• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Saturday, January 12, 2019

తొలి వన్డే లో భారత్ ఓటమి:ఆస్ట్రేలియా తో భారత్ 3 వన్డేల సిరీస్.

ఆస్ట్రేలియా టూర్ లో ,3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు సిడ్నీ లో జరిగిన , మొదటి వన్డే లో ఓటమి పాలైంది.మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో  288/ 5  పరుగులు చేయగా ,భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల కు 254 పరుగులు మాత్రమే చేయగల్గింది.ఆస్ట్రేలియా తరుపున ఖ్వాజా 59,షాన్ మార్ష్ 54,హాండ్స్ కూంబ్ 73, స్టాయినిస్ 47 నాటౌట్ పరుగుల తో రాణించారు.భారత్ బౌలర్లు ప్రారంభంలో కట్టడి చేసినా తర్వాత్ డాన్ని కొనసాగించలేకపోయారు.భువీ 2, కుల్దీప్ 2 , జడేజా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.భారత్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (129 బంతుల్లో  133. 10 ఫోర్లు, 6 సిక్స్ లు ) భారత్  ను ఓటమి నుండి రక్షించ లేకపోయింది.ధోనీ  51 (96 బంతుల్లో 3 ఫోర్లు ,ఒక సిక్స్ ) పరుగులు చేసినా ఎక్కువ బంతులు వృధా చేసి వెనుదిరిగాడు.మిగితా వికెట్లు త్వర త్వరగా కోల్పోవడం వల్ల కావాల్సిన రన్ రేట్ ను భారత సాధించలేక పోయింది.ఆస్ట్రేలియా బౌలర్ల లో  జే రిచర్డ్సన్  4 వికెట్లు తీసి భారత్ ను దెబ్బ తీసాడు.అతనికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ' అవార్డ్ లభించింది.
రోహిత్ శ్రమ వృధా 

భారత్ తరుపున 2 మైలు రాళ్ళు
ఈ మ్యాచ్ లో ధోనీ 10 వేల పరుగులు సాధించాడు.అంతే కాకుండా ఈ ఫీట్ సాధించిన 13 వ ఆటగాడు.
ఇక బౌలింగ్ విభాగంలో  భువనేశ్వర్ 100 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు.ఈ ఫీట్ సాధించిన వారిలో    భారత్ తరుపున 19 వ ఆటగాడు.

న్యాచురల్ స్టార్ నాని 'జెర్సీ' మూవీ ట్రయిలర్ టాక్


జెర్సీ మూవీ కథను క్లుప్తంగా చెప్పాలంటే లేటు వయసులో క్రికెటర్ కావాలనుకునే వ్యక్తి కథే జెర్సీ. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ట్రయిలర్ లో. 'నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. ప్రొఫెషనల్స్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్' అంటూ ట్రయిలర్ ప్రారంభమవుతుంది. ఇక ఆ తరువాత అర్జున్ చుట్టూ వుండే వాళ్ళు అవహేళన చేస్తున్న టైం లో అతడు ఎలా లక్షాన్ని చేరుకున్నాడు అనేది సినిమా కథ. ట్రయిలర్ చివరన ప్రయత్నం ఆపేసి ఓడిపోయిన వాడున్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయేవాడు లేడు అంటూ నాని పలికే సంబాషణతో ట్రయిలర్ ముగుస్తుంది. ఫైనల్ గా నాని మరోసారి చక్కని పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పొచ్చు.

'విశ్వాసం' 'పేట' సినిమాల బాక్సాపీస్ కలెక్షన్స్తమిళనాట పొంగల్ పందెం కోళ్లుగా బరిలో దిగిన సూపర్  స్టార్ రజినీకాంత్ 'పేట' సినిమా తలా అజిత్ 'విశ్వాసం' సినిమా పోటా పోటీ వసూళ్ల తో దూసుకుపోతున్నాయి. ట్రేడ్ రిపోర్ట్ ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వసూలైన కలెక్షన్స్ లో సూపర్ స్టార్ రజిని పేట మూవీ రెండు రోజులకు 40 కోట్లు కలెక్టు చేయగా 'తలా' అజిత్ విశ్వాసం మూవీ 35 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడు వరకు చూస్తే 'విశ్వాసం 'మూవీ రెండు రోజుల్లొ 16 కోట్లు వసూల్ చేయగా 'పేట' మూవీ 11 కోట్లు వసూల్ చేసింది. పొంగల్ కి విజయం సాధించే పందెం కోడి ఎవరో తెలిసేది వచ్చే వారం కలెక్షన్స్ ను బట్టి ఉంటుంది.

