Tuesday, August 6, 2019

తెలంగాణ చిన్నమ్మ ,బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) అస్తమయం


బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) గారు స్వర్గస్థులయ్యారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..గుండె పోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు.

ఈమె భౌతిక కాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుండి జంతర్ మంతర్ లోని ఆమె నివాసానికి తరలించారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు తమ నివాసం లో ఉంచనున్నారు.
ఈ సాయంత్రం డిల్లీ లోధి రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మా
గారి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
గత ప్రభుత్వం లో ఈమె విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి గా పనిచేశారు.
ఈమె 1953 ఫిబ్రవరి 14 న హర్యానా లోని అంబాల లో జన్మించారు.
ఈవిడ 1977 లో అంబాలా లో తొలి సారిగా ఎమ్మెల్యే గ గెలిచారు,
1996,1998 లో వాజ్ పెయ్ మంత్రి వర్గం లో పని చేశారు.
1998 లో డిల్లీ లో సీఎం గా పనిచేశారు.
ఏడు సార్లు ఎంపీ గా మూడు సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహించటం జరిగింది.
అటు సుప్రీమ్ కోర్టులో న్యాయవాది గా కూడా పనిచేశారు.
---శివ్

0 comments:

Post a Comment