనే అంశాలు ప్రేక్షకులని థియేటర్స్ వరకు నడిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్ యూత్ ని సినిమాకు కనెక్ట్ చేశాయని చెప్పాలి. సినిమా బాగుంటే బాషా బేధం లేకుండా ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు సర్వదా సిద్ధంగా వుంటారు. ఇక చూడాలి టీజర్ తో కుర్రకారు హృదయాలలో అలజడి రేపిన ఈ మలయాళీ పరిమళం తెలుగులో మొదటి సినిమా ద్వారా ఎలాంటి ఫలితాన్ని పొందుంతుందో!

Tuesday, February 12, 2019

ఈ నెల 16 న తెలంగాణా కేబినెట్ విస్తరణ :8 మంది ఎమ్మెల్యే లకు మంత్రి పదవి ...!


ఎంతో మంది ఆశావహులు ఎదురు చూస్తున్న తెలంగాణా మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 16 న జరగనుందని సమాచారం.తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎలక్షన్ లలో ఘన విజయం సాధించిన తెరాస పార్టీ , అధినేత కెసిఆర్ ను  ముఖ్యమంత్రి గా ఎన్నుకున్న విషయం తెలిసిందే.అయినా చాలా రోజులనుండి మంత్రి వర్గ విస్తరణ జరగక పోయే సరికి ఆశావహుల్లో ఎంతో ఉత్కంఠ  కల్గింది.ఈ నెల 16 న కేబినెట్ విస్తరణ జరుగుతుండటం తో ఇక అందరూ రిలాక్స్ అవ్వొచ్చు.ఇప్పటి వరకు అయితే 8 మంది ఎమ్మెల్యే ల కు మాత్రమే మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తుంది.
హరీష్ రావు కి మంత్రి పదవి ఖాయం : 
ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం ..హరీష్ రావు ను MP గా పోటీ చేయిస్తున్నారు కాబట్టి మంత్రి రాదని అనుకున్నారు.   కానీ లేటెస్ట్ వార్తలను బట్టి  ,హరీష్ రావు కి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తుంది.దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లు ఐంది.హరీష్ రావు తో పాటు ఈటెల రాజేందర్,జగదీశ్వర్ రెడ్డి ,తలసాని  లకు మంత్రి  పదవి ఖాయం, అని అంటున్నారు.కాగా,మిగతా 5 గురు ఎవరో 16 వ తేదీన తెలుస్తుంది.

Monday, February 11, 2019

ఆస్ట్రేలియా టీమ్ ని వెక్కిరించిన వీరూ... వార్నింగ్ ఇచ్చిన హెడెన్:వైరల్ అవుతున్న TV యాడ్


టీమ్ ఇండియా ఆస్ట్రేలియా కి టూర్ కి వెళ్లినప్పుడు ఓ టెస్టు మ్యాచ్ సందర్బంగా ,యువ బ్యాట్సమన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా ,వికెట్ కీపర్ ,కెప్టెన్ టిమ్ పైన్ ,పంత్ ను ఉద్దేశించి, "వన్డే సిరీస్ కి ధోని వస్తున్నాడట,ఇక నీకు జట్టులో చోటు ఉండదు.నువ్వేం చేస్తావ్..??  మేము బయటకు వెళ్ళినప్పుడు  మా పిల్లల్ని చూస్కుంటావా..?? (Will you baby sit for us when we couple go for a movie?) " అని కామెంట్ చేశాడు.అయితే ఆ మ్యాచ్ లో పంత్ చెలరేగి ఆడడం తో ఆ మ్యాచ్ గెలవడమే కాకుండా, సిరీస్ కూడా నెగ్గింది.అప్పుడు జరిగిన ఒక ఫంక్షన్ లో టిమ్ పైన్ భార్య ,పంత్ కి తన బేబీ ని ఇచ్చి ఎత్తుకున్న ఫోటో ను ట్విట్టర్ లో ఉంచడం అంతా సరదాగా సాగి పోయింది.ఇప్పుడు ఈ నెల 24 నుండి ఆస్ట్రేలియా టీమ్ ఇండియా కి 2 t20 లు ,5 వన్డేలు ఆడడానికి వస్తుంది.అయితే స్టార్ స్పోర్ట్స్   ఈ టూర్ కి బ్రాడ్ క్యాస్టర్, కాబట్టి ఒక మంచి ప్రోమో యాడ్ తయారు చేయాలని భావించి, వేరేందర్ సెహ్వాగ్ తో ఒక యాడ్ చేయించింది.ఈ యాడ్ లో వీరూ  ఇద్దరు పిల్లలను ఎత్తుకుంటాడు.అయితే ఆ పిల్లలు ఆస్ట్రేలియన్ టీమ్ జెర్సీ వేసుకుని ఉన్నారు.సెహ్వాగ్ ఇందులో "మేము ఆస్ట్రేలియా టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని బేబీ సిట్ చేస్తారా..అని అడిగారు...అప్పుడు మేము అన్నాము..ఎందుకు చేయము

.మొత్తం టీమ్ అంతా రండి..తప్పకుండా..మిమ్మల్ని బేబీ సిట్ చేస్తాము అని అన్నాము"అని అంటాడు.
ఇప్పుడు ఈ యాడ్ వైరల్ అవుతుంది.ఈ యాడ్ ను చూసిన మాథ్యూ హెడెన్ సెహ్వాగ్ కి,స్టార్ స్పోర్ట్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. " ఆస్ట్రేలియా టీమ్ ని అంత తేలిగ్గా తీసుకోవద్దు..గుర్తుంచుకోండి..వరల్డ్ కప్ ట్రోఫీ ని ఎవరు బేబీ సిట్ చేస్తున్నారో  మరవద్దు" అని హెడెన్ ట్వీట్ చేశాడు.ఎందుకంటే వరల్డ్ కప్ నెగ్గింది ఆస్ట్రేలియా కాబట్టి,అది ఇంకా ఆస్ట్రేలియా దగ్గరే ఉంది మరి.