Friday, January 11, 2019

సంక్రాంతి సినిమాలు ఎలా వున్నాయి??సంక్రాంతి కి విడుదలైన 3 భారీ చిత్రాలు మిశ్రమ స్పందనను తెచ్చుకున్నాయి.ఎన్టీఆర్-కథానాయకుడు ,వినయ విదేయ రామ,పేట చిత్రాలు జస్ట్ అవెరేజ్ అనే టాక్ ను తెచ్చుకున్నాయి.ఇక మిగిలిన 4 వ చిత్రం' F2 ' ఏ మాత్రం బాగున్నా,సంక్రాంతి విజేతగా నిలిచేలా వుంది.

ఆస్ట్రేలియా క్రికెట్ టీం కి కొత్త రంగు దుస్తులు


ఇండియా ,న్యూజీలాండ్ తో జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కి ,ఆస్ట్రేలియా టీం కొత్త రకం ,రంగు దుస్తులను ధరించబోతున్నారు.ఇది రిట్రో గ్రీన్ & గోల్డ్ రంగు దుస్తులు.ఇలాంటి డ్రెస్ నే 1986 లో అలెన్ బోర్డర్ నాయకత్వం లోని ఆస్ట్రేలియా టీం ధరించింది.ఈ దుస్తులలో ఆస్ట్రేలియా టీం న్యూ లుక్ చాలా బాగుంది.

Thursday, January 10, 2019

బాల కృష్ణ పై నాగ బాబు 6 వ కామెంట్

నందమూరి బాల కృష్ణ పై వరుసగా యూట్యూబ్ ద్వారా స్పందింస్తున్న నాగబాబు ,ముందే చెప్పినట్టుగా తన 6 వ ,చివరి స్పందనను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.గతం లో తన అన్నయ్య చిరంజీవిని బాలకృష్ణ ,తన తండ్రి కాలి గోటికి సరిపోడని కామెంట్ చేశాడు అని,మరి అలాంటప్పుడు తన అన్నయ్య చిరంజీవి కాలి గోటికి, బాలక్రిష్ణ సరిపోడని నేను అంటే మీరు ,మీ ఫాన్స్ ,మీ ఫామిలీ మెంబర్స్ ఎంత బాధ పడతారు ?అని అన్నాడు.ఆ రోజు మా అన్నయ్య చిరంజీవి చాలా పెద్దమనిషి లా స్పంచాడనీ,మేము సంస్కార వంతంగా పెరిగామని, మేము అలా అనలేము అని వ్యాఖ్యానించాడు.ఇప్పటికైనా దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దనీ,ఒక వేళ చేస్తే మేము తగిన విధంగా స్పందిస్తాం అనీ ఇక ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తున్నామనీ,ఫాన్స్ కూడా వదిలేయాలని చెప్పాడు నాగ బాబు. ఈ లింక్ ద్వారా వీడియో చూడండి.
https://youtu.be/ZtGTcZl1Q1Q 

‘పేట‘ సినిమా హాలులోనే వివాహం చేసుకున్న రజినీ అభిమాని
       
ఈరోజు తలైవా రజినీకాంత్ మూవీ ‘పేట’ తెలుగు మరియు తమిళ్ లో  విడుదలయి మిక్స్ డ్   టాక్ తెచ్చుకుంది. అభిమానుల పెళ్ళికి హీరో రావడం, హీరో పెళ్లికి అభిమానులు వెళ్లడం సాదరణంగా జరుగుతుంటాయి. కానీ రజినీ అభిమాని కొత్తగా ఆలోచించాడు. సినిమా హీరోలఫై ఫాన్స్ చూపించే అభిమానం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సినది తమిళ  అభిమానుల  గురించే. అందుకు ఉదాహరణే ఈసంఘటన. పేట సినిమా విడుదల అయిన థియేటర్లో నే రజిని అభిమాని వివాహం చేసుకున్నాడు. సినిమాకు వచ్చిన అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యానికి తరువాత తేరుకొని సినిమా అయిపోగానే వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లారు. చెన్నైలోని వూడ్ల్యాండ్సి నిమాహాలులోఈ సంఘటన జరిగింది. ఇలా తమిళ ప్రజలు సినిమాలఫై సినిమా హీరోల పైన తమ విపరీత ప్రేమ చూపించటం కొత్తేమికాదు ఎంజీయర్శి వాజీగణేశ న్తరం నుండి  వున్నదే.


