Tuesday, August 6, 2019

"సైరా" విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి.



మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ "సైరా" నర్సింహారెడ్డి సినిమా కి సంబంధించి సూపర్ హాట్ న్యూస్ ఇది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా స్వాతంత్ర్య సమర యోధుడు కర్నూల్  " ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" జీవిత చరిత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన మేగజైన్ "Bpositive"  కోసం తన మామయ్య చిరంజీవి ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి ని ఉపాసన "సైరా"సినిమా విడుదల ఎప్పుడు అని అడగగా దీనికి సమాధానంగా చిరంజీవి ఈ సినిమా అక్టోబర్ 2 ,2019 రోజున అనగా గాంధీ జయంతి రోజున విడుదల చేయనున్నట్లు సమాధానం చెప్పారు.దీంతో చిరు అభిమానులకు ఇది ఎంతో జోష్ ని తెచ్చి పెట్టింది.బాహుబలి సినిమాకి సంబంధించి ఇంతవరకు ఏ రికార్డు కూడా దాని దరిదాపుల్లోకి రాకపోగా,ఆ సత్తా ఉన్న సినిమాగా "సైరా"ను చెప్పుకుంటున్నారు.ఎందుకంటే ఇది కూడా అన్ని భాషల్లో నిర్మితం కావడం,ఇందులో అమితాబ్ బచ్చన్,కిచ్చా సుదీప్ తమన్నా,నయన తార వంటి తారలు ఇందులో నటించడమే కాకుండా,ఈ సినిమాలోని అంశము కూడా పాన్ ఇండియా కి సంబంధించినది కావడం,అంతే కాకుండా చిరంజీవికి తెలుగు భాషతో సమానంగా,తమిళ్, కన్నడ ,హిందీ లో అభిమానులు ఉండడం దీనికి కారణం గా చెప్పవచ్చు.ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి సినిమా గురించి చెబుతూ తనకు భగత్ సింగ్ పాత్ర చేయాలని ఉండేదని అయితే అనేక కారణాల వల్ల చేయలేక పోయానని,ఇక ఇప్పుడు చేస్తే తనకు సెట్ కాదని అనుకుంటుండగా తనకు సరిగ్గా సరిపోయే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అన్నట్టు ఈ ఇంటర్వ్యూ కోసం చిరు మేక్ ఓవర్ చూసి అందరూ ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు.ఎందుకంటే 64 ఏళ్ల వయసులో చిరంజీవి 40 ఏళ్ళ వ్యక్తి లాగా ఉన్నాడు మరి.

శర్వానంద్ " రణరంగం " ట్రైలర్ విడుదల

ఆసక్తి కరంగా "ఎవరు " సినిమా ట్రైలర్ . 3/5 రేటింగ్ ..
బెల్లం కొండ గట్టిగా కొట్టాడు హిట్టు
ప్రభాస్ "సాహో" ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల:ఇట్స్ బ్యూటిఫుల్. 3.5/5 -రేటింగ్
నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్

0 comments:

Post a Comment