Sunday, February 10, 2019

టెంపర్ తమిల్ రీమేక్ "అయోగ్య " ట్రైలర్ " : విశాల్ ఎలా చేశాడు?

టెంపర్ సినిమా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించగా పూరీ దర్శకత్వం లో వచ్చిన సినిమా.కలెక్షన్లు తక్కువ వచ్చినప్పటికీ,తెలుగు సినీ ఇండస్ట్రీ లో గుతున్చుకోదగ్గ సినిమా .జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిన సినిమా .ఈ మద్యనే బాలీవుడ్ లో సిమబా గా రిలీజ్ ఐంది.ఇప్పుడు తమిల్  లో విశాల్ హీరోగా వస్తుంది.ఎందరు చేసినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎవ్వరు కూడా ఇవ్వరేమో .అయితే విశాల్ ఎలా చేశాడో ఒక సారి చూడండి..

F2 VFX మేకింగ్ వీడియో

F2 సినిమా లో క్లైమాక్స్ లో బ్రిడ్జి సీన్  అందరికి గుర్తుండే ఉంటుంది.ఆ సీన్ VFX ఎలా చేశారో ఒక సారి చూడండి..

కూతురు పెళ్లి లో రజనికాంత్ డాన్స్
ఆసక్తి రేపుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ "నాగ కన్య"


వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో నే "నాగ కన్య" అనే చిత్రం జంబో  సినిమాస్ పతాకం , పై తెర ముందుకు రాబోతుంది. ఇది తమిళ్ మూవీ "నీయా" కి ఇది తెలుగు వెర్షన్. ఇప్పటివరకు ఆమె అన్నీ నెగెటివ్ రోల్స్ చేసింది.అయితే ఇందులో ప్రధాన పాత్రలో,అందునా కొంచెం గ్లామర్ రోల్ లో కన్పిస్తుంది.నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ల లో వరలక్ష్మి లుక్ చాలా బాగుంది. రాయ్ లక్ష్మి లుక్ కూడా బాగుంది.  ఈ చిత్రం పైన అంచనాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.ఇందులో వరలక్ష్మి తో పాటు క్యాథరిన్ త్రెస్సా, రాయ్ లక్ష్మీ లు కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో మేల్ లీడ్ గా జర్నీ ఫేమ్ జై నటిస్తున్నాడు. L.సురేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నిర్మాత A. శ్రీధర్. త్వరలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.

పోరాడి ఓడిన భారత్ :సిరీస్ న్యూజీలాండ్ కైవసం


Seddon Park, Hamilton: 
న్యూజీలాండ్ తో జరుగుతున్న 3 టీ20 సిరీస్ లో భారత్ పోరాడి ఓడింది.న్యూజీలాండ్ పై 4 పరుగుల తేడాతో ఓడి ,సిరీస్ ను 1-2 తేడా తో కోల్పోయింది. అంతే కాకుండా టీమిండియా టీ20 సిరీస్ ల వరుస విజయాలకు న్యూజీలాండ్ బ్రేక్ వేసింది.తొలుత టాస్ గెలిచి న భారత్ బౌలింగ్ ను ఎంచుకుంది. తిం సీఫెర్ట్ 43 ,కొలిన్ మున్రో 72, గ్రాండ్ హోమ్ 30 లు రాణించగా ,న్యూజీలాండ్ 20 ఓవర్ లలో  4 వికెట్ల నష్టానికి ,212 పరుగులు చేసింది.తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్ లలో 6 వికెట్లు కోల్పోయి ,208 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ 38(32 బాల్స్),శంకర్ 43(28 బాల్స్ ),పంత్ 28 (12 బాల్స్ ) ,హార్దిక్ (21 బాల్స్) ,కార్తిక్ 33(16 బాల్స్ ),ఆఖర్లో క్రునాల్ పాండ్యా కూడా 26(13 బాల్స్ ) ధాటిగా ఆడినప్పటికీ కావాల్సిన రన్ రేట్ ను అందుకోలేక పోయారు.208 పరుగులు మాత్రమే చేయగలిగారు. PLAYER OF THE SERIEim Seifert &

 కొలిన్ మున్రో :ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 

           

రౌడీ బేబీ సాంగ్ తో యూట్యూబ్ రికార్డుల మోతమోగిస్తున్న ఫిదా పిల్ల!


తమిళనాట ధనుష్ సాయి పల్లవి జంటగా రూపొంది ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకున్న "మారి-2" సినిమా లోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో రికార్డుల మోతమోగిస్తుంది. యువన్ శంకర్ రాజా ఈ పాటకు అదిరిపోయే బాణీలను అందించగా ధనుష్, సాయి పల్లవి లు వేసిన సూపర్బ్ స్టెప్స్ ఈ పాటను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాయి. యూట్యూబ్ లో 18 కోట్ల వ్యూస్ నెల రోజుల వ్యవధిలో రావడం బట్టి ప్రేక్షకులు ఈ పాట కు ఎంత ఫిదా అయ్యారో తెలియజేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ఈ వీడియో ఫై ఒక క్లిక్ వేసి రౌడీ బేబీ సాంగ్ ని చూసేయండి.