పేట మూవీ రేటింగ్స్


టైమ్స్ అఫ్ ఇండియా -3.5/5
గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ -2.75/5
IDLE BRAIN -3/5
తుపాకీ డాట్ కామ్-2/5
హన్స్ ఇండియా -2.5/5
123 తెలుగు డాట్ కామ్ -2.75/5
టాలీవుడ్ డాట్ నెట్ -2.5/5
చిత్ర మాల -3/5
న్యూస్ 18   -2.75/5
తెలుగు 360 డాట్ కామ్ -2.5/5
తెలుగు ఫిల్మ్ బీట్ -2.5/5
మిర్చి 9 డాట్ కామ్ -2/5
తెలుగు మిర్చి డాట్ కామ్- 2.75/5


Wednesday, January 9, 2019

'అవెంజర్స్ ఎండ్ గేమ్' ట్రైలర్

NTR కథానాయకుడు పై మహేష్ ప్రశంశల జల్లుNTR కథానాయకుడు సినిమా అద్భుతమని,దర్శకుడు క్రిష్ సినిమాని అద్భుతంగా చిత్రించారని సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు."బాలకృష్ణ గారు ,ఎన్టీఆర్ గారి పాత్ర లో పరకాయ ప్రవేశం చేశారని అభినందించాడు. రెండవ భాగం NTR  -మహానాయకుడు కోసం ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేశాడు మహేష్.

తమిళ అర్జున్ రెడ్డి ' వర్మ ' ట్రైలర్ టాక్


తెలుగు సూపర్ హిట్ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. తమిళ్ నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులు చేయడం వలన తెలుగు అర్జున్ రెడ్డి తో పోల్చి చూడలేము. ఇక ట్రయిలర్ ఆధ్యాంతం హీరో మరియు హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ని చూపించిన విధానం బాగుంది. మొదటి సినిమా అయినప్పటికీ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ నటన మరియు మాస్ లుక్ బాగున్నాయి. రతన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా వుంది. తెలుగు అర్జున్ రెడ్డి తో పోలిస్తే హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ పాళ్లు, ఎక్కువగా పెంచినట్టు గా ట్రయిలర్ చుస్తే తెలుస్తుంది. ఓవర్ ఆల్ గా ట్రయిలర్ యూత్ ని మెప్పించే విదంగా వుంది. తెలుగు లో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టోరీ కావడం ,స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వం వహించటం వలన సినిమా ఫై అంచనాలు. భారీగా వున్నాయి.

F2 Trailer - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada | Anil Rav...F2200 కోట్ల క్లబ్ లో KGF

కన్నడ యంగ్ సూపర్ స్టార్ యశ్ నటించిిిిన చిత్రం KGF ఈ మంగళ వారం నాటికి 201 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ చిత్రం ఇప్పటి వరకు కన్నడ చిత్ర సీమ రికార్డ్ లు అన్నీ తిరగ రాసి శాండల్ ఉడ్ అల్ టైం టాప్ గ్రాసర్ గా నిలిచింది.ఈ రోజు వరకు కూడా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.అన్ని భాషల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ లకు లాభాలను తెచ్చి పెట్టింది.ఈ సినిమా తో యశ్ ఒక్క సారి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ 'రాకీ భాయ్'అఫిషియల్' వీడియో సాంగ్ ని విడుదల చేయగా అది యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.ఈ లింక్ మీ కోసం..
https://youtu.be/S3KYrSrTZjE

రణ్వీర్ సింగ్ తర్వాతి చిత్రం 'గల్లీ బాయ్' ట్రైలర్ విడుదల

                      https://youtu.be/JfbxcD6biOk

బాలీవుడ్ యువ సంచలనం రణ్వీర్ సింగ్ కొత్త మూవీ 'గల్లీ బాయ్' ట్రైలర్ ని బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఓం లైన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ జోయా అక్తర్ ,హీరో రణ్వీర్ సింగ్ ,హీరోయిన్ ఆలియా భట్ మరియు నిర్మాత లలో ఒకడైన రితేష్ సిద్వాని,కూడా పాల్గొన్నారు.ఫరాన్ అక్తర్ జోయా అక్తర్ లు మిగతా నిర్మాతలు.
ఈ సినిమా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రధానంగా స్ట్రీట్ బాయ్స్ హిప్ హాప్ (asli hip hop) కి సంబంధించినది గా తీసినట్టు తెలుస్తుంది.


సూపర్ ఫామ్ లో ఉన్న రణ్వీర్ సింగ్ వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు.2018 లో పెద్ద హిట్ సాధించింది రణ్వీర్ మాత్రమే.అతడు నటించిిిిన సింబా 200 కోట్ల క్లబ్ లో చేర డానికి శరవేగంగా పరుగులు పెడుతుంది.ఈ మూవీ ట్రైలర్ ఇక్కడ మీ కోసం..

Tuesday, January 8, 2019

రాజమౌళి RRR కథను ,తారక్ కి ,తనకి ఒకేసారి వినిపించారు


వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ప్రశ్నకు స్పందిస్తూ, రాజమౌళి ,RRR కథను తనకి ,తారక్ కి ఒకే సారి వినిపించారని తెలిపాడు.కథ వినగానే తను ఎంతో ఆశ్చర్య పడ్డాను అని ,కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపోయాడు.ఈ మూవీ కోసం సన్నాహకంగానే తామిద్దరం అమెరికా వెళ్లామని  చెర్రీ తెలిపాడు.అయితే ఈ సినిమా కి ముందు గా తమను హీరోలుగా అనుకుని రాజమౌళి కథను తయారు చేయించలేదని, కథ సిద్ధం అయ్యాకే మమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చరణ్ తెలిపాడు.ఇందులో తన పాత్ర సహజంగా నే సాధారణ యువకుడి వలెనే ఉంటుందనీ ,దీనికోసం ప్రత్యేక మార్పులు ,లుక్ చేంజ్ ఏమీ ఉండవనీ అయితే ,తారక్ పాత్ర లో న్యూ లుక్ ఉంటుంది అని తెలిపాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ ప్రీమియర్ షో టాక్


విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్   దర్శకత్వము లో బాలయ్య బాబు హీరోగా తెర కెక్కిన ఎన్టీఆర్  కథానాయకుడు సినిమా ప్రీమియర్  షోలు  యూఎస్ఏ  మరియు ఆంధ్ర ప్రదేశ్ లో పడిపోయాయి. బారి అంచనాల నడుమ రిలీజ్  అయిన ఈ మూవీ అందుతున్న సమాచారం బట్టి ఫస్ట్   అఫ్.   యావరేజ్ గా ఉండి , సెకండ్   అఫ్ మాత్రం అద్బుతంగా వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా ల్యాబ్ ప్రింట్ సీన్ , దివి సీమ సీన్ అండ్ ఎన్టీఆర్ పార్టీ ప్రకటించే సీన్లూ, చాలా గొప్పగా వచ్చాయని తెలుస్తుంది. దీనికి బాలయ్య బాబు అద్భుత నటన , కీరవాణి మ్యుజిక్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మరియు క్రిష్  దర్శకత్వం ప్రతిభ చిత్రాన్ని,  ఎలివేట్ చేసిన తీరు సినిమాకు పాజిటివ్ అంశాలు. . ఎన్టీఆర్ కథానాయకుడు, అసలు సిసలు సంక్రాంతి బొమ్మో కాదో తెలియాలి అంటే పూర్తి రివ్యూ కోసం వెయిట్ చేయండి.

తమిళనాటఅజిత్ 'విశ్వాసం' మూవీక్రేజ్
తమిళస్టార్ హీరో ‘తల’ అజిత్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'విశ్వాసం' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులముందు కు రాబోతోంది. ఈసినిమా ఫై ముందునుండి అజిత్ అభిమానుల్లో వున్నఅంచనాలను సినిమా ట్రైలర్ ఒక్కసారిగా తారస్థాయికి తీసుకెళ్లింది. ఇందుకు ముఖ్య కారణం ఇంతకు ముందెన్నడూ కనిపించనంత మాస్ లుక్ లో  అజిత్ కనిపిస్తూ ఉండటం మరియు ట్రైలర్ పల్లెటూరి నేపధ్యంలోఉండటం. తమిళనాడులోఅజిత్ కి  అధికంగా మహిళా అభిమానులు ఉండటం వలన వారి కోసం తమిళనాడులో ని తిరునిరవూర్  తి
తిరువల్లూర్ జిల్లాల్లో ముందస్తు  సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వీలుగా వారికి స్పెషల్ షోలు వేయడానికి ప్లాన్ చేసారు. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్, థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తుంది తమిళనాడులోనే 1000 కి పైగా థియేటర్స్ లో విడుదల అవుతుండటం మరియు తమిళనాడు ప్రభుత్వం మొదటి 10 రోజులు ప్రతిరోజు 5 షోలకు అనుమతించడంవలన అజిత్ సరికొత్త రికార్డులు నిలపటం ఖాయంగా కనిపిస్తుంధి.

తమిళ అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ నేడేతెలుగు ఇండస్ట్రీ సెన్సేషన్ అర్జున్ రెడ్డి సినిమాను చియాన్వి విక్రమ్   తనయుడు ధృవ్ ని  హీరోగా పరిచయంచేస్తూ బాలదర్శకత్వంలో నిర్మితమైన వర్మ చిత్రం ట్రైలర్ ఈరోజుసాయంత్రం 4:30pm కి హీరో సూర్య చేతుల మీదుగా విడుదల కాబోతుంది. టీజర్ కు  మిశ్రమ స్పందన వచ్చిన నేపధ్యంలో ట్రైలర్ ఎలా ఉండ బోతోందో చూడాల్సిందే.

ఎన్టీఆర్ -కథానాయకుడు మూవీ కి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్


NTR కథానాయకుడు సినిమా రేపు విడుదల అవుతుంది.ఈ సినిమా లెజండరీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామా రావు గారి బయోపిక్ అన్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్రను ,ఆయన తనయుడు నందమూరి బాల కృష్ణ పోషిస్తుండగా,నటి విద్యా బాలన్, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రను పోషిస్తుంది.ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే .MM. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.కాగా ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో స్పెషల్ ప్రీమియర్ శో లకు అనుమతి లభించగా,తెలంగాణా లో ఇంకా ప్రభుత్వం నుండి అనుమతి రావాల్సి ఉంది.అమెరికాలో ఈ చిత్రం సుమారు 3 లక్షల డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా సుమారు 600 థియేటర్ లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

సంక్రాంతి బరి లో భారీ చిత్రాలు

ఈ సంక్రాంతి కి 3 పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్  బయోపిక్  మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు ఈ నెల 9న విడులవుతుంది. 10 వ తేదీన తల అజిత్ విశ్వాసం విడుదల అవుతుంది. 
11 వ తేదీన రామ్ చరణ్ ,బోయపాటి ల వినయ విధేయ రామ విడుదల కానుంది.
 12 వ తేదీన వెంక టేష్ ,వరుణ్ తేజ్ ల F 2 విడుదల కానుంది. 
కాబట్టి సినీ అభిమానులకు ఈ సంక్రాంతి నిజమైన పండగ లాంటిది గా చెప్పొచ్చు.  

Captain Marvel Released 3 Posters


MCU Producers Released 3 Different Posters of Latest MCU Movie Captain Marvel viz.. 3D/IMAX and Feature

Monday, January 7, 2019

ఆస్ట్రేలియా పై భారత్ చారిత్రాత్మక విజయం


ఆస్ట్రేలియా పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని 2-1 తో చేజిక్కించుకుంది.చివరిదైన 4 వ టెస్టు ఐదవ రోజు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.దీంతో భారత్ సిరీస్ ని గెలిచింది.1947 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 12 సార్లు ఆస్ట్రేలియా ను సందర్శించిన భారత్ ఒక టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియాలో గెలవడం ఇదే మొదటి సారి.ఈ మాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 622/7 కి డిక్లేర్ చేయగా ,ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 300 పరుగు లకు ఆల్ ఔట్ అయి ఫాలో ఆన్ లో పడి తమ 2 వ ఇన్నింగ్స్ లో వికెట్లేమి నష్టపోకుండా  6 పరుగులు చేయగా ,చివరి రోజు వర్షం కారణంగా ఆటను డ్రా గా అంపైర్లు ప్రకటించారు.చెటేశ్వర్ పుజారా కి "మ్యాన్ ఆఫ్ ది మాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లను గెల్చుకున్నాడు...